నెల్లూరు : జిల్లాలోని ప్రజలు చైతన్యవంతులని, ఇటువంటి జిల్లాలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ అన్నారు. శుక్రవారం స్థానిక పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో కలెక్టర్ కె.రాంగోపాల్‌కు ఆత్మీయ వీడ్కోలు సభ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన కలెక్టర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపానన్నారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం మూడేళ్ల నుంచి చేయాలనుకున్నది అనేక కారణాల వల్ల చేయలేకపోయారన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన పథకాలు అమలులో జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అధికారులందరూ ప్రత్యేక కృషి చేయాలని కోరారు. జిల్లా అధికారులు ఈ మూడేళ్లలో సహకరించినట్లు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు కూడా సహకరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడాన్ని అధికార యంత్రాంగం ఉందన్నారు. ప్రతి పనికి అందరిని కలుపుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోతానన్నారు.
ఎవరూ పని వారు చేసుకుంటూ పథకాల అమలుకు కృషి చేయాలన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే జిల్లాధికారులు ఏ సమయంలోనైనా సరే తనతో చర్చించవచ్చనన్నారు. జాయింట్ కలెక్టర్ సౌరబ్ గౌర్ మాట్లాడుతూ కలెక్టర్ రాంగోపాల్ జిల్లా ప్రజల మనసులో స్థిర స్థాయిగా నిలిచిపోతారన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ టి.సీతారామయ్య మాట్లాడుతూ కలెక్టర్ రాంగోపాల్ ప్రతి విషయంలోనూ తమకు సంపూర్ణ సహకారాలందించారని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాంగోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీ రామ్మూర్తి, జిల్లా ఎస్పీ ఇ.దామోదర్, జిల్లా రెవెన్యూ అధికారి జయరామయ్య, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, కమిషనర్ టీఎస్‌ఆర్ ఆంజనేయులు, నెల్లూరు, గూడూరు, కావలి ఆర్డీవోలు వేణుగోపాల్‌రెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, ఐటీడీఏ పీఓ రమేష్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మధుసూదన్‌రావు, జనార్దన్‌రావు, అల్లంపాటి పెంచలరెడ్డి, సుశీలమ్మ, ఎన్జీవో నాయకులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment