online marketing

Saturday, March 31, 2012

మేకలు, గొర్రెలు గుక్కెడు నీటికి సైతం తహతహలాడుతు..


cows in nelloreఆత్మకూరు: మేత, నీళ్లు లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఎండలు మండుతుండటంలో అవస్థలు తప్పడంలేదు. దీంతో పెంపకందారులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు వారికి అక్కరకు రావడంలేదు. మెట్టలో కష్టాలు మెట్టప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో గేదెలు, మేకలు, గొర్రెలు గుక్కెడు నీటికి సైతం తహతహలాడుతున్నాయి. గడ్డిపరకలు కానరాక పశువులకు వలసబాట తప్పడంలేదు. ముదురుతున్న ఎం డలతో మూగజీవాల కష్టాలు అధికమయ్యాయి.
మూగజీవాల మేత, నీళ్ల కోసం పెంపకందారులకు అవస్థలు తప్పడంలేదు. డబ్బెట్టి గడ్డి కొనడానికి రైతులు ఊరువాడా తిరుగుతున్నారు. కాని ఈ ఏడాది మెట్టప్రాంతాల్లో వరిసాగు తగ్గడం, హార్వెస్టర్‌తో కోతలు పూర్తి చేయడంతో గడ్డిశాతం తగ్గిపోయింది. ముదురుతున్న ఎండలతో బీడుభూముల్లో పచ్చిక ఎండిపోయింది. వాగులు, వంకలు, చెలిమిల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. గతంలో వేసవిలో పశువుల దాహార్తిని తీ ర్చెందుకు పొలాలు, గ్రామపొలిమే ర్లు, రోడ్డుమార్గాల వెంబడిఅక్కడక్కడ ఏర్పాటు చేసిన నీటితొట్టెలు, చేతిపంపులు, మరమ్మతులకు గురయ్యాయి. మరికొన్ని నిరుపయోగమయ్యాయి.

అక్కరకు రాని పథకాలు వేసవిలో పశువుల మేత అవసరాల కోసం, వాటి వలసలు అరికట్టడానికి, పశుగ్రాస కొరత నివార ణే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను ప్ర వేశపెట్టింది. కాని ఈ పథకాలు అక్కరకు రావడంలేదు. దీంతో మెట్టప్రాంతాల్లో ఏడాదికేడాది పశుసంపద గణనీయంగా తగ్గిపోతున్నది. రెం డేళ్లక్రితం ఉపాధిహామిలో వందశా తం నిధులతో పశుగ్రాసోత్పత్తి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడేళ్లపాటు పశుగ్రాసం సరిపడేలా పక్కాప్రణాళికలతో ఆరు పథకాలకు రూపకల్పన చేశారు.

పశుగ్రాసరకాల పెంపకం, పాతరగడ్డి తయారీ, సుబాబుల్ చెట్ల నీడన గడ్డిరకాల పెంపకం ఆజోలో ఉత్పత్తి తదితర పథకాల ద్వారా పాడిరైతులు లబ్దిపొందేలా వెసులుబాటు కల్పించింది. వీటి అమలుకుకు ఉపాధిహామి పథకంలో భూ మిదున్నకం, గడ్డివిత్తనాలు చల ్లడం, కలుపు తీయటం నీరుపెట్టటం,పశుగ్రాసం కోయడం తదితర పనులకు నిధులు కేటాయిచారు. అయితే ఈ పథకాలు అమలులో జాప్యంతోపాటు, అర్హులైనవారి దరిచేరడంలేదు.

Friday, March 30, 2012

సోమశిల జలాశయంనుంచి హైలెవల్‌ కెనాల్‌ఉదయగిరి : వరప్రసాదిని యైన సోమశిల జలాశయంనుంచి హైలెవల్‌ కెనాల్‌ ద్వారా సాగునీరు అందించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించి నట్లు తెలిసింది. సోమశిల ప్రాజెక్టు సాధారణ నీటి ప్రవాహంమించి అదనంగా సముద్రంలోకి వెళ్ళే నీటిని ఉత్తర కాలువ ద్వారా ఉదయగిరి -ఆత్మకూరు నియోజకవర్గాల్లోని సుమారు 6మండలాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి ప్రాంతనేతలతో కలిసి ఆదివారం ముఖ్యమంత్రిని తన ఛాంబర్‌లో కలుసుకుని అందుకు ఆమోదం తెలపాలని కోరినట్లు తెలిసింది.

మంత్రి ప్రతిపాదనకు స్పందించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు హైలెవల్‌ కాలువ నిర్మాణానికి నిధులు విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే టెక్నికల్‌ పిటిషన్‌ తదితర అంశాలతో ప్రతిపాదనలు సిద్దంచేస్తే ఆమోదిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.సోమశిల ప్రాజెక్టు హైలెవల్‌ కాలువ నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు పరిథిలోని ఆత్మకూరు నియోజకవర్గం లోని మర్రిపాడు, అనంతసాగరం మండలాలకు కొంతభాగం, ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు, వింజమూరు, కలిగిరి కొండాపురం మండలాల్లో సుమారు 1లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వెలుగొండ ప్రాజెక్టు పరిథిలోని సీతారామసాగర్‌ ప్రాజెక్టునుంచి నియోజక వర్గంలోని ఉదయగిరి , వరికుంటపాడు, మండలాలతో పాటు దుత్తలూరు మండలంలోని కొంతభాగానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కాలువల నిర్మాణంకూడా చేపట్టింది. ఇప్పటికే దాదాపు 50శాతంపైగా కాలువ తవ్వకాలు జరుగుతున్నాయి.ఇటు సీతారామసాగర్‌ అటు సోమశిల హైలెవల్‌ కాలువల ద్వారా సాగునీరు అందిస్తే నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మినహాయిస్తే , మిగిలిన 7మండలాలకు సాగునీరు అభ్యమయ్యేఅవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏలాంటి సాగునీరు అవకాశాలు లేని మెట్టప్రాంత రైతులకు ఈ ప్రతిపాదన ఒకరకంగా ఊరటనివ్వడమే కాకుండా మెట్టబెట్టతీరినట్లు అవుతుంది.

Thursday, March 29, 2012

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం..


కోవూరు : కోవూరులో ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌రెడ్డి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గురువారం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన ప్రమాణ స్వీకారంతో ఆయన 5వ సారి శాసనసభ్యునిగా అడుగుపెట్టారు. అదేవిధంగా వై.ఎస్‌.ఆర్‌సిపిలో వైఎస్‌ఆర్‌ సతీమణి విజయమ్మ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా రెండవ ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి అసెంబ్లీలో కొనసాగనున్నారు.

కోవూరు నియోజక వర్గ ప్రజలు అటు వైఎస్‌ఆర్‌ అబిమానంతో, ఇటు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డిపై ఉన్న మమకారంతో నల్లపురెడ్లకే కోవూరు ప్రజలు మరోసారి పట్టంకట్టి ఆ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని ఈ ఉప ఎన్నిక విజయంతో మరోసారి రుజువు చేశారు. దీంతో శాసనసభలో ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో జిల్లాలో ఆ పార్టీలోని కార్యకర్తలు, అభిమానులు, నేతల్లో నూతనోత్సాహాలు వెల్లివిరిశాయి.

ఆ పార్టీ కార్యకర్తలు బాణా సంచాలు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాల్లో తేలిపోయారు. కోవూరు నియోజక వర్గంలోని ప్రతి పల్లె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్నకుమార్‌ రెడ్డికి తామున్నామంటూ ఓట్ల వర్షాన్ని కురిపించి రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఈ రూపంలో రుణం తీర్చుకున్నామని కోవూరు ఓటర్లు ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు.

Wednesday, March 28, 2012

గ్లాస్ తయారీ కేంద్రం ఏర్పాటు


నెల్లూరు : జిల్లాలోని నాయుటుపేటలో గ్లాస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ కంపెనీ ముందుకొచ్చింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో గ్లాస్ ప్లాంట్ ను ఏప్రిల్ లో స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రభుత్వపరంగా అన్ని విధాల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తొలివిడతగా 480 కోట్ల పెట్టుబడు పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రోజుకు 600 టన్నుల గ్లాస్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 2012 నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తికానుందని చెప్పారు.

Monday, March 26, 2012

కోవూరు ఉప ఎన్నికలపుణ్యమా.. అని పదేళ్ల క్రితం తప్పిపోయిన ఈ చిన్నోడు సొంతూరికి చేరాడు


ఇందుకూరుపేట : రాజస్థాన్‌కి చెందిన ఇతను పదేళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేశాడు. ఎక్కడెక్కడో తిరిగి, చివరికి ఇందుకూరుపేట మండలం నిడుముసలిలో పశువుల కాపరిగా చేరాడు. కోవూరు ఉప ఎన్నికలపుణ్యమా.. అని ఈ చిన్నోడు సొంతూరికి చేరాడు. ఎన్నికల బందోబస్తుకు రాజస్థాన్ నుంచి వచ్చిన స్పెషల్ బెటాలియన్ జవాన్‌లతో ఈ అబ్బాయి మాట కలిపాడు. అందులోని ఓ జవాన్‌ది ఈ కుర్రాడి ఊరు కావడం విశేషం. ఇక చెప్పేదేముంది... రతన్ ఊరు చేరడానికి అతను సహకరించాడు. తల్లిదండ్రులు ఇందుకూరుపేటకు వచ్చి సోమవారం కుమారుడు స్వగ్రామానికి తీసుకెళ్లారు.

(ఇందుకూరుపేట) రాజస్థాన్ రాష్ట్రం రాజాసర్జన్ జిల్లా గిలుండీ గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్, దేవ్ దంపతుల పెద్ద కుమారుడు రతన్ (5). చిన్ననాటి స్నేహాలు, అల్లరిచిల్లర తిరుగుళ్లలో చదువులో వెనుకపడ్డారు. పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. వారు చేయి చేసుకోవడంతో చెన్నైకి రైలెక్కి వచ్చేశాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఆ కుర్రాడిని రైల్వే అధికారులు నెల్లూరులో దించేశారు. ఊరుగాని ఊరు...తెలియని భాషతో తంటాలు పడ్డాడు. బస్టాండులో తిరుగుతూ ఈ గిరిజన దంపతుల కంట పడ్డాడు. రతన్ చెప్పేది తెలియక ఆకలితో అలమటిస్తున్నట్లు గమనించిన వారు అతని ఆకలి తీర్చారు. సొంత వారు ఎవరూ లేకపోవడంతో తమ వెంట తీసుకెళ్లారు. కొద్ది రోజులు కూలి పనులకు పంపారు.

పశువుల కాపరిగా చేరి... అక్కడి నుంచి నిడిముసలికి చేరుకుని రైతు ఆదిశేషయ్య వద్ద పశువుల కాపరిగా చేరాడు. అతను వచ్చి పదేళ్లు గడిచినా చిరునామా సక్రమంగా చెప్పకపోవడంతో నిడిముసలిలో ఉండిపోయాడు. కోవూరు ఉప ఎన్నికల బందోబస్తు కోసం రాజస్థాన్‌కు చెందిన ఓ బెటాలియన్ వచ్చింది. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా నిడిముసలికి ఈ బెటాలియన్ చేరుకుంది. అక్కడ రతన్ తారసపడడంతో మాటా మాట కలిపారు. రతన్ చెప్పిన చిరునామా మేరకు బెటాలియన్‌లోని ఓ జవాన్‌ది గిలుండీ గ్రామం కావడం విశేషం. దీంతో పూర్తి వివరాలు తెలుసుకుని రతన్ తల్లిదండ్రులతో ఆ జవాన్ మాట్లాడాడు. ఆ జవాన్ చొరవతో రతన్ తల్లిదండ్రులు సోమవారం నిడిముసలికి చేరుకున్నారు.

రతన్ చిన్నప్పటి ఫొటోలు, దుస్తులు తదితర ఆధారాలను తీసుకువచ్చి పోలీసులకు చూపారు. గ్రామస్థులు కూడా ఈ ఆధారాలు చూసి సంతృప్తి చెందారు. దీంతో రతన్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం రాత్రి సొంతూరికి పయనమయ్యారు. కోవూరు ఉప ఎన్నికలు పుణ్యమా అని పదేళ్ల క్రితం తప్పిపోయిన తమ బిడ్డ కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Sunday, March 25, 2012

మధ్య తరగతి కుటుంబాలు ఒక్కపూట పచ్చడితో, ఒక్కపూట చారుతో లేదా గంజితో


ఏమీ కొనేట్టు లేదు.... ఏమీ తినేట్టు లేదు....రాజులో రాజన్న అని ఒక సినీ కవి రాసిన గేయం ప్రస్తుతం అక్షరాలా నిజమయ్యే పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతున్న రేట్లను చూస్తే పేద, మధ్యతర గతి ప్రజలకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. మార్కెట్లో అత్యధిక రేట్లకు కూరగాయలు అమ్ముతుంటే మార్కెట్‌లో నుంచి కొనుగోలు చేస్తున్న చిన్న చితక వ్యాపారస్తులు తీసుకు వచ్చి మార్కెట్లో అమ్మె రేట్ల కంటే మరో పది రూపాయలు వేసుకుని అధనంగాఇ అమ్ముతుండడంతో సాధారణ ప్రజలు కూరగాయలను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరంటే సందేహం లేదు. మార్కెట్‌లో గత మూడు రోజుల నుంచి ప్రతి కూరగాయల రేటు విపరీతంగా పెంచి అమ్ముతున్నప్పటికి మార్కెటింగ్‌ శాఖ అధికారులు మాత్రం అదే మార్కెట్‌లో కార్యాలయం ఉన్నప్పటికి సిబ్బంది చూసి చూడనట్లు వెళ్ళుతున్నట్లు పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

గత రెండు రోజుల నుంచి అమ్ముతున్న కూరగాయల రేట్లను పరిశీలిస్తే కేజీలలో ఈవిధంగా ఉన్నాయి. గోరుచిక్కుడు 50రూపాయలు, బెండ 60, బీనీసు 120, టమోటా 50, ఉల్లగడ్డలు 50, చామగడ్డ 50, పశ్చిమిర్చి(బెంగుళూరు రకం) 70, ఉల్లిపాయలు 25 ఈ రకంగా కూరగాయల రేట్లు చుక్కలు చూస్తుండడంతో కూరలులేని కూరతో భోజనం చేయాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. ఈ పరిస్థితుల్లో కనీసం గంజితోనైనా తిందాములేనని పేద, మధ్య తరగతి కుటుంబాలు ఒక్కపూట పచ్చడితో, ఒక్కపూట చారుతో లేదా గంజితో తిని సరిపెట్టుకుందామనే రీతిలో కుటుంబాలు కాలం వెళ్ళదీస్తున్నాయి. అయితే ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు తదితరా తో తయారైయే కూరలను మానేసి చానా రోజులు అయ్యింది.

వ్యాపారస్తులు రైతుల వద్ద నుంచి కూరగాయలు తక్కువ రేట్లకు కొంటున్నప్పటికి అవి మార్కెట్‌కి తరలించి మార్కెట్‌లో వారు కొంత మొత్తం పెట్టుకుని వ్యాపారస్థులకు అమ్ముతుండటంతో వ్యాపారస్థులు ఇంకొంత మొత్తం దానిపై పెట్టుకుని వినియోగ దారులపై భారం పడే విధంగా అమ్ముతుండడంతో ఎటు చూసినా వినియోగదారులపై భారం పడి కొనక తప్పలేదన్నట్లుగా కొద్దో గొప్పో కొనుకున్ని కాలం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే కూరగాయల మార్కెట్‌లో కేజీ కొందామంటే 750 గ్రాములే ఉంటుంది. వేసే తూకాల్లో కూడా భారీగా మోసం జరుగుతుందని వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవని తూ తూ మంత్రంగా తనిఖీలు చేసి వారిచ్చే నజరానాలకు అలవాటు పడి వినియోగదారులైన మమ్మలను పట్టించుకోవడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో గత కొంత కాలం క్రితం రైతులు స్వయంగా పండించిన కూరగాయలను రైతు బజారులకు తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు ఉండేది. ఏమైందో ఏమో కానీ రైతు బజారులు మూత బడిపోయిగత్యంతరం లేక నేరుగా మార్కెట్‌కే రైతులు తీసుకు రావాల్సిన ఏర్పడడంతో మార్కెట్‌లోని వ్యాపారస్థులు రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా అమ్ముతుండడంతో ఆ రేట్ల భారం వినియోగదారులపైనే పడుతుంది. కూరగాయల పరిస్థితి అలా ఉంటే ఆకు కూరల అమ్మె వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆకు కూరకట్ట ఒక్కప్పుడు చేతి నిండా పట్టుకుంటే సరిపోయేదని, ప్రస్తుతం రెండేళ్లతో పట్టుకునే విధంగా కట్ట కట్టడం జరుగుతుందని, ఇక పొదిన, కొత్తిమీర, గొంగూర, ర్వేపాకులు పేద ప్రజలకు రుచులే కరువయ్యాయి. ఇప్పటికైనా మార్కెట్‌లో జరిగే ఈ రకమైనతంతును జిల్లా అధికారులు పసిగట్టి వినియోగదారులు మోస పోకుండా అధిక రేట్లను అరికట్టి తూకాల్లో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh