Saturday, February 6, 2010
వివాదాస్పద భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
చిల్లకూరు, (మేజర్‌న్యూస్) : చిల్లకూరు మండలంలోని కడివేడు రెవిన్యూ పరిధిలోని వివాదాలకు నెలవైన సర్వే నెంబరు 805ను జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సర్వే నెంబర్‌లో 870 ఎకరాలు ఉండగా అందులో కొంతభాగం పట్టాలు ఉన్నాయని గర్భకండ్రిగ పరిధిలో కొంత భూములుండగా ఎండోమెంటుకు సంబంధించి 100 ఎకరాలు కేటాయించి ఉన్నట్లు జె.సి. పరిశీలనలో తేలింది. ఈ భూములను 59 బ్లాకులుగా విభజించి రికార్డులు తయారు చేసినట్లుగా ఆయన తెలిపారు. అత్యధిక శాతం ప్రభుత్వ సీలింగ్ భూములు ఈ సర్వే నెంబర్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.గత సంవత్సరం నుండి ఈ భూములను రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వడం లేదని జె.సి.కి తహసిల్దార్ కె.ఎం.రోజ్‌మాండ్ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలోని ఈ భూములను రైత్వారి పట్టాలుగా ఇనాంగా, గత తహసిల్దార్‌లు ఇచ్చిఉన్నారని కూడా ఆమె ఈయన దృష్టికి తీసుకువచ్చింది. ఈ సర్వే నెంబర్‌లో ఎవ్వరికీ పాస్‌పుస్తకాలుగానీ, పట్టాలు గాని ఇవ్వడం లేదని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లు కూడా చేయకూడదని ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ శాఖకు పంపిఉన్నట్లుగా తెలిపింది. ఈ సర్వే నెంబరు జె.సి.పరిశీలిస్తున్న సమయంలో పలువురు పట్టాదారులు పట్టాలు కలిగి ఉన్నామని, కాని రెవిన్యూ రికార్డులో నమోదు చేయలేదని ఆయన దృష్టికి తీసుకురాగా దీనిపై స్పందించిన జె.సి. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రేషను కార్డులను రద్దు పరచంప్రైవేటు సెక్టార్ ద్వారా సర్వే చేయించడం వలన కమ్మవారిపాళెం, బూదనం తదితర ప్రాంతాల్లో మండల పరిధిలో కొన్ని పొరపాట్లు జరిగాయని గ్రామ సభల ద్వారా బహిరంగ ప్రకటన చేస్తూ అర్హులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు జె.సి. చెప్పారు. ఈ కార్యక్రమం ఈ నెల 4 నుండి 18వ తేది వరకు కొనసాగుతుందని కార్డులు రద్దయిన వారు తహసిల్దార్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తే దానిపై క్షుణ్ణంగా పరిశీలించి వారికి అసలైన అర్హులుకి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ, విఆర్వో వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment