Monday, December 21, 2009
దట్టంగా కమ్మిన పొగమంచు-అవస్థల్లో వాహన చోదకులు
పెళ్లకూరు, మేజర్‌న్యూస్: మండలంలోని పూతలపట్టు జాతీయరహదారిపై శనివారం ఉదయం 8గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా పొగమంచు కారణంగా కనిపించని పరిస్థితి ఏర్పడంది. దీంతో ఎక్కడ ప్రమాదాలు సంభవిస్తాయని వాహన చోదకులు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వచ్చింది. కొన్ని చోట్ల రహదారిపై ఈ మంచు కారణంగా వాహనాలను నిలిపివేయగా మంచు కారణంగా పెన్నేపల్లి సమీపంలో లారీ, ఆటో డీ కొన్నాయి. గ్రామాలలోని ప్రజలు దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 8గంటల వరకు ఇళ్లలోనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment