Wednesday, February 24, 2010
పోలీస్ శాఖలోని లోపాలను సరిదిద్దుతా
నెల్లూరు(క్రైం) మేజర్‌న్యూస్:జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడమే గాక పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్‌పి దామోదరం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసే వారికి సరైన గుర్తింపు ఇవ్వడమేగాక, వారి సేవలను వినియోగించుకోడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. సోమవారం హెడ్‌కానిస్టేబుల్ నుండి ఎఎస్‌ఐలుగా ప్రమోషన్లు పొందిన పలువురికి ఎలాంటి ఇబ్బంది లేని పోలీస్ స్టేషన్‌లకు బదిలీలు ఇవ్వడం జరిగిందన్నారు. రోజురోజుకు జిల్లాలో పెరుగుతున్న క్రైంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. ఇందులో భాగంగా నగరానికి దూరంగా ఉండే కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారితో కమ్యూనిటీ మీటింగ్ నిర్వహించి వారితోపాటే పోలీసులు కలిసి గస్తీలు నిర్వహించి చోరీలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గతంలో చోరీలకు పాల్పడే నేరస్తులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమీ చేస్తున్నారో వారి సమాచారాన్ని ప్రతి నిత్యం సంబంధిత క్రైం ఎస్‌ఐలు ద్వారా తెలుసుకుని వారి కదలికలను గమనిస్తూ చోరీలకు పాల్పడకుండా ప్రత్యేక టీముల ద్వారా తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. నగరంలో విస్తృతంగా పేరుకుపోయిన ట్రాఫిక్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించడమేగాక ట్రాఫిక్ సమస్యలపై నిష్ణాతులైన ప్రొఫెసర్లు రాఘవాచారి, భానుమూర్తి, లక్ష్మణరావు వంటి వారిని పిలిపించి వారి సలహాలను తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రొఫెసర్లతోపాటు నగరంలోని కొంతమంది పెద్దలు, అధికారులతో కలిపి కమిటీగా ఏర్పరచి ట్రాఫిక్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదో వాటిని పాటించేదానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ మధ్య కాలంలో జరిగిన పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల జాబితా ప్రకటించడంలో కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉన్నందున జాబితాను విడుదల చేయలేదే తప్ప వేరే కారణాలు ఏమీ లేవని ఆయన గుర్తు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment