online marketing

Sunday, November 6, 2011

అమ్దాపూర్‌ శివారులో వృద్దుడి హత్య


బోధన్‌క్రైం: బోధన్‌ మండలంలోని అమ్దాపూర్‌ గ్రామ శివారులో వర్ని మండలం గోవూర్‌ గ్రామానికి చెందిన దండు మైసయ్య (60) అనే వృద్దుడు శనివారం రోజున హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి మృతుడు మైసయ్య అమ్దాపూర్‌ శివారులోని తన పొలంలో గల ధాన్యం కుప్ప వద్దకు కాపల నిమిత్తం వెళ్ళాడు. శనివారం ఉదయం మైసయ్య చిన్న కుమార్తె బోజనం తీసుకుని పొలం వద్దకు వెళ్ళగా ధాన్యం కుప్పపై మైసయ్య మృతి చెంది కన్పించాడు. దీంతో భయందోళనకు గురైన ఆమె ఇట్టి విషయాన్ని గ్రామస్థులకు, బందువులకు సమాచారం అందించగ సంఘటన స్థలానికి చెరుకున్నారు. ఇట్టి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని విచారణ చెపట్టారు.






శనివారం సాయంత్రం పోలీసులు డాగ్‌ స్కాడ్‌ను రప్పించగా కుక్క సంఘటన స్థలం నుండి రోడ్డు గుండా చెరువు వద్దకు వచ్చి ఉన్న బోరు వద్ద అగి తిరిగి చెరువు సమీపం వరకు వెళ్ళి అగిపోయింది. పోలీసులు చెరువులో ఎమైన ఆధారాలు దొరుకుతాయోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. బోధన్‌ డిఎస్పీ జాఫర్‌ జావీద్‌ సంఘటన స్థలానికి చేరుకుని హత్య విషయం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మృతుడు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు మైసయ్య వద్దనే ఉన్నట్లు తెలిసింది. మృతుడు కుమారుడు శ్రీను పోలీసులకు హత్య గురించి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో శంకరయ్య తెలిపారు.


నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్‌

నెల్లూరు :నగరంలోని ఓ లాడ్జీలో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు సీసీఎస్‌ సిఐ ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో నివసించే షేక్‌ ఇలియాజ్‌, షేక్‌ సిరాజ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములను కొత్తహాలు సెంటర్‌లో గల మహేశ్వరి లాడ్జీలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా అరెస్ట్‌ చేశామన్నారు. ఉన్నత చదువులు చదివిన నిందితులు కంప్యూటర్‌ పరిఙ్ఞానంతో వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, బి.టెక్‌, ఎంటెక్‌, డిప్లమా, ఇంటర్‌, టెన్త్‌ క్లాస్‌ సర్టిఫికెట్లను తయారు చేసి వాటిని బ్రోకర్ల ద్వారా రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు అమ్మేవారన్నారు.



నిందితుల్లో సిరాజ్‌ పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. లాడ్జీలో ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ సహాయంతో సర్టిఫికెట్లను తయారు చేస్తుండగా అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, ప్రింటింగ్‌ పేపర్‌, సీడీలు, రబ్బర్‌ స్టాంపులు, సుమారు 34 వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్‌పి రమణకుమార్‌ ఆదేశాలతో నగర ఒఎస్‌డి, డిఎస్‌పి నరసింహ కిషోర్‌ ఆధ్వర్యంలో వీరిని అరెస్ట్‌ చేశామని, తనతోపాటు సీసీఎస్‌ సిబ్బంది హెడ్‌కానిస్టేబుళ్లు కె.వాసుదేవరెడ్డి, కెవి.రమణయ్య, కానిస్టేబుళ్లు శిఖామణి, వెంకటేశ్వర్లు, శేషయ్య, పోలయ్య, సురేంద్ర, వారిస్‌ అహ్మద్‌, ఇలియాజ్‌లను జిల్లా ఎస్‌పి అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు.


వర్షంతో కష్టాలు

నెల్లూరు :జిల్లాలో గత 12 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవితం కష్టాల కడలిగా మారింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. పనులు లేక కూలీలు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై నీటిలోనే పేద, బడుగు వర్గాలు కాపురం చేస్తున్నాయి. పొగాకు, మినుము రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేజర్ల మండలంలో రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో అక్కడి రైతులు వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

చిత్త కార్తె అయినప్పటికీ అక్టోబర్‌ 23 అర్థరాత్రి వరకు ఎండలు మండిపోతూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. 23 అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. అతివృష్టి, అనావృష్టి ఏది వచ్చినా పేద ప్రజలు బలవుతున్నారు. 12 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా ప్రజలు అతలాకుతలం అయ్యారు. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు తీరని అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

స్థానిక చంద్రబాబు నగర్‌లో మంచినీటి కుళాయిల్లో మురుగునీరు రావడంతో నీటి కొరత ఏర్పడి ప్రజలు మంచినీటికి అవస్థలు పడుతున్నారు. వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. 15 రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే వంద శాతం వరకు ధరలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితులు కరువయ్యాయి. కలువాయి, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, వరికుంటపాడు, వింజమూరు, ఎఎస్‌.పేట, కలిగిరి, ఉదయగిరి, దుత్తలూరు, రాపూరు, పొదలకూరు, చేజర్ల, డక్కిలి తదితర మండలాల్లో మినుము, పొగాకు రైతులు పంటలు నీట మునిగి భారీ స్థాయిలో నష్టపోయారు. చేజర్ల మండలంలో రోడ్లపైకి నీరు వచ్చి ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.

రోడ్లు గుంతల మయం కావడంతో అక్కడి రైతులు రోడ్లపై వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. చేనేత కార్మికులు వర్షాలవల్ల పనులు జరగక పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో పేదల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. తుపానుకాకపోవడంతో ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదని, అంతకన్నా అధికంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh