online marketing

Saturday, March 10, 2012

దళితవాడకు వెళ్లి ఒక ఇంట్లో నిద్రిస్తున్న వివాహిత పై అత్యాచారం


కొండాపురం : కొండాపురం మండలం తూర్పుయర్రబల్లిలో శుక్రవారం రాత్రి అదేగ్రామానికి చెందిన బండారు స్వామిదాస్ అనే యువకుడు ఉన్మాదిలా వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు... నిందితుడు బండారు స్వామిదాస్ శుక్రవారం సాయంత్రం మందా మరియమ్మకు చెందిన ఒక గేదె, నాలుగు గొర్రెలకు, మందా సత్యవేణి, మందా కొండమ్మలకు చెందిన రెండు గేదెలకు విషగుళికలు పెట్టాడు.

దీంతో అవి మృతి చెందాయి. అనంతరం స్వామిదాస్ రాత్రి 9గంటల సమయంలో చీకూరు మాలకొండయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి 10గంటల సమయంలో లక్కే మల్లమ్మ అనే మహిళ ఇంటికి వచ్చి ఆమె పక్కన నిద్రిస్తున్న పదకొండేళ్ల బాలికను ఎత్తుకెళ్తుండడంతో వారు కేకలు పెట్టారు. దీంతో బాలికను వదిలి వారిపై దాడికి పాల్పడ్డాడు.

అనంతరం రాత్రి 12గంటల సమయంలో దళితవాడకు వెళ్లి ఒక ఇంట్లో నిద్రిస్తున్న వివాహిత పై అత్యాచారానికి యత్నించాడు. ఆ మహిళ కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న ఆమె బంధువులు ఉన్మాదిని పట్టుకుని చితకబాది కట్టేశారు.

స్థానికులు కొండాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై గతంలో కూడా ఇదే విధంగా కేసులు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పశువైద్యాధికారులు మృతి చెందిన గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు

ప్రసన్నకు 60 వేల ఓట్ల మెజారిటీ వస్తే 100 ఎకరాలు రాసిస్తానని, లేదంటే మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలను రాసిస్తారా


నెల్లూరు : రాష్ట్రంలోని నేతల్లోకెల్లా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అత్యంత స్వార్థపరుడని తెలుగు యువత జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పమిడి రవికుమార్‌చౌదరి, శింగంశెట్టి రవిచంద్ర విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు.

ఈ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 18 వేల పైచిలుకు మెజారిటీతో గెలుస్తారని వారు జోస్యం చెప్పారు. ఇందులో ఒక్క ఓటు తగ్గినా తాము పార్టీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. ఆపరేషన్ ఆకర్షతో రూ.30 కోట్లకు అమ్ముడుపోయిన ప్రసన్నకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రసన్నకు 60 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెబుతున్నారని, ఈ మెజారిటీ వస్తే తనకు ఉన్న 100 ఎకరాలు రాసిస్తానని, లేదంటే మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలను రాసిస్తారా ? అని పమిడి సవాల్ విసిరారు. లక్ష్మిపార్వతి, జయప్రద, వాణివిశ్వనాధ్ వంటి వారు రాష్ట్రంలో కనుమరుగవడానికి ప్రసన్నతో ఉన్న సాన్నిహిత్యమే కారణమన్నారు. ప్రసన్న పెద్ద ఐరన్‌లెగ్ అని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మండవ దినేష్, కొమ్మి రవీంద్రనాయుడు, శింగంశెట్టి మురళీమోహన్, నెల్లూరు మురళీ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Friday, March 9, 2012

కోవూరు నియోజకవర్గాన్ని తన నియోజకవర్గం వలె అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఇద్దరు కుమ్కక్కయ్యారని, వారు కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించాలని ప్రయత్నించి విఫలమయ్యారని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కొడవలూరు మండలం నార్తురాజుపాళెం హైవే వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురె డ్డి సత్తా గల అభ్యర్థి అని, ఆయనకు మీ ఆశీర్వాదం అందించాలన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని తన నియోజకవర్గం వలె అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కోవూరుకు ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో ఓటర్లు ఆలోచించాలన్నారు. మూడేళ్ల క్రితం టీడీపీ అభ్యర్థి అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికే ఓట్లు వేసి గెలిపించారన్నారు.

అప్పుడు వైఎస్‌ తిరిగినప్పటికీ ప్రసన్నే గెలిచారన్నారు. అయినా మూడేళ్లలో కోవూరులో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటాడో తెలుసా అన్నారు. ఇలా పార్టీ మారేవారికోసం ‘యాంటీ డిఫెక్షన్‌ లా’ అనే చట్టాన్ని తేవడం జరిగిందన్నారు. దీనివల్ల అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయడం, రాజీనామా, వేటు వేయడం జరుగుతుందన్నారు. 12 సార్లు జరిగిన ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో పోరాడుతూనే వస్తుందన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుతో పోరాడితే ఆయన తనయుడు జగన్‌ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం గత సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవారికి చేరేవిధంగా చూస్తుందన్నారు. అదేవిధంగా 108, ఆరోగ్యశ్రీ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. గతంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేలు ఉండగా, వాటిని భారీగా పెంచడం జరిగిందన్నారు. అలాగే మత్స్యకారులకు పక్కా గృహాల నిర్మాణానికి రూ.65 వేల వరకు ఇస్తున్నామన్నారు. అర్బన్‌ ఏరియాలో రూ.55 వేలు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అదనంగా 30 లక్షలు రేషన్‌కార్డులు, 8 లక్షలు పెన్షన్‌లు, 12.5 లక్షల పక్కా ఇళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం కిలో రూపాయ బియ్యం పొందుతున్నవారు 2.5 కోట్ల మంది వున్నారన్నారు.

అలాగే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లక్ష 16 వేల మందిని గుర్తించి భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిభ కలవారికే స్థానం కల్పిస్తున్నామన్నారు. అలాగే రాజీవ్‌ యువకిరణాల ద్వారా వివిధ రంగాల్లో ఏడాదికి 5 లక్షల చొప్పున మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే రైతులకు లక్ష వరకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పిస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో శ్రీనిధి ఏర్పాటు చేసి మహిళా బ్యాంకులు ప్రతి మండలానికి రూ.25 లక్షల చొప్పున ఒక భవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవూరు ఉప ఎన్నిక చరిత్ర సృష్టించబోతుందని సిఎం అన్నారు.

పేదల గోడు వినే నాధుడే కరువయ్యాడని వైఎస్‌ జగన్‌


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరులో జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌సి పార్టీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రెండవ విడత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ మరణానంతరం రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత పూర్తిగా దిగజారిపోయాయని, రైతుల, పేదల గోడు వినే నాధుడే కరువయ్యాడని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన విడవలూరు మండలంలో వావిళ్ల, దంపూరు, చౌకచర్ల, వేగూరులలో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి జీవించివుండగా ఆయన పథకాలకు ఆకర్షితుడై ఆయన వద్దకు వచ్చిన ప్రసన్నను రాజీనామా చేసి రమ్మని చెప్పడం జరిగిందన్నారు. తనపై గౌరవంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని ఆయనను తిరిగి ఎమ్మెల్యే చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌, టీడీపీలు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే ఉండాలని కోరుకుంటున్నాయని ప్రజలకు ఒకరి మీద బోర్‌ కొట్టినపుడు ఇంకొకరిని గెలిపించుకుంటార నే ఉద్దేశ్యం వారిదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రసన్నను మంచి మెజార్టీతో గెలిపించాలను ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్ధి ప్రసన్న మాట్లాడుతూ జగన్‌ను, విజయమ్మను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని తన ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ గాలి ధాటికి మిగతా పార్టీల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. జగన్‌ చంద్రబాబుకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తున్నారని, ఆయన ధాటికి చంద్రబాబునాయుడు గుండెల్లో రైళ్లు పరుగెస్తున్నాయని, ఈ ఉప ఎన్నికల్లో టిడిపికి 3వ స్థానం దక్కితే గొప్ప అని ఆయన జోస్యం చెప్పారు

1.500 కిలో బంగారు గ్రాములు నగలు స్వాధీనం చేసుకున్నట్లు రాపూరు పోలీసులు

రాపూరు :రాపూరు నెల్లూరు జిల్లాలోని కోవూరులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ఆదేశాల మేరకు రాపూరు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా రాపూరు మండల పరిధిలోని మద్దెలమడుగు కూడలిలో శుక్రవారం పోలీసు తనీఖీల్లో రూ. 50 లక్షల విలువచేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు రాపూరు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా రాయచోటి నుంచి రాపూరు మీదుగా ఆర్టీసి బస్సులో నెల్లూరుకు చెందిన నగల వ్యాపారులు సరైన పత్రాలు లేకుండా సుమారు 1.500 కిలో గ్రాములు బంగారాన్ని తరలిస్తుండగా గుర్తించినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు. వీరిని రాపూరు పోలీస్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలియచేశారు

ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార పర్యటనలో శుక్రవారం అపశృతి చోటు చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తరఫున జగన్ ప్రచారం చేస్తున్నారు. విడవలూరు మండలంలోని చౌకచర్ల గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పర్యటించారు. జగన్ మాట్లాడుతుండగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు. అయితే గ్రామ కూడలిలో ఆయన ప్రసంగిస్తుండగా పక్కనే ఉన్న రేకుల షెడ్డు పైనుంచి ప్రసంగాన్ని వింటున్న యువకులు రేకులు కూలి కింద పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.

కాగా అంతకుముందు వావిలాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. మంత్రులు మూటల సంచులతో కొవ్వూరు వస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అనురాగం, ఆప్యాయతలను డబ్బులతో కొనాలని చూస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వంత పాడుతున్నారని విమర్శించారు.

నెల్లూరు జిల్లా కోవూరు లో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది

నెల్లూరు: 2009 సంవత్సరం సాధారణ ఎన్నికలలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రయ్య గౌడ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు లో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉదయం రామచంద్రయ్య గౌడ్ పలువురు కార్యకర్తలతో కలిసి బాబు సమక్షంలో టిడిపిలోకి చేరారు. రామచంద్రయ్యతో పాటు పిఆర్పీ, కాంగ్రెసు కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లను తగు విధంగా కల్పిస్తామని చెప్పారు. అవినీతి విషయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, అధికార కాంగ్రెసు పార్టీ దొందు దొందేనని అన్నారు.

రాష్ట్రంలో మంచి పాలన కోసం తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ప్రజలకు సూచించారు. టిడిపి అభ్యర్థిని గెలిపించి మిగతా పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. కాగా ప్రచారం ముగించుకున్న చంద్రబాబు అటు నుండి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారు -ముఖ్యమంత్రి


నెల్లూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోవూరు ఎన్నికల ప్రచార సభ రికార్డు డ్యాన్స్‌లతో హోరెత్తింది. సభకు వచ్చిన ప్రజలను అలరించేందుకు యువతీయువకులతో కాంగ్రెసు నాయకులు రికార్డు డ్యాన్సులు చేయించారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రావడం కాస్తా ఆలస్యం కావడంతో కాంగ్రెసు నాయకులు రికార్డు డ్యాన్సులు పెట్టించారు. రోషమున్న కుర్రాళ్ల కోసం.. వంటి సినిమా పాటలకు యువతీయువకులు జోరుగా నృత్యాలు చేశారు. ఆ తర్వాత సభకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దని ఆయన ఓటర్లకు హితవు చెప్పారు. కోవూరు ఎన్నికలు చరిత్ర సృష్టించే ఎన్నికలని, తమ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఉందని చెప్పడానికి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తమ కాంగ్రెసు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గెలిపిస్తే కోవూరును తన నియోజకవర్గం చూసుకుంటున్నట్లు చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఇవి మామూలు ఎన్నిక కాదని, అందుకే కాంగ్రెసుకు ప్రజలు ఓటేయాలని ఆయన అన్నారు.

సంక్రాంతికి చంకలు లేపనివ్వని చలి, ఉగాదికి ఊడ్చిపెట్టుకుపోతుందనేది

నెల్లూరు జిల్లా: ఈ సారి వేసవి కాలం ముందే వస్తోందని వాతావరణ నిపుణులు ప్రకటించారు. ఎండలు సైతం మునుపెన్నడూ లేని విధంగా మండుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం కాస్త చల్లగా ఉన్నా… మధ్యాహ్నానికి చెమటలు పట్టిస్తాయని, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. చలి… ఈ పేరు చెబితే పాత సామెత గుర్తుకు రావడం సహజమే. సంక్రాంతికి చంకలు లేపనివ్వని చలి, ఉగాదికి ఊడ్చిపెట్టుకుపోతుందనేది ఆ సామెత. శివరాత్రికి శివశివా అంటుందనేది పలు ప్రాంతాల సామెత. ఏదయినా… ఈ ఏడాది శివరాత్రి నుంచే ఎండలు ఆరంభమయ్యాయి. రుతువులు మారకముందే రుతు ధర్మాలు మారుతున్నాయి. ముందే వచ్చిన వేసవి ఈ సారి తన ప్రతాపాన్ని చూపనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాది ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రత సగటున 34.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా…. ఈ సారి ఫిబ్రవరి మాసం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే 34.1 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత వాలెంటీన్ డే నాటికి 37 డిగ్రీల స్థాయికి పెరిగిపోయింది. ఏప్రిల్ రెండో వారానికి ఇది 39 డిగ్రీలను దాటే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ తెలంగాణలలో అధికంగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇక ఈ నెల మూడో వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయంటున్నారు. అయితే అధిక ఎండలు పుష్కల వర్షాలకు సూచనలని, ఈ సారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Thursday, March 8, 2012

మహిళను ఉద్దేశించి అమ్మా.. నీవు ఎవరికి ఓటేస్తావని నాయుడు ప్రశ్నించినప్పుడు-ఆమె తాను వైయస్ జగన్‌కే ఓటేస్తానని

కోవూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఓ మహిళ షాక్ ఇచ్చారట. ఆదివారం చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సెంటర్లో మాట్లాడారు. మధ్యలో సభకు హాజరైన ఓ మహిళను ఉద్దేశించి అమ్మా.. నీవు ఎవరికి ఓటేస్తావని అడిగారు. దానికి ఆమె తాను వైయస్ జగన్‌కే ఓటేస్తానని చెప్పింది.

దీంతో బాబు కంగు తిన్నారట. విస్తుబోయిన ఆయన వెంటనే తేరుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే ఫలితం ఉండదమ్మా.. టిడిపికి ఓటేసి గెలిపిస్తే మేలు జరుగుతుందని ఆమెకు సూచించి ప్రసంగం ప్రారంభించారట. స్వయంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించినప్పుడు కూడా ఓ మహిళ ఇలా సమాధానం చెప్పడంతో స్థానిక నేతలు కూడా ఒకింత గందరగోళంలో పడ్డారని అంటున్నారు.

YSR కాంగ్రెస్‌ పార్టీని పురిట్లోనే చంపేయాలని -చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు

కోవూరులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. అగ్రనేతలు రంగంలోకి దిగడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌ను పురిట్లోనే చంపేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. విశ్వసనీయత లేని టీడీపీ-కాంగ్రెస్‌లకు డిపాజిట్లు రానీయద్దని జగన్ జనాన్ని అభ్యర్థించారు.

రెండోవిడత కోవూరు ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి స్పందన లభించింది. సముద్ర తీరప్రాంతాల్లో బాబు రోడ్‌షోకు మత్స్యకారులు ఘనస్వాగతం పలికారు. ఇందుకూరుపేట మండలంలో జేజేపేటలో ప్రారంభమైన ప్రచారం.. డేవిస్‌పేట, ఇందుకూరుపేట, మైపాడు మీదగా గంగపట్నం దాకా సాగింది. టూర్ మొత్తం అవినీతి పార్టీలను ఓడించండి.. అసమర్ధ ప్రభుత్వానికి బుద్ధిచెప్పండంటూ బాబు ప్రసంగించారు.

కోస్టల్ కారిడార్‌ పేరుతో గంగపుత్రుల నోట్లో కాంగ్రెస్ సర్కారు మట్టి కొట్టిందని విమర్శించారు. YSR కాంగ్రెస్‌ పార్టీని పురిట్లోనే చంపేయాలని ప్రసన్నకుమార్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు. అటు బాబు ప్రచారానికి ధీటుగా జగన్‌ టూర్ కొనసాగుతోంది. నాలుగో రోజు ఇందుకూరుపేట, కొడవలూరు మండలాల్లో పర్యటించారు యువనేత.

తన తండ్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరుగున పడిపోతున్నాయని..అవి తిరిగి పేదలకు అందుబాటులోకి రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని రాజుపాలెం బహిరంగసభలో అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు మ్యాచ్‌ పిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఇవాళ కోవూరు, విడవలూరులో జగన్ టూర్ కొనసాగుతుంది. అన్ని పార్టీల ప్రచారానికి జనం భారీగా వస్తుండండతో గెలుపు ఎవరిని వరిస్తుందనే టెన్షన్‌ ఎలక్షన్‌ తర్వాతే వీడనుంది.

కోవూరులో గెలుపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి టానిక్‌లా...

కోవూరులో ప్రతిపక్షాలను కట్టడి చేయడమెలా!? అక్కడ మళ్లీ పాగా వేయడమెలా!? అధికార కాంగ్రెస్‌లో అంతర్మథనమిదే! తెలంగాణలో జరుగుతున్న ఆరు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల కంటే కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే ఆ పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. ఇక్కడ విజయం సాధించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాన్ని ఇవ్వగలుగుతామని భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల తర్వాత జగన్ వర్గంపై వేటుతో ఖాళీ అయిన 17 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కోవూరులో గెలుపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి టానిక్‌లా పనికొస్తుందని కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు.

జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తదితరులు కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కోవూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే, ఈనెల 11న కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరంజీవి, 15న మళ్లీ చిరంజీవితోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోవూరులో ప్రచారం చేయనున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సా నుభూతి కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు. తాజా గా ఈ నియోజకవర్గంలో జగన్ ప్రచారానికి జనం పలుచగా ఉండడం కాంగ్రెస్ వర్గాలను సంతోషపరుస్తోంది.

వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తే పిల్లలకు జేబులు కొట్టే అలవాటు వస్తుంది


నెల్లూరు:,"గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం కోసం పోరాడాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. వారి విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తే పిల్లలకు జేబులు కొట్టే అలవాటు వస్తుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దొంగ అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఓ గజదొంగ అని దుయ్యబట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఇందుకూరుపేట మండలంలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో, అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. "1993 నుంచి 2009 వరకు పార్టీ టికెట్ ఇవ్వడమే కాదు. పైసలు కూడా ఖర్చు చేసి ప్రసన్నను గెలిపించాం. కానీ, రెండు నెలలు తిరగకముందే ఆయన 'వైఎస్ఆర్ ఆకర్ష్'లో చిక్కాడు. డబ్బు సంచులు తెచ్చుకుని దొంగగా మారాడు. ఆ దొంగను అభ్యర్థిగా పెట్టడం ద్వారా జగన్ మరో గజదొంగ అయ్యాడు. సీబీఐ అరెస్ట్ చేస్తుందని భయపడి ఇంట్లోనే దాక్కొన్న జగన్ దొంగ లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు. నేను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పిన తర్వాతే ఆయన ప్రజలను ఓట్లు అడగాలి'' అని బాబు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ దొంగల పార్టీ అని, ఆ చెట్టు నుంచి పుట్టిన విషపు కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వస్తే పాలన పిచ్చోడి చేతిలో రాయి అవుతుందన్నారు. వైఎస్ చేసినంత అన్యాయం, అవినీతి ఏ సీఎం చేయలేదన్నారు. రెండేళ్లుగా ఓదార్పు చేస్తున్న జగన్ ఓ దోషి అని, ఆయన్ని ఓదార్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. పాపిష్టి సొమ్ముతో పెట్టిన జగన్ పత్రిక చదవొద్దని, చానల్‌ను చూడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ ఒక్క పత్రిక కూడా పెట్టలేదన్నారు.

టీడీపీ ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న తమకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని చెప్పారు. చిరంజీవి సినిమా డబ్బా తిరుగుటపా అయిందని, కానీ, ఎన్టీఆర్ మడమ తిప్పని నేత అని కొనియాడారు. యూపీ ఫలితమే 2014లో ఆంధ్రప్రదేశ్‌లోనూ పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు

భర్త శవానికి అంత్యక్రియలు చేయడాన్ని భార్యనే అడ్డుకుంది


నెల్లూరు :నెల్లూరు జిల్లా దువ్వూరు గ్రామంలో ఓ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా మూడు రోజుల పాటు ఓ వ్యక్తి శవం ఇంటి ముందు ఉంది. భర్త శవానికి అంత్యక్రియలు చేయడాన్ని భార్యనే అడ్డుకుంది. ఆస్తి విషయం తేల్చే వరకు శవాన్ని కదలనిచ్చేది లేదని పట్టుబట్టింది. దీంతో శవానికి మూడు రోజుల పాటు అంత్యక్రియలు జరగలేదు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని పంచాయతీ చేయడంతో సమస్య పరిష్కారమైంది

నక్కా రమణయ్య అనే వ్యక్తికి కొంత భూమితో పాటు ఇల్లు ఉంది. అతను బంధువుల ఇంట్లో ఉంటూ మరణించాడు. రమణయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో, అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని భార్య కూతురు ఇంట్లో ఉంటుంది. రమణయ్య మరణంతో ఆమె కూతురితో పాటు గ్రామానికి వచ్చింది. ఆస్తిని తమకు అప్పగించాలని ఆమె పట్టుబట్టింది. అందుకు బంధువులు నిరాకరించారు. దాంతో మూడు రోజుల పాటు శవం అలాగే ఉంది.

చివరికి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పంచాయతీ చేశారు. రమణయ్య కూతురికి కొంత ఆస్తి ఇచ్చేటట్లు ఒప్పందం చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది. రమణయ్య శవానికి అంత్యక్రియలు జరిగాయి.

ప్రసన్నకుమార్‌రెడ్డి దొంగ అయితే, జగన్ గజదొంగని అభివర్ణించారు- చంద్రబాబునాయుడు


కోవూరు: సీబీఐ అరెస్టుకు భయపడి ఇంట్లో దాక్కున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కోవూరులో గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీ పార్టీ అభ్యర్ధి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దొంగ అయితే, జగన్ గజదొంగని అభివర్ణించారు. ఎవరబ్బ సొమ్మని రాష్ట్రాన్ని దోచుకున్నారని జగన్‌పై బాబు విరుచుకుపడ్డారు. జగన్ ఓటు కోసం వస్తే నిలదీయాలన్నారు.

నెల్లూరు జిల్లాలోని కోవూరులో చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సర్కార్ బ్రాంది ప్రభుత్వంలా మారిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే చిత్తూరు, విజయనగరం జిల్లాలో ఏసీబీ దాడులు జరిగాయన్నారు. బొత్స సత్యనారాయణ పీసీసీ, మంత్రి పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే రాష్ట్రంలోనూ సైకిల్ ప్రభంజనం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాదిలో అసమర్ధ కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. నాయకత్వ లోపంతో, అవినీతితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెసు 4 రాష్ట్రాల్లో దెబ్బ తిన్నదని, కోవూరులో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యూపీలో సైకిల్ దెబ్బకు హస్తం, ఏనుగు పటాపంచలయ్యాయని, రాష్ట్రంలో కూడా సైకిల్ దెబ్బకు హస్తం, ఫ్యాన్ తుక్కుతుక్కు అవుతాయని ఆయన అన్నారు.

తృతీయ కూటమి ఏర్పాటు ద్వారా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. సిగ్గులేని ప్రభుత్వం కరెంట్ లేక మంచినీళ్లు ఇవ్వడం లేదని, బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం ఇస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని సిగ్గులేని నాయకత్వం నడుపుతోందని, ఈ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని బాబు అన్నారు. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. మహిళా దినోత్సవం, హోలీ పండుగ ఒకే రోజు రావడం శుభపరిణామమని చంద్రబాబు పేర్కొన్నా

Wednesday, March 7, 2012

కోవూరు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి డిఎల్‌ఓలు ఓటరు స్లిప్పులు


కోవూరు : ఓటర్లకు అధికారులు అందజేసిన స్లిప్పులుంటే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ బి. శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గోల్డెన్‌ జూబ్లీహాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోవూరు ఉప ఎన్నికలను సజావుగా జరపడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం నుండి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి డిఎల్‌ఓలు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తారన్నారు. అందరూ ఇంటివద్ద ఉండాలని, అలా లేనివారు స్థానిక అధికారుల సహకారంతో వారంలో ఎప్పుడైనా తీసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అధికారులు ఇతర గుర్తింపు కార్డులను అనుమతిస్తారన్నారు. ఈనెల 12వ తేదీ నుండి వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇవిఎంల పరిశీలన జరుగుతుందన్నారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ నోటీసులు జారీ చేశామని వారి సమక్షంలో అవసరమైతే మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను నియమించామని తెలిపారు. వారికి ఈనెల 9, 14, 15 తేదీల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. అందుకు అధికారులంతా హాజరుకావాలని, ఎవరైనా హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద మైక్రో అధికారులుగా నియమించామన్నారు. 12వ తేదీన వీరికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేయనున్నామని, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ఎక్కడ నుండైనా పోలింగ్‌ సరళిని చూసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం, డబ్బు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నామని, కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎనిమిది, జిల్లా సరిహద్దుల్లో ఏడు మొత్తం 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభమైనందున ప్రతిపార్టీ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధికారపార్టీకి అధికారులు సహకరిస్తున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు జరిగిన తరువాత తాము రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తామన్నారు. నాయకులు వచ్చే సమయంలో కూడా పార్టీలు కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని, సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 16వతేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని ముగించాలన్నారు. కలెక్టరేట్‌లో కంప్లైంట్‌ సెల్‌ ఏర్పాటు చేశామని, అందులో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పొదుపు మహిళల అకౌంట్‌లో కొన్ని రాజకీయపార్టీలు డబ్బు వేస్తున్నారన్న ప్రచారంపై ఇప్పటికే డిఆర్‌డిఎ పిడిని విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వం వద్ద అందరి అకౌంట్‌ నెంబర్లు ఉంటాయని, అందులో పరిశీలన జరుపుతామని తెలిపారు.

సీఎం బహిరంగ సభను లక్ష మందితో జరపాలని ఆ పార్టీ నేతలు..

కోవూరు; కోవూరు రేపు సీఎం రాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివా సులు రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 9న విచ్చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి వెంకట రమణ, ఆనం రామనారాయణారెడ్డిలు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. వీరుగాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రధాన నేతలు గ్రామాల్లో పర్య టించి ఓటర్లను పలుక రిస్తున్నారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో శుక్రవారం జరిగే సీఎం బహిరంగ సభను లక్ష మందితో జరపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇప్పటినుంచే జనసమీకరణ కోసం నేతలకు బాధ్యతలు అప్పగించారు.

లోక్‌సత్తా పార్టీ అధినేత.. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. సాయంత్రం కోవూరులో బహిరంగ సభ నిర్వహించారు. గురువారం మరోమారు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక సీపీఎం నేతలు, స్వతంత్రులు ఎవరికి వారుగా ప్రచారాలలో నిమగ్నమై ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అలాగే అభ్యర్థుల కుటుంబసభ్యులు, బంధువులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రోజు లుగా రోడ్‌షో


జగన్ రోడ్‌షో వైఎస్సార్సీ అభ్య ర్థి నల్లపరెడ్డి ప్రస న్నకుమార్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రోజు లుగా రోడ్‌షో నిర్వ హిస్తున్నారు. తొలి రోజు కొడవలూరు మండలంలో జన స్పందన లేకపో వడంతో సభలు వెలవెలపోయాయి. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతిలో కథ నం ప్రచురితం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీ సుకుని వైఎస్సార్సీ నేతలు రెండో రోజు ఇందు కూరుపేట మండలంలో భారీ జన సమీకరణ జరిపారు. మైపాడులో జరిగిన జగన్ రోడ్‌షోలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కొందరు మత్స్యకారులపై దాడి చేయడం వివాద స్పదమైంది. కొన్ని గ్రామాల్లో పర్యటించకపోవడంతో ఆయా గ్రామస్థులు జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఇలా మూడు రోజుల జగన్ రోడ్‌షో బుధవారం ముగిసింది. మరో రెండురోజులపాటు జగన్ రోడ్ షో కొనసాగనుంది.


చంద్రబాబు బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు

నెల్లూరు కోవూరు ఉపఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలంతా తరలి వస్తున్నా రు. మండల, గ్రామ ఇన్‌చార్జులుగా బాధ్యతలు తీసుకున్న నేతలు అక్కడే మకాం వేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తొలి విడత ప్రచారాన్ని విజయవంతంగా ముగించుకున్న చంద్ర బాబు రెండో విడత ప్రచారం కోసం విచ్చేస్తున్నారు.

గత మూడు రోజులుగా జగన్ జరుపతున్న రోడ్‌షో చివరి దశకు చేరింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఖరారైంది. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కోవూరు నియోజకవర్గంలో కోవూరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇలా ప్రధాన పార్టీలు ఎవరికి వారు ప్రచారాలపై దృష్టి పెట్టారు.

నేడు బాబు పర్యటన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇప్పటికే మూడు విడతల ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ఈ నెల 4న చంద్రబాబు బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ప్రధానంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని బాబు ప్రసంగించారు. అదే రోజు రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండల, గ్రామ ఇన్‌చార్జి బాధ్యతలను నేతలకు అప్పగించి ఎలా వ్యవహరించాలన్నది సూచనలు చేశారు. రోజువారీ పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని ఆదేశిం చారు. బాబు తొలి విడత పర్యటన టీడీపీ కేడర్‌లో నూతనోత్సాహం నింపింది. పార్టీ అగ్ర నేతలతో పాటు, జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు వారికి కేటాయిం చిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తి స్తున్నారు.

రెండు రోజుల క్రితం విడవలూరులో సోమిరెడ్డి జరిపిన ప్రచారానికి పెద్ద ఎత్తున జనం విచ్చేశారు. ఎవరికివారుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు సాగిస్తుండటంతో రోజు రోజుకు టీడీపీ బలం పుంజుకుంటోంది. ఈ నేప థ్యంలో బాబు రెండో విడత రోడ్‌షోను గురు వారం ఇందుకూరుపేటలో నిర్వహించ నున్నారు. రోడ్‌షో అనంతరం నేతలతో చంద్రబా బు సమావేశమై ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చ ర్చించనున్నారు. శుక్రవారం ఉదయం హెలి కాప్టర్‌లో ఆయన తెలంగాణ ప్రాంతంలో ప్రచార ానికి వెళ్లనున్నారు.

Fire Erupted at Fireworks Godown in Nellore District Atmakur


ఆత్మకూరు: పొట్టకూటి కోసం ప్రాణాంతకమైన పనులు చేయకతప్పడంలేదు. పేదరికం, పనిచేస్తేగాని ఐదువేళ్లు నోటికాడికి చేరని దౌర్భాగ్యం వారిది. జానెడు పొట్ట పోసుకునేందుకు వచ్చి బాణాసంచా బారిన పడి దుర్మరణం పాలయ్యారు ఆ నలుగురు.. ఆత్మకూరుకు ముగ్గురు ఒకేసారి దుర్మరణం పాలవడంతో పట్టణం మూగబోయింది.

పనికి వెళ్లి ఇకతిరిగిరాని లోకానికి వెళ్లడంతో పట్టణవాసులు కంటతడిపెట్టారు. ఆత ్మకూరు సమీపంలోని నాగుల పాడు రోడ్డు వద్ద బుధవారం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీపేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు ఆత్మకూరు పట్టణవాసులుకాగా, మరొకరిది ముత్తుకూరు మండలం సుబ్బారెడ్డిపాళెం. మృతులది పేదరికం నేపథ్యమే.

నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆత్మకూరులోని వీవర్స్‌కాలనీకి చెందిన రాజేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్య, ఏడాది కుమారుడు, తల్లి ఉన్నారు. రాజేష్ మృతితో కుటుంబం దిక్కులేనిదైంది. మరో మృతుడు నసీరుద్దీన్‌కు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. నసీరుద్దీన్ గత కొన్నేళ్లుగా బాణాసంచా తయారీకేంద్రంలో పనిచేస్తున్నాడు. గౌస్‌బాషా అలియాస్‌శివకు భార్య ఉంది.పిల్లలు లేరు. సుబ్రహ్మణ్యం ముత్తుకూరుమండలం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు.

మిన్నంటిన ఆర్తనాదాలు మృతుల వివరాలు తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు మాంసపు ముద్దల్లా తయారయ్యాయి. కడసారి చూపునకు కూడా నోచుకోకపోవడంతో వారివేదన వర్ణనాతీతం. ఉదయం పనికెళ్లొస్తామని చెప్పి వచ్చిన వారు మాంసపుముద్దల్లా తయారైపోవడంతో అయిన వారు దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేశారు. మేం ఎవరికోసం బతకాలంటూ వారు రోధిస్తుండటంతో అందరూ కంటతడిపెట్టారు.

అధికారుల పరిశీలన సంఘటన స్థలాన్ని డీఎస్పీ రాజామహేంద్రనాయక్, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఆంజనేయరెడ్డి, తహసీల్దారు బికె వెంకటేశ్వర్లు, అగ్నిమాపకదళాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు.అదేవిధంగా సంఘటనస్థలాన్ని నెల్లూరు ఆర్డీవో మాధవీలత పరిశీలించారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను పరిశీలించారు. విద్యుత్ తీగలు రాసుకోవడంవల్ల ప్రమాదం జరిగిందా..? మరేమైనా కారణాలు ఉంటాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.

జాగ్రత్తలు లేకపోవడమే.. బాణాసంచా కేంద్రంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్‌డీవో మాధవిలత సంఘటనా స్థలికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. కేసు నమోదుచేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయరెడ్డి తెలిపారు.

పరారీలో నిర్వాహకుడు సంఘటన జరిగిన సమయంలో బాణాసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు రఫీ అక్కడే ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను రఫీయే స్వయంగా 108 వాహనంలో ఎక్కించి పరారైనట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా సంభవించిందనే విషయమై పూర్తి సమాచారం అందలేదు. పరారీలో ఉన్న నిర్వాహకుడు రఫీ పట్టుబడితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

అటు ఉక్కపోత ఇటు దోమల బెడదతో ప్రజానికానికి నిద్ర కరువవుతోంది.విద్యుత్ కోతల జిల్లా వాసులకు నరకం


నెల్లూరు నగరం.. మంగళవారం రాత్రి.... సమ యం 11 గంటలు... ప్రజలంతా అప్పుడే కునుకు తీస్తూ గాఢ నిద్రలోకి జారుకుంటున్నారు... అప్పటివరకు గిరగిరా తిరుగుతూ దోమలను, ఉక్కపోతను తరిమేస్తున్న ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో దో మల స్వైరవిహారం ప్రారంభమైంది. ప్రజలంతా వీధుల్లోకి పరిగెత్తాల్సి వచ్చింది... ఏమైందా అని ఆరా తీస్తే... ఇంకేముంది రాత్రుళ్లూ విద్యుత్ కోత ప్రారంభమైంది.

కావలి పట్టణంలో అధికారికంగా కోత నాలుగు గంటలే. అది కూడా పగలే. కానీ సోమవారం రాత్రి 10.15 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ 11.30 గంటలకు వచ్చింది. పగలు కోతలన్నారు.. రాత్రుళ్లు కరెంట్ తీయడమేమిటని అడిగితే అధికారులు వద్ద సమాధానం లేదు. అది అంతే అంటున్నారు.

ఉదయగిరి పట్టణంలో అధికారిక కోత పగలు ఆరు గంటలు, అయితే మంగళవారం రాత్రి 10.45 గంటలకు కరెంట్ పోయింది. 12 గంటలకు వ చ్చింది. మళ్లీ రాత్రి 1.30 గంటలకు తీశారు. 3.45 గంటలకు ఇచ్చారు. దీంతో ప్రజలకు కునుకు లేకుండాపోయింది. ఇది జిల్లాలో రాత్రి పూట విద్యుత్ సరఫరా పరిస్థితి. ఒక ఊరు కాదు ఒక ప్రాంతం కాదు జిల్లా అంతా ఇదే పరిస్థితి. పగలంతా కష్టపడి రాత్రి పూట ప్రశాంతంగా కునుకు తీద్దామనుకున్న ప్రజలకు ఆ వీలు లేని పరిస్థితి ఏర్పడుతోంది. అటు ఉక్కపోత ఇటు దోమల బెడదతో ప్రజానికానికి నిద్ర కరువవుతోంది. ట్రాన్స్ అధికారుల తీరు జిల్లా వాసులకు నరకం చూపుతోంది.


పెరుగుతున్న కోతలు భానుడి తీవ్రత పెరుగుతున్న కొద్దీ జిల్లాలో విద్యుత్ కోతల సమయం కూడా పెరుగుతోంది. అనధికారిక కోతలు అధికమవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పగటి పూట మాత్రమే కోతలు విధిస్తున్నామని అధికారులు ప్రకటించినప్పటికి పగలు, రాత్రి తేడా లేకుండా భారీగా కోతలు విధిస్తున్నారు.

రాత్రి కోతలతో ఇక్కట్లు సకలజనుల సమ్మె పేరుతో ఈ ఏడాది వర్షాకాలం నుంచే కోతలు విదిస్తూ వస్తుండడంతో పగటి పూట కోతలకు ప్రజలు కొంత మేర అలవాటుపడ్డారు. అయితే ప్రస్తుతం ఎండలు ముదరుతున్న సమయంలో రాత్రిళ్లు కూడా కోత విధిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత ఇబ్బందికరంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

వాడకం తక్కువ, సరఫరా ఎక్కువ జిల్లాలో విద్యుత్ సరఫరాలో వింత పరిస్థితి ఏర్పడింది. సహజంగా సరఫరా కంటే డిమాండ్ పెరిగితే కోతలు విధిస్తారు. కానీ జిల్లాలో సరఫరా కోటా కంటే వినియోగం తక్కువగా ఉన్నప్పటికి భారీగా కోతలు విధిస్తున్నారు. రోజుకు 8.032 మిలియన్ యూనిట్ల కోటా ఉండగా 7.3 మిలియన్ యూనిట్ల వాడకం మాత్రమే ఉంటోంది. ఈ ప్రకారం జిల్లాలో కోతలు పూర్తిగా ఉండకూడదు. అయితే రాష్ట్రవ్యాప్తం గా ఇతర ప్రాంతాలలో డిమాండ్ అధికంగా ఉంటోందనే కారణంతో అధికారులు జిల్లాలోనూ కోతల మోత మోపుతున్నారు

కోవూరులో 12,13 తేదీలలో చిరంజీవి, 13న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రచారం

కోవూరు : కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. బుధవారం మండలంలోని నార్తురాజుపాళెంలో తలపెట్టిన బహిరంగ సభ, హెలిప్యాడ్‌ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల9న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన 12,13 తేదీలలో చిరంజీవి, 13న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రచారం చేస్తారని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, కోవూరులో ఎన్నిక ఎందుకు జరుగుతుందో మాత్రం ప్రజలకు తెలుసునన్నారు. స్వార్థపరుల్ని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య, నాశన ప్రసాద్, ఇండ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వైయస్ జగన్ నిర్వహించిన రోడ్ షోలకు ప్రజలు పెద్దగా రాలేదంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల్లో కలవరం

నెల్లూరు: తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్వహించిన రోడ్ షోలకు ప్రజలు పెద్దగా రాలేదంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. అప్పటి ఓదార్పు ఏదంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రశ్నించింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం - జగన్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొడవలూరు మండలంలో పర్యటించారు. 18 చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేశారు. కొడవలూరు, తలమంచి, గండవరం తదితర సభలకు జనం బాగానే కనిపించారు. మిగిలిన సభలు మాత్రం జనంలేక పలుచనయ్యాయి. గుండాలమ్మపాళెంలో ఇరవై ముప్పై మంది కూడా కనిపించలేదు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చేపట్టిన రోడ్‌షో అనుకోకుండా ఏర్పాటు చేసింది కూడా కాదు. ఇక్కడ ఆదివారమే జగన్ ప్రచారం చేయాల్సి ఉంది. కానీ... అది సోమవారానికి వాయిదా పడింది. అయినప్పటికీ జనం లేకపోవడంతో జగన్ పార్టీ నేతల్లో కలవరం మొదలైందని ఆంధ్రజ్యోతి రాసింది. కోవూరు నియోజకవర్గంలో ఆదివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనకు వచ్చిన భారీ స్పందనతో పోల్చుకుని మరింత ఆందోళన పడుతున్నారు. అవినీతి సొమ్ముతో పార్టీ పెట్టిన జగన్‌ను బహిష్కరించాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ప్రజలు ప్రతిస్పందించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందపడుతున్నట్లు కూడా ఆ పత్రిక రాసింది.

రాష్ట్ర రాజకీయాలపై, నేతలపై విమర్శలు చేయకుండా, తన ప్రసంగాన్ని వేదాంత ధోరణి, ఆవేదనాపూరిత స్వరంతో జగన్ కొనసాగించారని ఆ పత్రిక రాసింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రాజుపాలెంలో బహిరంగసభకు జగన్ వస్తుండగా, ఎన్నికల అధికారి పోలీసులను వెంటబెట్టుకుని జగన్‌ను ఆపారు. దీంతో జగన్ పార్టీ నేతలు, ఎన్నికల అధికారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు జగన్ కాన్వాయ్‌ను అధికారులు ఇందుకుపేట మండలం జగదేవిపేటకు పంపారు. కాన్వాయ్‌లో పరిమితికి మించి ఉన్న ఒక ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కోవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు ఓటు ఈ మెసేజ్‌ను పదిహేను మందికి పంపితే మీ సెల్ ఫోన్‌కి ఐదువందల రూపాయల బ్యాలెన్స్


నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఎస్సెమ్మెస్‌లు సెల్ ఫోన్లలో షికారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయండని, ఈ మెసేజ్‌ను మరో పదిహేను మందికి పంపితే మీ సెల్ ఫోన్‌కి ఐదువందల రూపాయల బ్యాలెన్స్ వస్తుందని ఎస్సెమ్మెస్‌లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఎస్సెమ్మెస్‌లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఎస్సెమ్మెస్‌లకు తమ పార్టీకి గాని, తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కాని ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ కన్వీనర్ పిఎన్‌వి ప్రసాద్ తెలిపారు.

ఈ ఎస్ఎంఎస్ వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ ఎస్ఎంఎస్‌లో మరిన్ని వివరాలకు సాక్షి టెలివిజన్ చూడాలంటూ తప్పుడు సమాచారాన్ని కూడా అందరికీ ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

Four workers dead in a crackers manufacturing unit in Nellore district in fire accident.


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరుకు రెండు కిలోమీటర్ల దూరంలో గల నాగులపాడు వద్ద గల బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో నలుగురు కార్మికులు సజీవదహనం కాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల అవయవాలు చెల్లచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. చాలా సేపు మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం చోటు చేసుకుంది.

బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలను అర్పడానికి ఫైరింజన్ చాలా ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది. బాణసంచా కేంద్రంలో ప్రతి రోజు 8 నుంచి 10 మంది పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం కూడా వారు పనిచేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉగాది, శ్రీరామనవమి పండుగల కోసం క్రాకర్లు చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయి. దీంతో జనవరి నుంచి మార్చి నెల చివరి వరకు ఈ కేంద్రంలో బాణసంచా తయారు చేస్తుంటారు.

బాణసంచా గోడౌన్ లో పేలుడు ముగ్గురు కార్మికులు సజీవ దహనం

నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం లోని బాణసంచా గోడౌన్ లో పేలుడు   
ముగ్గురు కార్మికులు సజీవ దహనం. గోడౌన్ మరికొంత మంది ఉనట్లు సమాచారం 
గోడౌన్ ఎగిసిపడుతున మంటలు 

Tuesday, March 6, 2012

కోవూరు ఉప ఎన్నికలో ప్రతివ్యూహాలతో లోపల టెన్షన్‌గా నాయకులు..

కోవూరు : కోవూరు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సి పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు వ్యూహ, ప్రతివ్యూహాలతో రాష్ట్ర నాయకులను ప్రచారాల్లో ఉపయోగించుకుంటూ రాజకీయ ఆరంగేట్రం తిప్పుతున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలతో, అసభ్య పదజాలాలతో మాట్లాడుకుంటూ గెలుపు తనదంటే తనదంటూ పోటీ పడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 4వ తేదీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవూరులో రోడ్‌షో నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు వచ్చారు. అదేవిధంగా 5, 6 తేదీల్లో వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కొడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు కొంత మేర వచ్చారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలంలోని రేగడిచెలికలో రాత్రి 10 గంటలు దాటిన సందర్భంలో ప్రచారం నిర్విహ స్తున్నారన్న ఉద్దేశ్యంతో జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అదేవిధంగా 6వ తేదీ మైపాడు కొరుటూరు రోడ్డు సమీపంలో 20 మంది మత్స్యకారులు, జగన్‌ భద్రతా సిబ్బంది మధ్య తోపులాట జరిగి చివరకు ఘర్షణకు దారితీసింది.

ఈ రెండు సంఘటనలతో జగన్‌కు చేదు అనుభవం ఎదురైనట్లయింది. కొంతమంది రెండు పార్టీల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కూడా అంతుపట్టని ధోరణి ప్రజలకు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారానికి కూడా ప్రజలు కొంత మేర వస్తున్నారు. దీన్ని బట్టి ఓటరు నాడిని చెప్పలేని పరిస్థితిలో నాయకులున్నారు. ఈ మూడు పార్టీల అభ్యర్థులే గాక పలు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎవరి ఓట్లు ఎటు చీలుతాయో తెలియని పరిస్థితి కూడా ఉప ఎన్నికలో నెలకొంది. అంతేకాకుండా ప్రచారాలైతే జోరుగా జరుగుతున్నాయి. ప్రజలైతే వస్తున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్తున్నారు. మార్చి 18 జరుగనున్న ఓటింగ్‌లో ప్రజల ధోరణి ఏ విధంగా ఉంటుందో అంతు చిక్కని విధంగా వుంది. జయాపజయాలపై ఎవరి ధీమాతో వాళ్లు ఉన్నప్పటికీ లోలోపల టెన్షన్‌గా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మార్చి 21న జరుగబోవు కౌంటింగ్‌ రోజే నాయకుల భవితవ్యం ఖరారు కానుంది.

జగన్ సెక్యూరిటీ సిబ్బంది మైపాడులో మత్స్యకారులను దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని కుమ్మేశారు.


జగన్ వస్తున్నారు.. ఆయనను పలకరిద్దాం, దండలు వేద్దామని వెళ్లిన పాపానికి ఆ మత్స్యకారులకు దెబ్బలు తగిలాయి. అవికూడా అలాంటి, ఇలాంటి దెబ్బలు కావు.. పోలీసు దెబ్బలు! నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఇందుకూరుపేట మండలం మైపాడులో మత్స్యకారులను దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని కుమ్మేశారు. పిడికిళ్లు బిగించి పొట్టలో కొట్టారు. మత్స్యకారులు కూడా వారితో తలపడేందుకు ప్రయత్నించినా.. వారి పశుబలం ముందు నిలవలేకపోయారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలగజేసుకోవడంతో పరిస్థితి చల్లబడింది.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రోడ్‌షో మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట, కొత్తూరు, ఇందుకూరుపేటలలో రోడ్‌షో ముగించుకుని వస్తున్న జగన్ కాన్వాయ్‌ను జంగంవారిదొరువు గ్రామస్థులు అడ్డుకుని, తమ గ్రామంలోకి కూడా రావాలని పట్టుబట్టారు. సమయాభావం వల్ల రాలేకపోతున్నానని వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. సోమరాజుపల్లి, కొరుటూరు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మైపాడుకు జగన్ చేరుకున్నారు.

మైపాడు తుపాను షెల్టర్ సమీపానికి ఆయన చేరుకునేసరికి సుమారు పదిమంది మత్స్యకారులు అక్కడకు వెళ్లి, ప్రచార రథం నుంచి కిందకు దిగాలని జగన్‌ను కోరారు. వారిలో కొందరు జగన్‌కు పూలదండలు వేసేందుకు పోటీపడ్డారు. అంతే.. జగన్ సెక్యూరిటీ సిబ్బంది వారిని ఓ పక్కకు తోసేశారు. వాళ్లకు, స్థానిక మత్స్యకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఇంతలో జగన్ వాహనం కొంత ముందుకు వెళ్లింది. దాంతో మత్స్యకారులు మరోసారి జగన్‌ను కలిసేందుకు వెళ్లబోయారు. సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను మళ్లీ నెట్టారు.

దాంతో వారి మధ్య మాటా మాటా పెరిగాయి. జగన్‌ను చూద్దామని వస్తే.. ఆయనకు దండ వేద్దామనుకుంటే తమను అడ్డుకుంటారేమిటంటూ స్థానికులు నిలదీశారు. వారిని జగన్ చుట్టూ ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఏడెనిమిది మంది వచ్చి స్థానికులను చితక్కొట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాదారు. పిడికిళ్లు బిగించి పొట్టలో కొట్టి.. పోలీసు మార్కు దెబ్బలు రుచి చూపించారు.

ఓ సెక్యూరిటీ గార్డు ఎగిరి కాలితో తన్నబోగా.. స్థానికులు ఆ కాలు పట్టుకుని లాగారు. అతడు కింద పడటంతో గార్డులు మరింత రెచ్చిపోయారు. దాదాపు పది నిమిషాల పాటు ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. తర్వాత పార్టీ నేతలు కొంతమంది వచ్చి, సెక్యూరిటీ సిబ్బందిని వారించి.. వాళ్లను ప్రచార రథంలోకి ఎక్కించారు. "అభిమానంతో జగన్‌తో నేరుగా మాట్లాడాలని వస్తే మాపై దాడులు చేస్తారా?'' అని మత్స్యకారులు మండిపడ్డారు.

Pushpa Yagam performed at Rajarajeswari Temple Nellore

Pushpa Yagam performed at Rajarajeswari Temple Nellore
డబ్బు మూటలు దిగుతున్నాయ్ ప్రసన్నను ఓడించేందుకు--వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్

రాష్ట్రంలో పేదలు, రైతుల కోసం పనిచేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని ఆ పార్టీ నాయకుడు జగన్ తెలిపారు. మంగళవారం ఆయన ఇందుకూరుపేట మండలం జగదేవిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు కుళ్లిపోయి ఉండటంతో, విలువలు పెంచి, నిజాయితీకి అర్ధం చెప్పేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, దేశం కుమ్మక్కు

అవినీతికి మారుపేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిస్తే, ప్రతిపక్షం కుమ్మకై పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదనే కారణంలో తమ పార్టీపై కుట్ర చేస్తున్నారని, తిప్పికొట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.

మూటలు దిగుతున్నాయ్ ప్రసన్నను ఓడించేందుకు డబ్బు మూటలు దిగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రచారంలో ప్రసన్న, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు, నెలవల సుబ్రహ్మణ్యం, బట్టేపాటి నరేంద్రరెడ్డి, గునపాటి సురేష్‌రెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అబ్బాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగన్ డేవిస్‌పేట, కొత్తూరు, ఇందుకూరుపేట, సోమరాజుపల్లె, కొరుటూరు, మైపాడు, గంగపట్నం, పల్లెపాడు గ్రామాలలో పర్యటించారు. రావూరు, పున్నూరు, కొమరిక, లేబూరు గ్రామాల పర్యటన రద్దు కావటంతో కార్యకర్తలు నిరాశకు గురిఅయ్యారు.

Nellore kovur by elctions, AP CM helicopters landing area in kovur

Nellore kovur by elctions, AP CM helicopters landing area in kovur

Nellore district Sullurpet A husband is believed to have murdered his wife

Nellore district Sullurpet A husband is believed to have murdered his wife


Nellore Kovur by elections Many special check posts and mobile police parties..

Nellore Kovur by elections Many special check posts and mobile police parties..

Kovur by elections campaign prasana says Jagan will be next CM of AP

Kovur by elections campaign prasana says Jagan will be next CM of AP

Kovur Congress candidate requesting voters Please Vote and Support Congress in Assembly By Elections

Kovur Congress candidate requesting voters Please Vote and Support Congress in Assembly By Elections

Podalakuru YSRCP local leaders Bike Rally Suppport To Prasana kumar reddy Kovur by elections

Podalakuru YSRCP local leaders Bike Rally Suppport To Prasana kumar reddy Kovur by elections

జగన్ కోవూరు నియోజకవర్గం ప్రచారం లో ఉద్రిక్తత.


జగన్ కోవూరు నియోజకవర్గం ప్రచారం లో ఉద్రిక్తత.
స్థానికులకు, సెక్యూరిటీ సిబ్బందికి  మధ్య  తీవ్ర వాగ్వాదం
కోవూరు ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయిన జగన్ సెక్యూరిటీ సిబ్బంది
మైపాడు లో స్థానికుల్ని చితకబాదిన సెక్యూరిటీ సిబ్బంది
స్థానికులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య  తీవ్ర వాగ్వాదం.
కోవూరు నియోజకవర్గం లో స్థానికుల ఫై జగన్ సెక్యూరిటీ దాడి
కోవూరు నియోజకవర్గం ప్రచారం లో ఉద్రిక్తత.
సెక్యూరిటీ సమన్వయము పాటించక పోవడం ఫై జగన్ మౌనంగా వుండటం విశేషం

ప్రతి గ్రామంలో జనం తన వాహనానికి అడ్డుపడటంతో జగన్ వాహనం దిగి వారితో చేతులు కలుపుతూ..


నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో న్యాయం అమలు చేశారు నెల్లూరు పోలీసులు! ఆదివారం కోవూరు ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చిన చంద్రబాబు.. రాత్రి 10 గంటలకు కొడవలూరు మండలం యల్లాయపాళెంతో తన ప్రసంగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత సుమారు పది నిమిషాలు మాట్లాడకుండా జనానికి నమస్కారం పెడుతూ ముందుకు సాగారు. చంద్రబాబు విషయంలో ఇది పోలీసులకు ఏమాత్రం తప్పుగా కనిపించలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి ఇదే గ్రామంలో ప్రచార సభ ముగించారు.

తన కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న జనానికి ప్రచార రథం మీద నిలబడి నమస్కారం పెడుతూ ముందుకు పోవాలనుకున్నారు. ప్రతి గ్రామంలో జనం తన వాహనానికి అడ్డుపడటంతో జగన్ వాహనం దిగి వారితో చేతులు కలుపుతూ వచ్చారు. సరిగ్గా 10 గంటలు దాటుతూనే పోలీసులు వచ్చి జగన్‌ను వాహనం నుంచి కిందకు దిగరాదని అడ్డుకున్నారు. నార్త్ రాజుపాళెంలో జగన్ సభ ఉంటుందని.. వేలాది మంది రాత్రి 8 గంటల నుంచి ఎదురుచూశారు.

రాత్రి 10 గంటలు దాటుతూనే పోలీసులు జనాన్ని బెదరగొట్టి పంపేశారు. ఈ మార్గంలో వెళ్లరాదంటూ పోలీసు అధికారులు జగన్ వాహనాన్ని అడ్డుకున్నారు. వేలాది మంది జనం రాజుపాళెంలో ఎదురు చూస్తున్నందున అక్కడికి వెళ్లి నమస్కారం పెట్టినా ప్రచారం చేసినట్లే అవుతుందని అభ్యంతరం చెప్పారు. తాము సూచించిన మార్గంలోనే రాత్రి విడిదికి వెళ్లాలని ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్ కూడా రాజుపాళెం సర్కిల్‌కు వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాహనం ఆ మార్గంలో వెళ్లరాదని హుకుం జారీ చేశారు. అధికారుల ద్వంద్వ నీతిపై మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, పార్టీ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

తాము ప్రచారం చేయబోమని, అయితే తాము కోరుకున్న మార్గంలోనే రాత్రి విడిది కేంద్రానికి వెళ్తామని చెప్పారు. ఇందుకు పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో జగన్ ప్రచార వాహనం నుంచి దిగి కారులో తన విడిది కేంద్రానికి వెళ్లారు. రాజుపాళెం సభ రద్దు కావడంతో వేలాదిగా తరలివచ్చిన జనం నిరాశతో వెనుదిరిగిపోయారు. ఉదయం నుంచి కూడా పోలీసులు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి చెందిన ప్రచార వాహనాలను అడ్డుకున్నారు. కొన్ని వాహనాలను సీజ్ చేశారు. జగన్ కాన్వాయ్‌లో మీడియా వాహనాలను కూడా అనుమతించలేదు.

ఎన్నికల ప్రచారంలో మంత్రి కాన్వాయ్‌ను అనుసరిస్తూ పెద్దసంఖ్యలో వాహనాలు


కోవూరు : కోవూరు ఉప ఎన్నికలు జరుగుతున్న కోవూరు నియోజకవర్గంలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అడుగడుగునా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జ్యోతుల నెహ్రూ, జనక్ ప్రసాద్ సోమవారం సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి కాన్వాయ్‌ను అనుసరిస్తూ పెద్దసంఖ్యలో వాహనాలు తిరుగుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని చెప్పారు.

చెక్‌పోస్టుల్లోని పోలీసులు సెల్యూట్ చేసి మరీ మంత్రి కాన్వాయ్‌ను సాగనంపిన వైనాన్ని వారు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఉప ఎన్నికలను న్యాయబద్ధంగా, సమర్థంగా నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకునేం దుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. కడప తరహాలో నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. అధికారులను కాంగ్రెస్ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జనక్ ప్రసాద్ ఆరోపించారు.

కోవూరు ప్రచారంలో పోలీసుల ఓవరాక్షన్

కోవూరు ప్రచారంలో పోలీసుల ఓవరాక్షన్, రాత్రి 10 దాటిందంటూ జగన్‌ను వాహనం నుంచి కూడా దిగ నివ్వని ఖాకీలు
తాము చెప్పిన దారిలోనే వెళ్లాలని హుకుం జనానికి నమస్కారం పెట్టినా ప్రచారం చేసినట్లేనని అభ్యంతరం
ఆదివారం రాత్రి జనానికి నమస్కారం పెడుతూ ముందుకు సాగిన బాబు.. అయినా నోరెత్తని పోలీసులు
సోమవారం మాత్రం వైఎస్ జగన్ వాహనాన్ని అడ్డుకుని పోలీసుల హల్‌చల్ ఉదయం ప్రచారంలో పాలుపంచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ వాహనాలకూ అడ్డంకులు

Monday, March 5, 2012

శవాలపై చిల్లర ఏరుకునే వాడు బాబు, అసలు బ్రోకర్ బాబు అని ఘాటుగా విమర్శించారు


కోవూరు : రాష్ట్రంలో ప్రజలు తమ వైపే చూస్తున్నారని, కోవూరు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థికే పట్టం కడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడవలూరు మండలంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మా ట్లాడుతూ ఈ ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయనే ఆలోచన చేయాలన్నారు. విలువలు లేని రాజకీయం, విశ్వసనీయతకు ఈ ఎన్నికలు పరీక్షగా మారిందన్నారు. వీటిని కాపాడేందుకు ప్రస న్న, రాజమోహన్‌రెడ్డిలు తమ పదవులను త్యాగం చేశారన్నారు. పేదలు, రైతుల కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యమని అన్నారు.

బాబుపై విమర్శలు రోడ్‌షోలో పాల్గొన్న వైఎస్సార్సీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విజయమ్మ నంగినంగిగా ఉంటుందని, జగన్ దోపిడీ, గజదొంగని విమర్శించిన చంద్రబాబు చరిత్ర ఏమిటన్నది తెలుసుకోవాలన్నారు. శవాలపై చిల్లర ఏరుకునే వాడు బాబు అని అసలు బ్రోకర్ ఆయనేనని ఘాటుగా విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. మామను వెన్నుపోటు పొడిచి మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి వైఎస్ కుటుంబాన్ని విమర్శించే అర్హత ఎక్కడిదన్నారు.

జగన్ వెంట నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నేదురమల్లి పద్మనాభరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా కొడవలూరులో ఉదయం 9గంటలకు చేరుకోవాల్సి ఉం డగా, 10.45 గంటలకు వచ్చారు.

వై.ఎస్‌జగన్‌ ,ఈ జిల్లాలోని రోడ్లను సర్వనాశం చేసి పలువురిని పొట్టనపెట్టుకున్నాడనా విమర్శించారు

వైఎస్‌ఆర్‌సి పార్టీ అధినేత వై.ఎస్‌జగన్‌ ఏమొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేశాడనా, వందలాది మందిని ఖూనీ చేసి హత్యా రాజకీయాలు నడిపారనా, అతని భాగస్తుడు గాలి జనార్దన్‌రెడ్డి ఈ జిల్లాలోని రోడ్లను సర్వనాశం చేసి పలువురిని పొట్టనపెట్టుకున్నాడనా అని ప్రశ్నించారు.కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఊసరివెల్లి అని విమర్శించారు. వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి సూటుకేసులిచ్చి ఆ ఊసరివెల్లిని కొనుగోలు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓట్లేయాలని వైఎస్‌ జగన్‌ ఎలా అడుగుతారని అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ను అరెస్టు చేస్తామని సిఐబి చెప్పకుండానే ఆ పార్టీ నాయకులు ఎలా నిర్ణయించుకుంటారన్నారు. ఆ పేరుతో పర్యటన రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నారని విమర్శించారు. జగన్‌ను అరెస్టు చేస్తే తమ ప్రతాపం చూపుతామనీ, రాష్ట్ర అగ్నిగుండం అవుతుందనీ నాయకులు ప్రకటించడం చూస్తే వారికి చట్టం, న్యాయం అంటే గౌరవం లేదా అన్నారు. అవినీతి పరులనూ, చట్టాలను అతిక్రమించే వారిని అరెస్టు చేయాలని డిమాండు చేశారు. వైఎస్‌ఆర్‌సి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎప్పుడో జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఎపిఐఐసి ఛైర్మన్‌గా ఉన్న ఆయన హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నారు. అలాంటి వ్యక్తి నీతి గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన టిడిపి ఎస్‌సి జిల్లా అధ్యక్షులు బద్దెపూడి రవీంద్ర ఉన్నారు..

తనపై గౌరవంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని ఆయనను తిరిగి ఎమ్మెల్యే చేయడం తన బాధ్యత..


కోవూరు :డాక్టర్‌ వైఎస్సార్‌ మరణానంతరం రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత పూర్తిగా దిగజారిపోయాయని, రైతుల, పేదల గోడు వినే నాధుడే కరువయ్యాడని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన కొడవలూరులో సోమవారం ఆయన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి బతికుండగా ఆయన పథకాలకు ఆకర్షితుడై ఆయన వద్దకు వచ్చిన ప్రసన్నను రాజీనామా చేసి రమ్మని చెప్పడం జరిగిందన్నారు.తనపై గౌరవంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని ఆయనను తిరిగి ఎమ్మెల్యే చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీలు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే ఉండాలని కోరుకుంటున్నాయని ప్రజలకు ఒకరి మీద బోర్‌ కొట్టినపుడు ఇంకొకరిని గెలిపించుకుంటార నే ఉద్దేశ్యం వారిదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రసన్నను మంచి మెజార్టీతో గెలిపించాలను ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్ధి ప్రసన్న మాట్లాడుతూ జగన్‌ను, విజయమ్మను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని తన ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ గాలి ధాటికి మిగతా పార్టీల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. జగన్‌ చంద్రబాబుకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తున్నారని, ఆయన ధాటికి చంద్రబాబునాయుడు గుండెల్లో రైళ్లు పరుగెస్తున్నాయని, ఈ ఉప ఎన్నికల్లో టిడిపికి 3వ స్థానం దక్కితే గొప్ప అని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్‌ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్పీటిసి వీరి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

VR College Assets Funds wrong route..Demand CBI Investigation --Nellore BJP

VR College Assets Funds wrong route..Demand CBI Investigation --Nellore BJP

Prasana blame tdp chief chandrababu naidu

Prasana blame tdp chief chandrababu naidu

Nallapa reddy Gitamma w/o Prasanakumar reddy Door to Door campaign in Kovur

Nallapa reddy Gitamma w/o Prasanakumar reddy Door to Door campaign in Kovur

Nellore Kovur by elections TDP into trouble and confuse its rank and cadres..

Nellore Kovur by elections TDP into trouble and confuse its rank and cadres..


sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh