online marketing

Saturday, April 7, 2012

1.50 లక్షలు ఎంసీఏ, రూ. 2 లక్షలు బీటెక్, రూ. 3 లక్షలు ఎంటెక్, రూ. 15 లక్షలు ఎంబీబీఎస్ సర్టిఫికెట్

నెల్లూరు మార్కెట్‌లో వివిధ సర్టిఫికెట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. డబ్బులిస్తే ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌లు ఇట్టే ఇస్తేస్తారు. మోసపోయిన బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సర్టిఫికెట్‌ను బట్టి ధర రూ. 50వేలు ఇస్తే డిప్లమో, లక్ష ఇస్తే ఎంబీఏ, రూ. 1.50 లక్షలు ఇస్తే ఎంసీఏ, రూ. 2 లక్షలు ఇస్తే బీటెక్, రూ. 3 లక్షలు ఇస్తే ఎంటెక్, రూ. 15 లక్షలు ఇస్తే ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. డిగ్రీ, పీజీ కళాశాలంటూ బోర్డులు పెట్టి విద్యార్థులను నిలువు నా దగా చేస్తున్నారు. నెల్లూరు నవాబుపేటకు చెందిన ఓ వ్యక్తి కార్తికేయ కళాశాలను నిర్వహిస్తున్నాడు. ఎలాం టి గుర్తింపు లేకుండానే ఎంబీఏ, ఎం సీఏ లాంటి డిప్లమో అంటూ బోర్డు లు తగిలించారు. ఎవరైనా వస్తే పెద్ద ఎత్తున నగదు తీసుకుని, సర్టిఫికెట్ ఇస్తున్నాడు.

మోసం జరిగిందిలా.. నెల్లూరుకు చెందిన మధు, మల్లికార్జున్‌లతోపాటు మరి కొందరు ఐటీ పూర్తి చేశారు. వారంతా నీటి యాజమాన్య సంస్థలో పని చేస్తున్నారు. డిప్లమో ఉంటే పదోన్నతి పొందవచ్చునని, కోర్సు చేసేందుకు కార్తికేయ కళాశాలకు వెళ్లారు. నిర్వాహకులు ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష వసూలు చేశారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కళింగ యూనివర్సిటీలో వన్ సిట్టింగ్ చేస్తామని నమ్మబలికారు. మధు, మల్లికార్జున్‌లు నగదు చెల్లించిన తరువాత ఇంటర్నెట్‌లో కళింగ యూనివర్సిటీ వివరాలు సేకరించారు. ఆ యూనివర్సిటీని 2005లో రద్దు చే స్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకుని బాధితులు ఖంగుతిన్నారు. తాము చెల్లించిన డ బ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. తిరి గి డబ్బులు ఇచ్చేది లేదని కార్తికేయ కళాశాల నిర్వాహకులు తెగేసి చెప్పా రు. దీంతో బాధితులు రెండో నగర పోలీసులను ఆశ్రయించారు.

అదుపులో నిర్వాహకుడు కళాశాల నిర్వాహకుడు సుధాకర్ ను రెండో నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్తికేయ కళాశా ల బోర్డును తొలగించారు. ఇంటినే క ళాశాలగా మార్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తేలింది. తాము కేవలం మధ్యవర్తులమేనని, అసలు వ్యక్తులెవరో తమకు తెలియదని నిం దితుడు సమాధానం చెప్పారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నా

నెల్లూరులో ఎక్కడైనా... ఎప్పుడైనా... దేనికైనా సిద్దమే. నువ్వు సిద్దమేనా.... అంటూ ఆయన మరో సారి వివేకాకి ఛాలెంజ్‌---శ్రీధర్‌రెడ్డి

ysrcp nellore
నెల్లూరు :మన మధ్య రోజు మాటల యుద్ధం వద్దు. డెకాయిట్ల పార్టీ ఎవరిదో చీటర్లు, డాఫర్లు, లోఫర్లు ఎవ్వరో బహిరంగ వేదికపై తెల్చుకుందాం... రా... అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి సవాల్‌ విసిరారు. శనివారం నగరంలోని వైఎస్‌ఆర్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఈ చర్చకు పిలిచారు. ఆదేవిధంగా తేదీ నువ్వు చెప్తావా .... మమ్మల్ని చెప్పమంటావా...... ఏసీ సెంటర్‌ అయినా...రాజన్న భవన్‌ అయినా... నెల్లూరులో ఎక్కడైనా... ఎప్పుడైనా... దేనికైనా సిద్దమే. నువ్వు సిద్దమేనా.... అంటూ ఆయన మరో సారి వివేకాకి ఛాలెంజ్‌ విసిరారు. అసలు నువ్వు వైఎస్‌ఆర్‌ పార్టీని డెకాయిట్ల పార్టీ అనే అర్హత నీకుందా వివేకానందరెడ్డి నీ తమ్ముడు నిన్ను ఏ విధంగా మాట్లాడుతున్నారో నీకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. 

వివేకా నీకు ఇంకా చరిత్ర అంటూ ఉందా 80 సంవత్సరాల నా రాజకీయ చరిత్ర అంటున్నావు. 
ఈ నగరంలో ఒక మనస్సు పడ్డ వ్యక్తికి రాజకీయ చరిత్రను దారపోశావు. నీ కంటూ ఇంకేమి చరిత్ర ఉంది అని మర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. విలాస భవనాలు కట్టావని, అందిన కాడికి దోచుకు న్నావని విమర్శించారు. నీవు డెకాయిట్‌ కాకుంటే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో తెలపాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మా అభిమానులు మొత్తం మీడియాతో ప్రజల సమక్షంలో తెల్చుకొందాం.. . అని శ్రీధర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నెల్లూరు లో 24 గంటలపాటు కాఫీషాప్‌.

నెల్లూరు : నెల్లూరు కెవిఆర్‌ పెట్రోలు బంకు సమీపాన అన్ని హంగులతో నిర్మించిన హోటల్‌ లియో నేడు ప్రారంభం కానుంది. హోటల్‌ను నగర, నెల్లూరురూరల్‌ ఎంఎల్‌ఎలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, మాజీ మేయర్‌ భానుశ్రీ ప్రారంభిస్తారని ఆహోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.జయప్రకాష్‌ తెలిపారు. స్థానికంగా శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నివసతులతో 105 గదులు నిర్మించామని తెలిపారు. 24 గంటలపాటు కాఫీషాప్‌, నార్త్‌, సౌత్‌, ఇండియన్‌, చైనీస్‌ వంటకాలతో మల్లీక్యూజన్‌ రెస్టారెంట్‌ ఉందన్నారు. ఆన్‌దిరాక్స్‌ లాంజ్‌, సిప్‌ అండ్‌బైట్‌ బడ్జెట్‌ బార్లను ఏర్పాటు చేశామని చెప్పారు. శుభ, భవ, యుక్త, సంయుక్త పేర్ల శుభకార్యాలు చేసుకునేందుకు ఫంక్షన్‌ హాళ్లను నిర్మించామన్నారు. కాఫీ రూ.25, బ్రేక్‌ఫాస్టు 127, నాన్‌వెజ్‌ఫుడ్‌ రూ.199 కు లభిస్తాయని తెలిపారు.

Friday, April 6, 2012

వైఎస్‌ఆర్‌సి పార్టీలో అంబటి స్థానం ‘పుట్టింటోళ్లు తరిమేశారు... కట్టుకున్నోడు వదిలేశాడు’--వివేకా


నెల్లూరు : నెల్లూరు 80 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబాన్ని విమర్శించే అర్హత అంబటి రాంబాబుకు లేదని రూరల్‌ ఎమ్మెల్యే వివేకా పేర్కొన్నారు. శుక్రవారం వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సి పార్టీ నాయకుడు జగన్‌ రూ.లక్ష కోట్లు దోచుకున్నాడని, డెకాయిట్‌ అని ఆయన విమర్శించారు. ఆయన విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని వంద కోట్లు సంపాదించాడని అంబటిని దుయ్యబట్టారు. గత 35 ఏళ్లుగా వైఎస్‌ వెంట వున్న సీనియర్లను వదిలేసి నేడు జగన్‌ పాట పాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

నెల్లూరు జిల్లా ప్రజలు తమ వెంటే ఉన్నారని, ప్రజలే మాకు బంధువులని, వారే మమ్ములను ఆదరించారని ఆయన తెలిపారు. దండకాల రాయుళ్లు ఇకనైనా నీతిగా బతకాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎంఆర్‌ ప్రాపర్టీ కేసులో జగన్‌ ఎ-1 ముద్దాయి అని, త్వరలో మీ నాయకుడు జైలుకు వెళ్లక తప్పదని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌సి పార్టీలో అంబటి స్థానం ‘పుట్టింటోళ్లు తరిమేశారు... కట్టుకున్నోడు వదిలేశాడు’ అనే చందంగా ఉందని ఆయన అంబటిపై ధ్వజమెత్తారు. నీవు ఆ పార్టీలో నెల జీతగాడివని, రాజకీయ కూలీవని ఆయన దుయ్యబట్టారు.

మెర్సిడెస్‌-బెజ్‌ తమ కార్లను దేశంలోనే మొట్ట మొదటి సారిగా నెల్లూరు నగరంలో ‘స్టార్‌ షోకేస్‌’

నెల్లూరు:నెల్లూరు మరోసారి జాతీయస్థాయిలో స్థానం సంపాదించింది. ఇప్పటికే కృష్ణపట్ట్నం పోర్టు ద్వారా జాతీయస్థాయి పట్టంలో స్థానం పొందిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం ఇప్పుడు మార్కెట్‌లో కూడా ప్రముఖ స్థానంను సంపాదించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారి సంస్థ మెర్సిడెస్‌-బెజ్‌ తమ కార్లను దేశంలోనే మొట్ట మొదటి సారిగా నెల్లూరు నగరంలో ‘స్టార్‌ షోకేస్‌’ను శుక్రవారం ఏర్పాటు చేసింది. స్టార్‌ షోకేస్‌లో కార్ల వినియోగదారుల కోసం అత్యంత వేగంగా ప్రయిణించే సి63 ఏఎంజి, స్టైలిష్‌ ఇ-క్లాస్‌ కాబ్రియోలెట్‌, ఐకానిక్‌ ఎస్‌వియు, అల్టిమేట్‌ ఆఫ్‌ రోడర్‌గా గుర్తింపు పొందిన జి55ఏఎంజి కార్లు తోపాటుగా మెర్సిడెస్‌-బెంజ్‌ సి క్లాస్‌, ఇ-క్లాస్‌సెడాన్‌, డైనామిక్‌ ఆఫ్‌ రోడర్‌ అయిన మెర్సిడెస్‌-బెంజ్‌ జిఎల్‌-క్లాస్‌లను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. 

ఈ అంతర్జాతీయ కార్ల ప్రదర్శన ఈ నెల 7, 8 తేదిలలో ఉంటుంది. నెల్లూరు నగరంలో శుక్రవారం లగ్జరీ, ఫెర్‌ఫార్మెన్స్‌ను అందించే మెర్సిడెస్‌-బెంజ్‌ స్టార్‌ షోకేస్‌ను మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా సేల్‌ అండ్‌ మార్కెటిగ్‌ డైరెక్టర్‌ దేబాశిష్‌ మిత్రా లాంచనంగా ప్రారంభిచారు. అనంతరం ఆయన పత్రిక ప్రతినిధులతో మాట్లాడుతూ నెల్లూరు పట్టణం తర్వాత తరానికి దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించనున్నదని అన్నారు. అదేవిధంగా ఇక్కడ కార్ల మార్కెట్‌కు మంచి డిమాండ్‌ ఉన్నా దృష్ట్యా, లగర్జీ వినియోగదారులు ఉన్నదున తమ కార్ల వ్యాపారంను దేశంలోనే మొదటి సారిగా నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నామనారు. స్టార్‌ షోకేస్‌ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించే కార్యక్రమం అన్నారు. 

నెల్లూరులో మెర్సీడెస్‌- బెంజ్‌ కార్లకు ఖచ్చితమైన మార్కెట్‌ ఉంద ని తాము భావిస్తున్నాం అన్నారు. మెర్సీడెస్‌- బెంజ్‌కు నేరుగా షో రూంలు లేకసోయినప్పటికీ ఖచ్చితమైన మార్కెట్‌ వస్తుందని భావించి దేశ వ్యాప్తంగా నెల్లూరుతో కలిపి 9 నగరాలలో ఈ స్టార్‌ షోకేస్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ స్టార్‌ షోకేస్‌ అనేది తమ వినూత్నంగా చేపట్టిన ‘గో టు ద కస్టమర్‌’ అని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా టైర్‌-2, టైర్‌-3 నగరాలకు మెర్సీడెస్‌-బెంజి మరింత చేరువవుతుందన్నారు.

Thursday, April 5, 2012

యువకులు ఇలా నీలిచిత్రాలు చూస్తూ అమ్మాయిలను వేధిస్తూ ఆకతాయిలుగా.


హట్‌ అండ్‌ సెక్సీ వాల్‌ పేపర్స్‌...గెట్‌ టాలీవుడ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ మోడల్స్‌ వాల్‌పేపర్స్‌ అండ్‌ మిస్‌కాల్స్‌ అలెక్ట్‌ ఆన్‌ యువర్‌ మొబైల్‌ జెస్ట్‌ ఫర్‌ 3 రూపీస్‌ డే..డయల్‌ స్టార్‌ 777 స్టార్‌ 24'' అంటూ యువత సెల్‌ ఫోన్లకు వివిధ రకాల కంపెనీలు నీలిచిత్రాల మెసేజ్‌లు వరుస కడుతున్నాయి. ఒకసారి తెలీక నొక్కితే రోజుకు మూడు రూపాయల చొప్పున నెలకు 90 రూపాయలు సెల్‌ బిల్లుకు చిల్లుపడుతుంది. అంతేగాక యువతీ, యువకులు పెడదోవపడుతున్నారు. ఇప్పటికే ఇ మెయిల్లో ఇలాంటి మెసేజ్‌లు పెద్దఎత్తున యువతీ, యువకుల మనస్సులను కలుషితం చేస్తున్నాయి. ఇంటర్నెట్‌ కేవలం కొందరికే మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెల్‌ఫోన్లు దాదాపు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో దాదాపు 20 లక్షల సెల్‌ఫోన్ల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రధానంగా యువతీ, యువకులు 90 శాతం దాకా సెల్‌ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలని తేడా లేదు. తొలిరోజుల్లో కేవలం సమాచారం కోసం ఉపయోగించేవారు. రానురాను సెల్‌ ఫోన్లలో పాటలు, సినిమాలు, ఇంటర్నెట్‌, తదితర సౌకర్యాలు వచ్చాయి. దాంతో వాటి వినియోగం అధికమైంది. నేడు ఎక్కువగా సెక్స్‌ చిత్రాల చూడడానికి ఎక్కువ మంది యువతీ, యువకులు వినియోగిస్తున్నారు.
ప్రధానంగా అన్ని వర్గాల యువకులు ఇందుకోసం పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేస్తున్నారు. గతంలో ఇంటర్నెట్‌ సెంటర్ల నుండి నీలిచిత్రాలను సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకునేవారు. ఆ తరువాత బ్లూటూత్‌ ద్వారా ఒకరి సెల్‌ నుండి మరొకరు డౌన్‌లోడ్‌ చేసుకునేవారు. దీనికి ఖర్చుపెద్దగా ఉండేదికాదు. ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న ఇంటర్‌నెట్‌ సెంటర్లమీద పోలీసులు పలుమార్లు దాడులు చేశారు. దాంతో ఆ కేంద్రాలు కొంత మేర నియంత్రణను పాటిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేరుగా ఆయా సెల్‌ఫోన్‌ కంపెనీలే నీలిచిత్రాలు, సెక్స్‌బొమ్మలు, సినీ తారల అర్ధనగ చిత్రాలను అందిస్తున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అదే ఎక్కువగా పంపిస్తోంది. యువత బలహీనతలను ఆసరా చేసుకొని సెల్‌ కంపెనీలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ తమ వినియోగదారులకు ఇలాంటి సమాచారంతో మేసేజ్‌లు పెడుతున్నాయి. ఒక సారి ఒకే అని నొక్కితే ఇక అంతే సంగతులు. వరుసగా రోజువారి మేసేజ్‌లు వస్తుంటాయి. రోజుకు మూడు రూపాయల చొప్పున ఆయా సెల్‌ కంపెనీలు జమ చేసుకుంటాయి. మనం ఇవ్వకపోయినా సెల్‌లో డబ్బులు పడగానే ఆటోమేటిక్‌గా కట్‌ అవుతాయి. సెల్‌పోన్లలో నీలిచిత్రాలు షికార్లు చేస్తున్నాయి. ఈ మోజులో పడి యువత పెడదారి పడుతోంది. ముఖ్యంగా చదువులను నిర్లక్ష్యం చేస్తోంది. ప్రదానంగా కళాశాల యువత చదువులను కూడా నిర్లక్ష్యం చేస్తోంది. మొన్నటి దాకా ఇంటర్నెట్‌ ద్వారా తమ పిల్లలు చెడిపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఏకంగా అరచేతిలోకే నీలిచిత్రాలు వస్తుండడంతో తమ బిడ్డల భవిష్యత్‌పై వారు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువకులు ఇలా నీలిచిత్రాలు చూస్తూ అమ్మాయిలను వేధిస్తూ ఆకతాయిలుగా మారుతున్నారు. కేవలం సమాచారాన్ని చేరవేసే సెల్‌ఫోన్‌ ఇప్పుడు సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిందని సర్వత్రా చర్చనీయాంశమైంది. వివిధ కంపెనీలు సెల్‌ ఫోన్లకు నీలి చిత్రాలు పంపిస్తూ జిల్లాలో అధిక మొత్తంలో యువత నుంచి సొమ్మును దోచుకుంటున్నాయి. డబ్బు విషయం అలా ఉంచినా యువత చెడుమార్గం పడుతుండడమే పెద్ద ఆందోళనకరం. ఇలాంటి వ్యవహారాలపై అధికారులు దృష్టిపెట్టి సెల్‌ కంపెనీలను నియంత్రిస్తే సమాజానికి కాస్తయినా మేలు జరుగుతుంది

జిల్లాలో సుమారు 30 లక్షల జనాభా ఉంటే అందులో సగానికి సగం మద్యపాన ప్రియులు...

మద్యం సేవించడం ఓ ఫ్యాషన్ అ యిపోయింది. సందర్భం ఏదైనా మం దు పార్టీ ఇవ్వడం సరదాగా మారింది. ఈ సరదానే మందుకు బానిస చేస్తోంది. 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా మద్యం ప్రియుల సంఖ్య నానాటికి రెట్టింపు అవుతోంది. జిల్లాలో ఏటా రూ.600 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సుమారు 30 లక్షల జనాభా ఉంటే అందులో సగానికి సగం మద్యపాన ప్రియులు ఉన్నట్టు సమాచారం. మందుబాబుల ఆరోగ్య పరిరక్షణకంటూ ఏకంగా మద్యపాన ప్రియుల సం ఘా న్నిరాష్ట్రంలోనే మొ దటిసారిగా జి ల్లా లో ఏర్పా టు చేయడం కూడా చర్చనీయాంశమైంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ ప్రభావం కాలేయంపై పడి కణజాలాన్ని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుత సీజన్‌లో కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కల్లులో మత్తు శాతం పెంచేందుకు డైజీఫాం అనే మాత్రలను పొడి చేసి కలుపుతారు. 'మత్తు' సంగతి దేవుడెరుగు నాడీవ్యవస్థను దెబ్బతీయడంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. జిల్లాలో ఏటా మద్యపాన బానిస ల్లో 25వేల మందికిగా పైగా తీవ్రఅనారోగ్యానికి గురవుతుండగా ఇందులో మృతుల సంఖ్య వం దల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చిన్నారులపై వైట్నర్ అనాథలుగా మారిన కొందరు చిన్నారులు వైట్నర్‌కు బానిసలవుతున్నారు. రోడ్డుపై చిత్తుకాగితాలు ఏరుకుని వచ్చిన డబ్బుతో బుక్‌షాపులలో దొరికే వైట్నర్‌ను కొనుగోలు చేసి దానికి గుడ్డకట్టి గంజాయిలా పీలుస్తున్నారు. దీంట్లో ఉన్న ప్రమాదకర ఎ«థనాల్ వాయువు మత్తును కలిగించడంతో దానికి ఆ చిన్నారులు బానిసలవుతున్నారు. ఏడాది క్రితం వైట్నర్ మత్తులో నగరంలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో నీటిలో మునిగి పిల్లలు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం మద్యపాన ప్రి యుల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతికి చెందిన వారే ఉంటున్నారు. కూలి పనులు చేసుకునే వారు తన సంపాదనలో 70 శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కొన్ని కుటుంబాలు అర్ధాకలితో పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఉద్యోగులదీ అదే పరిసితి. ప్రమాదాల సంఖ్య రెట్టింపు జిల్లాలో ఏటా సరాసరి 5,600 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 60 శాతం ప్రమాదాలు మద్యం సేవించి వా హనాలు నడపడం వల్లే జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నా రు. ఆల్కహాల్ ప్రభావం వల్ల జరిగే ప్రమాదాల కారణంగా త లకు తీవ్రగాయమై మతిభ్రమించిన బాధితులు నమోదవుతున్నారు.

ప్రభావం ఇలా.. * అతిగా మద్యం సేవించడం వల్ల గ్యాస్టిక్ సమస్యతో అనారోగ్యం ప్రారంభమవుతుంది. * కాలేయం చెడిపోయి పొట్ట ఉబ్బరం, రక్తం కక్కుకోవడం జరుగుతుంది. * కడుపులో పూత, గుల్లలు వస్తాయి. * చేతులు, పాదాలు తిమ్మెర్లు లేదా చచ్చుబడుతాయి. * కామెర్ల వ్యాధికి దారి తీస్తుంది. * మద్యం సేవించడం వల్ల ఆహారం అధికంగా తీసుకుని ఊబకాయానికి దారి తీస్తుంది. * లివర్ కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

* మతిభ్రమించే అవకాశం ఉంది. చికిత్స.. * మద్యానికి బానిసలై ప్రాథమిక దశలోనే వైద్యుడిని సంప్రదిస్తే తగిన వైద్యం అందుకోవచ్చు. వెంటనే తాగుడు ఆపేస్తే వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు మందులు ఉన్నాయి. * వైద్యుడి పర్యవేక్షణలో మద్యపానంపై విరక్తి కలిగించే మందులు తీసుకోవాలి. * మద్యం బానిసలకు తగిన మానసిక పరివర్తన తెచ్చేందుకు డీహైడ్రేషన్ కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

Wednesday, April 4, 2012

పోలంరెడ్డి గెలుపుకు ఆనం సోదరులు ఎలాంటి కృషీ చేయలేదన్న విమర్శలు

నెల్లూరు పార్లమెంట్‌, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఆపార్టీకి సమస్యగా మారింది. ఇప్పటికే టిడిపి, వైఎస్‌ఆర్‌సి తమ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. కోవూరు ఉపఎన్నికల్లో కూడా చివరి దాకా అభ్యర్థిని ప్రకటించని కారణంగా ఆపార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు ఖరారైనా కేవలం గ్రూపుల కారణంగా చివరి వరకు ప్రకటించలేదు. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడం, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆ పార్టీకి మూడో స్థానం దక్కింది. దానిని నుంచి గుణపాఠం తీసుకున్న ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలకు త్వరగా అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర స్థాయిలో సిఎం. పిసిసి అధ్యక్షులకు మధ్య గొడవల కారణంగా అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపికలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్‌ ఎంఎల్‌ఎ ఆనం వివేకానందరెడ్డి పేరు కొద్ది రోజులుగా మీడియాలో కన్పిస్తోంది. అలాగే మాజీ ఎంపి, జిల్లా వాసి టి. సుబ్బరామిరెడ్డి, మాగుంట పార్వతమ్మ, మాదాల జానకిరామ్‌, ప్రముఖ కాంట్రాక్టరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఎంపి అభ్యర్థి ఎంపికలో ఆనం సోదరుల సిఫార్సులు పనిచేయవని తెలుస్తోంది. కోవూరు టికిట్‌ విషయంలో పోలంరెడ్డి సామర్థ్యంతోపాటు ఆనం సోదరుల సిఫార్సు ప్రముఖంగా పనిచేసింది. పోలంరెడ్డి గెలుపుకు ఆనం సోదరులు ఎలాంటి కృషీ చేయలేదన్న విమర్శలు వచ్చాయి. అందువల్లఎంపి అభ్యర్థి ఎంపికలో పెద్దగా ఆనం సోదరుల ప్రమేయం ఉండదని తెలుస్తోంది. ఉదయగిరి శాసనసభకు కాంగ్రెస్‌ తరపున మాజీ ఎంఎల్‌ఎ కంభం విజయరామిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన పేరును మాజీ మంత్రి మాదాల జానకిరామ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉదయగిరి ప్రాంతానికి చెందిన పెద్దపాడు గ్రామానికి చెందిన వెండ్లారు వెంకటేశ్వర్లు చౌదరి పేరును మాదాల జానకిరామ్‌ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టిడిపి, వైఎస్‌ఆర్‌సిలు ఇప్పటికే తమ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశాయి. టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేరు ఖరారైంది. 2009 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా ఈ ఉప ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్‌ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లోనూ వంటేరు కీలకంగా వ్యవహరించారు. వంటేరు కూడా చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా బొల్లినేని రామారావు పేరును ఇప్పటికే ఆపార్టీ ఖరారు చేసింది. ఇటీవల రైతుపోరుబాట ముగింపు కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించినప్పుడు చంద్రబాబునాయుడు ఈ మేరకు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో రామారావును గెలిపించాలని కూడా ప్రచారం చేశారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కారణమైన మేకపాటి సోదరులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి పేర్లనే వైఎస్‌ఆర్‌సి నెల్లూరు పార్లమెంటు, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలకు రును ఖరారు చేసింది. వైఎస్‌ఆర్‌సి పార్టీ తరపున పోటీచేయనున్న మేకపాటి సోదరులపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉంది. ఎంపిగా గెలిచినప్పటి నుండి రాజమోహన్‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యం. అప్పటి నుండి జగన్‌ భజన చేస్తూనే కాలం గడిపారు. ప్రజా సమస్యలపై ఒకరోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కొంత అభిమానం ఉన్నా మేకపాటి సోదరుల మీద ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పడుతుందని పరిశీలకులు అంటున్నారు.

Tuesday, April 3, 2012

రికార్డు డ్యాన్స్‌ పేరిట తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం


నెల్లూరు : ఉన్నత స్థానాలకు వెళ్ళాలని తమలోని కళను పదిమందికి పరిచయం చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించుకోవాలనుకున్న ముగ్గురు యువతులను రికార్డు డ్యాన్స్‌ పేరిట తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మంగళ వారం ఐసిపిఎస్‌ డిసిపిఒ కె. మధుబాబు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, వై. రామవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువతులను అదే జిల్లాకు చెందిన విశ్రాంత్‌ అనే వ్యక్తి నెల్లూరులో రికార్డు డ్యాన్సుల పేరిట తీసుకురావడం జరిగింది.

అయితే రికార్డు డ్యాన్సుల కోసం వచ్చిన ముగ్గురు యువతులను నగరంలోని శెట్టిగుంటరోడ్డులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని రెండవ నగర పోలీసులు తెలుసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ముగ్గురు యువతులను ఐసిపిఎస్‌ కార్యాలయంలో అప్పజెప్పడం జరిగిందన్నారు. వీరికి మహిళా ప్రాంగణంలోని సేవా సదన్‌ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి వారి సొంత గ్రామాలకు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు

ఉప ఎన్నికల కు ఏక్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం రెండో దశ ఉప పోరుకు


నెల్లూరు నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీలకు ఉప ఎన్నికల కు ఏక్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రెండో దశ ఉప పోరుకు ఇప్పటికే అధికారులు సమాయత్తమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఓటర్ల జాబితాల సవరణ వంటి కార్యక్రమాల్లో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ త్వరలో నెల్లూరుకు విచ్చేసి ఈ ఉప ఎన్నికలపై అధికారులతో చర్చించనున్నారు. దీర్ఘకాలికంగా పని చేస్తున్న మండల స్థాయి అధికారుల బదిలీలకు జాబితాలు సిద్ధమయ్యాయి. తహసీల్దార్లు, ఎస్ఐలకు బదిలీలు ఉండవచ్చునన్నది సమాచారం. ఇప్పటికే కొందరు అధికారులను బదిలీ చేశారు. మరో వైపు నేతల్లో హడావుడి జోరందుకుంది. పార్టీల వారీగా అభ్యర్థుల ఖరారు, నియోజకవర్గాల్లో నేతలు పర్యటన సాగుతున్నాయి.

ఏర్పాట్లలో అధికారులు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజీనామా ఆమోదం, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. నెల్లూరు నగరం, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లా కందుకూరు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఓ దశ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలు తనిఖీ చేసి నివేదికలు సిద్ధం చేశారు. మరో వైపు ఓటర్ల జాబితాలలో జరిగిన తప్పులను సరి చేస్తున్నారు.

ఖచ్చితంగా ఫొటోలు, పేర్లు వంటివి సరిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. చేర్పులు, మార్పులతో తాజా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడంలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతీ శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బన్వర్‌లాల్ నెల్లూరుకు విచ్చేసి ఈ నియోజకవర్గాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కోవూరు ఉప ఎన్నికలను ఎంతో సమర్ధవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించడంతో కలెక్టర్ బీ శ్రీధర్‌తోపాటు జిల్లా యంత్రాంగానికి ప్రశంసలు లభించాయి. అదే రీతిలో రెండో దశ ఉప ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

భారీగా బదిలీలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వచ్చే ఏడు నియోజకవర్గాల్లో దీర్ఢకాలికంగా పని చేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీలు చేసేందుకు భారీ కసరత్తే జరుగుతోంది. మూడేళ్లు పూర్తి చేసిన వారిని సాగనంపనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్, ఆర్డీవో మండలాల్లో పని చేసే తహసీల్దార్ల జాబితా రూపొందించి 25 మందిని ఎంపిక చేశారు. తొమ్మిది మందిని ఇప్పటికే బదిలీ చేసిన కలెక్టర్ మిగిలిన వారి బదిలీలపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇక పోలీసు శాఖలో ఆత్మకూరు, కావలి డివిజన్‌లకు తాజాగానే డీఎస్పీలు నియమితులయ్యారు. ఇక సీఐలు, ఎస్ఐల బదిలీలు తప్పేటట్లు లేదు. షెడ్యూల్ వెలువడే లోగా అధికారుల బదిలీలు పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఇక డీఆర్వో బీ రామిరెడ్డి, జేసీ సౌరభ్‌గౌర్‌లు కూడా మూడేళ్లు పూర్తి కావడంతో వీరిని బదిలీ చేసే అవకాశం ఉంది.

ఏ క్షణాన్నైనా.. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఓ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. మినీ సంగ్రామంగా పేర్కొంటూ మే లోగా ఎన్నికలు నిర్వహిస్తారన్నది సమాచారం. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోగా ఈ ఖాళీలను భర్తీ చేయాలన్నది ఆలోచన. దీని కోసం ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేపట్టింది.

నేతల్లో హడావుడి నెల్లూరు పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీ అభ్యర్థిగా తాజా, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇక కాంగ్రెస్ నుంచి రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని రామారావు, వైఎస్సార్సీ నుంచి తాజా, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎన్ఆర్ఐ వెంకటేశ్వర్లు చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, మాదాల జానకిరామ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైఎస్సార్సీ నేతలు ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారాలు కూడా సాగిస్తున్నారు. షెడ్యూలు రాకముందే నేతల్లో హడావుడి మొదలైంది.

చిల్డ్రన్స్‌పార్కులో రూ.10 లక్షలతో ప్రహరీగోడ, యాడ్‌ లైటింగ్‌


నెల్లూరు : నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కులో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డితో కలసి ఆయన చిల్డ్రన్స్‌ పార్కు అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (బిఒటి) విధానం ద్వారా ముందుకొచ్చిన యెడల పార్కును నగర ప్రజల కోసం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో నగరంలోని మరో రెండు పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. చిల్డ్రన్స్‌పార్కులో రూ.10 లక్షలతో ప్రహరీగోడ, యాడ్‌ లైటింగ్‌, గ్రీనరీ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇంకా చేయాల్సిన పనులు స్విమ్మింగ్‌ పూల్స్‌, పిల్లల ఆటపరికరాలు, జిమ్‌, క్యాంటిన్‌, మ్యూజికల్‌ ఫౌంటైన్స్‌ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆమ్రణలు చేస్తోన్నా రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం

వెంకటగిరి : వెంకటగిరి మండలంలోని పూలరంగడపల్లి, బసవాయిగుంట ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆమ్రణలు చేస్తోన్నా రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మంగళవారం సర్వే నెంబర్‌ 31/7లో కొంతమంది రాజకీయ చోటా నాయకులు రెవెన్యూ విఆర్‌ఓ అండదండలతో జెసిబిని పెట్టి రాత్రి నుంచి తెల్లవారేంత వరకు చెట్లు తొలగించి ఆక్రమణలకు పూనుకున్నారు. గతంలో భూఆక్రమణలకు సంబంధించి పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడంతో 31/7లో 270ఎకరాలు, 31/2లో 690, 74లో 145ఎకరాలకు 145సెక్షన్‌ను తహశీల్దార్‌ అమలు చేశారు. ఈపొలంలో ఎవరు ప్రవేశించిన వారి పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈఆదేశాల అనుసారం భూముల ఆక్రమణకు ప్రయత్నించిన సిపిఐ కార్యకర్తలు, నాయకులపై 100మందికి పైగా కేసులు బనాయించారు. ఇదే భూముల్లో భూస్వాములు, బడాబాబులు రెవెన్యూ అధికారుల అంగబలం, అర్ధంబలంలో లోబరుచుకొని యథేచ్ఛగా జెసిబిలు పెట్టి కోట్లరూపాయల విలువగల భూములను కబ్జాచేస్తున్నా అధికారులు ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని ఆరోపణలున్నాయి. మంగళవారం విఆర్‌ఓ రామ్మూర్తికి సమాచారం తెలిసిన వెంటనే తలారి యుంగధర్‌ను పంపి జెసిబిని పోలీసులకు అప్పజెప్పామని ప్రజాశక్తికి తెలిపారు. సిఐ అబ్ధుల్‌ కరీంకు ఈసమాచారం తెలిసిన వెంటనే ఎఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బంది ద్వారా జెసిబిను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఆదేశాల ప్రకారమే 145సెక్షన్‌లోని భూముల్లో ప్రవేశిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అన్వర్‌బాషా తెలిపారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెంకటగిరి చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కబ్జాదారుల వశమవుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇకనైన సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఈఆక్రమణలకు ప్రొత్సహించి అండగా ఉండి లబ్ధిపొందుతున్న అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Monday, April 2, 2012

బ్రిటన్‌ దేశం తరుపున మరో 5 కంపెనీలు కూడా శ్రీ సిటీకి..బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ మెక్‌నిథావ్‌ రియానకీస్‌


నెల్లూరు, తడ: భారతదేశంలోని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ మెక్‌నిథావ్‌ రియానకీస్‌ సోమవారం దక్షణ భారతదేశంలోని అతిపెద్ద సమీకృత వాణిజ్య నగరం శ్రీసిటీలో విస్తృతంగా పర్యటిం చారు. చెనై్న నుంచి ఉదయం వచ్చిన హై కమిషనర్‌ మెక్‌ శ్రీసీటీలో సోలర్‌ క్యానల్‌ తయారు చేసే , షన్‌సోనార్‌ మెత్తటి ఆటబొమ్మలను తయారు చేసే పల్స్‌ప్లస్‌ యూనిట్లను సందర్శించారు. శ్రీసిటీ లో పర్యటించిన అనంతరం బిజినెస్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో శ్రీసిటీ మేనే జింగ్‌ డైరక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డితో హైకమీషనర్‌ మెక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెక్‌ మాట్లా డుతూ ఇక్కడ tజరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యేకంగా అభినందిం చారు. ప్రస్తుతం రూ. 120 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన మూడు బ్రిటన్‌ కంపెనీలు త్వరలో ఉత్పత్తులను ప్రారంభించనున్నానమని తెలిపారు.

తమ దేశం తరుపున మరో 5 కంపెనీలు కూడా శ్రీ సిటీకి రానున్నాయని చెబుతూ ఇంకా ఎక్కువ కంపెనీలు శ్రీసిటికి వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామనన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు కంపెనీల ద్వారా దాదాపు 600 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా మెక్‌ చెప్పారు. ఈ సమావేశంలో రవీంద్రా సన్నారెడ్డి మాట్లాడుతూ గత మూడేళ్ళ కాలంలో మొదటి దశ అభివృద్ధి పనుల్లో భాగంగా శ్రీసిటిలో 22 దేశాలకు చెందిన 70 కంపెనీలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ప్రారంభమైయ్యే 2వ దశ పనుల్లో ఘననీయమైన అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sunday, April 1, 2012

జగన్‌ను అరెస్టు చేయకుంటే సాక్ష్యాలు తారుమారు -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


నెల్లూరు: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకపోతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన బడా కంపెనీల పేర్లు సిబిఐ ఛార్జీషీటులో లేవని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేయకుంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు.

జగన్‌కు జనంలో తిరిగే నైతిక అర్హత లేదన్నారు. ఆయన చెప్పినట్లుగా ఏమైనా నైతిక విలువలు ఉంటే వెంటనే కోర్టులో సరెండర్ కావాలని సూచించారు. జగన్‌ను అరెస్టు చేయక పోవడానికి ఆయన ఏమైనా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెసు జగన్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సిబిఐ పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను తన ఛార్జీషీటులో పేర్కొందని విమర్శించారు. ఎఫ్ఐఆర్, ఛార్జీషీటులో మొదటి ముద్దాయి జగన్‌ను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలేమిటన్నారు. సురేష్ కల్మాడీ, కనిమొళి, అమర్ సింగ్‌లను అరెస్టు చేసినప్పుడు జగన్‌ను అరెస్టు చేయక పోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.

జగన్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని వైయస్సార్ కాంగ్రెసు నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించడంపై ఆయన మండిపడ్డారు. సంఘ విద్రోహ శక్తులను ప్రజల్లో తిరగనీయడం సరికాదని, వెంటనే జగన్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగ్ రిపోర్టులో, సిబిఐ విచారణలో జగన్ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నందున ఆయనే స్వచ్చంధంగా లొంగిపోవాలని సూచించారు. కాగా శనివారం సిబిఐ జగన్ ఆస్తుల కేసులో కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

2001 జనాభా లెక్కల ప్రకారం 26.69 లక్షల, ప్రస్తుతం 2.97 లక్షల మంది జనాభా పెరిగారు


నెల్లూరు ; జిల్లా ప్రజల జీవన విధానం మారుతోంది. 2001లో జిల్లాలో ల్యాండ్ ఫోన్ కనెక్షన్లు 1 లక్ష ఉండేవి. అలాంటిది పదేళ్లలో వాటి సంఖ్య తగ్గి సెల్‌ఫోన్ల వినియోగం బాగా పె రిగింది. సుమారు 4.5 లక్షల మందిపైగానే మొబైళ్లు వాడుతున్నారు. ఇక టీవీలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కేబుల్, డీటీహెచ్ ద్వారా మారుమూల పల్లెల్లో ప్రజలు సైతం టీవీ లేని జీవితం లేదన్న విధంగా మారింది. మొత్తం మీద జిల్లాలో 62.9 శాతం మంది టీవీలను వీక్షిస్తున్నారు. 14 శాతం కుటుంబాలు మాత్రమే టీవీలకు దూరంగా ఉంటున్నాయి. 5.4 శాతం మందే రేడియోను వినియోగిస్తున్నారు.

గ్యాస్ వాడకంలో.. జిల్లాలో తాజా లెక్కల ప్రకారం 7,72,825 కుటుంబాలు ఉన్నాయి. 4,47,149 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్లు 1.87 లక్షలు, డబుల్ సిలిండర్లు 1.47 లక్షలు, దీపం కనెక్షన్లు 1.35 లక్షలు ఉన్నాయి. అంటే సింగిల్ సిలిండర్లు, దీపం కనెక్షన్లు కలుపుకుంటే 3.22 లక్షలు అవుతాయి. కుటుంబ సర్వే లో 30.2 శాతం తీసుకుంటే 2.33 లక్షల కు టుంబాలు గ్యాస్ వినియోగిస్తున్నట్లు తేల్చా రు. అంటే జిలా ్లలో సు మారు 90వేల కనెక్షన్లు మాటేమిటన్నది తేలా ల్సి ఉంది.

తగ్గని పూరిళ్లు 2001, జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 6,40,942 కుటుంబాలు ఉండేవి. ఈ పదేళ్లలో 1,31,883 కుటుంబాలు పెరిగాయి. ప్రస్తుతం 18.5 శాతం మంది ఇంకా పూరిళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేసినా 1.42 లక్షల కుటుంబాలు పూరిళ్లలోనే గడుపుతున్నాయి. మరుగుదొడ్ల వినియోగం కూడా 30.2 శాతం కుటుంబాలకే ఉన్నాయి. మిగిలిన 70 శాతం మంది బహిర్భూమి కోసం ఆరు బయటకు వెళుతున్నారు.

తాగునీటి కటకటే జిల్లాలో ప్రస్తుతం 29.66 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరికి సురక్షిత మంచినీరు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూనే ఉంది. ఇప్పటికీ 13.9 శాతం మందికి తాగునీరు అందడం లేదు. 2001 జనాభా లెక్కల ప్రకారం 26.69 లక్షల మంది జనాభా ఉం డగా, ప్రస్తుతం 2.97 లక్షల మంది జనాభా పెరిగారు. వీరి అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం మంచినీరు అందించడం లేదు.

ఒకరే ముద్దు ఏదిఏమైనా కుటుంబ నియంత్రణ ప్రజలు పాటిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో 30.9 శాతం మంది, ఒకరితో 17.2 శాతం మంది సరి పెట్టుకుంటున్నారు. దీంతో జనన రేట్ 0.40 శాతం తగ్గింది. 53 శాతం మంది బ్యాంకు సేవలు వినియోగించుకుంటున్నారు. సైకిళ్లను వీడి పూర్తిగా మోటారు సైకిళ్లపై 14 శాతం మంది, 1.5 శాతం మంది కార్లు వినియోగిస్తున్నారు. సైకిళ్లకు మాత్రం పల్లెల్లో ఆదరణ తగ్గలేదు. విద్యుత్ వినియో గం 92.2 శాతం మంది వినియోగిస్తున్నారు.

రానున్న రోజుల్లో ప్రతి వస్తువు రేటు పెరిగిపోయి ఏమీ కొనలేము, ఏమీ తినలేము అన్న వ్యాఖ్యలు


నెల్లూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత నిత్యావసర వస్తువుల నుండి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు విపరీతంగా పెరిగిపోవడం, వీటికి తోడు వ్యాట్‌ పేరు మీద అధిక ధరలను విధించి అమ్ముతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏ వస్తువునూ కొనలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత రెండు నెలల కిందట ఉన్న వస్తువులకు, ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముతున్న వస్తువులకు వందల రూపాయలు తేడా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరి ఎలా ఉంటుందోనని, ఏ వస్తువైనా కొనగలమా? తినగలమా అనే ఆందోళనలో ప్రజలున్నారు. ప్రస్తుతం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యంగా ద్విచక్ర వాహనాల నుండి 4 వీలర్స్‌ వరకు రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, దానిపై వ్యాట్‌ పేరుతో మరింత అదనంగా రేట్లు పెంచి అమ్ముతుండడంతో వాహనాలను కొనే పరిస్థితి పేద, మధ్యతరగతి ప్రజల్లో కనపడడం లేదు.

అలాగే ఎక్కువగా వినియోగించే ఎలక్ట్రానిక్‌ వస్తువులైన రేడియో, టెలివిజన్‌, మొబైల్స్‌, సెల్‌ఫోన్‌లతోపాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులపై బల్బులు, స్విచ్‌లు తదితర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం సామాన్య మానవుడికి మింగుడు పడడం లేదు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఏ వస్తువైనా కిలో రూ.70, రూ.80లకు తక్కువ లేదనడంలోకూడా సందేహం లేదు. వీటికి వ్యాట్‌ అనే పేరుతో అదనంగా మరో రూ.5లను పెంచి అమ్ముతున్నారు. అలాగే వస్త్ర దుకాణాల్లో కూడా చీరల వద్ద నుండి ప్యాంట్లు, టవల్స్‌ షర్ట్‌‌స , లుంగీలు, రెడీమేడ్‌ దుస్తులు అన్నింటిపై 5 శాతం వ్యాట్‌ను కలిపి అమ్ముతుండడంతో కనీసం రెడీమేడ్‌ వస్తువులను కూడా కొనలేని పరిస్థితిలో ప్రజలున్నారు. దీనికితోడు పెంచిన ఇంటి పన్నులు, విద్యుత్‌ చార్జీలు, సిమెంటు, ఇనుము, తదితర వస్తువులన్నీ రేట్లను విపరీతంగా పెంచడంతో మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లును కట్టుకోవాలన్న కల కూడా కలగానే మిగిలిపోతుంది.

పెంచిన ఇంటి పన్నుల కారణంగా బాడుగ ఇళ్లలో ఉంటున్న వారికి కూడా ఇంటి అద్దెలు విపరీతంగా పెంచడం తదితర సమస్యలతో సామాన్య మానవుడు సతమతమవుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోల్‌ చార్జీలు కూడా పెంచుతారన్న వ్యాఖ్యలు వినిపిస్తుండడంతో వాహనదారుల్లో ఆందోళన చోటుచేసుకుంటుంది. ఇప్పటికే వాహనాలపైన అత్యదిక రేట్లకు అమ్ముతుండడం, పెట్రోల్‌ చార్జీలుకూడా పెరుగుతాయన్న వ్యాఖ్యలతో పేద, మద్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్‌ చార్జీలు పెరిగినట్లయితే మళ్లీ అన్ని వస్తువులు రేట్లను పెంచే అవకాశం ఉండడంతో రానున్న రోజుల్లో ప్రతి వస్తువు రేటు పెరిగిపోయి ఏమీ కొనలేము, ఏమీ తినలేము అన్న వ్యాఖ్యలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆ సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ పక్కనపెట్టి విపరీతంగా రేట్లు పెంచడం ప్రజల్లో ఆందోళన కలిగించే అంశంగా మారివుంది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచిన సమయంలో ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేయడం, అసెంబ్లీ ముందు గందరగోళాలు చేయడం, స్తంభింపచేయడం వంటి చర్యలు చేసి కాల్పుల వరకు తీసుకెళ్లిన సంఘటనలు జరిగివున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అన్ని తరహా వస్తువులపై రేట్లను పెంచుతున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ మౌనం వహించడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన, వ్యతిరేకత పార్టీలపై ఏర్పడే పరిస్థితి నెలకొనివుంది. తూతూ మంత్రంగా వామపక్షాలు పెంచుతున్న రేట్లపై అడపాదడపా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఆందోళన చేయడం తప్ప పూర్తిగా తగ్గించేంతవరకు పోరాటం చేయాలన్న ఆలోచన లేకపోవడం ప్రజలను కలవరపరుస్తుంది. దీంతో కూడా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీల కోసం పెంచిన చార్జీలను తగ్గించే విధంగా ప్రయత్నాలు చేసే పార్టీల వైపు మొగ్గు చూపుతుండడం కూడా గమనార్హం.

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పెంచిన రేట్లపై తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ప్రజల్లో కొంతలో కొంతైనా ఉపశమనం కలిగించే అంశం అవుతుంది అని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సివుంది.

Nellore Venkatagiri Top Lawer Doctors contact Mobile Numbers


sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh