online marketing

Saturday, March 19, 2011

ఆంధ్రులు బిర్యానీ చేస్తే

నెల్లూరు/ విజయవాడ: ఆంధ్రులు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుందని, చెప్పులేకుండా హైదరాబాద్ వచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల గురించి, వారు చెప్పుల్లేకుండా హైదరాబాద్ వచ్చారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే నవ్వొస్తోందని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు.

ప్రజల మధ్య విద్వేషాగ్నులు రగిల్చడానికి కేసీర్ నానా పాట్లు పడుతున్నాడనీ, కెసిఆర్‌కు మతిభ్రమించిందని ఆయన అన్నారు. తెలుగుజాతి, తెలుగుప్రజలు అంతా అన్నదమ్ముల్లాంటివారనీ, వీరిలో ఒకరు ఎక్కువా... ఇంకొకరు తక్కువా అనే బేధం లేదన్నారు. స్వార్థప్రయోజనాలకోసం ప్రాంతీయవాదాన్ని తలకెత్తుకున్న కేసీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిదన్నారు.

ఇక ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడటంలో తప్పేమీ లేదని, రాజకీయాల్లో ఇవన్నీ సహజమన్నారు. అయినా చిరంజీవి తనకు మంచి స్నేహితుడు, మంచివాడని కితాబిచ్చారు. అటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు పోదామని అడగటంలో ఎటువంటి తప్పూ లేదని ఆనం అన్నారు.చిరంజీవితో కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి, వైఎస్ జగన్ వర్గానికి వచ్చిన ఇబ్బందేమిటో తనకైతే అర్థం కావడం లేదన్నారు. 

వరకట్నం వేధింపుల కేసులో సినీ నటి ఆమని

నెల్లూరు‌: వరకట్నం వేధింపుల కేసులో సినీ నటి ఆమని మంగళవారం నెల్లూరు కోర్టుకు హాజరయ్యారు. ఆమని సోదరుడి మొదటి భార్య శశికళ ఆమనిపై, ఆమె కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల కింద నెల్లూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఆమని సోదరుడు శశికళకు దూరమై మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

నెల్లూరు కోర్టుకు హాజరైన ఆమని ఫోటోలను మీడియా ప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె భర్త హజ్రత్ మీడియా ప్రతినిధులపై తిట్ల పురాణం అందుకున్నారు. కేసు విచారణను కోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

వివేకా మరో కేసిఆర్, సోనియాకు సీన్ లేదు: జగన్ వర్గం ఎమ్మెల్యేలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అనం వివేకానందరెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మరో నేత వెంకట్రామిరెడ్డి ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆనం వివేకానందరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివేకానంద నెల్లూరు కేసిఆర్‌లా తయారయ్యారన్నారు.

ఆనం వివేకానందరెడ్డికి నెల్లూరు జిల్లాలో సమవుజ్జీ లేకనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందంటే కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డియే అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాష్ట్రంలో పార్టీని గెలిపించే సీన్ లేదన్నారు. సోనియాగాంధీవల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు.

స్వామివారి హుండీ లెక్కింపు

రాపూరు : స్వామివారి  హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 30న పాలకమండలికి సన్మానం  ఈనెల 30వ తేదితో గడువు తీరిపో తున్న కోన దేవస్థానం పాలకమండలికి ఆలయ ఆవరణంలో ఘనంగా సన్మానం చేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

రాపూరు సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో నిలువు దోపిడి

రాపూరు: రాపూరు సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం పోయిన ప్రజలను అక్కడి అధికారులు నిలువు దోపిడి చేస్తూన్నారని బాదితులు ఆరోపిస్తున్నారు. అప్పు చేసి భూములు కొనుగోలు చేసుకుని జీతం కూడబెట్టుకుని ఇంటి స్ధలం, ఇల్లు కొనుగోలు చేసి రిజిస్టేషన్‌ కోసం కార్యాలయం వద్దకు పోతే వ్యాలివేషన్‌ కన్న అధికంగా డబ్బులు వసూళ్ళు చేస్తున్నారని తెలిపారు. కార్యాలయంలో ప్రవేటు వ్యక్తుల హవా కొనసాగడంతో రిజిస్ట్రేషన్‌ దారులు వారికి తలొగ్గక తప్పడం లేదని అంటున్నారు. దేవుడిని కలుసుకోవాలంటే పూజారి పర్మిషన్‌ కావాలన్నట్లు గా రిజిస్టార్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ఈ ప్రవేటు వ్యక్తుల సహకారం ఖచ్చితం గా కావాల్సిందేనని వీరు ఎంత అడిగితే అంత చెల్లించాల్సిందే అంటున్నారు. కార్యాలయం మూసివేసిన రాత్రులు సమయాలలో రహస్య ప్రాంతాలలో కూర్చుని పాత తేదిలతో రిజిస్ట్రేషన్‌ లు చేసి లక్షల రూపాయలు అక్కడి రిజిస్టార్‌ తీసుకుంటున్నట్లు గా సమాచారం. లైసెన్స్‌ పొందిన ఓ వ్యక్తి స్టాంపులు అమ్మకాలలో చేతి వాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ధర కన్న ఎక్కువ ధరకు అమ్ముకుని లబ్దిపొందుతున్నాడు. ప్రశ్నించిన వారికి ఆయన తాపిగా లైసెన్స్‌పొందిన ప్రవేటు వ్యక్తులం కాబట్టి ప్రతి స్టాంపుకు అదనంగా పది రూపాయలు వసూళ్ళు చేస్తున్నట్లు పార్టీలకు చెప్పడం విశేషం. గతంలో అవినీతి నిరోధక అధికారులు సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పై దాడి చేసి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టి అక్రమ దారుల పై కేసులు నమోదుచేసిన వారిలో మార్పు రాలేదని, అవినీతికి అలవాటు పడ్డ అధికారులను, లైసెన్స్‌ తో ఎక్కువ ధరకు స్టాంపులు విక్రయిస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకుని రాపూరు రిజిస్టార్‌ కార్యాలయాన్ని అవినీతి కూపం నుండి బైటకు తీసుకురావాలని బాదితులు జిల్లా అధికారులను, ఎసిబి అధికారులను కోరుతున్నారు. సబ్‌రిజిస్టార్‌ వివరణ ................ స్టాంపుల అమ్మకాలలో జరుగుతున్న అవకతవకలపై సబ్‌రిజిస్టార్‌ దృష్టికి తీసుకుని రాగా అటువంటిది ఏమి లేదంటూ స్టాంపులు అమ్ముతున్న వ్యక్తిని పిలిచి విచారించ గా స్టాంపుకు పది రూపాయలు అధనంగా తీసుకున్నట్లు సబ్‌రిజిస్టార్‌ ముందే చెప్పడం జరిగింది. ఇక మీదట అధిక ధరలకు స్టాంపులు విక్రయించవద్దని ఆయన అతనిని హెచ్చరించి పంపించడం జరిగింది.

రాపూరు పోస్టింగ్‌ కోసం ఎంపిడీవో తహతహ?

రాపూరు‌: రాపూరు ఎంపిడీవో ఇ.వాణి దీర్ఘకాలిక సెలవులో వెళ్లి మళ్లీ రాపూరులో బాధ్యతలు నిర్వహించేందుకు తహతహలాడుతున్నట్లు తెలిసింది. రాపూరు ఎంపిడీవోపై ఎంపిపి సూర్యప్రకాష్‌యాదవ్‌ ఉపాధిహామీ పథకంలో అవకతవకలకు పాల్పడినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్‌కు, పలువురు అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్న విషయం తెలిసిందే. అదేవిదంగా ఎంపిడీవో ఎంపీపికి తెలియకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో అసంతృప్తికి గురైన ఎంపీపి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు. రూ.1.70కోట్ల వరకు ఉపాధి నిధుల్లో అవినీతి జరిగినట్లు ఎంపీపి అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. కొన్ని చోట్ల పనులు చేయకనే చేసినట్లు రికార్డుల్లో చూపినట్లు ఎంపీపి ఆరోపించి ఉన్నారు.

ఈ విషయమై ఉపాధిహామీ పథకం అంబుడ్స్‌మన్‌ ప్రభాకర్‌రావు కూడా ఉపాధిహామీలో కొన్ని అవకతవకలు గుర్తించి, ఎంపిడీవోను విచారించి అధికారులకు నివేధిక అందించినట్లు తెలిసింది. ఎంపిడీవోపై పలు ఫిర్యాదులు ఉండటంతో ఆమెపై ఇటు ఆర్థికశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపిడీవో సెలవుపై వెళ్లవలసిందిగా సూచించినట్లు తెలిసింది. అయితే ఎంపిడీవోపై ఇటు జడ్పీచైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా ఆమె పనితీరుపట్ల సంతృప్తి కరంగా లేరని తెలిసింది. దీంతో ఎంపిడీవోకు రాపూరు పోస్టింగ్‌ అందని ద్రాక్షలాగ మారిందని ఈ ప్రాంతవాసులు చర్చించుకుంటున్నారు. జనవరి 25 నుండి ఎంపిడీవో విధులకు హాజరు కాకుండా సెలవులో ఉండేది తెలిసిందే. రిపబ్లిక్‌డే రోజు జెండా ఆవిష్కరణ ఎంఈవో చేపట్టారు.

అలాగే రచ్చబండ కార్యక్రమానికి కూడా ఎంపిడీవో హాజరు కాలేదు. ఇక్కడ పనిచేస్తున్న సూపరిండెంట్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు రచ్చబండ కార్యక్రమానికి అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈవోపీఆర్‌డీ ఉండటంతో ఆమెకు ఇన్‌చార్జ్‌ ఎంపిడీవోగా బాధ్యతలు అప్పగించి ఉన్నారు. రాపూరు లాంటి ప్రాంతం అధికారులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇటు జిల్లా అధికారులు, రాజకీయ నాయకుల జోక్యం పెద్దగా లేకపోవడంతో అధికారులు ఎక్కువ రాపూరు వైపు మొగ్గుచూపుతున్నారు.

ముందు వెనుకబడిన ప్రాంతమని కనీస సౌకర్యాలు లేని ప్రాంతమని రాపూరుకు వెళ్లమని చెప్పే అధికారులు తర్వాత దీర్ఘకాలంగా ఇక్కడే తిష్టవేయడం గమనార్హం. ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానికులు, ఇతరులు దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతం పట్ల జిల్లా అధికారులు సైతం చిన్నచూపు చూడటం విశేషం. రాపూరు మండలంలో ఉపాధిహామీ పథకానికి సంబంధించి సుమారు రూ.9కోట్లల వరకు కొత్త పనుల కోసం ప్రతిపాదన లు పంపి ఉండటంతో ప్రశాంతమైన ఈ ప్రాంతంలో మళ్లీ విధులు నిర్వహించేందుకు ఎంపిడీవో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఎంపీపితో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది

చదివినంతవరకు ఉచితంగా చదివిస్తా

ఆత్మకూరు : మండలంలో 10వ తరగతి విద్యార్థులు 550 మార్కులకుపైగా సాధిస్తే వారు పైతరగతులలో కూడా చదివినంతవరకు తమ సొంత ఖర్చులతో ఉచిత చదువునందిస్తానని రియల్‌ఎస్టేటర్‌ ఇందూరు నరసింహారెడ్డి, మాధవి దంపతులు తెలిపారు. గురువారం అనంతసాగరం మండలం వెంగంపల్లి జడ్పీహైస్కూల్‌లో వారు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షఅట్టలు, పెన్నులు, పెన్సిల్స్‌, ఎరేజర్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

మండలంలో ఎవరికైనా 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా వస్తే ఆపై తరగతులు చదివించేందుకు కష్టఖర్చునైనా భరిస్తామని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించి గురువులకు, తల్లిదండ్రులకు, మీ ఊరికి గుర్తింపు తీసుకునిరావాలని తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిల్స్‌, ఎరేజర్స్‌ను రియల్‌ఎస్టేటర్‌ ఇందూరు నరసింహారెడ్డి, మాధవి దంపతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.సుజనమ్మ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి సదస్సు


 నెల్లూరు :స్థానిక విక్రమసింహపురి విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ సదస్సును నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విజేత జడ్డా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ది ఫౌండేషన్‌ హెడ్‌-2011 అనే పేరుతో విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిఎ విద్యార్థులను ఆహ్వానించామని తెలిపారు. ఈ సదస్సులో అత్యుత్తమ యంగ్‌ మేనేజర్‌, బిజెనెస్‌ క్విజ్‌, అడ్వర్‌టైజ్‌మెంట్ల రూపకల్పన అనే అంశాల్లో పోటీ నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. ఈ సదస్సులో రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జెవి.ప్రభాకర్‌రావు, విసి ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు, రిజిష్ట్రార్‌ వి.నారాయణరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన ఎంబిఎ విద్యార్థులు 98489 18640, 99893 20068 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

జిల్లాలో 35 జంటలకు సామూహిక వివాహాలు

ఆత్మకూరు : జిల్లాలో ఈ ఏడాది నిరుపేదలైన 35 మంది జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగిందని మైనార్టీ కార్పోరేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు జమీర్‌ అహ్మద్‌ తెలిపారు. శుక్రవారం ఏఎస్‌పేట మండలం రాజవోలు గ్రామంలో ప్రార్థన మందిరం వద్ద ఐదు మంది జంటలకు ఆయన సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో మైనార్టీలకు అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఫాస్టర్‌ స్టీఫన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మమ్మ-లక్ష్మయ్య, పుల్లమ్మ-శేఖర్‌, మమత-శ్రీను, మాధవి-ప్రసాద్‌, నాగలక్ష్మి-వినోద్‌ జంటలకు సాంప్రదాయబద్దంగా దైవసేవకుల ప్రార్థనల నడుమ వివాహాలు నిర్వహించారు. అనంతరం ఒక్కోక్క జంటకు రూ.3 వేలు వంతున నగదు చెక్కులను పంపిణీ చేశారు. రూ.15 వేల విలువైన వంట పాత్రలను పంచిపెట్టారు. ఐదు జంటల బంధువులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దైవసేవకులు స్టీఫన్‌, విజయకుమార్‌, ఆనందరావు, జాన్‌డేవిడ్‌, మోషే, దావీదు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌లో 9 మంది డీబార్‌


నెల్లూరు ‌:జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో శుక్రవారం జరిగిన ప్రధమ సంవత్సరం పరీక్షలో 9 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో కామర్స్‌-1, శ్రీసర్వోదయ కళాశాలలో కెమిస్ట్రీ-2, కామర్స్‌-1, ధనలక్ష్మీపురం చైతన్య జూనియర్‌ కళాశాల బిసెంటర్‌లో కామర్స్‌-1, కోట ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ జూనియర్‌ కళాశాలలో కెమిస్ట్రీ-1, ఆత్మకూరు షిర్దీసాయిరాం జూనియర్‌ కళాశాలలో కామర్స్‌-1, ఉదయగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బిసెంటర్‌లో కెమిస్ట్రీ-2 మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. 28,747 మంది రెగ్యులర్‌ విద్యార్థులకుగాను 27,047 మంది, 620 మంది ఒకేషనల్‌ విద్యార్థులకుగాను 532 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 29,367 మందికిగాను 1,783 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో 27,584 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షల జిల్లా కన్వీనర్‌, ఆర్‌ఐఒ జి.వరప్రసాద్‌, కమిటీ సభ్యులు సుబ్బారావు, హరిబాబు, వివిధ స్క్వాడ్‌ బృందాలు 61 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి

బిల్లుల కోసమే ’మేకపాటి’ రాజకీయాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:ఘనత వహించిన, నీతి నిజాయితీ కలిగివున్నామని చెప్పుకునే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కేవలం కాంట్రాక్ట్‌ పనుల్లో పెట్టిన కోట్ల రూపాయల బిల్లులను రాబట్టుకోవడానికే రాజకీయం చేస్తున్నారని రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఘాటుగా విమర్శించారు. మంత్రి ఆనం నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ తీసుకుని కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు ఆనం మేకపాటికి ధన్యవాదాలు తెలిపారు. మేకపాటి నేరుగా సిఎం వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని కాంగ్రెస్‌కే ఓటు వేస్తామని నమూనా కోడ్‌ అడిగి తీసుకుని నిజాయితీగా కాంగ్రెస్‌కు ఓటు వేయడం జరిగిందన్నారు.

అయితే ఇదే నిజాయితీతో నెల్లూరు స్థానిక సంస్థల్లో కూడా ఓటు వేసి జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కూడా ఇదే అవకాశాన్ని కల్పిస్తారా అని ప్రశ్నించారు. ఇది కేవలం వందల కోట్ల రూపాయల పనులు, బిల్లుల కోసమే మేకపాటి సోదరులు రాజకీయం చేస్తూ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఓటు వేయనీయకుండా బెంగుళూరు మిరియాల తోటలు, కాఫీ చెట్ల కింద దాచడం ఏమిటని ప్రశ్నించారు. మేకపాటి సోదరులు చెప్పేదొకటి, చేసేదొకటని, మిమ్మల్ని నమ్మి ఏ కాంగ్రెస్‌ నాయకుడు ఇక ముందుకు రాడని పేర్కొన్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఒక్కసారి పాత చరిత్రను మళ్లీ గుర్తు చేసుకోవాలని హితవుపలికారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మెడపట్టి బయటకు నెట్టింది, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది గుర్తు చేసుకుని ఈ సారైనా కాంగ్రెస్‌ పార్టీలో నీ నిజాయితీని రుజువు చేసుకోవాలని తెలిపారు. రెండున్నర నెలలు పదవిలో ఉండే కాకాణిని దించడానికి ఇంతమంది కావాలా అని ఆనం వ్యంగ్యంగా అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనపడని అవినీతి ఇప్పుడు కలెక్టరేట్‌లో కనిపించిందా అని పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని విమర్శించారు. ఇంటిపక్కనే ఉన్న ఎరువుల అవినీతి కుంభకోణంలో ఒక అధికారిని బ్లాక్‌మెయిల్‌ చేసి భయపెట్టిన సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని టీడీపీ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బొల్లినేని గిరినాయుడు, యానాదిశెట్టి, చెంచలబాబు యాదవ్‌, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గురవారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమీపిస్తున్న మండలి ఎన్నికలు... అభ్యర్థుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

నెల్లూరు:స్థానిక సంస్థల ఎన్ని లు దగ్గర పడడంతో అభ్యర్థుల్లో రోజు రోజుకీ ఉత్కంఠత పెరుగుతున్నప్పటికీ అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న వాకాటి నారాయణరెడ్డి శిబిరానికి రోజు రోజుకూ జడ్పీటిసిలు, ఎంపిటిసిలు చేరడంతో వాకాటి ధీమాగా ఉంటున్నట్లు సమాచారం. గత పాతికేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన వాకాటి అంచెలంచెలుగా పార్టీలోని ప్రముఖుల మన్ననలు, అండదండలు పొంది నేడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబడడంతో ఆయన గెలుపు కోసం జిల్లాలోని అగ్రనేతల నుండి సాధారణ కార్యకర్తల వరకు కృషి చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఛైర్మన్‌గా రైతుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ఆదుకున్నారు.

నష్టాల ఊబిలో ఉన్న కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకును రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధిపరచి లాభాల బాటలో పయనింపచేసి లాభాలను ఆర్జింపచేశారు. పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా పనిచేస్తూ వాకాటిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎలాగైనా గెలిపించి అధిష్ఠానం వద్ద తమ పట్టు నిలుపుకోడానికి ఆనం సోదరులతోపాటు నేదురుమల్లి వర్గం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ఓటర్లను జాగ్రత్తగా ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. సందిగ్ధంలో ఉన్న ఓటర్లను కూడా గుర్తించి వారికి నచ్చచెప్పి వారిని కూడా పిలిపించి తమ శిబిరాలకు తరలించుకుని తమ మద్దతుదార్ల సంఖ్యను తగ్గకుండా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు ఎన్ని రకాల పావులు కదిపినా వాకాటికి ఉన్న మంచిపేరే ఆయన అభివృద్ధికి సోపానమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన శిబిరానికి 300 పైబడి ఓటర్లు చేరుకున్నారని, ఆయన గెలుపు తథ్యమని పలువురు రాజకీయ ప్రముఖుల విశ్వసనీయ సమాచారం.

ఘనంగా గౌసేఆజమ్‌ దస్తగిర్‌ గంథమహోత్సవం

ఆత్మకూరు: ఏఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామంలో ఉన్న గుల్షన్ఫ్రాయి (సుఫీస్వామి) ఆధ్వర్యంలో గురువారం గౌసేఆజమ్‌ దస్తగిర్‌ గంథమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కర్నూలు, కడప, ఒంగోలు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత గుల్షన్ఫ్రాయి ఆశ్రమంలో గంధాన్ని దంచి తయారు చేశారు.అనంతరం ఫకీర్ల వాయిద్యాల మధ్య, బుర్జువుల కీర్తనలతో గుల్షన్ఫ్రాయి కుమారుడు సయ్యద్‌ మిర్జాబ్ఫ్రాయి గంధ కలశాన్ని శిరసుపై ఉంచుకుని ఏఎస్‌పేట ఖాజానాయబ్‌ రసూల్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం జమ మసీదు దగ్గర ఉన్న గౌసేఆజమ్‌ దస్తగిర్‌ వద్దకు గంథం చేరింది. గంథాన్ని నిషానికి పూసి ఫాతేహా కార్యక్రమాన్ని నిర్వహించారు. సలామ్‌ పాడి గంథాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా సరస్వతిపూజ

పొదలకూరు రూరల్‌,మేజర్‌న్యూస్‌: మండలంలోని ఇనుకుర్తి గ్రామంలోని జడ్పీ ఉన్నతపాఠశాలలో గురువారం జరిగిన సరస్వతిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సరస్వతి పూజకు మండల ఎంపిడీవో సరళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ స్కూల్‌ విద్యార్ధులకు సాఫ్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వి.రవికుమార్‌ తల్లి శారదమ్మ జ్ఞాపకార్ధంగా 10వ తరగతి విద్యార్ధులకు ప్యాడ్లు, పెన్నులు అందచేశారు.ఎంపిడివో సరళ మాట్లాడుతూ విద్యార్ధులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.మెరీనా మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మార్కులు సాధించాలని విద్యార్ధులకు విలువైన సలహాలు చేశారు. మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకుని రావాలని కోరారు. అంతకు ముందు విద్యార్ధులు హాల్‌ టికెట్లను సరస్వతి విగ్రహం ముందు ఉంచి వారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మ్రాజీ సిడిసి చైర్మన్‌ పెదమల్లు రమణారెడ్డి, సర్పంచ్‌ నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఏవి.సుధాకర్‌, పద్మావతి, గోపి, శ్రీనివాసులు తదితరులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గరుఢ వాహనంపై రంగడు

పొదలకూరు : పొదలకూరు మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఉన్న శ్రీ రుక్మిణీదేవి పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామివార్లను గరుఢసేవ వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, 10 గంటలకు అష్టోత్తర సహస్రనామపూజలు, రాత్రి 9 గంటలకు పూజలు, పండరి భజనలు, రాత్రి 11 గంటలకు గరుఢవాహనంపై శ్రీ రుక్మిణీసమేత పాండుగడులను విశేష వస్త్రాభరణాలతో అలంకృతులైన స్వామివార్లను భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ గరుఢసేవకు ఉభయకర్తలుగా మాలపాటి మస్తాన్‌రెడ్డి, పద్మమ్మ ద ంపతులు నిర్వహించారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh