online marketing

Friday, December 25, 2009

THE MOST THINGS TO KNOW

The most useless thing to do.......... ...... Worry

The greatest Joy......... ......... ......... ... Giving.

The greatest loss ............ ......... ..... Loss of self-respect.

The most satisfying work ............ ....... .Helping others.

The ugliest personality trait....... ......... .. Selfishness.

The most endangered species..... ......... Dedicated leaders.

The greatest "shot in the arm"............ .. Encouragement.

The greatest problem to overcome.... ...... Fear.

The most Effective sleeping pill........ .... Peace of mind.

The most crippling failure disease..... ... Excuses.

The most powerful force in life........ ..... Love.

The most dangerous pariah...... ......... ... A Gossiper.

The world's most incredible computer.... . The Brain.

The worst thing to be without..... ......... . Hope.

The deadliest weapon...... ......... ......... ... The tongue.

The two most power-filled words....... ... "I Can".

The greatest asset....... ......... ......... ......... Faith.

The most worthless emotion..... ......... ... Self-pity.

The most prized possession.. ......... ....... Integrity.

The most beautiful attire...... ......... ......... A Smile.

The most powerful channel of communication. ..... Prayer.

The most contagious spirit...... ......... .... Enthusiasm.

The most important thing in the life....... God.

క్రిస్మస్‌ కళకళలు


నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌: క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ ప్రాంతాలు క్రిస్మస్‌ కాంతులతో కళకళలాడుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మించిన నాటి పరిస్థితులను ప్రతిబింబించే అలంకారాలతో, ఆధునిక విద్యుత్‌ దీపాల వెలుగులతో క్రిస్మస్‌ పండుగకు నగరంలో సంసిద్ధమైంది. అలంకరణకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగలో స్టార్స్‌, శాంతాక్లాజ్‌, క్రిస్మస్‌ ట్రీలు, అలంకరణకు అవసరమైన బెలూన్స్‌, రంగు కాగితాలు, రంగురంగుల సీరియల్‌ సెట్స్‌, ఙ్ఞానులు, పశువుల కాపరుల బొమ్మలను కొనడానికి అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్‌ చేయడం గురువారం నగరంలో తారసపడింది. ఏసుక్రీస్తు జననానికి సూచనగా అరుదైన నక్షత్రం ఆకాశంలో వెలిగిందని, అందుకు సూచనగా ప్రతి క్రైస్తవుని ఇంటిపై నక్షత్రాన్ని వెలిగించడం ఆచారంగా క్రైస్తవులు భావిస్తారు. క్రీస్తు జననం పశువుల పాకలో జరిగినందుకు నిదర్శనంగా ప్రతి గృహంలో, పెద్ద పెద్ద సెంటర్లలో పశువుల పాకలను ఏర్పాటు చేసి మరియమ్మ, యోసేబు, ఙ్ఞానులు, గొర్రెల కాపరులు తదితర ప్రతిమలతో అలంకరించి విద్యుత్‌ దీపాల వెలుగులో క్రిస్మస్‌ సందేశాన్ని అందించడానికి భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్‌కు ముందు రాత్రి నగరంలోని ప్రతి క్రైస్తవ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువతీ యువకులు పాటలతో నృత్యాలు చేస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలను అందరికీ తెలిపే కేరల్స్‌ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. కేరల్స్‌లో శాంతాక్లాజ్‌ (క్రిస్మస్‌ తాత) వేషధారణ ప్రత్యేక ఆకర్షణ గా కేరల్స్‌లో ఉత్సాహాన్ని అందించడానికి దోహదం చేస్తుంది. క్రీస్తు జన్మించిన కొన్ని శతాబ్దాల తర్వాత క్రిస్మస్‌తాత వేషధారణతో ఓ వ్యక్తి నిరుపేద ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఉండేవారని, ఆయనను స్మరించుకోవడం కోసం క్రిస్మస్‌ తాత ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. పశువులపాకతో పాటు క్రిస్మస్‌ ట్రీ అలంకరణ ఎంతో ప్రాముఖ్యమైంది. పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రీని క్రిస్మస్‌ బహుమతులతో అలంకరించి బహుమతులను అందజేయడం ఆనవాయితీ. స్థానికంగా ప్రతి ఇంట్లో ఈ ట్రీలకు దూతల, ఙ్ఞానుల, నక్షత్ర, శాంతాక్లాజ్‌, బెలూన్స్‌, గ్రీటింగ్‌ కార్డులతో అలంకరించడంతోపాటు పెద్ద పెద్ద కూడళ్లలో భారీస్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు క్రిస్మస్‌ సందేశాన్ని అందించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. అలంకరణలతోపాటు ఆధ్యాత్మికంగా పండుగను జరుపుకోవడంలో భాగంగా నగరంలోని ప్రతి క్రైస్తవ దేవాలయాల్లో గురువారం అర్థరాత్రి నుండి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అద్వాన్నంగా అన్నారెడ్డిపాళెం


విడవలూరు, (మేజర్‌ న్యూస్‌) : ఆర్‌అండ్‌బి రహదారులు నరకానికి నకళ్ళుగా మారాయి. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెం గ్రామం నుండి అలగానిపాడు వెళ్ళే రోడ్లు భవనాలశాఖ రహదారి గుంటలమయమైంది. విడవలూరు - ఊటుకూరు ప్రధాన రహదారి నుండి వెళ్ళే అలగానిపాడు వరకు గల మూడు కిలో మీటర్ల రోడ్డు గతుకులమయమైంది. పలుచోట్ల గుంటలు ఏర్పడి వాహనాలు వెళ్ళలేని స్థితిలో వున్నాయి. అన్నారెడ్డిపాళెం గ్రామంలోని మండల ప్రజాపరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాల వద్ద రహదారి నీటిమడుగుగా తయారైంది.గుంటలమయంకావడంతో రోడ్డు మార్జిన్‌లో వాహనాలు వెళుతున్నాయి. ప్రజానీకం కూడా అద్వాన్నమైన రహదారిలో నడిచి వెళుతున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య మార్గ్‌గా వ్యవహరించే ఈ రహదారి అలగానిపాడు గ్రామం వరకు ఘోరంగా దెబ్బతినింది. గుంటలు పుడ్చడంకాని, ప్యాచ్‌వ ర్క్‌లు చేయడం కాని సంబందిత అధికారులు చేపట్టడంలేదు. వర్షాకాలం కావడంతో వర్షం వల్ల రహదారి దెబ్బతిని నీటి మడుగులైనాయి. ఊటుకూరు - వావిళ్ళ లింక్‌రోడ్డు వేస్తుండగా ట్రిప్పర్లు కంకర, ఎర్రమట్టి తోలుతుండగా రహదారి గోతులమయమైంది. రోడ్డు నిర్మించడ మో లేక గుంటలు అయినా పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరగాలి

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరిగితే వస్తువుల కొనుగోలు విషయంలో సమస్యలుండవని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జడ్పీ సమావేశమందిరంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్మన్‌ మాట్లాడుతూ వస్తువుల ధర తక్కువగా ఉన్నదని కాకుండా, నాణ్యతను చూసి కొనుగోలు చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఇటువంటి ఆలోచనలు రావాలన్నారు. వస్తువుల కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధరలను, ఎక్స్‌పైరీ తేదీలను గుర్తించడం లేదన్నారు. వినియోగదారులు సరైన అవగాహక కలిగి, చైతన్యంతో వ్యాపారస్తులను నిలదీయాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క వినియోగదారునికి కొన్ని హక్కులుంటాయనీ, వీటి గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఇందు కోసమే జిల్లాలో 99 ఉన్నత పాఠశాలలోనూ, 5 కళాశాలలోనూ వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 వినియోగదారుల సంఘాలు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నట్లు వివరించారు. జడ్పీ సిఇఓ రామిరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడి పాతికేళ్లవుతున్నప్పటికీ, ఇంకా పలుచోట్ల వినియోగదారులు మోసపోతూనే ఉన్నారన్నారు. డిఎస్‌ఓ జ్వాలాప్రకాష్‌ మాట్లాడుతూ ప్రతి వినియోగదారులు తన ఆర్థిక జ్ఙానాన్ని పెంపొందించుకుంటూ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందేలా సరియైన విలువగల వస్తువులను పొందామా లేదా అని చూసుకోవాలని సూచించారు. వినియోగదారుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు జయరామరాజు మాట్లాడుతూ వినియోగదారుల చట్టంలో ఆరు హక్కులు పొందుపరచబడ్డాయనీ, వీటి సంరక్షణకు కోర్టులకురావడం కూడా జరిగిందన్నారు. అంతక్రితం ఇటీవల మరణించిన వినియోగదారుల సంఘ జిల్లా నేత జితేంద్రనాథ్‌బాబుకు కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర వినియోగదారుల సంఘ కార్యదర్శి కెవి సుబ్బారెడ్డి, జిల్లా ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శి ఎస్‌వి కృష్ణయ్య, డిఇఓ ఆంజనేయులు, డికెడబ్ల్యు కళాశాల అధ్యాపకురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

రోశయ్యా...ఇక చాలు దిగవయ్యా...!

గూడూరు, (మేజర్‌న్యూస్‌) : రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిస్థితి ఉద్రిక్తంగా మారి అగ్నిగుండంలా తయారైందనీ ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారనీ కావున గద్దె దిగి రాష్టప్రతి పాలన విధిస్తే పరిస్థితులు చక్కబడతాయని డిసిసి అధ్యక్షులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథిగృహం ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విషయమై చిదంబరం ప్రకటన వెలువడిన అనంతరం కోస్తాంధ్రలో జరిగిన ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో సంయమనంతో వివిధ మార్గాల్లో ఆందోళన నిర్వహించారన్నారు. అదే తదుపరి ప్రకటన వెలువడిన అనంతరం తెలంగాణ వాసులు ప్రారంభించిన ఉద్యమాలు శాంతియుతంగా గాకుండా హింసాత్మకంగా మారడంతో ప్రజలు భయాందోళనలను చెందుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షాత్తూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకే రక్షణ లేదు ఇక సామాన్య మానవుని పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మావోయిస్టులు కూడా తెలంగాణ జెఎసికి ప్రత్యక్షంగా మద్దతు తెలపడం మరికాస్త భయాందోళన కలిగిస్తోందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు ఎంతో నష్టపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ఏ విధమైన చర్యలూ లేకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లుందని ముఖ్యమంత్రి రోశయ్యను వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రించలేనందున గద్దె దిగి రాష్టప్రతి పాలన విధించడం ప్రజలకు శ్రేయస్కరమని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ యారం మంజుల, నెల్లూరు రమణారెడ్డి, కొణిదల మునిగిరీష్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, జమళ్ల వాసు తదితరులున్నారు.

కొత్తపట్నం ‘సెజ్‌’లో అవినీతి బాగోతం

కోట, (మేజర్‌న్యూస్‌) : కోట చిల్లకూరు మండలాల్లో ప్రత్యేక ఆర్ధిక మండళ్లు (సెజ్‌)కు సేకరించిన భూమికి పరిహారంలో బినామీల పేర్లతో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారిస్తున్న అధికారులను స్థానిక అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారులు, భూ స్వాములు కొందరు సాగించిన దుశ్చర్యలు వెలుగు చూస్తున్నా ఏమీ జరగలేదంటూ బుకాయిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి.అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం కొత్తపట్నం, తూర్పు కనుపూరు సెజ్‌ల్లో చోటు చేసుకున్న అవతకవకలపై దర్యాప్తు చేస్తుండగా కొందరు అక్రమార్కులు అవకతవకలు బయట రానీయకుండా ఉండేందుకు రాజీ యత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిసింది. సెజ్‌ల కోసం సుమారు 6 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే కొత్తపట్నం, కర్లపూడి, సిద్దవరం, తూర్పుకనుపూరు, వేళ్లపాళెం పరిధిలో సిజెఎఫ్‌ఎస్‌ భూములకు కూడా పరిహారం పంపిణీ చేసి ఉన్నారు. ఈ పంపిణీ చేసిన పరిహారంలో దాదాపు 5 కోట్ల రూపాయల మేర బినామి పేర్లతో అధికారులు, భూ స్వాములు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని పరిహారం చెల్లించిన దాదాపు 300 ఎకరాల్లో అసలైన పట్టాదారులు లేకపోవడంతో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మకై్క భాగాలు పంచుకున్నట్లు తెలిసింది. పట్టాదారులు లేకుండా తమ రెవెన్యూ లోని భూములకు సంబంధించిన పరిహారాన్ని పరులు పంచుకునే ప్రయత్నాలపై స్థానికులు తిరగబడ్డంతో అధికారులే దగ్గరుండి మధ్యస్తాలు జరిపి పంపకాలు నిర్ణయించడం విశేషం. సెజ్‌ కోసం సేకరించిన భూమికి ఎకరాకు 1 లక్షా 90 వేల రూపాయల పరిహారంలో గ్రామానికి 30 వేల రూపాయలు మాత్రం మిగిలింది. మిగిలిన మొత్తాన్ని అధికారులు, రాజకీయ నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొత్తపట్నం గ్రామానికి చెందిన రేషన్‌ షాపు డీలర్‌ వెంకటాద్రి, అధికారులు, స్థానిక నాయకులు తమ ఖాతాల్లో జమ చేసుకుని తరువాత గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. బినామీల చెల్లింపు విషయంలో బ్యాంకర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. యమదిన్నెపాళెం, గున్నంపడియ, పోసినవారిపాళెం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 595, 596, 597లలోని 19.62 ఎకరాలకు చెందిన పరిహారం దాదాపు 37 లక్షల రూపాయలు చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు స్వాహా చేశాడని తెలిసింది. 1963 ప్రాంతంలో అసైన్‌మెంట్‌ భూములను గిరిజనులైన గడ్డం పోలయ్య, గడ్డం రామయ్య, మానికల పోలయ్య, చింతపూడి సుబ్బయ్యలు పట్టాలు కలిగి ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా ఊర్లో లేకపోవడంతో బల్లవోలు గ్రామానికి చెందిన కొందరు గిరిజనులకు బ్యాంకులో వలలకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుండి సంతకాలు సేకరించి ఖాతాలు తెరిచారు. అనంతరం ఆ గిరిజన లబ్ధ్దిదారులు వీరే అని బ్యాంక్‌ అధికారులకు చూపి డబ్బులు డ్రా చేసి ఒక గిరిజనుడికి 1900 రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే చిల్లకూరు మండలం వేళ్లపాళెం గ్రామంలో మల్లిగుంట చిన్నయ్యకు చెందిన 260/1, 2, 262/1, 275/2 సర్వే నెంబర్ల లోని 4.53 ఎకరాల భూమికి పరిహారంగా 8 లక్షలా 60 వేల 760 రూపాయలు చెక్కు చిన్నయ్య పేరున రాగా సదరు వ్యక్తి దీర్ఘకాలంగా గ్రామంలో లేకపోవడంతో వారసులు కూడా అక్కడ లేకపోవడంతో బినామి వ్యక్తిని సృష్టించి ఆ పరిహారం మొత్తాన్ని బల్లవోలు రాజకీయ నాయకులు స్వాహా చేశారని తెలిసింది. పాలు గంగయ్య అనే వ్యక్తికి సర్వే నెంబరు 268/4లో 1.24 ఎకరాలు, 268/2లో 63 సెంట్లు 263/1లో 50 సెంట్లు భూమికి గాను దాదాపు 3 లక్షలా 80 వేల రూపాయలకు సంబంధించిన పరిహారం మొత్తాన్ని కూడా స్వాహా చేసినట్లు తెలిసింది. ఇలా ఎన్నో రకాలుగా అవకతవకలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా అధికారుల దృష్టికే ఈ అవకతవకలు వచ్చినా కూడా వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కాలం వెళ్లదీస్తుండడంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు నిజాయితీ కలిగిన అధికారులచేత సమగ్ర విచారణ జరిపిస్తే అసలు దోషులు బయటపడతారని స్థానికులు కోరుతున్నారు

Tuesday, December 22, 2009

భూస్వాముల చేతిలో ప్రభుత్వ భూమి

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో సుమారు 300 ఎకరాలు ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన భూస్వాములు ఆక్రమించుకున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు కెఆర్‌.దాసరి ఆధ్వర్యంలో బల్లవోలు గ్రామస్తులు సోమవారం గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో చాలా కాలం నుండి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది. ఈ భూమిని అదే గ్రామంలో నివసిస్తున్న హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతులకు ఇవ్వాలని కోరారు. గతంలో ఆక్రమణ విషయమై సంబంధిత తహసిల్దార్‌కు తెలపగా ఆయన తలారిచే దండోరా వేయించిని ఫలితం లేకపోగా ఆక్రమణ చేశారన్నారు. ప్రభుత్వ భూమిని నిరుపేదలైన తమకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామవరపు బాబు ఎం.వెంకారామయ్య, కె.ఏడుకొండలు, ఆర్‌ .శివయ్య, ఎం.చిరంజీవి, కె.ఆదినారాయణ, సి.సుబ్బయ్య, అమర్‌నాధ్‌ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం పనిని ఇప్పించండిబాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామంలో నివసిస్తూ గతంలో మధ్యాహ్న భోజన పథకం పనిని నిర్వహించిన ఎం. రాజేశ్వరికి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్‌ కార్యదర్శి ప్రజావిఙ్ఞప్తుల దినంలో జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు టైఫాయిడ్‌ జ్వరం వచ్చినందున ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిని, మండలాధికారిని అనుమతితో విశ్రాంతి తీసుకున్నామన్నారు. ఆ సమయంలో పొదుపులక్ష్మి నాయకురాలైన ఒక మహిళకు ఆ పనిని ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం తమ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని తమకు గతంలో తాము చేసిన పనిని ఇప్పించాలని కోరారు. కుటుంబాన్ని ఆదుకోండి గత ఆరు నెలల క్రితం విద్యుత్‌ వైర్లు తగిలి మృతి చెందిన రియాజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజింగ్‌ నగర అధ్యక్షులు ముజహిద్‌ సోమవారం గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. మృతి చెందిన కుటుంబం కూలి పని చేసుకుంటూ చాలీచాలని జీతంతో జరుగుబాటు కష్టంగా ఉందని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు.

జనవరిలో ప్రధానిచే బిహెచ్‌ఈఎల్‌ శంఖుస్థాపన:

వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:వచ్చే ఏడాది జనవరిలో భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌చే బిహెచ్‌ఈఎల్‌ కర్మాగారం శంకుస్థాపన జరుగుతుందని తిరుపతి ఎంపి డాచింతామోహన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీ నుండి స్థానిక విలేకరులకు సోమవారం సమాఛారం తెలిపారు. బిహెచ్‌ఈఎల్‌ కర్మాగారాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్ర్తి సమీపంలోని మన్నవరం వద్ద ఏర్పాటుచేస్తున్న ప్రాజెక్టుపై ఢిల్లీలో ప్రధానమంత్రిని కలువగా ఆయన సానుకూలంగా సమాధానమిచ్చారని, జనవరిలో తప్పక శంకుస్థాపన జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సమైక్యాంధ్ర కోసం రాష్టమ్రంతటా జరుగుతున్న పరిస్ధితులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నట్లు ఆయన వివరించారు

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు చెలిస్తాం:డిఇవో

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నం భోజన బిల్లులను మార్చి ఆఖరులోపు చెలిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు తెలిపారు. సోమవారం మండలంలోని నరసారెడ్డి కండ్రిగ పాఠశాలను తనిఖి చేసిన ఆయన ఆపాఠశాలలో మధ్యాహ్న భోజనంలో వివక్ష ఉందన్న విషయం సరికాదన్నారు. అక్కడున్న పిల్లలు, విద్యార్ధుల తల్లిదండ్రులను ఈ విషయమై ప్రశ్నించారు. ఈ సందర్భంగా విలేకర్లుతో మాట్లాడుతూ గత ఏడాదిగా మధ్యాహ్న భోజన పథకంకు నిర్వాహకులకు రూ5కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డిశంబర్‌1నుంచి బిల్లులు కూడా పెంచినట్లు తెలిపారు. అదే విధంగా 25మంది విద్యార్ధులు పై బడిన పాఠశాలలో అదనపు కుక్‌ కోసం రూ1000చెల్లించనున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు ఎంఇవో అజయ్‌కుమార్‌, ఎంఆర్‌పిలు శరత్‌, రజనీబాబు తదితరులున్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించం

వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:సోనియా గాంధీ రాష్ట్రాన్ని బర్తడే కేకులాగా ముక్కలు చేసే ప్రతిపాదనను మానుకోవాలని పుత్తూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడించారు. సోమవారం స్థానిక పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్ష వద్ద ఆయన పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ లాంటి కుహనా రాజకీయవాదికి భయపడి తెలంగాణాను ప్రకటించాలనుకోవడం అర్ధరహితమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేస్తే సోనియాగాంధీ తనంతట తానే దిగివచ్చి సమైక్యాంధ్రకే మద్దతు పలుకుతుందన్నారు. తెలంగాణాను వేరుపరిస్తే అక్కడవున్న నీటి వనరుల నుంచి ఒక బొట్టు కూడా నీరు కోస్తా, రాయలసీమలకు అందవని అన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా ఎడార్లుగా మారుతాయని చెప్పారు. టిడిపి బస్సు యాత్ర ఈనాడు సమైక్యాంధ్ర కోసం రాష్ట్రం యావత్తు జరుపుతుందన్నారు. ఆనాడు ఎన్టీరామారావు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం నిలబెడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 9ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ప్రపంచస్ధాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశారన్నారు. అలాంటి హైదరాబాద్‌ను దోచుకునే ప్రయత్నంలో కెసిఆర్‌ కుట్ర పన్నుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని వేరుచేసే విషయం ఆశామాషి కాదని, అలా చిన్నచిన్న ముక్కలైతే అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. కురుగొండ్ల చేపడుతున్న దీక్ష ఆయన ధైర్యానికి నిదర్శనం: మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి సమైక్యాంధ్ర నినాదంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గత మూడు రోజుల నుండి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆయన ధైర్యానికి నిదర్శనమని శ్రీకాళహస్ర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శిబిరం వద్ద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్న ప్రకటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ఆయన ఆరోపించారు. కెసిఆర్‌ దీక్షకు భయపడి కేంద్రహోం మంత్రి చిదంబరం ప్రకటన చేయడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర విషయంలో ఢిల్లీ పెద్దలను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఎంవిఎస్‌ గిరిజాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంముక్కలు చేయాలనుకోవడం సరైన చర్య కాదన్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం మాట్లాడుతూ ఇది ఒక తెలంగాణాకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, యావత్తు రాష్ట్రానికి సంబంధించిన విషయమని, రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి సమైక్యాంధ్ర నినాదానికే కేంద్రప్రభుత్వం మద్దతు పలకాలని కోరారు. కురుగొండ్లకు సంఘీభావం ప్రకటించిన పలువురు నాయకులు:స్ధానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మూడురోజులుగా చేపడుతున్న ఆమరణ నిరాహారదీక్షలకు పలువురు జిల్లా, మండలస్థాయి నాయకులు సోమవారం తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ విద్యాసంస్ధల అధినేత వంకి పెంచలయ్య, జిఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ అధినేత గంగోటి నాగేశ్వరరావు, గూడూరు- వెంకటగిరి నాయకులు, స్ధానిక పాన్‌బ్రోకర్స్‌ అసోసియేషన్‌, నాయిబ్రహ్మణ అసోసియేషన్‌ ర్యాలీగా మంగళవాయిద్యాలతో వచ్చి వారు ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటించి సమైక్యాంధ్ర నినాదం చేశారు.

సాహిత్య రంగంలో వర్థమాన సమాజం ఆదర్శం

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:సింహపురిలో సాహిత్య సేవా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన శ్రీ నెల్లూరు వర్థమాన సమాజం నేటికీ ఆదర్శమని విక్రమసింహపురి వైస్‌ చాన్సలర్‌ సి.విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన శ్రీ నెల్లూరు వర్థమాన సమాజం శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ బెజవాడ గోపాలరెడ్డి, మరుపూరు కోదండరామిరెడ్డి, దువ్వూరు రామిరెడ్డి తదితర సాహిత్య ఉద్దండులు వర్థమాన సమాజం ద్వారా సింహపురి నగరానికి ఎనలేని కీర్తిని ఆపాదించారని అన్నారు. తెలుగు సాహిత్య రంగంలో వర్థమాన సమాజం ఒక ప్రత్యేక ఒరవడిని రూపొందించుకుని వందేళ్లకు పైగా సేవలందించడం ఆదర్శమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా సెషన్స్‌ జడ్జి గణేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ 45 వేల గ్రంధాలతో ఇన్నేళ్లుగా సాహిత్య సేవలు అందించడం విశేషమని అన్నారు. భావితరాలకు సాహిత్య సేవలను అందించడానికి వర్థమాన సమాజం దినదిన ప్రవర్థమానం చెందాలని ఆకాంక్షించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న మైసూర్‌ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు శ్రీమద్భగవద్గీతను ప్రేక్షకులకు వివరించారు. అనంతరం వర్థమాన సమాజం సభ్యులు ఆయనను సన్మానించారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు అతిధులు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్థమాన సమాజం అధ్యక్షులు మలుచూరు ధర్మారెడ్డి, కార్యదర్శి మజ్జిగ ప్రభాకర్‌రెడ్డి, పురమందిర ప్రతినిధి పొన్నాల రామసుబ్బారెడ్డి, బివి.నరసింహం ఎం.బలరామనాయుడు, సుభద్రాదేవి, సాహిత్య ప్రియులు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్థారణల వల్లే స్ర్తీ, శిశు మరణాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:గర్భిణీ స్ర్తీలు ముందుగానే వివిధ వైద్యశాలలకు వెళ్లి స్కానింగ్‌ ద్వారా ఆడ, మగ లింగ నిర్థారణ తెలుసుకుంటున్నందువల్లే స్ర్తీ, శిశు మరణాలు సంభవిస్తున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటరమణారెడ్డి తెలిపారు. గర్భిణీ స్ర్తీ, శిశు మరణాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో లింగ నిర్థారణ కమిటీ (పిఎన్‌డిటి) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్‌ ద్వారా పుట్టబోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్‌ చేయించుకోవడం పరిపాటైందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియపై వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లో తగిన విధంగా తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.స్ర్తీ,శిశు మరణాలు జరగకుండా అంగన్‌వాడీ, ఆశ వాలెంటీర్లతో అవగాహన సదస్సులు నిర్వహించి వారి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సుల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. నాలుగు లేదా ఐదు మాసాలు పూర్తయిన గర్భిణీ స్ర్తీలు ఎవరైనా స్కానింగ్‌ తీసుకుని ఉంటే అలాంటి వివరాలను సేకరించాలన్నారు. దీనిపై ప్రధానంగా డివిజన్‌ స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి దీనికనుగుణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి డాక్టర్‌ రోగులకిచ్చే మందుల చీటీపై ఖచ్చితంగా లింగ నిర్ధారణ నిషిద్ధమని విధిగా ముద్రించాలన్నారు.సాధారణంగా పరిసర ప్రాంతాల్లో మురుగునీరు, గృహాలలో పూలకుండీల వద్ద నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై చికున్‌గున్యా తదితర విషజ్వరాలు సోకే ప్రమాదముందని, అందువల్ల గృహాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చన్నారు. దీనిపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు వైద్యాధికారులు, మున్సిపల్‌ శాఖాధికారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు ఇవిఎస్‌.నాయుడు, అదనపు పిపి అయ్యప్పరెడ్డి, న్యాయవాది రమణమ్మ, మెటర్నిటీ వైద్యశాల ఆర్‌ఎంఒ డాక్టర్‌ తిరుపాల్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, డిపిఆర్‌ఒ జెయుకె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మతాలు ఉద్యానవనంలో పుష్పాలు

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:ప్రపంచమనే ఉద్యానవనంలో మతాలు పుష్పాలని కరుణామయి విజయేశ్వరీదేవి అభివర్ణించారు. ఆదివారం నగరంలోని విఆర్‌.కళాశాల మైదానంలో నిర్వహించిన విజయోత్సవ అభినందన సభలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలన్నీ శాంతిని కాంక్షిస్తాయని అన్నారు. పుష్పాలు వేరైనప్పటికీ సౌరభం వాటి లక్షణమని, అలాగే మతాలు మానవాళి శ్రేయస్సు కోసమేనని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోన్‌ నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కరుణామయి విజయేశ్వరిదేవి తన అనుభవాలు గూర్చి భక్తులకు వెల్లడించారు.ప్రపంచ దేశాల్లో ప్రస్తుతమున్న సమస్యలను, అలజడులను మతం ద్వారా వాటిని పరిష్కరించడానికి ఉపయోగపడే అనేక అంశాలను ఆమె వివరించారు. గ్రామస్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు శాంతియుత సహజీవనం చేయడానికి ఐకమత్యం అవసరమని ఆమె ఉద్బోధించారు. చదువు ద్వారా దేశంలో అభివృద్ధిని సాధించవచ్చునన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకున్న గొప్ప పేరును ప్రపంచ వ్యాప్తంగా పలు మత గురువుల అభిప్రాయలను ఆమె విశదీకరించారు. సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చడానికి, నివాసం కల్పించడానికి ఆధ్యాత్మిక చింతన పెంపొందించి మానవాళిలో అశాంతిని తొలగించడానికి తాను అన్ని విధాలా కృషి చేస్తున్నానని తెలిపారు. భగవంతుడు తనకిచ్చిన స్థానం ద్వారా సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఆసుపత్రులను, పాఠశాలలను, వృద్ధాశ్రమాలను, యోగా కేంద్రాలను, వేద పాఠశాలలను నిర్వహిస్తున్నామన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఏకైక ఆధ్యాత్మి కేంద్రం శ్రీమాతృదేవి విశ్వశాంతి ఆశ్రమమని అన్నారు. తాను పర్యటించిన 20 దేశాల్లో పాశ్యాత్యులను సైతం ప్రభావితం చేసిన భారతజాతి ఔన్నత్యాన్ని ప్రజలు పరిరక్షించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముర ళీకృష్ణ 70 అధినేత వీరిశెట్టి హజరత్‌బాబు, కళాబంధు కొండా బలరామిరెడ్డి, సేవారత్న ఒమ్మిన సుబ్రహ్మణ్యం, తెలుగు సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఎన్‌.బలరామయ్యనాయుడు, విద్యాదాత ఆనందరావు, కాంగ్రెస్‌ నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కావలి కోటారెడ్డి, కవి ఆలూరు శిరోమణి శర్మ, తల్పగిరి ఆలయ ఛైర్మన్‌ పత్తి రవీంద్రబాబు తదితర పుర ప్రముఖులు వేద మంత్రోచ్ఛారణల నడుమ విజయేశ్వరిదేవిని ఘనంగా సన్మానించారు. సభాసింమం బివి.నరసింహం వ్యాఖ్యానం అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన కరుణామయి భక్తులతోపాటు భారీ సంఖ్యలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.

నగరంలో తీవ్రమవుతున్న చికున్‌గున్యా జ్వరాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:ఓ వైపు నగరపాలక సంస్థ, మరో వైపు వైద్య ఆరోగ్య శాఖలు దోమల నివారణకు తీవ్రంగా చర్యలు చేపడుతున్నా, మీ చర్యలు తమనేమీ చేయలేవంటూ నగరంలో దోమలు నిరాటంకంగా తమ పని తాము చేసుకుంటున్నాయి. ఫలితంగా చికున్‌గున్యా, డెంగ్యూ తదితర విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చికున్‌గున్యా బాధితులైతే తమ ఇళ్లలోనే ఉండి నానా అవస్థలు పడుతుండగా డెంగ్యూ బాధితులు చెనై్న నగరాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చెనై్న నగరంలోని జనరల్‌ హాస్పిటల్‌, విజయ, అపోలో, కంచికామకోటి ట్రస్ట్‌ తదితర వైద్యశాలలు నెల్లూరు జిల్లాకు చెందిన వందలాదిమంది రోగులతో కిటకిటలాడుతున్నట్లు సమాచారం.అంతేకాకుండా నగరంలోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల, నారాయణ, బొల్లినేని, జయభారత్‌, నెల్లూరు వైద్యశాల, జిల్లా ప్రభుత్వ వైద్యశాలలతోపాటు అనేక నర్సింగ్‌ హోమ్‌లు విషజ్వరాలతో బాధపడుతుండేవారితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక జూబ్లీ వైద్యశాల (మెటర్నిటీ) మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీతాలక్ష్మి గత నాలుగైదు రోజులుగా చికున్‌గున్యా వ్యాధితో బాధ పడుతున్నారు. జూబ్లీ వైద్యశాల సమీపంలోనే ఎసి.కూరగాయల మార్కెట్‌ ఉండడంతో ఆ ప్రాంతంలో కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వ్యర్థ పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉండ డం, ఇటీవల వర్షాలు కురవడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధమై వాసనతో భయంకరంగా తయారైంది. సమీపంలోనే బాలికల హాస్టల్‌ ఉండడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన జూబ్లీ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీతాలక్ష్మి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషయాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఆ హాస్టల్‌ను సందర్శించి దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సైతం ఆదేశించారు.నగరంలో దోమల పెరుగుదల కారణంగా చిన్న, పెద్ద, స్ర్తీ, పురుష వంటి తేడాలు లేకుండా నగరవాసులు విషజ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగానపడ్డ ప్రజలను తమ వైద్యసేవలతో బాగుచేసే వైద్యులు సైతం ఈ వ్యాధుల బారిన పడుతుండడం విశేషం. పైగా విషజ్వరాల వల్ల రోగులకు ప్లేట్‌లెట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుండడంతో అందుకు అవసరమైన రక్తాన్ని ఇస్తుండే దాతలు సైతం చికున్‌గున్యా బారినపడి మంచాన పడుతుండడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషజ్వరాలను తీవ్రంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Monday, December 21, 2009

ట్రాక్‌పై విద్రోహ చర్యకు యత్నం

కావలి రూరల్‌, మేజర్‌న్యూస్‌: పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు ఉత్తరాన ట్రాక్‌కు అమర్చిన క్లిప్పింగ్‌లు దుండగులు శుక్రవారం రాత్రి తొలగించి విద్రోహ చర్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నెల్లూరు రైల్వే డిఎస్పీ భాస్కర్‌నాయుడు, ఇన్‌స్పెక్టర్‌ విజయకుమార్‌ల ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి ట్రాక్‌మెన్‌ బి కొండయ్య స్టేషన్‌ నుంచి మొదటి దఫా రౌండ్‌కు చెకింగ్‌కు వెళ్లాడు. కావలికి ఉత్తరం వైపు ఊరి చివరన ఐదుమంది గుర్తు తెలియని దుండగులు ట్రాక్‌కు అమర్చిన క్లిప్పింగ్‌లను తొలగించడాన్ని గమనించి వారి వద్దకు వెళ్లాడు. ఎందుకు తొలగిస్తున్నారని ట్రాక్‌మెన్‌ అడగడంతో అతనిపై దాడి చేశారు.222/5/3కి.మీ వద్ద చెనై్న వైపు వెళ్లే అప్‌లైన్‌ నుంచి 13క్లిప్పింగ్‌లను తొలగించి అపహరించారు. అనంతరం కొండయ్య విషయాన్ని హుటాహుటినా స్థానిక రైల్వే పోలీసులకు సమాచారమందించారు. లైన్‌కు నూతన క్లిప్పింగ్‌లను అమర్చి ముప్పు నుంచి తప్పించినట్లు పోలీసులు తెలిపారు. క్లిప్పింగ్‌లను అపహరించాలనుకుంటే అవి దుండగులకు ఎక్కడయినా దొరుకుతాయన్నారు. కానీ పథకం ప్రకారమే పట్టాలకు ఉన్న క్లిప్పింగ్‌లను తొలగించి రైలు ప్రమాదాలు చేసేందుకే వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్లే విద్రోహ చర్యను భగ్నం చేసినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వారితోపాటు బిట్రగుంట రైల్వే ఎసై్స సత్తార్‌, సిబ్బంది ఉన్నారు.

కొనసాగుతున్న ఉద్యమాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా సమైక్య ఆంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సీనియర్‌ కాంగ్రెస్‌నేత, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నగరంలో పర్యటించి అన్ని పార్టీలకు చెందిన శిబిరాలను సందర్శించి మద్దతు ప్రకటించారు. రాష్ట్రం ముక్కలు కాబోదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీలు ఉద్యమ కార్యక్రమాలను కొనసాగించాయి. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆమరదీక్షకు శ్రీకారం చుట్టారు. జనజీవనానికి ఇబ్బందికలగని రీతిలో వివిధ పార్టీలో ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. దుకాణాలబంద్‌, రాస్తారోకోలు, విద్యాసంస్థల మూసివేత వంటి ఉద్యమాలకు దూరంగా ఉండటంతో జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. ఉద్యమాలు కూడా పూర్తి శాంతియుతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటుచేశారు. నెల్లూరు నగరంలో రాజీవ్‌గాంధీభవన్‌ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద ఆటోలను రివర్స్‌గేర్‌లో నడిపించి నిరసన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆమరణదీక్ష చేపట్టడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.సమైక్య ఆంధ్ర ప్రకటన చేసే వరకూ నిరాహారదీక్షను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరులలో నిరాహార దీక్షా శిబిరాలు కొనసాగాయి. గూడూరులో కాంగ్రెస్‌ నాయకుడు పనబాక కృష్ణయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. నెల్లూరు గాంధీబొమ్మ వద్ద మైనారిటీ నేతలు, నాయుడుపేటలో మహిళలు, కావలిలో విద్యార్థులు నిరాహారదీక్షలో పొల్గొన్నారు.

దట్టంగా కమ్మిన పొగమంచు-అవస్థల్లో వాహన చోదకులు

పెళ్లకూరు, మేజర్‌న్యూస్‌: మండలంలోని పూతలపట్టు జాతీయరహదారిపై శనివారం ఉదయం 8గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా పొగమంచు కారణంగా కనిపించని పరిస్థితి ఏర్పడంది. దీంతో ఎక్కడ ప్రమాదాలు సంభవిస్తాయని వాహన చోదకులు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వచ్చింది. కొన్ని చోట్ల రహదారిపై ఈ మంచు కారణంగా వాహనాలను నిలిపివేయగా మంచు కారణంగా పెన్నేపల్లి సమీపంలో లారీ, ఆటో డీ కొన్నాయి. గ్రామాలలోని ప్రజలు దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 8గంటల వరకు ఇళ్లలోనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

బాల్యం బందీ - సంక్షేమం ఖైదీ

ఇందుకూరుపేట, మేజర్‌న్యూస్‌:అంచనాలకు అందని రీతిలో పశువులశాలను తలపించే ఓ రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ ప్రభుత్వ వసతి గృహంలో భావిభారత పౌరులు బాధామయ జీవితాన్ని గడుపుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన వసతి గృహాలు వారి పాలిట బందిఖానాలుగా మారాయనేందుకు ఆ హాస్టల్‌ దర్పణం పడుతోంది.గాలి, వెలుతురు సరిగా సోకని రేకుల షెడ్లు, శిథిలావస్థకు చేరి నేడో రేపో కూలే స్థితిలోవున్న ఇరుకైన పురాతన అద్దె భవనాలు అపురూపమైన బాల్యం ఇక్కడ బందీగా మారిపోయింది. అన్నెం పున్నెం, ప్రపంచ ఙ్ఞానం తెలియని ఆ చిన్నారులు ఏంపాపం చేశారని వారికీ శిక్ష విధించారు. ఎంత తరచి చూసినా ఓ పట్టాన బోధపడటంలేదు. బాల నేరస్తులకందించే సౌకర్యాలు సైతం ఈ బాలురకు కల్పించడంలేదంటే అతిశయోక్తి కాదు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల జైలును తలపించే ఆ వసతి గృహం అడ్రసు కోల్పోతోంది. జిల్లా సాంఘిక సంక్షేమశాఖకే తలవంపులు తెస్తూ జైలును తలపించే ఈ హాస్టల్‌ మండల కేంద్రమైన ఇందుకూరుపేట ఎంకెఆర్‌ హైస్కూల్‌ వెనుకభాగంలో దర్శనమిస్తోంది. ఆ భవనంలోని చీకటి గదుల్లో సంక్షేమం ఖైదీగా మారింది. బాలుర హాస్టల్‌ కోసం అర్థశతాబ్దం కిందట నిర్మించిన ఈ రేకుల షెడ్డులో వసతుల ప్రసక్తి ఎత్తడం పొరపాటే అవుతుంది. నెలకు సుమారు మూడువేల రూపాయల వంతున ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్న ఈ భవనంలో మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేనేలేవు.విద్యార్థుల కాలకృత్యాలన్నీ ఆరుబయటే. ఒకేఒక పెద్ద హాలు, వరండాలోనే వంద మంది వరకు విద్యార్థులు సర్దుకోవాల్సిందే. భవనంలోని మూడు గదుల్లో ఒకదానిని వంట కోసం, మరోదానిని స్టోర్‌రూంగా, ఇంకోగదిని ఆఫీస్‌గా ఉపయోగిస్తున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ హాస్టల్‌ భవనానికి చుట్టూ ప్రహరీ కూడా లేదు. తలుపులు, కిటికీలు అంతంత మాత్రమే. వర్షం వస్తే భవనంలో కురవని ప్రదేశమే లేదు. వసతిగృహం పరిసరాలను మహిళలు బహిర్భూమిగా ఉపయోగిస్తుంటారు. హాస్టల్‌కు ఒకవైపు దట్టంగా పెరిగిన కంపచెట్లు, మరోవైపు పొలాలు ఉండడంతో విషసర్పాల బెడద ఎక్కువగా ఉంది. ఏళ్లతరబడి చిన్నారులు బందిఖానాలోనే మగ్గుతున్నప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడంలేదు.

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని రాస్తారోకో

గాంధారి , మేజర్‌న్యూస్‌:ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తు శనివారం గాంధారిలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు టిఆర్‌ఎస్‌ నాయకులు ముకుందర్‌రావు, సత్యం, సాయిలు, దీలీప్‌రావు, భాస్కర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh