ఆత్మకూరు: మన సాంప్రదాయం కనుమరుగవుతుంది. మహిళల పట్ల ఉండే గౌరవం కాస్త చనిపోయిందని చెప్పవచ్చు. మద్యంమత్తులో ఊగే యువత కోసం సభ్యసమాజం తలదించుకునేలా కొన్ని ప్రదర్శనలను సాక్ష్యంగా చెప్పవచ్చు... నియోజకవర్గం పరిధిలో అన్ని పల్లెల్లో ముమ్మరంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా స్వామివార్ల ఉత్సవాల ముందు ఏదోక ప్రదర్శన జరపడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ ప్రదర్శన కాస్త రూపురేఖలు మారుతున్నాయి. రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన అర్థరాత్రికి ఓవిధంగా మార్పుచెందుతూ, తెల్లవారేలోపు అందరికి వినోదం పంచేలా ఉంటున్నాయి. ఎంత వినోదం పంచితే అక్కడ అంత డబ్బు వెదజల్లే పరిస్థితులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగే ఉత్సవాల్లో సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఓ నృత్య ప్రదర్శనపై ‘సూర్య’ ప్రత్యేక కథనం......
మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్టేజిలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఉత్సవమూర్తుల గ్రామోత్సవం సందర్భంగా కొందరు యువతులను ఏర్పాటు చేసి నృత్యప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఆరంభంలో అందరు గమనించేలా స్థానిక పోలీసులు ఆ ప్రదర్శనను అడ్డుకున్నారు. ఔరా... పోలీసులు ఇంత కచ్చితంగా పని చేస్తున్నారా..? అంటూ సెహబాస్ అని కొందరు వెళ్లిపోయారు.
ఇంకేముంది ఆరంభంలో అర్థనగ్న ప్రదర్శన ఇద్దరు యువతులు చేస్తుంటే మగవాళ్ల ఆనందం అంతాఇంతాకాదు. ఒక్కోక్క స్టెప్‌కు ఒక్కోక్కరకంగా డ్యాన్సర్స్‌ను ఒప్పించారు. ఇలా తెల్లవారుజాము వరకు జరిగింది. తెల్లవారుజామున శరీరంపై నూలిపోగు లేకుండా నగ్నప్రదర్శన చేయించారు. ఆ ప్రదర్శన చూస్తే మన సాంప్రదాయం ఇదా... అనిపించాల్సిందే. యువత కేరింతల నడుమ నలుగురు యువతులు నగ్న ప్రదర్శన చేయడం... ఎంత బాధకరమో వారి ప్రదర్శన వెనుక కుటుంబాల ధీన స్థితో.. లేక పేదరికమో... మనకు తెలియదుకానీ మహిళ లోకం తలదించుకునేలా ప్రదర్శన జరిగింది.
అక్కడ ఒక్కచోటే కాదు అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లో సైతం విచ్చలవిడిగా ఉత్సవాల సందర్భంగా నగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయి. పోలీసులు మామూళ్లతో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఓవైపు భక్తిపారవశ్యం, మరోవైపు నగ్న ప్రదర్శనలు వెరసి ఆదునిక ఉత్సవాల్లా కనిపిస్తున్నాయి. నాటి భక్తి పారవశ్యం కనిపించడం లేదు. నేడు ఎక్కడ చూసినా అశ్లీల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.దీంతో ఎక్కడ ఎక్కడ నుంచో ద్విచక్ర వాహనాలపై యువకులు కార్యక్రమం వద్ద కిక్కిరిస్తున్నారు. మర్రిపాడు మండలంలో రాత్రి 10 గంటల నుంచే నగ్న ప్రదర్శన జరుగుతున్నా అక్కడ మహిళలకు అవకాశం లేదు.
కేవలం మగవాళ్ళకు మాత్రమే ఉత్సవాలు అన్నట్లుగా ఉన్నాయి. అనంతసాగరం మండలంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తొలుత ఆర్కెస్ట్రాలతో పాటకచ్చేరిలు ప్రారంభించి అర్థరాత్రి అర్థ నగ్న ప్రదర్శన, తెల్లవారుజామున నగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇది తప్పని స్థానిక మహిళలు వాదిస్తున్నా మగ సామ్రాజ్యం వారిని నోరు మెదపకుండా చేస్తుంది. జిల్లా పోలీసులు యంత్రాంగం స్పందించి సమాజానికి దోహదపడే కార్యక్రమాలు జరిగేలా చర్యలు చేపట్టాలి. అశ్లీల వాతావరణాన్ని పూర్తిగా నియంత్రించాలి. మహిళ లోకానికి ఓ విలువ ఉందని చాటిచెప్పాలి. మరి అలా జరుగుతుందా... వేదిచూద్దాం...

No comments:
Post a Comment