Monday, December 21, 2009
కొనసాగుతున్న ఉద్యమాలు
నెల్లూరు, మేజర్‌న్యూస్ ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా సమైక్య ఆంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సీనియర్ కాంగ్రెస్‌నేత, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నగరంలో పర్యటించి అన్ని పార్టీలకు చెందిన శిబిరాలను సందర్శించి మద్దతు ప్రకటించారు. రాష్ట్రం ముక్కలు కాబోదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు ఉద్యమ కార్యక్రమాలను కొనసాగించాయి. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆమరదీక్షకు శ్రీకారం చుట్టారు. జనజీవనానికి ఇబ్బందికలగని రీతిలో వివిధ పార్టీలో ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. దుకాణాలబంద్, రాస్తారోకోలు, విద్యాసంస్థల మూసివేత వంటి ఉద్యమాలకు దూరంగా ఉండటంతో జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. ఉద్యమాలు కూడా పూర్తి శాంతియుతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటుచేశారు. నెల్లూరు నగరంలో రాజీవ్‌గాంధీభవన్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద ఆటోలను రివర్స్‌గేర్‌లో నడిపించి నిరసన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆమరణదీక్ష చేపట్టడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.సమైక్య ఆంధ్ర ప్రకటన చేసే వరకూ నిరాహారదీక్షను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరులలో నిరాహార దీక్షా శిబిరాలు కొనసాగాయి. గూడూరులో కాంగ్రెస్ నాయకుడు పనబాక కృష్ణయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. నెల్లూరు గాంధీబొమ్మ వద్ద మైనారిటీ నేతలు, నాయుడుపేటలో మహిళలు, కావలిలో విద్యార్థులు నిరాహారదీక్షలో పొల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment