online marketing

Saturday, March 19, 2011

రాపూరు పోస్టింగ్‌ కోసం ఎంపిడీవో తహతహ?

రాపూరు‌: రాపూరు ఎంపిడీవో ఇ.వాణి దీర్ఘకాలిక సెలవులో వెళ్లి మళ్లీ రాపూరులో బాధ్యతలు నిర్వహించేందుకు తహతహలాడుతున్నట్లు తెలిసింది. రాపూరు ఎంపిడీవోపై ఎంపిపి సూర్యప్రకాష్‌యాదవ్‌ ఉపాధిహామీ పథకంలో అవకతవకలకు పాల్పడినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్‌కు, పలువురు అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్న విషయం తెలిసిందే. అదేవిదంగా ఎంపిడీవో ఎంపీపికి తెలియకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో అసంతృప్తికి గురైన ఎంపీపి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు. రూ.1.70కోట్ల వరకు ఉపాధి నిధుల్లో అవినీతి జరిగినట్లు ఎంపీపి అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. కొన్ని చోట్ల పనులు చేయకనే చేసినట్లు రికార్డుల్లో చూపినట్లు ఎంపీపి ఆరోపించి ఉన్నారు.

ఈ విషయమై ఉపాధిహామీ పథకం అంబుడ్స్‌మన్‌ ప్రభాకర్‌రావు కూడా ఉపాధిహామీలో కొన్ని అవకతవకలు గుర్తించి, ఎంపిడీవోను విచారించి అధికారులకు నివేధిక అందించినట్లు తెలిసింది. ఎంపిడీవోపై పలు ఫిర్యాదులు ఉండటంతో ఆమెపై ఇటు ఆర్థికశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపిడీవో సెలవుపై వెళ్లవలసిందిగా సూచించినట్లు తెలిసింది. అయితే ఎంపిడీవోపై ఇటు జడ్పీచైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా ఆమె పనితీరుపట్ల సంతృప్తి కరంగా లేరని తెలిసింది. దీంతో ఎంపిడీవోకు రాపూరు పోస్టింగ్‌ అందని ద్రాక్షలాగ మారిందని ఈ ప్రాంతవాసులు చర్చించుకుంటున్నారు. జనవరి 25 నుండి ఎంపిడీవో విధులకు హాజరు కాకుండా సెలవులో ఉండేది తెలిసిందే. రిపబ్లిక్‌డే రోజు జెండా ఆవిష్కరణ ఎంఈవో చేపట్టారు.

అలాగే రచ్చబండ కార్యక్రమానికి కూడా ఎంపిడీవో హాజరు కాలేదు. ఇక్కడ పనిచేస్తున్న సూపరిండెంట్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు రచ్చబండ కార్యక్రమానికి అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈవోపీఆర్‌డీ ఉండటంతో ఆమెకు ఇన్‌చార్జ్‌ ఎంపిడీవోగా బాధ్యతలు అప్పగించి ఉన్నారు. రాపూరు లాంటి ప్రాంతం అధికారులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇటు జిల్లా అధికారులు, రాజకీయ నాయకుల జోక్యం పెద్దగా లేకపోవడంతో అధికారులు ఎక్కువ రాపూరు వైపు మొగ్గుచూపుతున్నారు.

ముందు వెనుకబడిన ప్రాంతమని కనీస సౌకర్యాలు లేని ప్రాంతమని రాపూరుకు వెళ్లమని చెప్పే అధికారులు తర్వాత దీర్ఘకాలంగా ఇక్కడే తిష్టవేయడం గమనార్హం. ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానికులు, ఇతరులు దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతం పట్ల జిల్లా అధికారులు సైతం చిన్నచూపు చూడటం విశేషం. రాపూరు మండలంలో ఉపాధిహామీ పథకానికి సంబంధించి సుమారు రూ.9కోట్లల వరకు కొత్త పనుల కోసం ప్రతిపాదన లు పంపి ఉండటంతో ప్రశాంతమైన ఈ ప్రాంతంలో మళ్లీ విధులు నిర్వహించేందుకు ఎంపిడీవో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఎంపీపితో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh