Tuesday, December 22, 2009
లింగ నిర్థారణల వల్లే స్ర్తీ, శిశు మరణాలు
నెల్లూరు, మేజర్‌న్యూస్:గర్భిణీ స్ర్తీలు ముందుగానే వివిధ వైద్యశాలలకు వెళ్లి స్కానింగ్ ద్వారా ఆడ, మగ లింగ నిర్థారణ తెలుసుకుంటున్నందువల్లే స్ర్తీ, శిశు మరణాలు సంభవిస్తున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటరమణారెడ్డి తెలిపారు. గర్భిణీ స్ర్తీ, శిశు మరణాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో లింగ నిర్థారణ కమిటీ (పిఎన్‌డిటి) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ ద్వారా పుట్టబోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించుకోవడం పరిపాటైందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియపై వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లో తగిన విధంగా తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.స్ర్తీ,శిశు మరణాలు జరగకుండా అంగన్‌వాడీ, ఆశ వాలెంటీర్లతో అవగాహన సదస్సులు నిర్వహించి వారి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సుల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. నాలుగు లేదా ఐదు మాసాలు పూర్తయిన గర్భిణీ స్ర్తీలు ఎవరైనా స్కానింగ్ తీసుకుని ఉంటే అలాంటి వివరాలను సేకరించాలన్నారు. దీనిపై ప్రధానంగా డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి దీనికనుగుణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి డాక్టర్ రోగులకిచ్చే మందుల చీటీపై ఖచ్చితంగా లింగ నిర్ధారణ నిషిద్ధమని విధిగా ముద్రించాలన్నారు.సాధారణంగా పరిసర ప్రాంతాల్లో మురుగునీరు, గృహాలలో పూలకుండీల వద్ద నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై చికున్‌గున్యా తదితర విషజ్వరాలు సోకే ప్రమాదముందని, అందువల్ల గృహాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చన్నారు. దీనిపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు వైద్యాధికారులు, మున్సిపల్ శాఖాధికారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు ఇవిఎస్.నాయుడు, అదనపు పిపి అయ్యప్పరెడ్డి, న్యాయవాది రమణమ్మ, మెటర్నిటీ వైద్యశాల ఆర్‌ఎంఒ డాక్టర్ తిరుపాల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జయసింహ, డిపిఆర్‌ఒ జెయుకె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment