Friday, February 5, 2010
8 కాళ్ళ గొర్రెపిల్ల జననం
కొడవలూరు, (మేజర్ న్యూస్) : 8 కాళ్ళతో గొర్రెపిల్ల జన్మించిన అరుదైన సంఘటన కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాళెం గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళితే కదురు రమణయ్యకు 40 గొర్రెలు, 10 మేకల మంద వుంది. అందులో ఒక గొర్రె నిండుచూలాలుకావడంతో బుధవారం సాయంత్రం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మొట్టమొదటి పిల్ల 8 కాళ్ళతో చనిపోయి బయటకు రాక తల్లి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక కుమ్మరి వారి తోపునకు చెందిన యాటగిరి వెంకయ్య చాకచక్యంగా తల్లి గొర్రె కడుపులోకి చేయిపెట్టి గొర్రెపిల్లను బయటకు తీశారు. గొర్రెపిల్ల చనిపోయి వుండి ఆలస్యంగా బయటకు రావడంతో తరువాత వచ్చిన రెండవ గొర్రె పిల్ల కూడా మృతి చెందింది. యాటగిరి వెంకయ్య వివరణ: తన 60 సంవత్సరంలో ఇలాంటి అరుదైన 8 కాళ్ళ గొర్రెపిల్ల జన్మించడం ఇప్పటి వరకు తను చూడలేదని 11వ ఏటనే పలువురు వద్ద బర్రెల మందను కాచేవాడినని యాటగిరి వెంకయ్య తెలిపారు. దేవుని సృష్టి వలననే ఇలాంటి సంఘటనలు జరగుతాయని ఆయన మేజర్ న్యూస్‌కు వివరణ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment