నెల్లూరు :ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్షల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి పి.వసుధ ఎంఇసి గ్రూపులో 475 మార్కులతో జిల్లా మొదటి స్థానాన్ని సాధించిందని కళాశాల డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఫలితాలు వెలువడిన అనంతరం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. తమ విద్యార్థులు గత ఐదేళ్లుగా ఎంఇసి విభాగంలో జిల్లాలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ రీతిలో ఫలితాలను సాధిస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ ఏడాది ఎంఇసిలో కె.భావన 473, సుధామహేష్ 472 మార్కులు, 428 మార్కులతో శ్రీనాధ్, 466 మార్కులతో హర్షవర్థన్, 465 మార్కులతో లక్ష్మీ హరిశంకర్ అత్యుత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు.ఎంపిసి విభాగంలో డేగా పవన్‌కుమార్ 470 మార్కులకుగాను 460 మార్కులు సాధించారని తెలిపారు.ఎంపిసి విభాగంలో 459, 456, 453 మార్కులతో పాటు గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది ఎంపిసిలో అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది 90 శాతానికి పైగా ఫలితాలను సాధించడంతోపాటు సాధారణ విద్యార్థులను టాప్ ర్యాంకర్లుగా రూపొందిస్తున్న అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment