online marketing

Sunday, March 11, 2012

కెసిఆర్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరంగా ఉంచితే, జగన్ టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యాడు - లగడపాటి


నెల్లూరు: వైయస్ రాజశేఖర రెడ్డికి తలవంపులు తెచ్చేలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాట్లాడుతున్నారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తానని జగన్ ప్రగల్భాలు పలికారని, టీడీపీతో కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోయారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కలిసి జగన్ అబద్ధాలకోరుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ విమర్శలకు ప్రతివిమర్శలు చేయడానికి కాంగ్రెసు నాయకులు మొహమాట పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా మెరుగైన పథకాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమలు చేస్తున్నారని కొనియాడారు. కెసిఆర్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరంగా ఉంచితే, జగన్ టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని, అందుకే తెలగాణలో పోటీ పెట్టలేదని ఆయన అన్నారు. కొవూరులో కాంగ్రెసును గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గానీ తెలుగుదేశం పార్టీని గానీ గెలిపిస్తే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. రైతు పోరుబాట పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని ఆయన విమర్సించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh