online marketing

Thursday, April 12, 2012

కాంగ్రెస్ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.--మేకపాటి రాజమోన్‌రెడ్డి

నెల్లూరు; డక్కిలి ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఉండవని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోన్‌రెడ్డి అన్నారు. గురువారం డక్కిలి మండలం వెలికల్లులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ పథకాలు తిరిగి ప్రజలకు చేరువవుతాయన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో కనిపించే ఏకైక పార్టీ తమదే నన్నారు. కాంగ్రెస్ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ లకు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని మేకపాటి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపిీ నాయకుడు మచ్చాల నాగభూషణం తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కార్యక్రమంలో నాయకులు మేరిగ మురళీ, ఎ.వి రెడ్డి, పాల్గొన్నారు. వెంకటగిరిలో.. తిరుమల నుంచి వెంకటగిరి చేరుకొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి వెంకటగిరిలో ఆపార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక క్రాస్ రోడ్డులో ఆపార్టీ కార్యకర్తలు రాజమోహన్‌రెడ్డికి బాణా సంచా కాల్చి స్వాగతం పలికారు.

మే నెల 1 నుంచి పెంచలకోన లో వెలిసిన పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: రాపూరు మండలం పెంచలకోన లో వెలిసిన పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు  మే నెల 1 నుంచి ప్రారంభమయ్యే శ్రీ పెంచలస్వామి  బ్రహ్మోత్సవాలు  విజయవంతం చేయాలని ఆలయ పాలకమండలి చైర్మన్ నెల్లూరు రవ్రీంద్రారెడ్డి కోరారు. పెంచలకోనలో గురువారం ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడతూ కోనలో ఆరు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ దీనికి ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. రోడ్లు మరమత్తులు చేయాలని, మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. అగ్నిమాపక కేంద్రం వారు ఉత్సవాల్లో వాహనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా అడవుల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. కార్యక్రమంలో ఆయల పాలక మండలి అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బారీగా ఏర్పాట్లు ఈ ఏడాది జరిగే శ్రీవారి బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి గురువారం చైర్మన్ ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన సమీక్షలో నిర్ణయించారు. కోన క్షేత్రంలో మంచినీటి వసతి ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. భక్తులకు పూర్తిస్తాయిలో సౌకర్యాలు ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించా

Wednesday, April 11, 2012

మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థుల శాతం రోజురోజుకూ...

నెల్లూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని పాలకులు తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య డిమాండు చేశారు. స్థానిక యుటిఎఫ్‌కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థుల శాతం రోజురోజుకూ తగ్గుతోందన్నారు. ఆ శాతం ప్రయివేటు పాఠశాలల్లో పెరుగుతోందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని ప్రాథమిక పాఠశాలలను జనవిజ్ఞాన వేదిక బృందం పరిశీలించి అధ్యయనం చేసిందన్నారు. అక్కడి పాఠశాలల వాతావరణం, ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్య తల్లిదండ్రుల్లో మంచి భరోసా కల్పిస్తున్నాయన్నారు. అందువల్లే ఆ రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు తమపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నాయని తెలిపారు. మనరాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతోనే ప్రయివేటు విద్యాలయాలపై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రయివేటు విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తుండడంతో ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక పాఠశాలలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల హాజరు, ఉత్తీర్ణతా శాతాలు తగ్గడంపై ప్రభుత్వం రకరకాల సర్వేలు, ప్రయోగాలు చేస్తుందేగాని అందుకు గల కారణాలను మాత్రం విశ్లేషించడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ప్రతి మండలంలో నాణ్యమైన విద్య బోధించే పాఠశాలలను ఏర్పాటు చేసి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ రంగ విద్యపై నమ్మకం కలిగించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో మునిగి తేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయక, మిల్లర్లు కారుచౌకగా అడుగుతుండడంతో రైతులు ధాన్యాన్ని పొలాలు, రోడ్ల వెంబడి ఆరబెట్టుకుని రేటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ సంక్షోభంపై జనవిజ్ఞాన వేదిక మే 2వ వారంలో చర్చావేదిక నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యుత్‌కోతలు తీవ్రం కావడంతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి అవసరమైన 12500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నా అదనంగా 28,800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలను చేపట్టారని, అవి ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు. ఆ ధర్మల్‌ కేంద్రాలన్నీ నెల్లూరు తీర ప్రాంతాన్ని కలుషితం చేయనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కృష్ణపట్నం పోర్టులో పరిపాలనా భవనం కంపించింది సునామీ ప్రభావం వుండవచ్చని హెచ్చరికలు..

నెల్లూరు : సునామీ భయంతో ముత్తుకూరు తీర ప్రాంతంలో బుధవారం రోజున అలజడి చెలరేగింది. మద్యాహ్నం నుంచి రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భీతావహులయ్యారు. ముఖ్యంగా తీరగ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కృష్ణపట్నం, నేలటూరు, ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కృష్ణపట్నం పోర్టులో పరిపాలనా భవనం కంపించింది. సాయంత్రం సునామీ ప్రభావం వుండవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని హుటాహుటిన బస్సుల్లో ముత్తుకూరుకు తరలించారు. బెర్తుల వద్ద లంగరు వేసిన నాలుగు నౌకలను వెంటనే సముద్రంలోకి పంపివేశారు.

ఎగుమతి, దిగుమతులను తాత్కాలికంగా నిలిపి వేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు తీరగ్రామాల్లో పర్యటించారు. నేలటూరు పట్టపుపాళెంలో మత్స్యకారులతో మాట్లాడారు. అవసరమైతే మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తహసీల్దారు సుశీల తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సముద్రంలో అలల తాకిడి పెరిగింది. సముద్రం స్వల్పంగా ముందుకు వచ్చింది. సాయంత్రం ఆరు గంటల వరకు సునామీ భయంతో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 2006 డిసెంబరు నాటి సునామీ పరిస్థితులను గుర్తు తెచ్చుకొని భయపడ్డారు. అయితే రాత్రికి సునామీ ముప్పు తప్పిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సునామీ ప్రకంపనంతో భీతిల్లిన కోడూరు బీచ్ తోటపల్లిగూడూరు: సునామీ కారణంగా మండలంలోని కోడూరు బీచ్‌లో బుధవారం మధ్యాహ్నం పర్యాటకులు భీతిల్లారు. ఏ క్షణంలోనైనా సముద్రం ఉప్పొంగి ప్రమాదాన్ని సృష్టించవచ్చని భయబ్రాంతులతో సముద్రం సరిహద్దుకు చేరకుండా దూరంగానే ఉండిపోయారు. జాలర్లు తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రత ఎక్కువగా కనిపించింది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎస్ఐ సాంబశివరావు సముద్రతీరం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tuesday, April 10, 2012

వెలుగొండల్లో ఉన్న స్తం భాలగిరి కోనలో సేదతీరుతారని, భక్తుల కొంగుబంగారంలా

నెల్లూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దిన దినాభి వృద్ధి చెందుతున్న దేవునివెల్లంపల్లి స్తం బాలగిరి ఆలయాన్ని ప్రభు త్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వెంకటగరి ఎ మ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభిప్రా య పడ్డారు.సోమవారం ఆయన తిరునాళ్ళకు హ జరై స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆలయానికి ఆనుకొనే స్తంబాలగిరి కోన ఉండటం, తిరునాళ్ళకు భక్తులు అధిక సం ఖ్యలో హజరుకావడం తదితర విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీ సుకొని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేం ద్రంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. వేసవిలో భక్తులు ఈ ఆలయానికి సమీపంలోని వెలుగొండల్లో ఉన్న స్తం భాలగిరి కోనలో సేదతీరుతారని, భక్తుల కొంగుబంగారంలా విరాజిల్లుతు న్న ఈ ఆలయం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను ఆ యన ప్రశంసించారు. ఆలయానికి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంద ని తాను శాశ్వత మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయించానని ఆ యన వివరించారు.

కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలో అధికార పార్టీకి 3వ స్థానం దక్కడం ఇందుకు ఉదాహర

నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌ల కారణంగా అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితికి చేరుకున్నారు. ఏ వస్తువు కొనాలన్నా విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మాది పేదల పార్టీ అని, పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, అందుకు సంబంధించి చెప్పడం, అధికారంలోకి రావడం జరిగింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రస్తుతం పేద, మధ్యతర గతి ప్రజల నడ్డి విరిచేవిధంగా ప్రభుత్వ వ్యవహారం ఉండడంతో ప్రజల్లో నిరాసక్తత నెలకొంది. మీ పని మీరు చేసుకుని పొండి, రానున్న ఎన్నికల్లో మాపని మేం చేస్తామని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.   గత రెండు నెలల నుంచి విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచిన ప్రభుత్వం తాత్కాలికంగా సర్‌ చార్జీలను కొద్దిగా తగ్గించడంతో దీనివల్ల ప్రయోజనం లేదని ప్రజలు అంటుండగా విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. పెంచిన విద్యుత్‌ చార్జీల్లో కేవలం సర్‌ చార్జీలు తగ్గించడంలో తమకు ఏమీ ప్రయోజనం లేదని ప్రజలు అంటున్నారు. నిత్యావసర వస్తువు ఏది కొనాలన్నా కిలో రూ.90ల నుండి రూ.120ల లోపు ఉంటున్నాయి. అలాగే 49-51 రూపాయల మధ్యలో ఉండిన కిలో నూనె ప్యాకెట్‌ ప్రస్తుతం 82-84 రూపాయల మధ్యలో అమ్ముతుండడంతో పేద ప్రజలు దినసరి కూలీల మీద ఆధారపడి జీవించేవారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీనికి తోడు కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిఒక్క కూరగాయ కిలోకు రూ.25ల నుండి రూ.30లకు తక్కువ లేదంటే తాము ఏవిధంగా బతుకులు ఈడ్చాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.   పేద, మధ్యతరగతి ప్రజలను విస్మరిస్తున్న ప్రభుత్వం తమ ఇష్టానుసారం ప్రతిఒక్క వస్తువుపైన రేట్లు పెంచడంతోపాటు వ్యాట్‌ పేరు మీద అదనపు భారాన్ని వేయడంతో కనీసం కొనుగోలు చేసేందుకు దుస్తులు కూడా అందుబాటు ధరల్లో లేవని పేదలు చెబుతున్నారు. అలాగే ఇటీవల వ్యాట్‌ పేరుతో బంగారంపు ధరలను కూడా విపరీతంగా పెంచేయడంతో ఉన్నతస్థాయి కుటుంబాల్లో కూడా ప్రభుత్వ చర్యలపట్ల అసమ్మతి చెలరేగుతోంది. ఎన్నికల ముందు ఒక మ్యానిఫెస్టోను, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మ్యానిఫెస్టోను పార్టీలు పెడుతుండడంతో ప్రజల్లో పార్టీలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనికి ఉదాహరణగా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.   గత కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలో అధికార పార్టీకి 3వ స్థానం దక్కడం ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరిలో విపరీతంగా పెరిగిపోయిన రేట్లపైనే చర్చలు జరుగుతున్నాయనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏ వస్తువు రేట్లు పెంచినా పోరాటాలు చేసే ప్రతిపక్షం, వామపక్షాలు కూడా నామ్‌కే వాస్తుగా పోరాటాలు చేసి చేతులు దులుపుకుంటుం డడంతో వారిపై కూడా ప్రజలు అపనమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఇంటి పన్నులు, మంచినీటి కుళాయిలు, విద్యుత్‌, పలసరుకులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల న్నింటిపై వ్యాట్‌ పేరుతో విపరీతంగా బాదుతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజల బతుకు మరీ ఛిద్రమవుతోంది.   వీరిని దృష్టిలో ఉంచుకోనైనా వ్యాట్‌ను తొలగిస్తే కొంతలో కొంతైనా చార్జీలు తగ్గించే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం, పాలకులు ఈ దిశలో ఆలోచించకుండా తమ తమ పదవులను, అధికారాన్ని కాపాడుకోవడంలోనే కాలయాపన చేస్తూ ప్రజా సమస్యల పట్ల స్పందించకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందుకే మీపాటికి మీరు రేట్లు పెంచండి, మేము సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతామంటున్నారు.

Monday, April 9, 2012

Anam Viveka follows chiru. Nellore Rural MLA Seat Who Will Get Lets See..

Nellore Rural MLA. Anam Vivek Ready to Galli to Delhi Tour..

Nellore Rural MLA. Anam Vivek Ready to Galli to Delhi Tour..

Nellore Rural MLA. Anam Vivek Ready to Galli to Delhi Tour..

Sunday, April 8, 2012

మహిళలను వ్యభిచారం ముగ్గులో దింపి వారి ద్వారా డబ్బున్న వారిపై వల వేసి, వారి శృంగార కార్యకలాపాలను సీడీలు.

అమాయకులయిన మహిళలను వ్యభిచారం ముగ్గులో దింపి వారి ద్వారా డబ్బున్న వారిపై వల వేసి, వారి శృంగార కార్యకలాపాలను సీడీలు, ఫొటోల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేస్తుందన్న ఆరోపణలతో అరెస్టయిన తారాచౌదరి ఖాతాలో పెద్ద గద్దలే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాధమిక విచారణలో కళ్లు చెదిరే విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయినట్లు సమాచారం. వివిధ సందర్భాల్లో విచారణకు హాజరయిన తారాచౌదరిని చూస్తే పోలీసులే హడలిపోయేవారట. తన చేయి పట్టుకున్నారని గొడవ చేస్తానని బెదిరిం చడం, తనకు పైస్థాయిలో ఆఫీసర్లు తెలుసని చెప్పడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీ సులు కూడా హడలిపోయి పారిపోయేవారట. తారా చౌదరి కహానీ తెలిసిన పోలీసులు చివరకు మహిళా కానిస్టేబుళ్ల సమక్షంలో మాట్లాడవలసిన పరి స్థితి ఏర్పడింది. 

తారాచౌదరి బాధితులు, వారికి సంబంధించి ఎదుర్కొం టున్న సమస్యల పూర్తి వివరాలన్నీ ‘సూర్య’ సేకరించింది. వారి గుట్టుమట్లను తెలుసుకుంది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న తారాచౌదరి చేతిలో రాజకీయ నాయకుల గుట్టు మట్లు చిక్కుకుపోయాయి. నిజానికి ఆమె ప్రధాన వ్యాపారం వ్యభిచారం కాదని, అందుకోసం వచ్చిన డబ్బున్న వారిని ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చే డబ్బున్న వారు, రాజకీయ నాయకులు శృంగారంలో ఉన్నప్పుడు ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి తర్వాత వారిని బెదిరించేదంటున్నారు. 

అందులో భాగంగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎంపీని తన దగ్గర ఉన్న సీడీని చూపించి చాలాకాలం బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్త కూడా అయిన సదరు ఎంపీని మానసికంగా వేధించినట్లు చెబుతున్నారు. తన సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుందని, తనకు గుర్తింపు లేదని నాయకత్వంపై విరుచకుపడే అంత పెద్ద నేతకే తారాచౌదరి చెమటలు పట్టించిందంటే ఆమె బ్లాక్‌మెయిలింగ్‌ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చంటున్నారు. అదేవిధంగా ఒక నగరానికి మొదటి పౌరుడిగా పనిచేసిన సదరు ఎంపీ పుత్ర రత్నం కూడా తారా చౌదరి ఖాతాలో ఉన్నట్లు చెబుతున్నారు. కోటి రూపాయలు ఇవ్వకపోతే సీడీ బయటపెడతానని బెదిరిస్తుండటంతో సదరు ఎంపీ లక్ష్మణరావు అనే సన్నిహితుడిని మధ్యవర్తిగా పంపి, చివరకు వ్యవహారాన్ని 25 లక్షల రూపాయలకు సెటిల్‌ చేసుకున్నట్లు సమాచారం. 

అదే జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను చంపాలని కర్నూలుజిల్లాకు చెందిన ఓ డీఎస్పీని బెదిరించినట్లు తెలుస్తోంది. సదరు డీఎస్పీ తారామణి ఒడిలో పడుకుని, పక్కనే ఆప్యాయంగా నిల్చుని ఉన్న ఫొటోలు కూడా దాడుల్లో దొరికినట్లు సమాచారం. దానితోపాటు శృంగారానికి సంబంధించిన సీడీని కూడా చూపించి, ప్రస్తుతం కర్నూలులో వ్యాపారం చేస్తున్న ఆ పారిశ్రామిక వేత్తను చంపాలని ఆ డీఎస్పీపై ఒత్తిడి తీసుకురాగా, తాను ఆ పనిచేయలేనని, ముందు సీడీలు, ఫొటోలు ఇవ్వాలని ఆయన కాళ్లావేళా పడి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. 

కాగా, రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చి, తెలుగు రాజకీయాల్లో భూకంపం పుట్టించిన ఓ దివంగత మాజీ ముఖ్యమంత్రి ద్వితీయ కళత్రం సైతం తారాచౌదరికి దన్నుగా నిలిచినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్‌ పార్టీలో క్యారెక్టర్‌ పాత్ర పోషిస్తున్న ఆమెకూ తారా చౌదరికీ లింకులేమిటన్నదే ఆసక్తికరంగా మారింది. 
ఇదిలాఉండగా, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా తారా చౌదరి చేతికి చిక్కినట్లు సమాచారం. సాంకేతికంగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, గత కొద్ది నెలల నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సదరు నేత కొన్నాళ్లు కేంద్ర రాజకీయాల్లో కూడా ముఖ్య భూమిక పోషించడం గమనార్హం. 

ఇక ఇద్దరు ఏపీఎస్‌లు కూడా తారామణి శృంగార సామ్రాజ్యంలో సేదదీరిన వారేనని తెలుస్తోంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసిన వారిద్దరూ తారాచౌదరిని ఇతర జిల్లాల్లో ఓ వీవీఐపీ స్థాయికి చేర్చారని తెలుస్తోంది. ఆమె గుంటూరు, ప్రకాశం, ఇతర జిల్లాలకు వెళుతున్న సమయంలో సదరు ఐపీఎస్‌లు స్థానిక డీఎస్పీలకు ఫోన్లు చేసి బందోబస్తు చేసి, మర్యాదల్లో లోటు రాకుండా చూడాలని ఆదేశించేవారట. కమ్మవారిపాలెం దేవాలయానికి వెళ్లిన సమయంలో బందోబస్తుకు వెళ్లిన సమయంలో పోలీసులు పక్కకు జరగమన్నందుకు వారిపై తారాచౌదరి చిందులుతొక్కిందట. 

మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూ ప్రతిరోజూ టీవీ చర్చల్లో కనిపించే ఇద్దరు రాష్ర్ట స్థాయి మిహళా సంఘ నేతలు కూడా తారా చౌదరికి దన్నుగా నిలిచి, అందుకు ప్రతిఫలంగా నజరానా తీసుకున్నారంటే నోరెళ్లబెట్టక తప్పదు. గతంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా తారా చౌదరి అమాయకురాలని, పోలీసులు ఆమెను వేధిస్తున్నారని ఆమె తరఫున వకాల్తా తీసుకున్నారు. సినీ రచయిత చిన్నకృష్ణ కేసులో మహిళా కమిషన్‌ వద్ద యాగీ చేసి, వారి ద్వారా పోలీసులను హడలెత్తించిన తారా చౌదరికి ఓ రాజ్యాంగపరమైన సంస్థకు చైర్మన్‌గా పనిచేసిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే అండగా నిలవడం అప్పట్లోనే విమర్శలకు తావిచ్చింది.

మహిళలపై ఎక్కడ అత్యాచారాలు, అరాచకాలు, కట్నం వేధింపులు జరిగినా అక్కడ ప్రత్యక్షమై ఆందోళన జరిపి, సాయంత్రానికి మళ్లీ టీవీ చర్చల్లో హాజరయ్యే ఈ ఇద్దరు మహిళా సంఘ నేతలకూ, తారాచౌదరికీ సంబంధాలేమిటన్నది ప్రశ్న. అప్పుడు తారా పక్షాన నానా యాగీ చేసిన ఈ మహిళా సంఘాల నేతలిద్దరూ ఇప్పుడు నోరుమెదపకపోవడం విచిత్రం. జిల్లాల నుంచి వచ్చే వారికి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే తారా చౌదరికి అందులో ఒక ఐపీఎస్‌ ఏకపక్షంగా సాయం చేసేవారని తెలిసింది. ఏకంగా ఆయన తారామణి అందించిన అప్లికేషన్లకు తన విజిటింగ్‌ కార్డు పెట్టి మరీ ఉద్యోగాలకు సిఫార్సు చేసేవారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొని, సకల కళావల్లభుడిగా పేరున్న మరో ఐపీఎస్‌ కూడా తారాచౌదరి సృష్టించిన శృంగార సామ్రాజ్యంలో తేలిపోయిన వారేనంటున్నారు. పదవీ విరమణ చేసిన ఈ ఐపీఎస్‌ల వ్యవహారంపై అటు పోలీసు శాఖలోనూ చర్చ జరుగుతోంది. 

ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న తారాచౌదరి పెదవి విప్పితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారని తెలియడంతో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అధికార, అనధికార వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఆ పరిచయం వారి మద్య ప్రేమగా మారింది. ప్రేమ విషయం పెద్దలకు .

నెల్లూరు: నేను డిగ్రీ చదివాను.... వయస్సు 21 సంవత్సరాలు ఉన్నాయి.... ఇలాంటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా? అని స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోకుండా తన భర్త వెంకటేశ్వర్లు కుటుంబీకులను పొదలకూరు పోలీసులు అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారంటూ పొదలకూరు మండలం చిట్టేపల్లికి చెందిన కోవూరు కామాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.. ఆమె ఆదివారం ‘ప్రేమించి పెళ్లి చేసుకున్న తీరును వివరించింది. ఆమె మేరకు చదువుకునే రోజుల్లో కామాక్షికి వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం వారి మద్య ప్రేమగా మారింది. ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. అయితే కామాక్షి కుటుంబీకులు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈనెల తేదీన చెన్నై చేపాక్ స్టేడియం సమీపంలో ఉన్న నాగారతమ్మ కోవెలలో వారు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న కామాక్షి కుటుం బీకులు వారి కోసం గాలింపు ప్రారంభించారు. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కామాక్షిని విచారణ చేస్తే వారు మేజర్ అని తెలిసింది. దాంతో తాము ఏమి చేయలేమని పోలీసులు కామాక్షి కుటుంబీకులకు చెప్పారు.కామాక్షి కుటుంబీకులు పోదలకూరుకు వచ్చి అక్కడి పోలీసులకు కామాక్షిని వెంక టేశ్వర్లు కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.

పొదలకూరు పోలీసులు వెంకట్శేర్లు కుటుంబీకులను అదుపులోకి తీసుకుని వేధించడం ప్రారంభించారు. ఆ విషయం తె లుసుకున్న కామాక్షి,వెంకటే శ్వర్లు పొదలకూరు ఎస్సై, సీఐలతో మాట్లాడారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తన ప్రమేయంతోనే వెంకటేశ్వర్లుతో వెళ్లి చెన్నైలో వివాహం చేసుకున్నానని కామాక్షి పోలీసు అధికారులకు పోన్‌లో వివరించారు. అయినా వారు శాంతించకుండా వెంకటేశ్వర్లు కుటుంబీకులను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి వేధిస్తున్నారు. వారిని వదలకుంటే ఎస్పీ వద్దకు వెళ్లి పోలీసులపై ఫిర్యాదు చేస్తానని కామాక్షి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh