Wednesday, February 24, 2010
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్:నగరంలోని ఫత్తేఖాన్‌పేటకు సమీపంలో ఉన్న సింధూర నర్సింగ్ హోం వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గోవిందరాజు సెల్వరాజ్ (45) అనే వ్యక్తిని కత్తులతో సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఆదిత్య, గోపాల్, పోలయ్య, వారి కుటుంబ సభ్యులు కలసి కత్తులతో దాడి చేయడంతో సెల్వరాజ్ మృతి చెందాడు. మృతునికి మురళీ అనే వ్యక్తి స్నేహితుడు కాగా అతనిపై గత నెల 25వ తేదీ గోపాల్, పోలయ్య తదితరుల దాడిలో తీవ్ర గాయాలైన మురళీని సెల్వరాజ్ హాస్పిటల్‌లో చేర్పించాడు. దీన్ని మనసులో పెట్టుకుని పై ముగ్గురు సెల్వరాజ్‌పై కక్ష పెంచుకుని కత్తులు, రాడ్‌లతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో మృతి చెందిన సెల్వరాజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీనిపై 4వ నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్‌పిజిల్లా ఎస్‌పి దామోదర్ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి బాధితులను పరామర్శించారు. తన సిబ్బందికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్‌పి కనకారావు, నగర డిఎస్‌పి జిఆర్.రాధిక తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment