online marketing

Friday, April 22, 2011

అందరికీ అందుబాటులో ఉంటా!

నెల్లూరు: అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని కొత్త జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి కలెక్టర్ సౌరబ్‌గౌర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. శాఖల పని తీరు మెరుగుపరచి ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో సమస్యలు సహజంగా వస్తాయన్నారు.

ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గోదాములు నిర్మించి రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతామని చెప్పారు. జిల్లా ప్రజలకు ఏది అవసరమో గుర్తించి దానిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వారికి అందుబాటులో ఉంటానన్నారు. పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దృష్టి సారిస్తామన్నారు. రెవెన్యూ, ఇతర శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ

చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ టి.సీతారామయ్య, డీఆర్‌ఓ జయరామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు అభినందనలు తెలిపిన అధికారులు

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీధర్‌కు జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు ఆయన కలెక్టరుగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. శుభ సమయం వచ్చే వరకు వేచి ఉండి ఇన్‌చార్జి కలెక్టర్ సౌరబ్‌గౌర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

అభినందనలు తెలిపిన వారిలో అదనపు జాయింట్ కలెక్టర్ టి.సీతారామయ్య, డీఆర్‌ఓ జయరామయ్య, డ్వామా పీడీ రామిరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ నందకుమార్, ఐటీడీఏ పీఓ రమేష్, ఐకేపీ అర్బన్ పీడీ సోమయ్య, నగర కమిషనర్ టీఎస్‌ఆర్ ఆంజనేయులు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, సెట్నల్ సీఈఓ కోటేశ్వరరావు, సీపీఓ శివరామనాయకర్, డీఎస్‌ఓ జ్వాలా ప్రకాష్, భూసేకరణ ప్రత్యేకాధికారి కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి, ఖజానా అధికారి గీతా దేవి, నెల్లూరు, గూడూరు, కావలి ఆర్డీఓలు వేణు గోపాల్‌రెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వరరావు, ఎస్‌బీఐ కలెక్టరేట్ శాఖ మేనేజర్ రామ్మోహన్, నెల్లూరు నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh