Friday, December 25, 2009
రోశయ్యా...ఇక చాలు దిగవయ్యా...!
గూడూరు, (మేజర్‌న్యూస్) : రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిస్థితి ఉద్రిక్తంగా మారి అగ్నిగుండంలా తయారైందనీ ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారనీ కావున గద్దె దిగి రాష్టప్రతి పాలన విధిస్తే పరిస్థితులు చక్కబడతాయని డిసిసి అధ్యక్షులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహం ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విషయమై చిదంబరం ప్రకటన వెలువడిన అనంతరం కోస్తాంధ్రలో జరిగిన ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో సంయమనంతో వివిధ మార్గాల్లో ఆందోళన నిర్వహించారన్నారు. అదే తదుపరి ప్రకటన వెలువడిన అనంతరం తెలంగాణ వాసులు ప్రారంభించిన ఉద్యమాలు శాంతియుతంగా గాకుండా హింసాత్మకంగా మారడంతో ప్రజలు భయాందోళనలను చెందుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షాత్తూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకే రక్షణ లేదు ఇక సామాన్య మానవుని పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మావోయిస్టులు కూడా తెలంగాణ జెఎసికి ప్రత్యక్షంగా మద్దతు తెలపడం మరికాస్త భయాందోళన కలిగిస్తోందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఎంతో నష్టపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ఏ విధమైన చర్యలూ లేకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లుందని ముఖ్యమంత్రి రోశయ్యను వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రించలేనందున గద్దె దిగి రాష్టప్రతి పాలన విధించడం ప్రజలకు శ్రేయస్కరమని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ యారం మంజుల, నెల్లూరు రమణారెడ్డి, కొణిదల మునిగిరీష్, మున్సిపల్ కౌన్సిలర్లు నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, జమళ్ల వాసు తదితరులున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment