Wednesday, February 24, 2010
సీసాల్లో రమణీయ రూపాలు
తడ, మేజర్ న్యూస్ : మనిషి అనుకొంటే సాధించలేనిది ఏమి లేదు. కులం, ధనం, సమా ం అందుకు ఏ మాత్రం అడ్డుకావు.. అతని ఏకాగ్రతే కళా ఖండాల సృష్టికి జీవం... ఇలా ఎన్నో అపరూపమైన కళా ప్రతిభింబాలను సన్నటి మూతి ఉన్న విద్యుత్ బల్బుల్లో, సీసాల్లో ఇట్టే అమర్చేస్తాడు. చాక్‌పీస్, ముగ్గురాళ్లతో ఆకట్టుకొనే ఆకృతులను తయారుచేస్తాడు. చూసేవారికి ఇది కల, నిజమా అన్న భ్రాంతితో అందరి నోళ్లతో ఔరా అనిపిస్తాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్‌లో సీనియర్ టెక్నిషన్‌గా పనిచేస్తున్న రవణయ్య ఏకాగ్రతతో సాధించలేనిది ఏమి లేదని నిరూపిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.చేసేది ప్రభుత్వ ఉద్యోగం. నెలపుడితే జీతం వస్తుందిలే చాలు అనుకునే నేటి రోజుల్లో, అందరిలాగా ఉద్యోగం చేసి హాయిగా ఉంటామనుకునే స్వభావం కాదు ఆయనది. భగవంతుడిచ్చిన కళను పదిమందికి పంచితేనే నిజమైన వృత్తిగా భావిస్తూ అనేక కళా ఖండాలకు జీవం పోస్తున్నాడు. శ్రీహరికోటలో పనిచేస్తున్న రవణయ్య. 1976లో వృత్తి రీత్యా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌లో హెల్పర్‌గా చేరిన ఇతనికి తన వృత్తి నైపుణ్యంతో అత్యంత కీలకమైన స్ప్రాబ్‌నందు సీనియర్ టెక్నిషన్ వరకు ఎదిగాడు.డ్యూటీ ముగించిన తరువాత కాళీగా ఉన్న సమయంలో స్ధానిక డివోఎస్ కాలనీలో నివాసముంటున్న ఇంటివద్దే తన మేధస్సుకు పదునుపెట్టి ఏదో కొత్తదనం చేసి అందరిచేత ప్రశంసలు అందుకోవాలన్న అతని తపన మంచి కళారూపాలను రూపొందించేలా చేసింది. ఆయన ఓపిక, ఏకాగ్రతతో ఇప్పటివరకు తయారుచేసిన 50 కళాఖండాలను అనేక సందర్బాల్లో ప్రదర్శనలు చేసి కళా హృదయాలను కదిలించాడు. జిల్లాలో పలుచోట్ల ఎగ్జిబిషన్లలో, ఈ ప్రాంతంలో జరిగిన పక్షుల పండుగలో ఇతను రూపొందించిన కళా నైపుణ్యానికి ప్రజలనుండి మరి ఆదరణ లభించింది. సూదిలో దారం ఎక్కించాలా పోమ్మా! అనే ఈ రోజుల్లో ఏకంగా ఒకే సూదిలో 1200దారాలు ఎక్కించి ‘‘లిమ్మా, గిన్నీస్’’ బుక్‌లలో స్ధానం కోసం ఎదురుచూస్తున్నాడు. చిన్నప్పటినుండి కళను సరదాగా నేర్చుకొన్న ఈన పలురకాల బొమ్మలు, రాకెట్లు నమూనా, భగవంతుని స్వరూపాలు, తాజ్‌మహల్, చెప్పులుతోపాటు అనేక రకాలైన రూపాలను సన్నటి మూతి ఉన్న సీసాలలో బంధించి అందరిని అబ్బురపరుస్తాడు. ఈ తయారీల్లో కేటాయించే సమయం, అతికించే విధానాన్ని పరిశీలిస్తే ఓర్పుతో దేనై్ననా ఇట్టే సాధించవచ్చు అన్న సామెతకు రమణయ్యను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఈ సందర్బంగా మేజర్ న్యూస్‌తో మాట్లాడుతూ తాను తయారుచేసిన కళా రూపాలు విదేశాలైన అమెరికా, లండన్, నార్వే ప్రాంతవాసులను అమితంగా ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే కళను పదిమందికి పంచాలన్న ఆలోచన నెరవేరేలా ఎవ్వరూ నేర్చుకునేందుకు ముందుకు రావడంలేదని విచారం వ్యక్తంచేశారు. పనిచేస్తున్న షార్ యాజమాన్యం సైతం ఇందుకు సహకరించడంలేదని వాపోయారు. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్ధలు అవకాశం ఇస్తే తాను విద్యార్ధులకు ఉచితంగా కళను నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాకుండా ఎలాగైన మన జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడమే తన లక్ష్యంగా భావిస్తున్నాడు. రమణయ్య ఆశయం నెరవేరాలని అందరం ఆశిద్ధాం మరి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment