కోవూరు:: ఇటీవల కాలంలో కోవూరు పట్టణంలోని రైల్వేఫీడర్స్ రోడ్డు నుంచి ఇళ్ళను ఖాళీచేసి, గుమ్మళ్ళదిబ్బలో ఇళ్ళు వేసుకుంటున్న పేదలు రాత్రిళ్ళు కఠినచీకటిలో అనేక దుర్భర అవస్థలు పడుతున్నారని, వారికి కనీస వసతులు కల్పించాలని సిపిఐ మండల, పట్టణ కార్యద ర్శులు విడవలూరు హనుమంతరావు, గుత్తా రామకృష్ణయ్యలు డిమాండ్ చేశారు. ఇండ్లస్థలాలు చూపి, వెంటనే ఖాళీచేయిస్తున్న రెవెన్యూ అధి కారులు, పేదల సామాన్లు చేర్చడానికి తగిన వసతులు కల్పించక పోవటం అన్యాయమన్నారు. ఇటుకలు, తాటాకు, కర్రలు, గడ్డి తదితర సామాన్లను చేర్చుకోవడానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి స్థితిని చూసి కోవూరు పట్టణ సిపిఐ కమిటి, మండల కమిటి ఆధ్వర్యంలో పంచాయతి నుంచి, దాతల నుంచి ట్రాక్టర్లను విని యోగించి కొంతమేర సామాన్లను తరలించామన్నారు. ఇంకా చాలా వరకు చేర్చవలసిన అవసరం ఉందన్నారు. అంతేకాక అర్హులైన పేదవారు 15 మంది వరకు ఇంకా ఇళ్ళస్థలాలు చూపకపోవటం కడుదారుణమని ఆయన తెలియజేశారు. సర్వే చేయించారు కాని ఇండ్లస్థలాలు ఇవ్వడం మరిచారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అక్కడ కనీస వసతులయిన కరెంటు, వీథిదీపాలు, గ్రావెల్‌రోడ్డు తదితర సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని గుత్తా డిమాండ్ చేశారు. అర్హులైన పేదవారికి వెంటనే ఇండ్లస్థలాలు చూపించాలని సామాన్లు చేర్చుకోలేని పేదవారికి ప్రభుత్వమే రవాణాసౌకర్యం ఏర్పాటుచేసి ఆదుకోవాలని కోవూరు మండల సిపిఐ కమిటి ప్రధాన కార్యదర్శి విడవలూరు హనుమంతరావు డిమాండ్ చేశారు. ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెక్కాడితే డొక్కాడని పేదలకు ప్రభుత్వం రుణసహాయం అందించి, వారిని ఆదుకోవాలని కోవూరు మండల సిపిఐ కమిటి కార్యదర్శి విడవలూరు హనుమంతరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుత్తా రామకృష్ణయ్యలు కోరారు.
No comments:
Post a Comment