Wednesday, February 3, 2010
ఒబామా కొలువులో ‘పేట’ ఖ్యాతి
సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్ : అమెరికా నూతన అధ్యక్షుడు ఒబామా కొలువులో సూళ్ళూరుపేటకు చెందిన చైతన్య ఒబామా కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణకు సంబంధించి ముఖ్యకార్యదర్శిగా కొద్దిరోజుల క్రితం నియమితులయ్యారు. ఒబామా కొలువులో ఇలాంటి కార్యదర్శులు 12 మంది ఉండగా, వీరిలో ఒకరిగా చైతన్య నియమితులయ్యారు. చైతన్య కింద మరో 12మంది కార్యదర్శులు పని చేస్తారు. 45 వేలమంది ఈ పోస్ట్‌కు పోటీపడగా చైతన్య రాత పరీక్షలలో నెగ్గి అర్హత సాధించడం విశేషం. కాగా చైతన్య సూళ్లూరుపేటలో 1987 నుంచి 1997 (యుకెజి నుంచి, 10వ తరగతి) వరకు టైనీటాట్స్‌లో విద్య నభ్యసించాడు. చైతన్య మొదట్నుంచి పట్టుదల కలిగిన వ్యక్తి. ఏదైనా అనుకొంటే సాధించే మనస్థత్వం. ఏడవ తరగతిలోను, పదవ తరగతిలోను స్కూలు ఫస్ట్ సాధించాడు. అనంతరం నెల్లూరు నారాయణకాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎంసిఏ తరువాత ఎంఎస్ అమెరికాలోని బిగ్స్ పిలాసీలో చదివి పట్టభద్రుడయ్యాడు. ఎంఎస్ తరువాత బెంగుళూరిలోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటూ ఒబామా కొలువుని సంపాయించాడు. టైనీటాట్స్ ప్రిన్సిపాల్ వేనాటి దనుంజయరెడ్డి తమ స్కూలు వార్షికోత్సవ సభలో ఈ విషయాన్ని ఘనంగా చాటారు. తమ స్కూలు విద్యార్ధి అంత ఎత్తు ఎదగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చైతన్య సోదరులు కె రాజ్‌కుమార్, కె ప్రవీణ్‌కుమార్‌ని ఈ సందర్భంగా సత్కరించి మెమొంటోలు బహూకరించారు. సూళ్ళూరుపేట సిఐ వంగాసుబ్బారెడ్డి చేతులమీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది.చైతన్య సోదరులు రాజ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్‌లు కూడా టైనీటాట్స్ విద్యార్ధులు కావడం విశేషం. రాజ్‌కుమార్ బెంగుళూరు ఇన్ఫోసిస్‌లోనే ప్రాజెక్టు మేనేజరుగా పని చేస్తుండగా, ప్రవీణ్‌కుమార్ అమెరికా కంపెనీ అసెంచరుగా వ్యవహరిస్తున్నారు. చైతన్య వ్యక్తి గత విషయానికి వస్తే తల్లి తండ్రులు సాదారణ కుటుంబానికి చెందినవారు. తండ్రి గురవయ్య సాంఘిక సంక్షేమ శాఖలో హాస్టల్‌వార్డన్‌గా పని చేస్తూ రిటైరయ్యాడు. తల్లి లీలావతి సాదారణ గృహిణి. తల్లిదండ్రులు ప్రస్తుతం నెల్లూరులో కాపురముంటున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చైతన్య అమెరికా అధ్యక్షుడు ఒబామా కొలువులో ఉద్యోగం సంపాయించడం సూళ్ళూరుపేటవాసులతో పాటు, పలువుర్ని ఆశ్చర్యపరుస్తోంది. సూళ్ళూరుపేటకు చెందిన ఓ సాదారణ విద్యార్ధి అంత ఎత్తు ఎదగడం నిజంగా గొప్ప విషయమే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment