online marketing

Saturday, March 17, 2012

Lagadapti survey In Kovur assembly constituency, YSR Congress party candidate would emerge victorious?


As seven assembly constituencies in the state go to the polls on Sunday, everyone is curious about what Congress MP from Vijayawada Lagadapati Rajagopal has to say about the election results.

Sources said the survey commissioned by Lagadapati predicted that Congress would not even a single seat in elections.

While the TRS would win five seats, the independent candidate supported by Nagam Janardhan Reddy TRS would win the seat Nagarkurnool. In Kovur Constituent Assembly, the Congress Party YSR victorious candidate, citing sources according to the survey.

What is worse, according to the survey, the Congress party would end up third, except in two seats - Kollapur and Mahbubnagar, where he had fielded candidates P Vishnuvardhan Reddy and hard Muthyala Prakash. In the five remaining seats, the TDP would set up an impressive performance against the Congress and would retain its deposit.

The greatest victory is that of Nagam Janardhan Reddy and lowest margin would be that of TRS candidate Ibrahim in Mahbubnagar district. In other districts, too, the majority TRS would not be too high, but would be comfortable, sources added.


YSRCP leader Jagan political feature depending on the kovur by election results


నెల్లూరు: అందరి కళ్లూ కోవూరు నియోజకవర్గంపైనే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక కావడం వల్లనే కోవూరుపై ఆసక్తి నెలకొని ఉంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్ట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు బరిలో ఉన్నా వారిద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రసన్నకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తాయా అనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ, వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానం ముందు వైయస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టుకుపోతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. పైగా, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయి జగన్‌ను వేధిస్తున్నాయనే అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా ఉందని వారంటున్నారు.

అయితే, తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన మరో విధంగా ఉంది. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తున్నారని, డిఎంకె, బిఎస్పీలను ప్రజలు తిరస్కరించడమే ఇందుకు ఉదాహరణ అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిస్తే రానున్న 17 స్థానాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊపు వస్తుంది. ఈ ఫలితాన్ని బట్టి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుందని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశేతర రాష్ట్రాల నాయకులు కూడా కోవూరు ఫలితాల కోసం, తెలంగాణలోని ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం జాతీయ స్థాయిలో ఏర్పడబోయే జాతీయ స్థాయిలో ఏర్పడబోయే తృతీయ కూటమిపై కూడా ఉంటుందని అంటున్నారు. అందుకే, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డుతోంది.

కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అయితే, కోవూరు మాత్రం జగన్‌ రాజకీయాలకే అగ్ని పరీక్ష పెడుతుంది.

YSRCP leader Jagan life and death problem that do not win the kovur by elections


కోవూరు ఉప ఎన్నిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఒక్క స్థానం.. వ్యక్తిగతంగా జగన్‌కే కాకుండా, ఆయన పార్టీ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో ఐదింట తెలంగాణ వాదం పేరిట అభ్యర్థులను పోటీకి దించని జగన్ పార్టీ, శాసనసభ్యుడి మృతితో ఖాళీ అయిన మహబూబ్‌నగర్‌లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలంగాణలో రాబోయే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. ఇదంతా జగన్ పార్టీ వేసిన ఎత్తుగడగా ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు టీడీపీకి రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థిగా కోవూరు నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించుకోవటం ఇప్పుడు జగన్‌కు అనివార్యంగా మారింది. పైగా ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో తాము పోటీ చేస్తున్న ఒకే ఒక్క స్థానం కోవూరే కావటంతో దానిని కూడా గెల్చుకోలేకపోతే.. పరువు పోతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దీంతో జగన్ పార్టీ శ్రేణులన్నీ అక్కడే మోహరించాయి.

జగన్ స్వయంగా కోవూరులో వారానికిపైగా ప్రచారం చేశారు. కోవూరు ఉప ఎన్నికను జగన్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించటానికి, కడప ఉప ఎన్నికల తర్వాత చట్ట సభలకు సంబంధించి ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే కావటం కూడా ఒక కారణం. జగన్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కోవూరులో ప్రసన్న గెలుపుతో పాటు, ఆయన సాధించే మెజారిటీ కూడా ముఖ్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కోవూరులో ప్రసన్న ఓడిపోతే ఒక రకంగా జగన్‌తో పాటు, ఆయన పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ప్రసన్న గెలిచి, మెజారిటీ తక్కువగా వచ్చినా జగన్ పార్టీకి ఇబ్బందికరమేనని చెబుతున్నారు. అప్పుడు జగన్‌కు కడపలో తప్ప మిగిలిన చోట్ల పట్టులేదనే ప్రచారం సహజంగానే తెరపైకి వస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జగన్‌కు వ్యతిరేకంగా మరింత క్రియాశీలకమవుతాయి. ఇది త్వరలో 17 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవూరు ఉప ఎన్నిక జగన్‌కి, ఆయన పార్టీకి 'చావో రేవో' అన్నట్లుగా మారింది

Kovur by election polling today


కోవూరు : ఎప్పుడెప్పుడు ఎన్నిక జరుగుతుందోనని ఎదురుచూస్తున్న నాయకులు, ప్రజలు కోవూరు నియోజకవర్గంలో నేడు జరుగుతున్న ఉప ఎన్నికకు ఊపిరి పీల్చుకోనున్నారు. నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఎన్నిక జరుగనుంది. ఇందుకూరుపేట మండలంలో పురుషులు 19,690, మహిళలు 20,615, బుచ్చి మండలంలో పురుషులు 25,222, మహిళలు 26,910, కోవూరు మండలంలో పురుషులు 23,624, మహిళలు 25,633, కొడవలూరు మండలంలో పురుషులు 15,702, మహిళలు 16,952, విడవలూరు మండలంలో పురుషులు 16,279, మహిళలు 17,553 మంది, మొత్తం నియోజకవర్గంలో 2,08,180 మంది ఓటర్లు ఆదివారం తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటుహక్కును వినియోగించు కోవచ్చు.

నియోజకవర్గంలోని 255 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహణ నిమిత్తం ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరు కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మైక్రో అబ్జర్వర్‌లుగా విధులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ సిస్టమ్‌లో బిఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాప్‌ట్యాప్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా అభ్యర్థి ఓటింగ్‌ విధానం, అక్కడ జరుగుతున్న వాయిస్‌ రికార్డింగ్‌ను వెబ్‌ కెమెరా ద్వారా కవరింగ్‌ చేయనున్నట్లు, దీనికి ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు విధుల్లో కొనసాగనున్నట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలిపారు.

Friday, March 16, 2012

పిల్లలు పుట్టలేదన్న అక్కసుతో నమ్మించి అడవికి తీసుకువెళ్లి భార్యను హతమార్చాడు


డక్కిలి : కడదాకా తోడుంటానని మూడు ముళ్లు వేసిన చేతులో ఆమె గొంతును నులిమేశాయి. పిల్లలు పుట్టలేదన్న అక్కసుతో నమ్మించి అడవికి తీసుకువెళ్లి భార్యను హతమార్చాడు. డక్కిలి మండలం సం గనపల్లెలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంగనపల్లికి చెం దిన తూమాటి రమణయ్య సైదాపురం మండలం అనంతమడుగు దళితవాడకు చెందిన కృష్ణమ్మను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొంతకాలంగా గొడవపడేవారు. రెండేళ్ల క్రితం నెల్లూరులోని ఓ రైస్‌మిల్లు లో పని చేస్తూ కాపురం అక్కడకు మా ర్చారు.

వారం రోజుల క్రితం సంగనపల్లికి చేరుకున్న దంపతులు పిల్లలు పుట్టలేదనే విషయమై గొడవపడినట్లు స మాచారం. ఇదేవిషయమై గతంలోను గొడవ జరగడంతో కృష్ణమ్మ పుట్టినింటికి వెళ్లడం, పెద్దల పంచాయితీతో తిరిగి కాపురానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తీర్థంపాడులోని బంధువుల ఇంటికి వారు వెళ్లరు. ఇదే అవకాశంగా భావించిన రమణయ్య కృష్ణమ్మను సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను గొం తు నులిమి హతమార్చాడు. తర్వాత గ్రామానికి చేరుకున్న రమణయ్య తన భార్య కనిపించడం లేదంటూ బంధువు లతో కలిసి గాలించాడు.

సాయంత్రం గ్రామం విడిచి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పశువుల కాపర్లు కృష్ణమ్మ శవమై ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు తెలిపారు. సమాచారం అందుకున్న రాపూరు సీఐ అబ్దుల్‌కరీం, ఎస్ఐ వెంకట్రావ్ సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించి, ఎస్సై కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలంలో మృతదేహం పడిఉన్నతీరును బట్టి రమణయ్యే హత్య చేసిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

21 రోజుల ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం 5 గంటలతో ముగిసింది

ఒరేయ్‌...నిద్ర లేరా... అబ్బాయ్‌, ఉండయ్యా అలసిపోయాను... ఒరేయ్‌ లేటైతే డబ్బులు పోతాయ్‌రా... నా మాట విని త్వరగా లెయ్‌రా... (ఇది తండ్రీ కొడుకుల సంభాషణ). ఏమయ్యా... ఈ రోజు పని లేదా? నీకేమైంది.. రెండు రోజుల నుంచి మందంగా ఉన్నావ్‌... అబ్బా విసుగు పెట్టబాకే..కూలీ నాలి లేదు...చేతిలో చిల్లిగవ్వ లేదు... ఇల్లు గడవడమెట్లా... అని ఆలోచిస్తున్నాను. (ఇది భార్యభర్తల సంభాషణ). ఒరే ఫ్రండ్‌... పోలింగ్‌ డే దగ్గర పడుతుందిరా... ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటున్నవారికి ఒక్కో పార్టీవారు ఒక్కో రేటు ఇస్తున్నట్లు తెలిసిందిరా... త్వరగా బయలుదేరుదాం పదా.. లేటైతే నగదు మిస్సే. (ఇవి నిరుద్యోగ యువకుల మాటలు). ఈ మాటలన్నీ వివిధ వర్గాల ప్రజల్లో ఎందుకొచ్చాయనుకుంటున్నారా? ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారన్న ప్రధాన ఉద్దేశ్యమే కారణం. ఇక ఎన్నికల ప్రచారం ఎలా ముగిసిందో చూద్దాం.

21 రోజుల ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం 5 గంటలతో ముగిసింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు వారి వారి గెలుపు కోసం పట్టు సాధించే ఉద్దేశ్యంతో రెండు పర్యాయాలు రాష్ట్ర నాయకులను ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్‌ షోలలో నిలిపారు. ఈ ప్రచారాల్లో ఒకరిపై మరొకరు మాటల తూటాలతో విమర్శనాస్త్రాలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. గెలుపుపై ఎవరి ధీమా వారికుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోని 5 మండలాలైన ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. రాజుపాళెంలో జరిగిన సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గెలుపుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులు రాజుపాళెంలో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకు కూడా నియోజకవర్గంలోని ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలంరెడ్డి ప్రచారంలో ఆనం బ్రదర్స్‌ అయిన రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని రోడ్‌షోలు నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కోవూరులో వారం రోజులపాటు బస చేసి రోడ్‌షోలలో పాల్గొని ప్రచారాలు నిర్వహించారు. ఆయన సభలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీనినిబట్టి చూస్తుంటే ప్రజలు తెలివిగా వ్యవహరిస్తూ మూడు పార్టీల అభ్యర్థుల ప్రచారాలకు వెళ్లినట్లు తెలియవచ్చింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారిదే అయినప్పటికీ లోలోన కొంత ఆవేదనకు గురవుతున్నట్లు తెలిసింది. దీనికి ప్రధాన కారణం ఓటరు నాడి అంతు చిక్కకుండా ఉండడమే. ప్రతి ఓటుకు ఒక్కోపార్టీ ఒక్కో రేటు రూ.200, రూ.500, రూ.1000లు చొప్పున పంపిణీ చేస్తుండడం కూడా రాజకీయ విశ్లేషకుల చర్చనీయాంశంగా మారింది.

కొంతమంది పేదలైతే కూలీ నాలి లేక కడుపు మాడ్చుకుంటూ గడుపుతున్న వారు రాజకీయ నాయకులు ఓటుకు ఇచ్చేడబ్బులు కొంత ఊరటనిస్తందనే మాటలు వినిపిస్తున్నాయి. మరికొందారు ఇలాంటి ఓట్లు మళ్లీ మళ్లీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు విన వచ్చింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తు.చ పాటిస్తున్నామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. చేతల వరకు ఉండడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక భద్రత విషయానికొస్తే ఒక్కోచోట పోలీసులు నామ్‌కే వాస్తి తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 108, ఆర్టీసి బస్సులు, మరికొన్ని వాహనాలు కూడా యథేచ్ఛగా వదిలేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాకుండా టు వీలర్స్‌ వారిని ఆపుతూ తనిఖీలు చేపడుతూ లైసెన్సులు లేనివారిపై కొరడా ఝళిపిస్తూ అంతో ఇంతో వారి నుంచి ఆమ్యామ్యాలు స్వీకరించి వదిలేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కోడూరుపాడులో ఆర్థికమంత్రి రామనారాయణరెడ్డి కాన్వాయ్‌ను పోలీస్‌ అధికారులు యథేచ్ఛగా వదిలివేయడంతో వారిపై వేటు పడిన సందర్భమే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి మరింకెన్నో. రాష్ట్రంలోనే కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక ఫలితాల కోసం నాయకులు, ప్రజలు 21వ తేదీ వరకు వేచి చూడాల్సిందే

వైఎస్‌ఆర్‌ను అభిమానించినవారిని దగ్గరకు రానీయని వ్యక్తి జగన్‌ - ఆనం వివేకానందరెడ్డి


నెల్లూరు : కోవూరు వైఎస్‌ఆర్‌సి పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజకీయ వ్యసనపరుడని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక ఎసి సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసన్న పాప పరిహారం కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఓటర్లను మళ్లీ అమ్మేస్తాడని విమర్శించారు. ఒక్క క్షణం ఆలోచించాలన్నారు. విద్రోహులకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల సమరం కాదని, పరువు నిలబెట్టుకునే పోరాట యుద్ధమన్నారు. గతంలో మీ ఓటు ఎటుపోయిందో తెలుసా అన్నారు. డబ్బుకు అమ్ముడుపోయే నేతల గురించి ఆలోచించాలన్నారు. కోవూరు ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సిపి, టిడిపిలు రెండవ స్థానం కోసం పోటీ పుతున్నాయన్నారు. ఈ ఎన్నికలో తమపై ప్రత్యర్థిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందన్నారు.

కోవూరు ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డినే గెలిపించాలన్నారు. 85 సంవత్సరాలు రాజకీయాల్లో వున్న ఒక కుటుంబ సభ్యుడుగా చెబుతున్నానని, నీతి, నిజాయతీ లేనివారిని ఎన్నుకోవద్దని, వారిని ఎన్నుకుని కోవూరుకు చెడ్డపేరు తేవద్దన్నారు. విశ్వసనీయత, నిజాయతీ గురించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడడమా? అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. 10 రోజుల నుంచి జగన్‌ నెల్లూరులో తిష్ట వేసి కోవూరు ఉప ఎన్నికపై ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్‌... ఈ రాజకీయాలు చూస్తేనే బాధ వేస్తున్నదని, విశ్వసనీయత అనే మాట వింటేనే బాధ వేస్తుందని అనడం పట్ల వివేకా పైవిధంగా స్పందించి మాట్లాడారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ పొత్తిళ్ల నుండి పుట్టిన నీవు అనుభవిస్తున్న రాజసౌధ కాంగ్రెస్‌ పార్టీలో సంపాదించినవే అన్నారు.

అలాంటి నీవు నిజాయతీ, విశ్వసనీయత గురించి మాట్లాడడమా? అన్నారు. వైఎస్‌ఆర్‌ను అభిమానించినవారిని దగ్గరకు రానీయని వ్యక్తి జగన్‌ అన్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడుగా వున్న సూరీడు లాంటి వ్యక్తిని కూడా దగ్గరకు చేరనీయలేదన్నారు. జగన్‌ నమ్మక ద్రోహి అని వివేకా అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ను విమర్శించిన వ్యక్తి అయిన ప్రసన్నకు పార్టీ టిక్కెట్టు ఇచ్చారని వివేకా ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకుడు బర్నాబాస్‌ ఉన్నారు.

Thursday, March 15, 2012

ఒక్కఓటుకు 2000 ఇస్తున్నారని ప్రచారంలో ఉంది. కాని ఓటరు చేతికి 200 అందుతుండడంతో



కోవూరు : నేటితో కోవూరు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. నెల రోజుల నుంచి జరుగుతున్న బహిరంగ ప్రచారం శుక్రవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఈనెల 18న జరగనున్న ఎన్నికలకు తెర వెనుక నుంచి రాజకీయం నడపడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా టిడిపి, సిపిఎం, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వారు ఉవ్విళూరుతున్నారు. సిపిఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు, తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు, జక్కావెంకయ్య ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి వెంకమరాజు నియోజకవర్గమంతా కలియతిరిగారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మూడు దఫాలు నియోజకవర్గంలో పర్యటించి కేడర్‌లో నూతనోత్సాహం నింపారు. ఆయన ప్రచారంతో ఆ పార్టీ అభ్యర్థి సోమిరెడ్డిచంద్రమోహన్‌రెడ్డి, ఇతర నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. బాబు పర్యటనకు మంచి స్పందన లభించడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి తరపున 8 రోజులు నుంచి జగన్‌ ప్రచారం చేశారు. అయితే ఓదార్పు యాత్రకు వచ్చిన స్పందన ఈ ప్రచారంలో కనిపించలేదు. కొన్నిచోట్ల జనం పలుచగా ఉండడంతో తొలుత గెలుపుపై ధీమాగా ఉన్న ఆపార్టీ నేడు నీరసపడింది. గెలుపుకోసం ఉన్న అవకాశాలను అన్నింటినీ వెతుకుతుంది. డబ్బు, మద్యం, యువతకు స్పోర్ట్స్‌ కిట్లు అందించి ఓట్లు పొందాలని నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కఓటుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారని ప్రచారంలో ఉంది. కాని ఓటరు చేతికి రెండు వందల రూపాయలు అందుతుండడంతో వారిలో అసంతృప్తి నెలకొంది.

 కాంగ్రెస్‌పార్టీ ప్రచారంలోనూ వెనుకబడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోవూరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను మండలాలకు ఇన్‌ఛార్జిలుగా నియమించారు. వారు ఎక్కడా ప్రచారంలో కనిపించడంలేదు. అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెనుకే జనం లేని పరిస్థితి. కాంగ్రెస్‌పార్టీ కున్న సాంప్రదాయ ఓటింగ్‌ మాత్రమే దాని ఆయుధంగా ఉంది. మరోవైపు మాజీ ఐపిఎస్‌ అధికారి పట్టపురవి, లోక్‌సత్తా అభ్యర్థి కూడా నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. లోక్‌సత్తా తరపున జయప్రకాశ్‌నారాయణ రెండు రోజులు నియోజకవర్గంలో పర్యటించారు. బహిరంగ ప్రచారాలు నేటి సాయంత్రంతో తెర పడనుండడంతో తెర వెనుక రాజకీయాలకు నేతలు సిద్ధమవుతున్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. తనిఖీలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. అధికారపార్టీ ముఖ్య నాయకులు వస్తే కనీసం తనిఖీలు చేయకుండానే వదిలేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి మద్యం, డబ్బు వచ్చి చేరింది. 18వ తేదీ జరిగే పోలింగ్‌కు జిల్లా అధికారయంత్రాంగం అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికక్కడే గెలుపు తమదేనని ఆయా పార్టీల నాయకులు మేకపోతు గాంభీర్యంతో ఉన్నా ఓటర్లు మాత్రం మౌనం వీడడం లేదు.

చీటింగ్‌కు మారుపేరు గా ..తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విధంగా ఆనం సోదరులు


నెల్లూరు : కోవూరు ఉప ఎన్నికల్లో అథోగతి తప్పదని భా వించిన ఆనం సోదరులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఉదయగిరి తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించా రు. వారు చీటింగ్‌కు మారుపేరు గా మారారన్నారు. ఆయన గురువారం తన అతి థి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రా మనారాయణ రెడ్డి ఇటీవల కాలంలో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, తమ సోదరులపై చే స్తున్న విమర్శలను, ఆరోపణలను ఆయన తీవ్రం గా ఖండించారు. ఇటీవలకాలంలో ఆయన అధికా ర వ్యామోహంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతు న్నారని, ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు అతి వినయ విధేయతలు ప్రదర్శించి, ఆయన పు ణ్యమా అని పదవులను అడ్డం పెట్టుకుని రూ. కోట్లు సంపాదించుకున్నారన్నారు.

రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వారి అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడపెట్టుకున్నారని విమర్శించారు. ము న్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంతకానికీ వెలకట్టిన ఘనుడు ఆనం రామనారాయణరెడ్డేనన్నారు. అప్పటి మున్సిపల్ శాఖ కార్యకలాపాలపై సీబీఐ దృష్టి సారిస్తే ఆయన భాగోతాలు బ యటపడతాయన్నారు.వైఎస్సార్ హయాంలో కేబి నెట్ మంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు తమదేమీ లేదని, అంతా ముఖ్యమంత్రిదేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడ లాభం ఉంటే ఆ పంచన చేరే ఆనం సోదరులకు యువనేతను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఎంపీ సీటు కోసం సోనియా గాంధీ వద్ద పడిగాపులు కాశారని, తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని విమర్శించడం సిగ్గు చేటన్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ పుణ్యమా అని ఆయనకు రెండుసార్లు ఎంపీ సీటు లభించిందన్నారు. తనకు కూడా మూడుసార్లు ఎమ్మెల్యే సీటు వచ్చిం దంటే అది మహానేత చలువ వల్లేనన్నారు. ఆనం సోదరులకు కూడా రెండు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి వారికి రాజకీయభిక్ష పెట్టింది ఆ మహానేతేనన్నారు. అలాంటిది తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విధంగా ఆనం సోదరులు ప్రస్తుతం పదవుల కోసం విశ్వసనీయతను, విలువలను మంటగలిపి వ్యవహరిస్తున్నారన్నారు.

నయవంచకులెవరో తేల్చుకుందాం రండి
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, తమ సోదరులను నయవంచకులని పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవ రు నయవంచకులో తేల్చుకునేందుకు సిద్ధమా? అని ఆనం సోదరులకు సవాలు విసిరారు. నెల్లూరును మున్సిపాల్టీ స్థాయి నుంచి నగర స్థాయిగా మార్చిన ఆ మహానేత ఆశయాలకు వారు తిలోదకాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో నామమాత్రంగా పనులు చేయించి, అధిక శాతం నిధులు వారి జేబుల్లోకి, వారి అనుచరులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వారి ఆగడాలకు అడ్డొచ్చిన అధికారులను ఇంట్లో పనివారి కన్నా హీనంగా దూషిస్తున్నారని విమర్శించారు.

అధికారులు కూడా ఆత్మాభిమానం చంపుకుని పని చేయాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. అలా పదవులను ఇచ్చిన ప్రజల సొమ్మునే దోచుకుంటున్న ఆనం సోదరులు నయవంచకులా..? పదవులకు న్యాయం చేసి నియోజకవర్గ అభివృద్ధి కి పాటుపడుతున్న తాము నయవంచకులమో ప్రజలకే తెలుసన్నారు. దీనిపై ఎక్కడైనా చర్చావేదికకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే రాజమోహన్‌రెడ్డి దీనిపై సవాల్ విసిరారని గుర్తు చేశారు.

టిడిపి నేత ఓం ప్రకాశం ఇంట్లో దాదాపు కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు


నెల్లూరు: ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ధన ప్రవాహం కనిపిస్తోంది. గురువారం కొవూరు నియోజకవర్గం మైపాడ్ గేట్ సెంటర్‌లోని ఓ తెలుగుదేశం పార్టీ నేత ఇంట్లో పోలీసులు భారీగా డబ్బు కనుగొన్నారు. టిడిపి నేత ఓం ప్రకాశం ఇంట్లో దాదాపు కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఓం ప్రకాశ్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పోరేటర్. ఈ డబ్బు ఓటర్లకు పంచడానికే కావొచ్చుననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో డబ్బు దొరకడంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. తమకు ఇక్కడ డబ్బు ఉన్నట్లుగా సమాచారం వచ్చిందని అందుకే సోదాలు నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో రూ.యాభై లక్షలకు లెక్క చూపించారని, మిగిలిన డబ్బు గురించి తెలియడం లేదన్నారు. ఐటి వాళ్లకు సమాచారం అందించినట్లు చెప్పారు.

మరోవైపు ఓం ప్రకాశ్ తన సొంత డబ్బుతో ఇంకా కొంత డబ్బును కలిపి పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డబ్బు పంచేందుకు అని చెప్పడం సరికాదన్నారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో పోలీసులు జులుం చేసి ఇలా చేస్తున్నారన్నారు. డబ్బుతో పాటు టిడిపికి చెందిన ఎన్నికల సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా అంతకుముందు పోలీసులు భారీగా మద్యంను స్వాధీనం చేసుకున్నారు.

కోవూరు ఉప ఎన్నిక జరిగే ప్రాంతాలకు బస్సులు, స్కూటర్లు, ఆటోలు తదితర వాహనాల ద్వారా యథేచ్చగా మద్యం, నగదు


నెల్లూరు : జిల్లాలోని కోవూరు నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న అధికారులు తూతూ మంత్రంగా కేవలం కోవూరు వైపు, ఇందుకూరుపేట వైపు వెళ్లే కార్లను మాత్రమే తనిఖీలు నిర్వహించి మిగతా వాహనాలను వదిలివేస్తున్నారు. దీంతో కోవూరు ఉప ఎన్నిక జరిగే ప్రాంతాలకు బస్సులు, స్కూటర్లు, ఆటోలు తదితర వాహనాల ద్వారా యథేచ్చగా మద్యం, నగదు తరలిపోతున్నట్లు సమాచారం. అధికారులు కేవలం కార్లను మాత్రమే తనిఖీ చేస్తుండడంతో ఈ తరహా వాహనాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు జరుగుతున్న అన్నీ గ్రామాలకు ఇదే పద్ధతిలో యథేచ్చగా ఇప్పటికే 75శాతం చేరాల్సిన ప్రాంతాలకు చేరిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కేవలం కార్లనే తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు సైరన్‌ వేసుకుని వెలుతున్న వాహనాలను, పోలీసు అధికారుల ఖాళీగా వెలుతున్నా తనిఖీ నిర్వహించక పోవడంపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. 




అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ తరహా వాహనాల్లో యథేచ్చగా మద్యంను, నగదును తరలిస్తున్నట్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరుగనున్న బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు కాగా ఈ ప్రాంతానికి సంబంధించి పోలీసుల చెక్‌ పోస్టులు బుచ్చిరెడ్డిపాళెం మండలానికి గాను దువ్వూరు గ్రామం వద్ద ఒకటి, జొన్నవాడ గ్రామం వద్ద ఒక చెక్‌పోస్టు, కోవూరుకు గాను వెంకటేశ్వరపురం వద్ద ఒకటి, రాజుపాళెం వద్ద ఒకటి ఇందుకూరుపేట మండలానికి గాను ఆరవ మైలు వద్ద రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్‌ పోస్టుల వద్ద జిల్లా పోలీసుల తోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన పోలీసులను కూడా నియమించడంతో తనిఖీలు ఖచ్చితంగా జరుగుతాయన్న అభిప్రాయం తొలుత ఉన్నప్పటికి రాను రాను ఆ అభిప్రాయం కాస్తా మారి పోలీస్‌ తనిఖీలు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల వాహనాలను తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నట్లు ఆరోపణలు లేక పోలేదు.

ఏది ఏమైనప్పటికి పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కార్లను మాత్రమే టార్గెట్‌ చేస్తుండడంతో ఇప్పటికే ఇతర వాహనాల ద్వారా ఉప ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాలకి సంబంధించిన అన్ని గ్రామాలకు యథేచ్చగా నగదు, మద్యం ఇప్పటికే చేరిపోయిందన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మద్యాన్ని మాత్రం జిల్లా నుంచి ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ట్రాక్టర్ల ద్వారా, మ్యాజిక్‌ ఆటోల ద్వారా చేరినట్లు సమాచారం. ట్రాక్టర్‌కు సంబంధించిన తొట్టిల్లో సగం వరకు మద్యం బాటిళ్ళను నింపి ఆపైన ఇసక నింపి తరలించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి ఎన్ని తనిఖీలు నిర్వహించిన ఎంత మంది సిబ్బంది అప్రమత్తంగా ఉన్నా జరుగనున్న ఉప ఎన్నికల్లో మద్యం, నగదు రాజ్యమేలుతుందనేది జగమెరిగన సత్యమే

శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుందన్నారు- కలెక్టర్‌


 ఈ నెల 18న జరుగనున్న కోవూరు నియోజక ఉప ఎన్నికలో నియోజ కవర్గానిక సంబంధంలేని కొత్త వ్యక్తులు, ప్రజా ప్రతినిదులు నియోజక వర్గంలో సంచరించరాదని జిలా కలెక్టర్‌ బి.శ్రీదర్‌ సూచించారు. నగరంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుందన్నారు. నియోజక వర్గంలో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా నియంత్రించేందుకు ప్రతి మండలంలో రెండు పోలీస్‌ మొబైల్‌ టీమ్‌లను నిఘాఉంచడం జరిగిందన్నారు. పోలింగ్‌ రోజున పార్టీ ఏజెంట్లు ఉదయం ఏడు గంటలకే హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

ఏజెంట్లు ఆ పోలింగ్‌ పరిధిలోని ఓటరు అయి ఉండాలన్నారు. ఏజెంట్లు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో రెండింటిని తమ వెంట తీసుకుని రావాలన్నారు. పోలింగ్‌ రోజున ఏజెంట్లు, రిలీవింగ్‌ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ నుంచి సాయంత్రం మూడు గంటల తర్వాత బయటకు అనుమతించరని తెలిపారు. ఒక వేళ బయటకు వెళ్ళ దలిస్తే లోనికి వచ్చేందుకు వీలులేదన్నారు. అభ్యర్థులు, రాజకీయపార్టీల వారికి మూడు వాహనాల్లో తిరిగేందుకు మాత్రమే అనుమతిస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్‌ బలగాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లకు ఓటరు స్లిప్‌లను పంపిణీ కొనసాగుతుందని, నేటి వరకు 87శాతం పంపిణీ జరిగిందని తెలిపారు. 21వ తేదీ కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లు తమ వివరాలను ఎన్నికల అధికారి అందజేయాలని తెలిపారు.
ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న నగదు కోటి 15లక్షలు, మద్యం 7501 సీసాలను పట్టుకోవడం జరిగిందన్నారు

Wednesday, March 14, 2012

ప్రసన్నకుమార్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒక గూండా, ఒక రౌడీ అని ప్రచారం చేసి ఈ రోజు రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లను దేవుళ్లు

విడవలూరు: రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోచుకున్న వైఎస్‌ఆర్‌సి కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలను తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. కోవూరు ఉప ఎన్నికల సంద ర్భంగా బుధవారం విడవలూరు మండలంలోని విడవలూరు, ముదివర్తి, పార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించారు. గతంలో ఆరేళ్లు పనిచేసిన ముఖ్యమంత్రి అవినీతి ద్వారాలు తెరిస్తే తర్వాత వచ్చిన మంత్రులు ద్వారాలే లేకుండా రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, అలాంటి పార్టీలను ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ రెండు పార్టీలకు లేదన్నారు. అవినీతి కాంగ్రెస్‌ అనే వృక్షంలోని కొమ్మే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని, ఏ రోజుకైనా ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాకతప్పదని ఆయన జోస్యం చెప్పారు.


జగన్‌ లక్షకోట్లు అవినీతికి సమాధానం చెప్పకుండా సిబిఐ విచారణకు వస్తే ఇంట్లో దాక్కొనే పిరికి వ్యక్తి అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ అవినీతికి పాల్పడిన జగన్‌ సమాధానం చెప్పేంతవరకు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ విగ్రహాలు చూస్తే లక్ష కోట్లు అవినీతి గుర్తుకొస్తుందని ఆయన అన్నారు. జగన్‌ పక్కన వున్న ప్రసన్న ఎక్కడ నుంచి ఊడిపడ్డారని ఆయన ప్రశ్నించారు. 1993 నుంచి 2004 వరకు ఆయనకు టిక్కెట్టు ఇచ్చి ఆయన గెలుపునకు కారణమైన పార్టీని వదిలిపెట్టి వెళ్లడం సిగ్గుచేటన్నారు. 2009 ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒక గూండా, ఒక రౌడీ అని ప్రచారం చేసి ఈ రోజు రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లను దేవుళ్లు అనడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

సోమశిల నీళ్లు కడపకు వెళ్లకుండా కాపాడిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డఇని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత కోవూరు ప్రజలపై ఉందని ఆయన కోరారు.

ఎప్పటికీ రాజకీయలలోకి ప్రవేశించే ప్రశక్తే లేదన్నారు-నాగార్జున

నెల్లూరు : తనకు నేటి రాజకీయలపై ఎటువంటి ఆశక్తి లేదని, పూర్తిగా చిత్ర రంగం మీదనే దృష్టి సారిస్తున్నాని ప్రముఖ సినీ నటుడు, యువసామ్రాట్‌, కళ్యాణ్‌ జుయలరీ అంబాసిడిర్‌ అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ఎప్పటికీ రాజకీయలలోకి ప్రవేశించే ప్రశక్తే లేదన్నారు.నెల్లూరు నగరంలో బుధవారం ఆయన కళ్యాణ్‌ జుయలరీ షోరూంను లాంచనంగా ప్రారంభిచారు. సందర్భంగా నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ రాజకీయలపై తనకు ఎటువంటి ఆశక్తి లేదన్నారు. ప్రస్తుతం శ్రీ షిరిడీ సాయిబాబా చిత్రం షుటింగ్‌ జరుగుతుందన్నారు.
కాని చిత్రం కంటే ముందుగా ఢమరకం చిత్రం విడుదలవుతుందని తెలిపారు. త్వరలోనే నేను, నాన్న కలసి ఒక చిత్రంలో నటించబోతున్నామని ఆయన తెలిపారు. తన కుమారుడు అఖిల్‌ చదువు పూర్తి చేసుకొన్న తర్వతే సినీ రంగ ప్రవేశం ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. ప్రతేకించి నెల్లూరు ప్రజల అభిమానానికి, తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలపారు.  కళ్యాణ్‌ జుయలరీ ప్రారంభోత్సవానికి నెల్లూరుకు వచ్చిన నాగార్జునకు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. నాగార్జున రాకతో మినిబైపాస్‌ రోడ్డు అభిమానులతో, ప్రజలతో కిక్కిరిచిపొయింది

రైల్వే శాఖ చార్జీలు పెంచడంతో ప్రయాణీకులకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు తీవ్ర మనస్తాపానికి గురి

నెల్లూరు, : పార్లమెంటులో బుధవారం రైల్వే శాఖ మంత్రి దినేష్‌త్రివేది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ పాత బడ్జెట్‌నే కొత్త తరహాలో ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో దక్షణమధ్య రైల్వేకి అత్యంత కీలకంగా వున్న విజయవాడ రైల్వే జంక్షన్‌ కీలక జోన్‌గా ఉన్నప్పటికీ రాష్ట్రానికి, తద్వారా జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దక్షణ మధ్య రైల్వే నుంచి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్లో అతి స్వల్పంగా అభివృద్ధికి నిధులను కేటాయించడంపై దక్షణ మధ్యరైల్వే కింద వున్న జిల్లాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. నెల్లూరు జిల్లాకు చెందిన 9 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కాని, నెల్లూరు జిల్లాకు కాని రైల్వే శాఖ విస్మరించడం ప్రజల ఆగ్రహానికి గురి చేస్తోంది.

అయితే రైల్వే శాఖ చార్జీలు పెంచడంతో ప్రయాణీకులకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. జిల్లా నుండి ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలు విజయవాడకు, హైదరాబాద్‌కు, చెనై్నకు వివిధ వ్యాపారాల నిమిత్తం రోజూ వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతేగాక జిల్లాలోని ఉద్యోగస్తులు పై ప్రాంతాల్లో ఉండడంతో వారు కూడా రాకపోకలు సాగించడం తెలిసిన విషయమే. రైల్వే చార్జీలు పెంచడంతో వీరికి తీవ్రంగా తడిపి మోపెడవుతుందన్న వ్యాఖ్యలు సదరు ఉద్యోగస్తుల నుండి వినిపిస్తున్నాయి. ప్రతి 135 కి.మీ.లకు రూ.4ల వంతున చార్జీలను పెంచడం జరిగింది. సెకండ్‌ క్లాస్‌ ఎసికి కిలోమీటరుకు 0.15 పైసలు వంతున, స్లీపర్‌ కోచ్‌కు కిలోమీటరుకు 5 పైసల వంతున ఎసి 2టైర్‌కు కిలోమీటరుకు 15 పైసల వంతున చార్జీలను పెంచడం జరిగింది.
మొదటి తరగతి ప్రయాణీకులకు ఎసి ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణీకులకు కిలోమీటరుకు 30 పైసల వంతున పెంచడంతో రైల్వే ప్రయాణీకులపై అదనపు భారం పడుతుంది. దీనికి తోడు ప్యాసింజర్‌ రైలు కిలోమీటరుకు 2 పైసలు, ప్యాసింజర్‌ మెయిలుకు కిలోమీటరుకు 3 పైసల వంతున పెంచగా, ప్లాట్‌ఫారం టిక్కెట్టు రూ.3ల నుండి రూ.5ల వరకు పెరగడం జరిగింది. ఇకపోతే జిల్లా 9 మంది ఎంపిలు ఉన్నప్పటికీ కేవలం వీరుపార్లమెంటులో ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉండడం తప్ప రాష్ట్రానికి, తద్వారా జిల్లాల రైల్వే అభివృద్ధికి తీసుకురావాల్సిన నిధులను బడ్జెట్‌లో కేటాయించకపోవడంపై ఎంపిలు ఉన్నా లేనట్లే అయింది.

ఇకపోతే 75 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను, 21 కొత్త ప్యాసింజర్‌ రైళ్లను 2012-13 సంవత్సరానికి తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో రైల్వేశాఖ మంత్రి ప్రకటించారు. అలాగే 2012-13 సంవత్సరానికి గాను 213 లక్షల రైల్వే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన నిరుద్యోగులకు కొంతవరకు ఊరట కలిగించినప్పటికీ బడ్జెట్‌ మాత్రం ప్రజలకు ఆమోదకరంగా లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Tuesday, March 13, 2012

నల్లపురెడ్డి రూ.10 కోట్లు తీసుకొని జగన్‌కు జై అన్నారని -మంత్రి బొత్స


నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద రూ.10 కోట్లు తీసుకొని జగన్‌కు జై అన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. లేగుంటపాడు రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స నల్లపురెడ్డి, జగన్‌పై ధ్వజమెత్తారు. కొందరు పదవులకొద్ది డబ్బు కూడబెట్టుకొని ప్రజాభిప్రాయాన్ని కొనాలని చూస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. అవినీతిపరులకు కొమ్ము కాయవద్దని ప్రజలకు సూచించారు. దోపిడీదారులకు ఓటేయకండని కోరారు. అలాంటి వారికి ఓటు వేస్తే నష్టమన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెసుకు ఓటేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా కబ్జా చేయాలా అనే కొందరు చూస్తున్నారు తప్ప అభివృద్ధి, సంక్షేమం వారికి పట్టడం లేదని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. నాకు ఈ స్థానం మీ వల్లే వచ్చిందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రసన్నకు ఓటేస్తే తీర్పును అవమానించినట్టేనని అన్నారు. ఎవరు దోషులో సిబిఐ తేలుస్తుందని అన్నారు. జీవితాంతం మీకు అండగా ఉంటానని అన్నారు. కాగా బొత్స సత్యనారాయణ.. చిరంజీవితో కలిసి కొవూరులో ప్రచారం నిర్వహించాన్నారు

వెరైటీలు ఆనం వివేకానంద రెడ్డికి కొత్తేమీ కాదు.

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామీణ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి తరఫున కొవూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. సిగరేట్ తాగుతూ, తిరుపతి శాసనసభ్యుడి చిరంజీవి మాస్క్ వేసుకొని మరీ ప్రచారం నిర్వహించి అందరినీ ఆకర్షించారు. ఆనం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చిరంజీవి మాస్కులు వేసుకున్నారు. ఆనం కూడా వారి వద్ద నుండి ఒక మాస్కు తీసుకొని తన ముఖానికి పెట్టుకున్నారు. అంతేకాదు పక్కన ఉన్న కార్యకర్తలతో బాగుందా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కారులో కూర్చుని సిగరేట్ తాగుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. అయితే చిరంజీవి మాస్కు ఓకే కానీ ప్రచారం చేస్తూ సిగరేట్ తాగటం ఏమిటంటూ కొందరు చెవులు కొరుక్కున్నారట.

కాగా వెరైటీలు ఆనం వివేకానంద రెడ్డికి కొత్తేమీ కాదు. ఇటీవల అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబరులో ఆయన సిగరేట్ తాగి కిరణ్ కుమార్ రెడ్డితో చీవాట్లు పెట్టించుకున్నారు. అంతకుముందు నెల్లూరులో లిప్ స్టిక్ పెట్టుకొని, గాజులు వేసుకొని అలరించారు. అయితే ప్రచారం సమయంలో సిగరేట్ తాగుతూ, చిరు మాస్కు ధరించి తన దైన శైలిని ప్రదర్శించడం విశేషం.

ఓటు విలువ తెలియజేసే విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు


కోవూరు : సామాజిక న్యాయం జరిగే వరకు పేదల పక్షమై పోరాడుతానని సినీ నటుడు, కాంగ్రెస్ నేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి స్పష్టం చేశారు. కోవూరు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సభల్లో చిరంజీవి మాట్లాడుతూ సామాజిక అభివృద్ధి కోసమే పీఆర్పీని స్థాపించానని, రాజకీయ పార్టీల కుయుక్తులతో విజయం సాధించలేకపోయానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనమై బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానన్నారు. ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని, అయితే అధికార దాహంతో సీఎం పదవిపై కన్నేసిన జగన్ రాష్ట్ర రాజకీయాలను అస్తవ్యస్తం చేస్తున్నాడని విమర్శించారు.

ఐదేళ్లపాటు అధికారంలో ఉండాలని అవకాశం ఇచ్చిన ప్రజలను అవమానించేలా పదవికి రాజీనామా చేసిన ప్రసన్నకు తిరిగి ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ అదే పని చేస్తాడన్నారు. అభివృద్ధి పథకాలు ఆగాయాంటూ జగన్ తన సొంత మీడియాలో అసత్య ప్రచారాలు సాగిస్తున్నాడని విమర్శించారు. ఓటు విలువ తెలియజేసే విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. గతంలో ఓ గిరిజన మహిళకు పార్టీ టికెట్ ఇస్తే కోవూరు ప్రజలు పాతికవేల ఓట్లు వేశారని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్‌తో జత కలిసి ఉంటే గెలుపు కాంగ్రెస్‌దేనని చెప్పారు. జిల్లాలో రూ. 100 కోట్లతో చేపడుతున్న పెన్నా, సంగం బ్యారేజీ పనులను ఏడాదిలోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.

మత్స్యకారులకు రూ. 4వేలు పరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ఆదేశాలు, ప్రజాభిమానం పొందిన తరువాతే సీఎం పదవి దక్కిందన్నారు. రానున్న రెండేళ్లలో అభివృద్థి పథకాలు మరింతగా ప్రజల ముంగిటకు తీసుకుపోతామన్నారు.

కోవూరు ఉప ఎన్నిక కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా


కోవూరు : కోవూరు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలైన ఆనం వేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అధిష్టానం ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క మండలం కేటాయించడంతో వారి వారి ప్రాంతాల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి మెజారిటీ తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన పర్యటిస్తున్నారు. అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కోవూరు ఉప ఎన్నిక కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అక్కడ అభ్యర్థుల మధ్య నువ్వా...నేనా అన్నట్లుగా హోరా హోరీగా ఉంది. ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తమే కాకుండా జిల్లాలో కూడా ఉత్కంఠత నెలకొంది. ఎక్కడ చూచినా ఈ ఉప ఎన్నికపైనే చర్చ సాగుతోంది. ఒక వైపు రహస్య బెట్టింగ్‌లు కూడా సాగుతున్నట్లు సమాచారం. కోవూరు ఉప ఎన్నిక ప్రచారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించి బహిరంగసభ సైతం నిర్వహించారు. అలాగే రెండు రోజుల నుంచి చిరంజీవి రోడ్‌ షో నిర్వహిస్తుండగా పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిమిత్తం రావడం జరిగింది.


అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు సైతం కోవూరు ఎన్నిక కోసం రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా ఈ ఎన్నికల్లో భాగంగా నార్తురాజుపాళానికి రావడం జరిగింది. ఈ విధంగా అగ్రనాయకులకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావ డంతో ముఖ్యమంత్రి సూచన మేరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన ఆనం వివేకా, ముంగమూరు, ఆదాల, ఎమ్మెల్సీ వాకాటిలు ఈ  ఎన్నిక ల్లో వారి వారి ప్రాంతంలో మెజారిటీ కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డికి వచ్చే విధంగా వారి వారి రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్‌, తెదేపా గెలుపు పైనే కాయ్‌రాజకాయ్‌ అంటూ పందాలు కాస్తున్నారు


ఈ నెల 18వ తేదిన జిల్లాలోని కోవూరు నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్‌, తెదేపా అభర్ధుల గెలుపుపై నెల్లూరు ఎక్కడ చూసినా క్రింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు చూపు కోవూరుపైనే ఉంది. దీంతో కాయ్‌రాజకాయ్‌ అంటూ పందాలు కాస్తున్నారు. కొంత మంది కోవూరు నియోజక వర్గంలో వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలపరుస్తున్న అభ్యర్ధి నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సుమారు 25వేల ఓట్ల మేజార్టీతో ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుస్తాడని మరికొంత మంది అధికార పార్టీకి చెందిన పొలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గెలుపు తధ్యమని, ఇంకోంత మంది ప్రతిపక్ష పార్టీకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపు తధ్యమని ఎవరికి తోచిని ఆలోచనలు వారు జోస్యాలు చెప్పుకుంటున్నారు.

తెదేపా అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలవక పోతే భవిష్యత్తులో రాజకీయ యోగమే లేదని దేశం పార్టీకి చెందిన వారే ఖరాఖండిగా చెబుతున్నారు. అంతేకాదు జగన్‌ అండదండలతో ప్రసన్న గెలుపు జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో మేజార్టీ వస్తుందని జగన్‌ అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే సోమిరెడ్డి గెలుపు కూడా తధ్యమని మరి కొంత మంది చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పోలంరెడ్డి రెండవ స్థానమని కొంత మంది, ప్రసక్తే లేదు తెలుగు దేశం పార్టీ రెండో స్థానంపై కూడా పందాలు కాస్తున్నారు. ఏదేమైనప్పటికీ కోవూరు అసెంబ్లీ స్థానం తెలుగు దేశమా, వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్సా అని మూడు పార్టీల నాయకులు పచ్చ కామెర్లు ఉన్న వ్యక్తి అందరూ పచ్చగా కనబడుతారన్న రీతిలో ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ గెలుస్తోందని చెప్పుకోంటున్నారు.

కోతుల బీభత్సంవల్ల విద్యార్ధినులకు గాయాలు


రాపూరు : రాపూరు మండలంలో వానరాలు సృష్టించిన భీకరబీభత్సం వల్ల తీవ్ర భయాందోళనలకు గురై ఇద్దరు విద్యార్ధినిలు గాయాలు పాలైన సంఘటన మంగళవారం మద్దెలమడుగు తెలుగుగంగ క్వార్టర్స్‌లోని బాలికల హాస్టల్‌ వద్ద చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలావున్నాయి. మండల కేంద్రమైన రాపూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వి.సంధ్య(నర్సీపట్నం), సత్య(శ్రీకాకుళం)లు మంగళవారం ఉదయం హాస్టల్‌ భవనం పిట్టగోడపై కూర్చుకొని చదువుకుంటుండగా అటుగా వచ్చిన కోతులగుంపు గంతులేస్తూ కేకలు పెడుతూ నానాబీభత్సం సృష్టించడంతో భయపడిన విద్యార్ధులు అదుపుతప్పి కిందపడినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న తోటివిద్యార్ధులు వెంటనే 108ద్వారా రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. పట్టణ, పరసర ప్రాంతాల్లో వానరమూకలు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేయడం ఇటీవల రివాజుగా మారిందని మండల వాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కోతులను బెడదను నియంత్రించాల్సిన అవసరం ఎందైనావుంది.

Monday, March 12, 2012

నగదు పట్టుకున్న కొద్ది సేపటికే.. మంత్రి ఆనం ఇలాకా నుండి ఓ ఫోన్ కాల్ రావడంతో తర్జన భర్జనలు

 కోవూరు ఉప ఎన్నికలకు సంబంధించి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే సుళ్లూరు పేట రహదారి చెక్ పోస్టులో 19 లక్షలు పట్టుబడటంతో వారిపై కేసు నమోదు చేశారు. తాజాగా  టిఎన్ 07- బిఎ 5483 నెంబరు గల ఈ కారు  ఇద్దరు వ్యక్తులతో చెన్నైయ్ నుండి నెల్లూరు వైపు వచ్చే కారు ఉదయం 10గంటల సమయంలో సూళ్లూరుపేటకు చేరుకుంది. ఇక్కణ్ణుంచి కారును హోలోక్రాస్ సెంటర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేసి కారులో 5లక్షల ఒకటి, 3.5లక్షల నగదు మరొకటి బ్యాగులో ఉండడంతో కారులోని వ్యక్తులతో సహా పోలీసు స్టేషన్ కు తరలించారు. 

నగదు పట్టుకున్న కొద్ది సేపటికే.. మంత్రి ఆనం ఇలాకా నుండి ఓ ఫోన్ కాల్ రావడంతో నగదు వ్యవహారంలో తర్జన భర్జనలు సాగాయి. తొలుత 3.5లక్షలకు మాత్రమే తగిన ఆధారాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు విషయం మీడియాకు తెలియడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అదే సమయంలో ఓ కేసు నిమిత్తం సూళ్లూరుపేటకు వచ్చిన గూడూరు డిఎస్పీ సురేష్ కుమార్ సైతం నగదు పట్టుబడ్డ వైనాన్ని జిల్లా ఎస్పీకి తెలిపామని, ఉత్తర్వులు కోసం ఎదురుచేస్తున్నామని తెలపారు.  వ్యవహారాన్ని  జాగుచేస్తే ఎన్నికల కమిషన్ నుండి తాకీదులు అందుకోవాల్సి వస్తుందని భావించిన పోలీసులు మధ్యాహ్నం ప్రాంతంలో కేసును తహశీల్దారుకు అప్పగించారు. ఈలోపే  బయటవారు కొందరు వ్యక్తులు కొన్ని కాగితాలను నగదు పట్టుబడ్డ వ్యక్తులకు అందచేయడం వంటి  సంఘటనలు చోటుచేసుకొన్నాయి. హైడ్రామా అనంతరం నగదు, ఇద్దరు వ్యక్తులతో సహా కారును పోలీసు స్టేషన్ నుండి పట్టుబడ్డ ప్రాంతమైన హోలీక్రాస్ సెంటర్ వద్దకు తరలించి సూళ్లూరుపేట తహశీల్దారు సుబ్రమణ్యం సమక్షంలో లెక్కించారు. 
 
ఈ నగదు ఓజిలి మండలం రాజుపాళెంకు చెందిన ప్రీమియర్ మైకా కంపెనీకి చెందిన నగదుగా తెలియవచ్చిందని తహశీల్దార్ సుభ్రమణ్యం, సీఐ హనుమంతరావులు తెలిపారు. . అడ్వాన్స్ పన్ను 4లక్షలను నెల్లూరులో కట్టేందుకు తీసుకెళ్లుతున్నారని, అదే విధంగా మిగిలిన 4.5లక్షల ఉద్యోగుల జీతాల కోసం తీసుకువెళ్లుతున్నట్లు తెలిపారు. 
 
ఇదే ప్రాంతంలో గత నెల చివరివారంలో 19లక్షల క్యాష్ ను పట్టుకొన్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. కాని ఇప్పుడు పట్టుబడ్డ 8.5లక్షల నగదుపై కొంత హైడ్రామా నడపడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అధికార పార్టీ నేతల వత్తిళ్లకు పోలీసులు, రెవిన్యూ వర్గాలు తలవంచక తప్పలేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది 5 ప్రయోగాలు విజయవంతంగా నింగిలోకి పంపాల్సి ఉండగా ఇప్పటికి ఒక్క ప్రయోగం జరగక పోవడంతో

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఏప్రిల్‌లో పిఎస్‌ఎల్‌విసి-19 ప్రయోగం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది 5 ప్రయోగాలు విజయవంతంగా నింగిలోకి పంపాల్సి ఉండగా ఇప్పటికి ఒక్క ప్రయోగం జరగక పోవడంతో మిగిలినవి ఎప్పుడు జరుగుతాయోనని అనుమానం తలెత్తుతోంది. ఈ ఏడాది మార్చిలో ప్రయోగించాల్సిన పిఎస్‌ఎల్‌విసి-19 ప్రయోగం మరో నెలరోజుల పాటు వాయిదాపడి ఏప్రిల్‌లో ప్రయోగం జరగనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ కె రాధాకృష్ణన్‌ బెంగుళూరులో మూడు రోజుల క్రితం జరిగిన ఇస్రో డైరెక్టర్లు, శాస్త్రవేత్తల సమావేశంలో ప్రకటించినట్లు సమాచారం. మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి శాస్త్ర వేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎస్‌ ఎల్‌విసి-19ని ప్రయోగించనున్నట్లు పేర్కొ న్నారు. ఈ ప్రయోగంలో శాటిలైట్‌ సాంకేతిక లోపం తలెత్తడంతో మార్చికు వాయిదా వేశారు. ఈ ప్రయోగం ద్వారా 1800 కేజీల బరువుగల రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ -1 ( ఆర్‌ఐశాట్‌-1) ను పంపనున్నారు. ఈ ఉపగ్రహంలో మైక్రోవేవ్‌ రిమోట్‌సెన్సింగ్‌ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు అమర్చ నున్నారు. ప్రయోగం అత్యంత శక్తివంతమైనది కావడంతో చంద్రయాన్‌1కు ఉపయోగించిన స్ట్రాపాన్‌ మోటార్లును ఉప యోగిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో వాతావరణం అనుకూలంగా లేకున్న సమయంలో కూడా అంతరిక్షంలో ఫొటోలు సేకరించొచ్చు.

చంద్రబాబు, జగన్ కుమ్మక్కై ప్రభుత్వంపై


నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై గత సంవత్సరం ఆ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తన ఎమ్మెల్యేలతో ఓటు వేయించారని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి సోమవారం మండిపడ్డారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్, చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్ కుమ్మక్కై ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. అధికార దాహానికి, అవినీతికి, ప్రజా సంక్షేమానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జగన్ పార్టీ అవినీతి పార్టీ అయితే టిడిపి విశ్వాసం కోల్పోయిన పార్టీ అన్నారు.

జగన్ సొమ్ము దోచుకున్న జగన్ ప్రజా సేవ ఎలా చేస్తారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం అనేది ప్రజల నుండి రావాలి తప్ప బలవంతంగా తీసుకుంటే రాదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలను తీసుకు వచ్చారన్నారు. టిడిపి పాలనలో రైతులకు బాబు చేసిందేమీ లేదన్నారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. కుట్రతో ఉప ఎన్నికలు తీసుకు వచ్చిన టిడిపి, జగన్ పార్టీకి కాకుండా కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.అంతకుముందు చిరంజీవి గుడిలో పూజలు చేశారు. కాగా చిరంజీవిని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.

ఆనం వివేకానంద రెడ్డిలు చిరంజీవి ప్రచారంలో అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లుగా


నెల్లూరు: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి ఇంకా ప్రసంగాలపై పట్టు సాధించనట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన ప్రచారం నిర్వహించేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త తత్తర పడేవారు. ఆ తర్వాత కాగితం ముందు పెట్టుకొని మాట్లాడేవారు. అయితే ఇప్పటికీ ఆయన ప్రసంగం క్లియర్‌గా లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే సమయంలో చిరంజీవి అక్కడక్కడా తత్తరపాటుకు గురయ్యారు. ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆ తర్వాత మాట్లాడాల్సింది గుర్తుకు రాక కార్యకర్తలను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. చిరంజీవి ప్రదర్శన పేలవంగా ఉందని కాంగ్రెసు నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.

మరోవైపు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలు చిరంజీవి ప్రచారంలో అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవితో ఇన్నాళ్లూ రాసుకుపూసుకు తిరిగిన వారు ప్రచారం సమయంలో కొన్ని చోట్ల చిరంజీవి వాహనంలో కనిపించారు. మరికొన్ని చోట్ల ఎక్కడో జనంలో ఉండిపోయారు. దీంతో సొంత పార్టీ నుండి కూడా చిరంజీవికి మద్దతు కరువైందా అనే ప్రశ్న పలువురిలో

Sunday, March 11, 2012

ఎవరు కొడితే మైండ్ బ్లాకవుతుందో అతడే జగన్: రోజా


నెల్లూరు: ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే 2014లోనూ రాష్ట్రంలో పునరావృతం కానున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు రోజు ఆదివారం అన్నారు. ఆమె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రేబాల గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఘోర పరాజయాన్ని అందించారని ఆమె అన్నారు. రాష్ట్రంలో 2014లో జరిగే ఎన్నికల్లోనూ ప్రజలు ఇలాంటి తీర్పునే ఇస్తారని అన్నారు. కాంగ్రెసు పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓటమిని హుందాగా అంగీకరించలేక నిత్యావసరాల ధరలు పెరిగినందునే ప్రతికూల ఫలితాలు వచ్చాయని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం సిగ్గు చేటు అన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో అసలైన దొంగ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనన్నారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అతడే జగన్మోహన్ రెడ్డి అని, కడప పులివెందుల ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. కొవూరులో టిడిపి, కాంగ్రెసుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

పోలంరెడ్డిని ఓడించి ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు ఆనం సోదరులు తీవ్ర ప్రయత్నాలు


కోవూరు : కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఆనం సోదరులే ఓడిస్తారని వైఎస్సార్సీ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలంరెడ్డిని ఓడించి ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు ఆనం సోదరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

కోవూరు ఉపఎన్నికల నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. రాజుపాళెంలోని జరిగిన సీఎం బహిరంగ సభకు భారీ స్థాయిలో బస్సులు, లారీలు, టెంపోలలో జనాన్ని సమీకరించి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. అంతేగాక మహిళలను అవమాన పరిచేలా కాంగ్రెస్ నాయకులు రికార్డు డ్యాన్సులు ఏర్పాటు చేశారని వెంటనే ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనం వివేకానందరెడ్డి సీఎం సభలో రికార్డు డాన్స్‌లు ఏర్పాటు చేశాడని, ఆయన చీర కట్టుకొని ఉంటే బాగుండేదన్నారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పది గంటలు దాటాక ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు జగన్ ప్రభంజనం అధికమవుతోందని కోవూరులో తన గెలుపునకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఈ నెల 14వ తేదీన జగన్ పర్యటించనున్నట్లు ప్రసన్న తెలిపారు. ఈ సమావేశంలో నటి రోజా, వైఎస్సార్సీ పార్టీ నాయకులు శంకర్‌రెడ్డి, భక్తవత్సలరెడ్డి, సతీష్‌రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.

పద్మభూషణ్‌, డాక్టర్‌ కొణిదల చిరంజీవి సోమవారం ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో రోడ్‌షో

 కోవూరు : కోవూరు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రచారం నిమిత్తం పద్మభూషణ్‌, డాక్టర్‌ కొణిదల చిరంజీవి సోమవారం ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో రోడ్‌షో నిర్వహిస్తారని నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్థానిక ఏసీ సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 9 గంటలకు ఇందుకూరుపేట మండలంలోని డేవిస్‌పేట నుండి కొత్తూరు, ఇందుకూరుపేట, మైపాడు, గంగపట్నం, రావూరు, జగదేవిపేట, మధ్యాహ్నం 2.30 గంటలకు జొన్నవాడ సెంటర్‌లో, పెనుబల్లి, కళాయికాగల్లు, రేబాల నాగమాంబపురం, ఇస్కపాళెం, పోలినాయుడు చెరువు, ముసులపూడి, కట్టుబడిపాళెం, బుచ్చి హరిజనవాడ, బుచ్చిబస్టాండ్‌ సెంటర్‌లలో రోడ్‌షోలు నిర్వహిస్తారన్నారు. 

అలాగే 13వ తేదీ పీసీసీ అధ్యక్షులు బొత్సా సత్యనారాయణతో కలసి చిరంజీవి పడుగుపాడు, ఇనమడుగు, లేగుంటపాడు, వేగూరు, ముదివర్తి, అన్నారెడ్డిపాళెం, విడవలూరు మండలంలోని ఊటుకూరు, పెద్దపాళెం, రామతీర్థం, దండిగుంట, వరిణి, గాజులదిన్నె, వావిళ్ల, దంపూరు, చౌకచర్ల, పద్మనాభసత్రం, గుండాలమ్మపాళెం సెంటర్‌, బసవాయపాళెం సెంటర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు కొడవలూరు, 7.30 గంటలకు నార్తురాజుపాళెం, 8 గంటలకు కోవూరు రోడ్‌షోలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవిని కోవూరు ప్రజలు, చిరంజీవి అభిమానులు ఆశీర్వదించాలని ముంగమూరు తెలిపారు. అలాగే ఈ నెల 18వ తేదీ జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి గుర్తు అయిన హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రంగయ్యనాయుడు, రవికుమార్‌ యాదవ్‌, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. 

నేడు చిరంజీవి రాక 
కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు చిరంజీవి తొలిసారిగా కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట, బుచ్చి మండలాలకు సోమవారం రానున్నారు. పిఆర్‌పి అధ్యక్షుడుగా వున్న చిరంజీవి ఇటీవల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుని హోదాలో పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిమిత్తం రోడ్‌షోకు రానున్నారు. చిరంజీవి రాకసందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న విషయం తెలిసిందే.

అభిమానుల అభిమానాన్ని ఢిల్లీలో సోనియాగాంధీ దగ్గర డబ్బు సంచుల కోసం తాకట్టు పెట్టిన చిరంజీవి -గాలి


సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికల్లో భారీగా నగదు వసూలు చేసుకుని కాంగ్రెస్‌ పార్టీకి హోల్‌సేల్‌గా పార్టీని అమ్మకం పెట్టిన చిరంజీవిని చూసి ఓట్లు వేసే స్థితిలో నేడు ప్రజలు లేరని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కె.ఎర్రంనాయుడు, గాలి ముద్దు కృష్ణమనాయుడులు వ్యాఖ్యానించారు. ఆదివారం వారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవిని నమ్మి ఇతర పార్టీలను వదులుకొన్న అభిమానులను నిట్టనిలువునా మోసం చేసిన ఆయనకు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రచారం చేసే నైతిక హక్కులేదన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని ప్రచారం చేస్తారో తెలపాలన్నారు.

ప్రజల, అభిమానుల అభిమానాన్ని ఢిల్లీలో సోనియాగాంధీ దగ్గర డబ్బు సంచుల కోసం తాకట్టు పెట్టిన చిరంజీవికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నైతిక ఉందా? అని ప్రశ్నించారు. అవినీతి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కోవూరు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకుని దేశ వ్యాప్తంగా భోగస్‌ కంపెనీల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలను దోచుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి తీహార్‌ జైల్లో చిప్పకూడు తినేరోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. అధికార కాంగ్రెస్‌పార్టీ జగన్‌మోహన్‌రెడ్డితో రహస్య ఒడంబడిక చేసుకుని పైకి మాత్రం మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలనకు తోడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అవినీతి రాష్ర్తంలో రాజ్యమేలుతుందని దీనిని ప్రజలు గమనించి తీర్పు నివ్వాలని కోరారు.

తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో చిన్న మచ్చకూడా లేకుండా జాతీయ నేతల నుంచి ప్రశంశలు అందుకొన్న తెలుగుదేశం పార్టీకి కోవూరు ప్రజలు పట్టంకట్టాలని తీర్పు నిచ్చారు.

రికార్డు డ్యాన్స్‌లో ఆనం వివేకానందరెడ్డి కూడా డ్యాన్స్‌ చేసుంటే ఇంకా బాగుండేదని - రోజా


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారని వైఎస్‌ఆర్‌సిపి మహిళా నేత రోజా అన్నారు. ఆదివారం కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, రేబాల గ్రామంలో జరిగిన రోడ్‌షోలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఉన్నతాశయంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, అదే నేడు పేద ప్రజలకు దేవుని ప్రసాదం లాగా తయారైందని, అందుకే వైఎస్‌ఆర్‌ను ప్రజలు నేటికీ దేవుడిలాగా తలచుకుంటున్నారని, వైఎస్‌ఆర్‌ సేవలను మరోసారి ప్రజలకు గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజుపాళెం బహిరంగసభలో పాల్గొన్న సందర్భంలో రికార్డు డ్యాన్స్‌ వేయించారన్నారు. ఈ రికార్డు డ్యాన్స్‌లో ఆనం వివేకానందరెడ్డి కూడా డ్యాన్స్‌ చేసుంటే ఇంకా బాగుండేదని ఆమె వ్యంగ్యంగా అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.

అందుకే జగన్‌ ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తూ ఆప్యాయతగా చిన్నా, పెద్దా తేడా లేకుండా మీకు మేము అండగా ఉంటాము నాయనా అంటూ దీవిస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగనున్న ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఓడించేందుకు ఆనం సోదరులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. పోలంరెడ్డి ఓడిపోతే సిఎంకు అపఖ్యాతి అంటకట్టి సిఎం సీటును ఆనం అధిరోహించవచ్చునన్న ఉద్దేశ్యంతోనే ఈ ద్రోహానికి ఒడికట్టారని ఆమె దుయ్యబట్టారు. అందుకే నిత్యం ఆనం సోదరులు సోమిరెడ్డితో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌సి పార్టీకి కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రసన్నకుమార్‌రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే మీరు జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రసన్నకుమార్‌రెడ్డిన అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ప్రసన్నను గెలిపిస్తే జగన్‌మోహన్‌రెడ్డి గెలిపించినట్లేనని, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారి మాటలు నమ్మవద్దని, ప్రసన్న గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కోవూరు ఉప ఎన్నికలో ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయని లగడపాటి జోస్యం

గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కంటే కూడా రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక పరిపాలన భేష్‌గా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో సంక్షేమ ఫలాలను సమర్థవంతంగా సిఎం కిరణ్‌ అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా కాంగ్రెస్‌ పార్టీ ఏమి చేయలేకపోయారని వైఎస్‌ఆర్‌సిపి నాయకులపై ఆయన ధ్వజమెత్తారు. వై.ఎస్‌.ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తూ వాటికి కొత్త రూపాన్ని ఇస్తున్నారని ఏ మోహం పెట్టుకుని విమర్శిస్తారో అర్థం కావడంలేదని లగడపాటి జగన్‌పై విరుచుకు పడ్డారు. 

రాష్ట్రంలో ఒంటరిగా కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే ధైర్యంలేక వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, తెలంగాణా రాష్ర్త సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావులు కుమ్మకై కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు కుట్రబన్నారని రాజగోపాల్‌ ఆరోపించారు. కోవూరు ఉప ఎన్నికలు నీతికి అవినీతికి జరిగే పోరాటమని ఈ ఎన్నికల ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ సెంట్రల్‌ , పశ్చిమ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఉన్నారు.

Nellore Kovur by election lagadapati rajgopal survey...

Nellore Kovur by election lagadapati rajgopal survey...

Nellore Kovur by election campaign YSRCP Laxmi Parvathi

Nellore Kovur by election campaign YSRCP Laxmi Parvathi

Nellore District Naidupeta Government officials Mobile Numbers

Nellore District Naidupeta Government officials Mobile Number.

కెసిఆర్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరంగా ఉంచితే, జగన్ టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యాడు - లగడపాటి


నెల్లూరు: వైయస్ రాజశేఖర రెడ్డికి తలవంపులు తెచ్చేలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాట్లాడుతున్నారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తానని జగన్ ప్రగల్భాలు పలికారని, టీడీపీతో కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోయారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కలిసి జగన్ అబద్ధాలకోరుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ విమర్శలకు ప్రతివిమర్శలు చేయడానికి కాంగ్రెసు నాయకులు మొహమాట పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా మెరుగైన పథకాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమలు చేస్తున్నారని కొనియాడారు. కెసిఆర్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరంగా ఉంచితే, జగన్ టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని, అందుకే తెలగాణలో పోటీ పెట్టలేదని ఆయన అన్నారు. కొవూరులో కాంగ్రెసును గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గానీ తెలుగుదేశం పార్టీని గానీ గెలిపిస్తే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. రైతు పోరుబాట పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని ఆయన విమర్సించారు.

సీమాంధ్రలో ఏకైక ఉపపోరు కావడంతో అందరి దృష్టి కోవూరు నియోజకవర్గంపైనే


నెల్లూరు : అన్ని పార్టీలకు పట్టు ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గం పైనే సీమాంధ్ర దృష్టి అంతా ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కమ్యూనిస్టుల పురిటిగడ్డ, టిడిపి కంచుకోట కోవూరు ఈసారి ఎవరి వశం కానుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఓటర్లలో అత్యధికులు బడుగు వర్గాల వారు ఉండటంతో వారిని ఆకర్షించేందుకు పార్టీలన్నీ వ్యూహాలను పన్నుతున్నాయి. ఆయా కులసంఘాల నేతలను ప్రచారంలోకి దింపి ఓటర్లకు గాలం వేసేందుకు యత్నిస్తున్నాయి. మహిళా సంఘాలతో సమావేశాలు జరిపి తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీలన్నింటికీ ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకం కావడంతో నగదు, మద్యం ఏరులై పారుతోంది. సీమాంధ్రలో ఏకైక ఉపపోరు కావడంతో అందరి దృష్టి కోవూరు నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. టిడిపి నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సిపిఎం నుంచి జొన్నలగడ్డ వెంకమ రాజు, లోక్‌సత్తా నుంచి నెల్లూరు నరసయ్యలతో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం టిడిపి, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు మధ్యే ఉంది. ఈ మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి.

దాంతో ఆయా పార్టీల అగ్రనేతలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన రెడ్డి ఐదు రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి పల్లెపల్లెలో ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం రాత్రి కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. లోక్‌సత్తా తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ రెండు రోజులు ప్రచారం చేశారు. సిపిఎం అభ్యర్థి వెంకమ రాజు నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోవూరుకు వచ్చారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి మధు గెలుపు కోసం తాను ప్రచారానికి వస్తానని టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు ప్రకటించినా పర్యటనకు ఆయన ఇంత వరకు రానేలేదు. ఏదిఏమైనా కోవూరు ఎన్నిక ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. కోవూరు నియోజకవర్గంలో 1993 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి (2004) మాత్రమే టిడిపి ఓటమి చవిచూసింది. ఈ నియోజకవర్గంపై టిడిపికి ఇంత పట్టు ఉండడానికి కారణం మత్స్యకారులు, గిరిజనులు ఈ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుండటమే.

ఈ నియోజకవర్గంపై ఇంతటి పట్టు ఉన్న టిడిపికి ఈ ఎన్నికలు మాత్రం ప్రతిష్ఠాత్మకంగా మారాయి. టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి జగన్ పంచన చేరడంతోపాటు తన వెంట టిడిపి కార్యర్తలు కొందరిని కూడా తీసుకెళ్లారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో రెండు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తూ దారి తప్పిన కేడర్‌ను మళ్లీ పట్టాలపైకి తెచ్చుకోగలిగారు. చంద్రబాబు ఈ నెల 4, 8 తేదీల్లో ఇక్కడ జరిపిన రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది. ఇదే స్ఫూర్తితో ప్రచారాలు హోరెత్తిస్తూ గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. పలువురు నేతలు అక్కడే మకాం వేశారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు పైనే నేతలు ఆశలు పెట్టుకున్నారు. సోమిరెడ్డికి ఈ నియోజకవర్గంలో బంధువర్గం, గత పరిచయాలు మెండుగా ఉండటంతో గెలుపుపై ఆయన ధీమాతో ఉన్నారు.

టిడిపికి కంచుకోటగా ఉన్న కోవూరుపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు ఈసారి ఎట్టిపరిస్థితుల్లో గెలుపు సాధించాలన్న తపనతో ఉన్నారు. ఈ స్థానం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది, 2009లో ఓటమిపాలైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డినే ఈసారి కూడా కాంగ్రెస్ రంగంలోకి దించింది. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణతో పాటు ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌ కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ వి.నారాయణరెడ్డి ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో శుక్రవారం జరిగిన బహిరంగసభలో కిరణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో గెలుపు వ్యూహాలపై సిఎం మార్గనిర్దేశం చేశారు. కోవూరులో ఎలాగైనా గెలవాలని, ప్రజా సమస్యలు తెలుసుకుని హామీలు ఇవ్వాలని నేతలకు ఆయన సూచించారు. వైయస్సార్సీ అభ్యర్థి ప్రసన్న ఎట్టి పరిస్థితుల్లోను గెలవకూడదంటూ సిఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స కూడా ఈ నెల 12 నుంచి ప్రచారానికి వస్తున్నారు.

మరోవైపు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దివంగత నేత వైయస్ పైన ఉన్న అభిమానమే తమకు ఓట్లు కురిపిస్తుందని తాము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఈ పార్టీ నేతలు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గంలో జగన్ పాల్గొన్న రోడ్‌షోలు వెలవెల పోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో గెలుపుపై పార్టీ నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయంటున్నారు. కొడవలూరు మండలంలో జగన్ ఈ నెల 5న జరిపిన రోడ్‌షోకు ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన కరవయిందంటున్నారు. అంతేకాగ మైపాడులో మత్స్యకారులపై జగన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది దాడులు చేయడం వివాదానికి తెరలేపింది. పూలమాల వేసేందుకు వస్తే పిడిగుద్దులు కురిపిస్తారా? అంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు జగన్ రోడ్‌షో సందర్భంగా ఊటుకూరు పెద్దపాళెం వాసులు ప్రసన్న ఏ పార్టీయో చెప్పాలని నిలదీశారు. సిపిఎం, లోక్ సత్తా కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని జగన్ నీతులు


నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద దోపిడిదారుడు అని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆరోపించారు. బెంగళూరులోని అత్యాధునిక వసతులున్న డెబ్బై గదులు ఉన్న రాజభవనాన్ని ఎలా నిర్మించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగర కాంగ్రెసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తాము ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అన్నారు.

జగన్‌కు తమ పార్టీని, పార్టీ నేతలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ విమర్శలను ఆయన తప్పు పట్టారు. లక్ష కోట్లు సంపాదించిన జగన్ బెంగళూరులో శ్వేత సౌధాన్ని నిర్మించారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాకు మొదటిసారిగా నాటు బాంబుల సంస్కృతి తీసుకు వచ్చింది తాజా మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని జగన్ నీతులు చెప్పడం విడ్డూరం, సిగ్గుచేటు అన్నారు. కొవూరులో కాంగ్రెసు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.

కోవూరు ఉపన్యాసాలు ఇది రోజూ జరుగుతున్న తంతే కదరా... వెళ్లిపోదాం రండి అంటూ


నెల్లూరు: కోవూరు ఉప ఎన్నిక ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్టస్థ్రాయి నాయకులు కోవూరు ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాల కోసం రాష్ట్ర స్థాయి నాయకులు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించడంతోపాటు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదన్న వ్యాఖ్యలు ఆ నియోజకవర్గం ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గ్రామస్తులు రాత్రి సమయాల్లో ఆయా గ్రామాల రచ్చబండల వద్ద చేరి ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ గ్రామాలకు ఏ నాయకులొచ్చారు, ఏమేం చెప్పారు అన్న విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ నియోజకవర్గంలో పర్యటించిన నాయకుల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలతోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎర్రం నాయుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా, కెవి.కృష్ణమూర్తి, వైఎస్‌ఆర్‌సి పార్టీ నుంచి జూపూడి ప్రభాకర్‌ తదితరులు ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది.

ఈ నేపథ్యంలో వీరు ఓటర్లను ఉద్దేశించి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా రోడ్‌షోలను నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరిమీద ఒకరు, ఒకపార్టీ మీద మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకున్నట్టు ప్రచారంలో ప్రసంగించడంతో నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎవరు ఏమి చెబుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో తలలు గోక్కుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ఆర్‌సి పార్టీలు కుమ్మక్కయ్యాయని’, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నాయని దుయ్యబడుతూ తమ పార్టీని, పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోవూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. అలాగే వైఎస్‌ఆర్‌సి పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పర్యటించి తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ ‘కుమ్ముక్కయ్యాయని’ రాష్ట్రంలో అస్థిరత పాలనను కొనసాగిస్తున్నాయని, ఆ రెండు పార్టీలను తరిమి కొట్టాలని, తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవలు, పేద, మధ్య తరగతి ప్రజలకు అందించిన ఫలాలను గురించి తెలియజేస్తూ ప్రచారాలను, రోడ్‌షోలను నిర్వహించారు.

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రె ండు రోజుల క్రితం కోవూరు పర్యటనలో రాజుపాళెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏకంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సి పార్టీలు ‘కుమ్ముకై్క’ ప్రజలను మభ్యపెడుతున్నాయని, అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన ప్రచారాలను ఒక్కసారి పరిశీలిస్తే రాష్టస్థ్రాయి నుంచి వచ్చిన నాయకుల్లో ప్రతిఒక్కరి నోటా ప్రతి రెండు పార్టీలు ‘కుమ్ముకై్క’ అయ్యారన్న పదాలు తప్ప ప్రజల సంక్షేమం గురించి, ప్రజలు పడుతున్న కష్టాల గురించి వివరించే నాధుడే లేడని, అంతా కుమ్మక్కులనే మాట్లాడుకుంటూ, దుమ్మెత్తి పోసుకోవడంపై ప్రజలు వారి మాటల పట్ల విసుగెత్తిపోయి అసహ్యించుకుంటున్నారు. వీరికి తోడు కొంతమంది మంత్రులు, తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సి పార్టీల నేతలు కూడా కొంతమంది ఇదే ధోరణి అవలంబిస్తుండడంతో ప్రజలు ఆయా బహిరంగ సభల వద్ద కొంతసేపే వుండి, ఇది రోజూ జరుగుతున్న తంతే కదరా... వెళ్లిపోదాం రండి అంటూ అక్కడ నుంచి నిష్ర్కమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ నాయకులు నాలుకలకు నరం లేదని, వారు చెప్పిందే వేదమైపోతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తూ వీరి ప్రసంగాలపై విమర్శలు చేసుకుంటూ తాము మాత్రం ఏ పార్టీకి ఓటు వేయాలో ఇప్పటికే మదిలో నిర్ణయించుకోవడంతోపాటు జరుగుతున్న ప్రచారాలకు, మీటింగులకు తూతూ మంత్రంగా హాజరవుతున్నారు. దీంతో నాయకుల్లో ఇప్పటికే ప్రజలు ఏ పార్టీ పక్షాన ఉన్నారో అన్న విషయం అర్థం గాక తికమకపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో తమకు తప్పదని, ఈ ప్రచారాలకు, రోడ్‌షోలకు రావడం పరిపాటైపోయింది. ఏది ఏమైనప్పటికీ రానున్న కొద్ది రోజుల్లో అభ్యర్థుల భవిష్యత్తు తేలనుందని ప్రజలు వ్యాఖ్యానించుకుంటున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh