Monday, February 1, 2010
సమస్యల వలయంలో ప్రాథమిక పాఠశాల...
వెంకటగిరి,మేజర్‌న్యూస్:స్థానిక పట్టణంలోని మల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్ధులు విద్యను అభ్యసిస్తుండగా ఈ పాఠశాలకు ప్రహారి గోడ లేకపోవడమేకాక చుట్టూ కంపచెట్లు ఉన్నాయి. వీటితోపాటు పాఠశాల చుట్టూ పేడ దిబ్బలు కూడా ఉండటంతో పాఠశాల విద్యార్ధులు అసౌకర్యానికి గురౌతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్న భోజనం అక్కడి విద్యార్ధులు భోజనం చేయాలన్న పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. మరోవైపు ఉన్న తాగునీటి బోరు ముళ్లచెట్లలో మూసుకుపోయి ఉంది. దీంతో త్రాగునీటి వసతి కూడా సక్రమంగా అందడం లేదు. సంబంధిత పాఠశాలకు పూర్తిస్ధాయిలో కల్పించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment