Wednesday, February 3, 2010
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
నెల్లూరు రూరల్, మేజర్‌న్యూస్:నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేదలైన అర్హులకు వైఎస్‌ఆర్.నగర్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. మండల పరిధిలోని కొత్తూరు పంచాయతీల పరిధిలోగల వైఎస్‌ఆర్.నగర్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనితీరును మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సందేహాలను సంబంధిత అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇక్కడి లబ్ధిదారులకు గృహ నిర్మాణశాఖ అందజేస్తున్న మౌలిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణం, ఇళ్ల బేస్ మట్టం, ఇంటి ఫ్లోరింగ్ , మరుగుదొడ్ల వసతి తదితరాల వివరాలను అడిగి తెలుసుకుని మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సూచించినపుడు గృహ నిర్మాణశాఖ పిడి ఆర్‌వి.సత్యనారాయణ మాట్లాడుతూ మార్చి నెలాఖరు లోపు 2,165 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ ప్రత్యేకాధికారి రవిప్రకాష్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్‌వి.సత్యనారాయణరెడ్డి, నెల్లూరు తహసీల్దార్ ఐ.భక్తవత్సలరెడ్డి, ఎంపిడిఒ డి.వెంకటరావు, హౌసింగ్ ఆర్‌డబ్ల్యుఎస్ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment