online marketing

Wednesday, May 4, 2011

జగన్ అన్నీ దోచుకెళ్లావు మాకేమి మిగిల్చావు, పద్ధతి మార్చుకో: ఆనం

నెల్లూరు జిల్లా  మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపదను అంతా దోచుకు వెళ్లాడని మాకు ఏమీ మిగిల్చాడని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. డబ్బు మూటల్ని మొత్తం నువ్వే అక్రమంగా తీసుకు వెళ్లావు అన్నారు. అలాంటి అక్రమ డబ్బుతో జగన్ గెలవాలని అనుకుంటున్నాడని కానీ ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, జగన్‌తో పోటీయా అని ప్రశ్నించారు. వారిద్దరికీ నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

రౌడీయుజం చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పన్నారు. రెండురోజులుగా ఇద్దరు ముఖ్యనేతలపై ఆయన వర్గం దాడులకు పాల్పడిందన్నారు. జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని హెచ్చరించారు. ఎన్నికలు తమ స్వార్థ ప్రయోజనాలకు ఎవరో కోరుకుంటే వచ్చేవి కావన్నారు. కడపలో రౌడీయిజాన్ని జగన్ పెంచి పోషిస్తున్నాడని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వాళ్లు ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తారని ఎలా అనుకుంటామని అన్నారు. అలా అనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. జగన్ జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు.

రాభోఏ కాలంలో కాభోయే రైల్వే మిన్స్టర్ : చిరు ?

రాభోఏ కాలంలో కాభోయే రైల్వే మిన్స్టర్ : చిరు ? ,అవును అనిపిస్తుంది ,కారణం బెంగాల్ ఎన్నికలలో మమత బేనర్రజి ,cm పదవని అలంకరించ భోతున్నారు ,దీంతో రైల్వే మిన్స్టర్ పదవి కలి అవుతుంది ,ఈ స్తానంలో చిరు ని రైల్వే మిన్స్టర్ పదవి వారించ భోతుంది ,గత రైల్వే మిన్స్టర్ లు ఆంధ్ర కు ఎంతో అన్యం చేసారు ,ఈ పదవి చిరు అలంకరిచిడం వలన ఆంధ్ర కు కొంత లాబం చేకూరుతుంది ,మన తెలుగు వాడు ఆ పదవిని అలంకరిచాలని రాజికియలకు అతీతంగా అభిలసిన్చుడం ,గాడ్ బ్లెస్స్ యు చిరు. ఓ తెలుగు వాడిగా కోరిక సుమ ,తప్పుగా ఆలోచిస్తే క్షమినచండి

Sanders smuggling on rise in Nellore

Nellore:  Notwithstanding the raids being conducted by forest officials, red sanders smuggling activity is rampant, going by the seizure of logs and vehicles carrying them, almost on a daily basis in various parts of the district. Nearly Rs 1 crore worth of red sander logs have been seized in the recent past and it is widely suspected that ten times of what was caught is being smuggled to Chennai for export. Interestingly, logs are being seized on a regular basis along with the vehicles carrying them but hardly any arrests are being made. The stock answer from officials is that the offenders escape from the scene of offence after leaving the vehicle behind.
There are allegations that smugglers themselves are giving information about illicit transportation of small quantities to divert the attention of forest officers and take large quantities by another route. In an incident 10 days ago, police caught a lorry carrying 89 logs worth about Rs 4 lakh near Buchireddypalem while forest officials were searching in another area, following a tip-off. In this incident, police caught three persons involved in smuggling. Another allegation is that forest officials themselves are hand in glove with the smugglers and raids are being conducted to showcase their dutymindedness even while they are helping offenders from the back door.
According to sources in the department, logs are being packed conveniently to shift them to required destinations in small vehicles such as autorickshaws and vehicles carrying water cans. Smugglers also have the blessings of police in some parts of the district. Forest officers claim that they have increased vigil and their beat officers are on toes to prevent smuggling. They cite the raids and logs they have confiscated to justify their claim but the million dollar question from public is why they are not able to curb the activity though they are aware about the origin and destination of the red sanders.

Y.S. Viveka will win, says Anam

Nellore : The minister for finance, Mr Anam Ramanarayana Reddy, expressed confidence in the victory of Mr Y.S. Vivekananda Reddy for Pulivendula Assembly seat. He said that Mr Vivekananda Reddy’s decades-old acquaintance with constituents will pave the way for his success. However, he said that it was not easy to predict the outcome of the Parliament seat since it contains seven constituencies.
Speaking to this newspaper at his residence here on Wednesday, he said that Mr Vivekananda Reddy was an approachable candidate and had touch with every family in the Pulivedula segment. Moreover, he was taking care of the constituency whoever was elected from the family from the beginning. He stressed the need to create awareness among people that YSR Congress means Yuvajana Sramika Rythu Congress and not Yeduguri Sandinti Rajasekhar Reddy Congress. “The electorate is being misled by the party name,” Mr Ramanarayana Reddy said. He said that he had started canvassing on these lines in Pulivendula from Monday and the public response was satisfactory.
“Blaming the Congress does not go well with the electorate since the party gave the ticket to YSR’s wife soon after his demise and ensured her unanimous victory in the bypolls held in December 2009,” Mr Reddy maintained. He said that people were concerned about incomplete irrigation projects such as the Gandikota reservoir, Telugu Ganga canal and Galeru Nagari phase-I since they were dependent on these schemes to irrigate 2.5 to 3 lakh acres in the region.
“Sizeable funds are required for these projects and people are aware of the necessity to elect a ruling party candidate to realise the schemes,” the minister asserted. He said that all these factors will give an edge to the ruling party in the bypolls. Gajuvaka (Visakhapatnam) legislator, Mr Chintalapudi Venkataramaiah, was present with the minister. Both of them left for Badvel in Kadapa district in the morning to canvas.

లంచం తీసుకున్న ఇద్దరు ఇంజనీర్లకు మూడేళ్లు జైలు

నెల్లూరు: లంచం తీసుకున్న అభియోగంలో నేరం రుజువు కావడంతో రాజంపేట విద్యుత్‌ శాఖ ఉద్యోగులైన నిందితులు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ యనమల హరికృష్ణ, సబ్‌ ఇంజనీర్‌ బరిగల రామ్మోహన్‌రావులకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ ఏసీబీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామం సెంటర్‌లో కొట్లు కట్టుకొని 2003న షేక్‌ అజాముద్దీన్‌జాన్‌ తండ్రి విద్యుత్‌ సరఫరాకోసం ఆ శాఖాధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు.

అయితే 2004లో దరఖాస్తుదారుడు మరణించాడు. అనంతరం మృతి చెందిన అతని కుమారుడు అజాముద్దీన్‌ విద్యుత్‌ శాఖాధికారులను కలసి తన తండ్రి నిర్మించిన కొట్లకు విద్యుత్‌సరఫరా కోసమై ఆయన పెట్టుకున్న దరఖాస్తు విషయమై అధికారులకు తెలిపాడు. అనంతరం అధికారులు స్పందించి ఆ కొట్లకు మీటరును ఏర్పాటు చేసి సర్వీస్‌ నెంబర్‌ను కూడా ఇచ్చారు. అయితే విద్యుత్‌ సరఫరా ఇవ్వకపోవడంతో 5.10.2005న నిందితులు ఎఇ యనమల హరికృష్ణ, సబ్‌ ఇంజనీర్‌ బరిగల రామ్మోహన్‌రావులను కలిసి సరఫరా ఇప్పించాల్సిందిగా ఫిర్యాది అజాముద్దీన్‌ కోరారు.

విద్యుత్‌ సరఫరా ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నిందితులిద్దరూ ఫిర్యాదిని డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఫిర్యాది తిరుపతిలోని ఏసీబీ అధికారులను సంప్రదించి విషయాన్ని వివరించారు. అనంతరం అప్పటి ఏసీబీ డీఎస్పీ రామదాసు ఆధ్వర్యంలో పన్నిన వలలో విద్యుత్‌ శాఖ కార్యాలయంలో నిందితులైన ఆ అధికారులిద్దరూ ఫిర్యాది నిజాముద్దీన్‌ నుండి రూ.5 వేలు లంచం పుచ్చుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరిి పోయారు. ఈ కేసు విచారణలో సాక్ష్యాధారాలు రుజువు కావడంతో న్యాయమూర్తి పై మేరకు తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరపున స్పెషల్‌ పిపి రమేష్‌బాబు వాదించారు.

13 ఎర్రచందనం దుంగలు పట్టివేత..

డక్కిలి: డక్కిలి మండలంలోని వెంబులూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అటవీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో సుమారు లక్ష రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లుగా డిఫ్యూటి రేంజర్‌ శేఖర్‌ తెలిపారు. వెంబులూరు తీర్థంపాడు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు వ్యూహత్మకంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు ఎత్తుగడలను చిత్తుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం జరిపిన దాడుల్లో అక్రమరవాణాకు సిద్ధంగా ఉంచిన 13 ఎర్రచందనం దుంగలను ఇన్ఫర్మర్‌ల సాయంతో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రచందనం దుంగలు పట్టుకున్న పోలీసులు

కలువాయి: మండల కేంద్రమైన కలువాయి అంకమ్మమాను రచ్చ సమీపంలో పాడుపడ్డబావిలో దాచి ఉన్న ఎర్రచందనం దుంగలను కలువాయి పోలీసులు ఫోన్‌ సమాచారం మేరకు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ స్మగ్లర్లు అడవి ప్రాంతంలో కొట్టుకుని వచ్చిన ఈ దుంగలను ద్విచక్రవాహనాలపై తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో బావిలో డంపింగ్‌ చేయడం జరిగిందన్నారు.ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బావిలో దిగిచూడగా రూ.50వేలు విలువగల తొమ్మిది ఎర్రచందనం దుంగలను బావిలో డంప్‌ చేసినట్లు వారు తెలిపారు. ఈ దుంగలను కలువాయి పోలీస్టేషన్‌కు తరలించారు.

తీరా చూస్తే ఈ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారులు ఉన్నారా లేదా తెలియడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారంటే అవి పోలీసులు మాత్రమే పట్టుకోవడం జరుగుతుందని మండల ప్రజలు ఆనోట ఈనోట అనుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఫారెస్ట్‌ అధికారులు స్మగ్లర్ల ఆమ్యామ్మలకు లొంగినట్లు కనిపిస్తున్నట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రసూల్‌ఖాన్‌, పోలీస్‌ సిబ్బంది వంశీధర్‌రెడ్డి, బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ సాంబశివరావులు ఉన్నారు.

సూపర్‌ంప్యూటర్‌ను తయారుచేసిన ఇస్రో

సూళ్ళూరుపేట : సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతున్న ఇస్రో మరో అడుగు ముందుకు వేసి దేశంలోకెళ్లా అతి వేగవంతమైన, అత్యుత్తమ సూపర్‌ కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. 14కోట్ల రూపాయలను వెచ్చించి తయారు చేసిన సూపర్‌ కంప్యూటర్‌కు ‘సతీష్‌ ధావన్‌’ గా, గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ‘సాగ 220’ గా ఇస్రో నామకరణ చేసింది. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో సోమవారం ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ సూపర్‌ కంప్యూటర్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ఇస్రో శాస్తవ్రేత్తలు గగన తలంలో పరిజ్ఞానానికి సంబంధించి అతి క్లిష్టమైన సమస్యలను ఛేధించేందుకు కంప్యూటర్‌ ఉపయోగపడనుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన కంప్యూటర్‌లో గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు చెందిన టెస్లా 2070తోపాటు సిపియికు చెందిన 400 ఇన్‌టెల్‌ క్వాడ్‌ కోర్‌ జెన్‌ పరికరాలను విప్రో సంస్ధ తయారుచేసింది. ఇందులో 500జిగాప్లాప్స్‌కు చెందిన సమాచారాన్ని గుప్తంగా ఉండేందుకు వీలుంటుంది. కాలుష్య రహితంగా తయారుచేసిన సూపర్‌ కంప్యూటర్‌ 150కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడనుంది.

రగడ.... రగడే

నెల్లూరు: ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా తయారైంది జిల్లాలోని పలువురు అధికారుల పరిస్థితి. గతంలో ఆనం సోదరులు, మేకపాటి సోదరులు సఖ్యతగా ఉన్న రోజుల్లో వారి సిఫార్సులు, అండదండలతో జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో కీలక పోస్టులలోకి చేరుకున్న పలువురు ఉద్యోగులకు నేడు బదిలీల జ్వరం పట్టుకుంది. అయితే ఆనం సోదరుల ఆశీస్సులతో అధికారులుగా కొనసాగుతున్న వారికి ఎలాంటి ఢోకా లేకపోయినప్పటికీ సమస్యల్లా మేకపాటి సోదరుల అధికారులుగా గుర్తింపు పొందిన వారిదే. గత కొంత కాలంగా ఉప్పులో నిప్పుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆనం సోదరులు, మేకపాటి సోదరుల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.

ఒకరిపై ఒకరు ఘాటైన పదజాలాలతో విమర్శించుకుంటుండడం మామూలైపోయింది. అయితే ఈ విమర్శలు కేవలం జిల్లా స్థాయికే కాకుండా రాష్టస్థ్రాయికి పాకుతోంది. ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ గెలుపోటములు ఈ సోదరులిద్దరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు జగన్‌, వైఎస్‌.విజయలక్ష్మిల గెలుపు కోసం వైఎస్‌ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మేకపాటి సోదరులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి తదితర నేతలు గత 20 రోజులుగా కడప జిల్లాలోనే తిష్ట వేసి ముమ్మరంగా ప్రచారం కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.

ఎన్నికలు మరో 5 రోజుల్లో జరుగనుండడంతో ఈ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. జిల్లాలో మొదలైన ఈ వర్గపోరు ప్రస్తుతం కడప జిల్లాకు చేరుకుంది. అక్కడ సైతం ఆనం, మేకపాటి సోదరులు ఒకరిపై ఒకరు ఘాటుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా సోమవారం కడప జిల్లాలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆనం సోదరులకు విసిరిన సవాల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, వై.ఎస్‌. విజయలక్ష్మిలు ఓడిపోతే తాను, తన సోదరుడు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తామని, అదే కాంగ్రెస్‌ అభ్యర్థులు డిఎల్‌.రవీంద్రరెడ్డి, వైఎస్‌.వివేకానందరెడ్డిలు ఓడిపోతే ఆనం సోదరులు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య రోజు రోజుకీ అగాధం పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదని జిల్లాకు చెందిన రాజకీయ పెద్దలు చెబుతున్నారు.

కడప జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములు ఏవిధంగా ఉన్నా జిల్లాలో కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి అధికారుల బదిలీలు మాత్రం తప్పేలా లేవు. అయితే ఈ బదిలీలకు ‘సాధారణ’ బదిలీలు అని పేరు పెడుతున్నప్పటికీ ఇవి మాత్రం ముమ్మాటికీ రాజకీయ బదిలీలేనని చెప్పక తప్పదు. గత మూడేళ్లుగా ఐటిడిఎ పిఒగా జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రమేష్‌ ప్రజాప్రతినిధులు అందరితోనూ సఖ్యతగానే మెలుగుతున్నప్పటికీ మేకపాటి సోదరులు, ముఖ్యంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో మరింత సఖ్యతగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ఇడిగా, రాజీవ్‌ విద్యామిషన్‌ పిఒగా పనిచేసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో డ్వామా పిడిగా పని చేస్తున్న యుగంధర్‌కుమార్‌ కన్ను ఐటిడిఎ పిఒ కుర్చీ పడినట్లు తెలిసింది.

అందుకు ఆయనకు జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభించడంతో రాజధాని స్థాయిలో అన్ని విధాలా ‘ఏర్పాట్లు’ పూర్తి చేసుకుని ఇక రేపో మాపో ఆ కుర్చీలో కూర్చునే తరుణంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త, గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ పనబాక కృష్ణయ్య అడ్డు తగిలినట్లు సమాచారం. ప్రస్తుతం పిఒగా ఉన్న రమేష్‌ను బదిలీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే ఆ స్థానంలో యుగంధర్‌ కుమార్‌ నియామకంపై ఆయన గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో జిల్లా మంత్రి సైతం ఒక అడుగు వెనుకేసినట్లు తెలిసింది.

పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకున్న యుగంధర్‌కుమార్‌ తాజాగా ఖాళీ అయిన డ్వామా పిడి స్థానంలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతోపాటు మరో మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పించుకోవ డంతో పాటు జిల్లాలో బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ బదిలీల ప్రభావం జిల్లా పోలీస్‌ యంత్రాంగంలో కూడా తీవ్రంగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నగర డిఎస్‌పిగా ఉన్న జిఆర్‌.రాధిక కరీంనగర్‌కు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతోపాటు జిల్లాలోని పలువురు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐల బదిలీలు కూడా జరుగనున్నట్లు సమాచారం.

జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కె.రాంగోపాల్‌ బదిలీ అయిన నేపథ్యంలో ఎస్‌పి ఇ.దామోదర్‌కు కూడా త్వరలో స్థాన భ్రంశం కానున్నట్లు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనప్పటికీ ఎస్‌పి దామోదర్‌ స్వయంగా తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. దీంతో త్వరలో జిల్లాకు కొత్త ఎస్‌పి రానున్నారని, వారు కూడా ఆనం సోదరుల ఆశీస్సులు ఉన్నవారే వస్తున్నట్లు పోలీస్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh