Wednesday, February 24, 2010
ఈ వార్తకు ఫోటోను నెట్‌ద్వారా పంపుతున్నారు
మనుబోలు,మేజర్‌న్యూస్: ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఓ వ్యక్తి అమాయకుల వద్ద డ బ్బు వసూలు చేస్తుండగా అనుమానంతో కొందరు గ్రామస్తులు పోలీసులకు పట్టించిన సంఘటన మంగళవారం మండల కేంద్రమైన మనుబోలులో జరిగింది. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురానికి చెందిన దారా జాకబ్ అలియాస్ ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి గతంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో గూడురు, నాయుడుపేట ప్రాంతాల్లో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో కొంతమంది నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తుండగా గమనించిన అధికారులు ఇతన్ని విధుల నుంచి తొలగించారు.అదే తరహాలో ప్రస్తుతం కొన్ని గ్రామాలు తిరుగుతూ తాను హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తినని ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానంటూ డబ్బును వసూలుచేస్తూ మోసాలకు పాల్పడుతూ ఉన్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో మంగళవారం మనుబోలులో డబ్బులు వసూలు చేస్తుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు తెలియచేయడంతో ఇతని బండారం బయటపడింది. ప్రస్తుతం ఇతను పోలీసుల అదుపులోవున్నాడి. ఇతనిపై కేసు నమోదు చేస్తున్నట్లు మనుబోలు ఎస్‌ఐ వి శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment