online marketing

Sunday, March 25, 2012

మధ్య తరగతి కుటుంబాలు ఒక్కపూట పచ్చడితో, ఒక్కపూట చారుతో లేదా గంజితో


ఏమీ కొనేట్టు లేదు.... ఏమీ తినేట్టు లేదు....రాజులో రాజన్న అని ఒక సినీ కవి రాసిన గేయం ప్రస్తుతం అక్షరాలా నిజమయ్యే పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతున్న రేట్లను చూస్తే పేద, మధ్యతర గతి ప్రజలకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. మార్కెట్లో అత్యధిక రేట్లకు కూరగాయలు అమ్ముతుంటే మార్కెట్‌లో నుంచి కొనుగోలు చేస్తున్న చిన్న చితక వ్యాపారస్తులు తీసుకు వచ్చి మార్కెట్లో అమ్మె రేట్ల కంటే మరో పది రూపాయలు వేసుకుని అధనంగాఇ అమ్ముతుండడంతో సాధారణ ప్రజలు కూరగాయలను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరంటే సందేహం లేదు. మార్కెట్‌లో గత మూడు రోజుల నుంచి ప్రతి కూరగాయల రేటు విపరీతంగా పెంచి అమ్ముతున్నప్పటికి మార్కెటింగ్‌ శాఖ అధికారులు మాత్రం అదే మార్కెట్‌లో కార్యాలయం ఉన్నప్పటికి సిబ్బంది చూసి చూడనట్లు వెళ్ళుతున్నట్లు పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

గత రెండు రోజుల నుంచి అమ్ముతున్న కూరగాయల రేట్లను పరిశీలిస్తే కేజీలలో ఈవిధంగా ఉన్నాయి. గోరుచిక్కుడు 50రూపాయలు, బెండ 60, బీనీసు 120, టమోటా 50, ఉల్లగడ్డలు 50, చామగడ్డ 50, పశ్చిమిర్చి(బెంగుళూరు రకం) 70, ఉల్లిపాయలు 25 ఈ రకంగా కూరగాయల రేట్లు చుక్కలు చూస్తుండడంతో కూరలులేని కూరతో భోజనం చేయాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. ఈ పరిస్థితుల్లో కనీసం గంజితోనైనా తిందాములేనని పేద, మధ్య తరగతి కుటుంబాలు ఒక్కపూట పచ్చడితో, ఒక్కపూట చారుతో లేదా గంజితో తిని సరిపెట్టుకుందామనే రీతిలో కుటుంబాలు కాలం వెళ్ళదీస్తున్నాయి. అయితే ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు తదితరా తో తయారైయే కూరలను మానేసి చానా రోజులు అయ్యింది.

వ్యాపారస్తులు రైతుల వద్ద నుంచి కూరగాయలు తక్కువ రేట్లకు కొంటున్నప్పటికి అవి మార్కెట్‌కి తరలించి మార్కెట్‌లో వారు కొంత మొత్తం పెట్టుకుని వ్యాపారస్థులకు అమ్ముతుండటంతో వ్యాపారస్థులు ఇంకొంత మొత్తం దానిపై పెట్టుకుని వినియోగ దారులపై భారం పడే విధంగా అమ్ముతుండడంతో ఎటు చూసినా వినియోగదారులపై భారం పడి కొనక తప్పలేదన్నట్లుగా కొద్దో గొప్పో కొనుకున్ని కాలం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే కూరగాయల మార్కెట్‌లో కేజీ కొందామంటే 750 గ్రాములే ఉంటుంది. వేసే తూకాల్లో కూడా భారీగా మోసం జరుగుతుందని వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవని తూ తూ మంత్రంగా తనిఖీలు చేసి వారిచ్చే నజరానాలకు అలవాటు పడి వినియోగదారులైన మమ్మలను పట్టించుకోవడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో గత కొంత కాలం క్రితం రైతులు స్వయంగా పండించిన కూరగాయలను రైతు బజారులకు తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు ఉండేది. ఏమైందో ఏమో కానీ రైతు బజారులు మూత బడిపోయిగత్యంతరం లేక నేరుగా మార్కెట్‌కే రైతులు తీసుకు రావాల్సిన ఏర్పడడంతో మార్కెట్‌లోని వ్యాపారస్థులు రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా అమ్ముతుండడంతో ఆ రేట్ల భారం వినియోగదారులపైనే పడుతుంది. కూరగాయల పరిస్థితి అలా ఉంటే ఆకు కూరల అమ్మె వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆకు కూరకట్ట ఒక్కప్పుడు చేతి నిండా పట్టుకుంటే సరిపోయేదని, ప్రస్తుతం రెండేళ్లతో పట్టుకునే విధంగా కట్ట కట్టడం జరుగుతుందని, ఇక పొదిన, కొత్తిమీర, గొంగూర, ర్వేపాకులు పేద ప్రజలకు రుచులే కరువయ్యాయి. ఇప్పటికైనా మార్కెట్‌లో జరిగే ఈ రకమైనతంతును జిల్లా అధికారులు పసిగట్టి వినియోగదారులు మోస పోకుండా అధిక రేట్లను అరికట్టి తూకాల్లో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh