online marketing

Saturday, November 28, 2009

ఒకే కుటుంబలో ముగ్గురు ఆత్మహత్య

రాపూరు మండలం కొండక్రింద గ్రామమైన మద్దూరుపల్లి గ్రామంలో గత శుక్రవారం దేవళ్ళ అంకమ్మ ఆత్మహత్యచేసుకొని చనిపోగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె భర్త దేవళ్ళ రామయ్య(48), ఆయన కుమార్తెలు అమరావతి(18), ప్రసూన(16)లు శుక్రవారం రాపూరు-చిట్వేలి సమీపంలోని దట్టమైన అడవుల్లో గుట్టవద్ద అరటిపండులో గుళికలు తిని చనిపోయిన సంఘటన జరిగింది.దీంతో ఈ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోనికి వెళితే స్థానికుల కథనం మేరకు దేవళ్ళ రామయ్య రాపూరు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే దంపతులిద్దరు ఎంతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందరితో సరదాగా ఉండేవాడు రామయ్య. ఇంటివద్ద వ్వవసాయ పనులుచేసుకుంటూ ఉండేవారు. ఏమైందోఏమోకాని ఆ భార్యభర్తల మధ్య స్వల్ప వివాదం అతని భార్య ఆత్మహత్యకు ఉసిగొల్పింది. గత శుక్రవారం అంకమ్మ గూడూరులో మరణించింది. దీంతో ఆ కుటుంబంలో ఆమె మరణం వారందరిని ఎంతో మనస్థాపానికి గురిచేసింది.ఆమె మృతిని జీర్ణించుకోలేని భర్త, కూతుళ్లు ఏమిచేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఒకపక్క కుమారుడు రాజు తల్లి మరణించిందని దిగాలుగా రెండుమూడు రోజుల నుండి అన్నపానీయాలు మాని మౌనంగా ఉండసాగాడు. ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్ళడంతో అతన్ని రాపూరు 108 స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్సలు చేశారు. అయినప్పటికీ అతను తల్లి మరణం నుంచి తేరుకోలేకపోయాడు. ఈ విధంగా ఉండటంతో దేవళ్ళ రామయ్య అతని కూతుళ్ళను తీసుకొని ఎవరూ నిద్రలేవక ముందే అడవుల్లోనికి వెళ్ళి గుళికలు అరటిపండులోవుంచి మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు రామయ్య పెద్దకుమార్తె అయిన కస్తూరి ఆమె భర్తకు ఫోన్‌ ద్వారా తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని తమను ఎవరూ వెతకవద్దని ఏడుస్తూ ముగ్గురు చెప్పినట్లు తెలిసింది.అయితే వారు ఎంతసేపటికి రాకపోవడంతో వారికోసం అడవుల్లో కుక్కను వెంటపెట్టుకొని కుటుంబసభ్యులు గాలించగా అక్కడ మృతదేహాలు పడివుండటంతో వారు తల్లడిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రాపూరు ఎస్‌ఐ యు జయరావ్‌ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం రాపూరు డిపో మేనేజర్‌ హనుమంతరావు, ఎస్టీఐ తుక్కా రామిరెడ్డి, మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. ఆర్టీసి లాంచనాల ప్రకారం రూ.5వేలను ఎత్తుబడి కార్యక్రమానికి ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే ఎన్‌ఎంయు యూనియన్‌కు చెందిన రామయ్యకు ఆ యూనియన్‌ నాయకులు కె నరయ్య ఇతర కార్మికులు నివాళులు అర్పించారు.

Friday, November 27, 2009

జాబితాలో ఒకే కుటుంబానికి 11 రేషను కార్డులు

కోట: స్థానిక శ్యామ సుందరపురంలో ఒకే వ్యక్తికి ఏకంగా 11 రేషను కార్డులు మంజూరు చేసినట్లు బోగస్‌ రేషన్‌ కార్డుల సర్వేలో వెల్లడైంది. కోటలోని శ్యామసుందరపురంలో గురువారం రేషను కార్డులను జాబితా ప్రకారం సర్వే చేస్తుండగా జాబితాలోని ఉద్దంటి పెంచలబాబు కుటుంబానికి వరుసగా 11 రేషన్‌ కార్డులున్నట్లు జాబితాలో ఉండడంతో సర్వే చేస్తున్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. సర్వే చేస్తున్న సమయంలో తనిఖీ కోసం వచ్చిన తహసీల్దార్‌ శ్యామ్‌ వరప్రసాద్‌ అవకతవకల జాబితాను పరిశీలించారు. అదేవిధంగా చింతలపల్లి బుజ్జయ్య అనే కుటుంబ యజమాని పేరుతో ఆరు రేషను కార్డులు జాబితాలో ఉండడం విశేషం. కంప్యూటర్‌లో జాబితాలు తయారు చేయడంలో పొరపాట్లు జరగడం వల్లనే ఈ విధంగా జరిగి ఉండవచ్చని తహసీల్దార్‌ పేర్కొన్నారు. దీనికి ఒక కార్డు మాత్రమే గుర్తింపు ఇచ్చి మిగిలిన వాటిని రద్దు చేస్తామన్నారు.

హాస్టల్‌నుంచి ముగ్గురు విద్యార్ధులు అదృశ్యం

నాయుడుపేట: గత శనివారం నాయుడుపేట హాస్టల్‌ నుంచి వారి ఇళ్లకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు సోమవారం చేరి సాయంత్రం అదృశ్యమై నేటికి ఆచూకి తెలియని సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంమై విద్యార్థుల తల్లిదండ్రులు నాయుడుపేట ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ను ప్రశ్నించారు. అదృశ్యమైన విద్యార్థులతో ఉన్న మురళి అందించిన సమాచారం మేరకు దొరవారిసత్రం మండల కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన మావిళ్లపాటి లింగయ్య, వెంకటమ్మ దంపతుల ఏకైక కుమారుడు యం విజయ్‌కుమార్‌, అదే గ్రామానికి చెందిన తిరునామలై సురేష్‌, అరుణమ్మల రెండవ కుమారుడు టి ప్రవీణ్‌, సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరు గ్రామానికి చెందిన సాలు చిన్నయ్య, చెంగమ్మల సంతానం సాలు బాలాజీలు నాయుడుపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్నారు.

కాగా శనివారం వార్డెన్‌ పర్మిషన్‌తో స్వగ్రామాలకు వెళ్లారు. తిరిగి సోమవారం హాస్టల్‌కు చేరుకుని అదే రోజు సాయంత్రం హాస్టల్‌ ప్రాంతంలో ఉన్న మురళి అనే యువకునితో కలసి నాయుడుపేట నుంచి గూడూరుకు యూనిట్‌ ట్రైన్‌లో వెళ్లారు. అక్కడ సుందరమహాల్‌ అనే థియేటర్‌లో 2012 యుగాంతం సినిమా చూసి ప్యాసింజర్‌లో తిరుపతి చేరుకుని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.

ఇక్కడ వరకు విద్యార్థులకు ఖర్చులు భరించిన మరళి వారికి చెప్పకుండానే నాయుడుపేటకు చేరుకున్నాడు. ఈ విషయమై మురళిని ప్రశ్నించగా పలు రకాలు కథనాలు చెపుతున్నాడు. మురళి పోకిరిగా తిరుగుతూ ఇక్కడే ఓ వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. విద్యార్థుల తల్లి దండ్రులు మురళి వచ్చాడన్న సమాచారం తెలుసుకుని మా పిల్లల ఆచూకి తెలపాలంటూ రోదించారు. నాలుగు రోజులుగా విద్యార్థులు కనిపించకుండా పోవడం తల్లిదండ్రులకు తగు సమాచారం అందించక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన గురువారం నాయుడుపేటలో సంచలనం కలిగించింది.

విద్యార్థుల అదృశ్యంపై ఫిర్యాదు: విద్యార్థులు అదృశ్యమయ్యారన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెండు రోజులుగా వారి బంధువుల ఇళ్లలో వెతికి గురువారం నాయుడుపపేటకు చేరుకుని హాస్టల్‌ సంక్షేమ అధికారితో కలసి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థులను వెతికిస్తాం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థులను వెతికించేందుకు తాము ప్రయత్నిస్తామని స్థానిక మండల ఎస్సీ సెల్‌ నాయకులు ఎగుదాల విజయ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థుల అదృశ్యమైన విషయమై ఇక్కడి వార్డెన్‌తో ఆయన చర్చించారు. తల్లిదండ్రులుతో కలసి విద్యార్థులను వెతికించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎంపిడిఒ విచారణలో వెల్లడైన ఉపాధి అవినీతి

కలువాయి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ ంలోని నిధులు గోల్‌మాల్‌ అయిన విషయం మండలంలోని చింతలాత్మకూరు పంచాయితీలో చోటుచేసుకుంది. నిమ్మమొక్కలు నాటకుండానే నాటినట్లు నిధులు డ్రాచేసి రైతుల పేరిట అధికారులు కాజేసినట్లు వెలుగులోనికి వచ్చినవైనం. చింతలాత్మకూరు పంచాయితీలో ఉపాధిలో అవినీతి జరిగిందని గ్రామంలోని రైతులు ఎంపిడిఒకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఫిర్యాదు మేరకు ఎంపిడిఒ యునైశమ్మ గురువారం పంచాయితీ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగింది.

విచారణలో భాగంగా రైతులు జరిగిన 2008-09సంవత్సరానికి సంబంధించిన నిమ్మ మొక్కల పెంపకంలో భాగంగా కొందరు రైతులు మొక్కలు నాటకుండానే బిల్లులు డ్రాచేసుకొని దిగమింగడం జరిగిందని రైతులు ఆమెకు తెలియచేడంతో వెంటనే స్పందించిన ఆమె చీమలదిన్నె పోలయ్య, చీమలదిన్నె రమణయ్య, కంచర్ల సుబ్బమ్మలకు చెందిన పొలాలను పరిశీలించగా చీమలదిన్నె పోలయ్య పొలంలో మొక్కలు పూర్తిగా నాటకపోవడం, చీమలదిన్నె రమణయ్య, కంచర్ల సుబ్బమ్మ పొలాల్లో 20నుండి25సంవత్సరాల వయస్సుకలిగిన నిమ్మమొక్కలను చూసి నిర్ఘాంతపోయవడం జరిగింది.

మిగతా పొలాలను పరిశీలించమని రైతులు కోరగా అవినీతి జరిగిందని ఇక పొలాలను చూడాల్సిన అవసరం లేదని ఆమె తెలియచేసింది. ఈ విషయమై ఎపిఒ వెంకటేశ్వర్లు అడగ్గా నేడు చూడలేదని సమాధానం చెప్పడం జరిగింది. సిఐజి గ్రూపు లీడర్లు సోంపల్లి వెంకటేశ్వర్లు ఆయన భార్య విజయమ్మలు 260మొక్కలు నాటాల్సివుండగా 220మొక్కలు నాటి 260మొక్కలకు నిధులు డ్రా చేసినట్లు ఈ విచారణలో వెల్లడైంది. కనుక సంబంధిత అధికారులు, రైతులపై తక్షణమే చర్య తీసుకోవడం జరుగుదుంతని ఎంపిడిఒ యునైశమ్మ తెలిపారు.బాధ్యులపై చర్యలకు డిమాండ్‌ - టిడిపి యూత్‌

ఉపాధిహామీ పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశంపార్టీ యూత్‌ నాయకుడు మూతేటి చంద్రశేఖర్‌, సోంపల్లి గిరినాయుడులు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ప్రీమియర్‌ రియో కార్ల ఆవిష్కరణ

ఫతేఖాన్‌పేట (నెల్లూరు) : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రిమియర్‌ ఆధ్వర్యంలో కార్ల తయారీలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్‌‌స యుటిలిటీ వెహికిల్‌ (యుఎస్‌వి) స్థాయిలో కారును ఉత్పత్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రియోలో డిఎక్స్‌ మోడల్‌ కారును గురువారం సాయంత్రం నగరంలోని కరెంట్‌ ఆఫీస్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సాయి కృష్ణ ప్రిమియర్‌ షోరూంలో మేనేజింగ్‌ పార్ట్‌నర్లు ఎం.శివప్రసాద్‌, సిహెచ్‌.వెంకటేశ్వర్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ నరేందర్‌సింగ్‌లు విలే కరులకు కారు ప్రత్యేకతల గురించి వివరించారు.

షోరూంను డిసెంబర్‌ 11వ తేదీన ప్రారంభిస్తున్నప్పటికీ బుకింగ్‌ గురువారం ఉదయం నుంచే ప్రారంభించామని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి అప్పుడే బుకింగ్‌లు జరిగాయని వారు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో వాహనాలను డెలివరీ చేస్తామని వారు వివరించారు. ఇప్పటికే అరబ్‌, ఇండోనేసియాతో పాటు 33 దేశాల్లో ఈ మోడల్‌ కార్లు వినియోగంలో ఉన్నాయని, ప్రధానంగా మన దేశంలో గ్రామీణ రోడ్లను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్‌‌స యుటిలిటీ కార్ల స్థాయిలో ఉండటంతో గోతులమయమైన రోడ్లపై సైతం కారు ప్రయాణించే వీలు కలుగుతుందని వారు చెప్పారు. స్పోర్ట్‌‌స యుటిలిటీ వాహనాల్లో ఉన్న సౌకర్యాలు అన్నీ రియోలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకూ పొడవు, ఎత్తు, వెడల్పులను తగ్గించి తయారుచేయడంతో మహిళలు సైతం సునాయసంగా కారును నడుపుకుంటూ వెళ్లవచ్చని అన్నారు.

పైగా యుఎస్‌వి వాహనాలకంటే ఈ కారులో మైలేజీ అధికంగా ఉంటుందని, ఏసీ వినియోగంలో ఉండగా లీటరు డీజిల్‌కు 16 కిలోమీటర్ల దూరం వెళ్లడం వల్ల ఇటు ఖర్చు తగ్గడంతోపాటు, ప్రయాణం కూడా సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 రంగుల్లో కార్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. నెల్లూరులో తమ షోరూంలోనే సర్వీసు సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నామని, సాధారణ మెకానిక్‌లు సైతం మరమ్మతు చేసేవిధంగా కారును రూపొందించినట్లు ఆయన చెప్పారు. విడిభాగాల ధరలు కూడా అత్యంత తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం మూడు మోడల్స్‌లో కార్లు లభిస్తున్నాయని అన్నారు. ఉన్నతశ్రేణి మోడల్‌లో అన్ని హంగులు ఉంటాయని ఆయన వివరించారు.

ప్రీమియర్‌ రియో కార్ల ఆవిష్కరణ

ఫతేఖాన్‌పేట (నెల్లూరు) : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రిమియర్‌ ఆధ్వర్యంలో కార్ల తయారీలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్‌‌స యుటిలిటీ వెహికిల్‌ (యుఎస్‌వి) స్థాయిలో కారును ఉత్పత్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రియోలో డిఎక్స్‌ మోడల్‌ కారును గురువారం సాయంత్రం నగరంలోని కరెంట్‌ ఆఫీస్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సాయి కృష్ణ ప్రిమియర్‌ షోరూంలో మేనేజింగ్‌ పార్ట్‌నర్లు ఎం.శివప్రసాద్‌, సిహెచ్‌.వెంకటేశ్వర్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ నరేందర్‌సింగ్‌లు విలే కరులకు కారు ప్రత్యేకతల గురించి వివరించారు.

షోరూంను డిసెంబర్‌ 11వ తేదీన ప్రారంభిస్తున్నప్పటికీ బుకింగ్‌ గురువారం ఉదయం నుంచే ప్రారంభించామని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి అప్పుడే బుకింగ్‌లు జరిగాయని వారు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో వాహనాలను డెలివరీ చేస్తామని వారు వివరించారు. ఇప్పటికే అరబ్‌, ఇండోనేసియాతో పాటు 33 దేశాల్లో ఈ మోడల్‌ కార్లు వినియోగంలో ఉన్నాయని, ప్రధానంగా మన దేశంలో గ్రామీణ రోడ్లను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్‌‌స యుటిలిటీ కార్ల స్థాయిలో ఉండటంతో గోతులమయమైన రోడ్లపై సైతం కారు ప్రయాణించే వీలు కలుగుతుందని వారు చెప్పారు. స్పోర్ట్‌‌స యుటిలిటీ వాహనాల్లో ఉన్న సౌకర్యాలు అన్నీ రియోలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకూ పొడవు, ఎత్తు, వెడల్పులను తగ్గించి తయారుచేయడంతో మహిళలు సైతం సునాయసంగా కారును నడుపుకుంటూ వెళ్లవచ్చని అన్నారు.

పైగా యుఎస్‌వి వాహనాలకంటే ఈ కారులో మైలేజీ అధికంగా ఉంటుందని, ఏసీ వినియోగంలో ఉండగా లీటరు డీజిల్‌కు 16 కిలోమీటర్ల దూరం వెళ్లడం వల్ల ఇటు ఖర్చు తగ్గడంతోపాటు, ప్రయాణం కూడా సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 రంగుల్లో కార్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. నెల్లూరులో తమ షోరూంలోనే సర్వీసు సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నామని, సాధారణ మెకానిక్‌లు సైతం మరమ్మతు చేసేవిధంగా కారును రూపొందించినట్లు ఆయన చెప్పారు. విడిభాగాల ధరలు కూడా అత్యంత తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం మూడు మోడల్స్‌లో కార్లు లభిస్తున్నాయని అన్నారు. ఉన్నతశ్రేణి మోడల్‌లో అన్ని హంగులు ఉంటాయని ఆయన వివరించారు.

భారీగా సెల్‌ఫోన్లు స్వాధీనం

రాపూరు: కొంత కాలంగా సెల్‌ఫోన్‌ దొంగతనాలు, పోగొట్టుకున్న సెల్‌ఫోన్లపై నిఘాపెట్టి గాలిస్తుండగా గురువారం 63సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని ముగ్గురిను అరెస్ట్‌ చేసినట్లు రాపూరు ఎస్‌ఐ యు జయరావ్‌ గురువారం తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు రాపూరులో సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు తమకు అందిన సమాచారం మేరకు నిఘాపెట్టి కొప్పల కిషోర్‌, రేవూరి నాగరాజు, రేవూరి రవి అనే వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుండి సెల్‌ఫోన్లతోపాటు ఒక సైకిల్‌, ఆటో బ్యాటరీ, రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కసారిగా రాపూరు పట్టణంలో పోలీసులు దాడులు చేసి సెల్‌ఫోన్లు పట్టుకోవడంతో స్టేషన్‌ ఆవరణం బాధితులతో నిండిపోయింది. పోగొట్టుకున్నవారు ఎస్‌ఐ వద్దకు చేరారు. దీంతో ఆయన విచారించి కొందరివి సెల్‌ఫోన్లు వారికి అందజేశారు

కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సభ్యుడుగా బొమ్మిరెడ్డి

నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సభ్యుడుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య రాఘవేంద్రరెడ్డిని అనుబంధ సభ్యుడుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి అభినందించారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన రాఘవేంద్రరెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా ఎన్నికైన కొద్దికాలం తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా వైఫల్యం చెందడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం స్తబ్దుగా ఉంటూ అనంతరం కాంగ్రెస్‌పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.నేడు సిఎల్‌పి సమావేశానికి హాజరు

ముఖ్యమంత్రిగా కె.రోశయ్య నియమించబడిన మూడు నెలల తర్వాత శుక్రవారం జరుగనున్న సిఎల్‌పి సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సభ్యుడుగా నియమితులైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి హాజరు కానున్నారు. తాను కాంగ్రెస్‌పార్టీ అనుబంధ సభ్యుడుగా ఎన్నికైనందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్యతోపాటు ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్థనరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు బొమ్మిరెడ్డి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు

ఆర్టీసీ బస్సు బోల్తా

నెల్లూరు:మండల పరిధిలోని ఆమంచర్ల సమీపానగల కనుపూరు కాలువపైగల వంతెన వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను తప్పించబోయి ఆర్టీసి బస్సు 42 అడుగుల లోతుగల కాలువలో పడి డ్రైవర్‌, కండక్టర్‌లతో సహా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం మేరకు నెల్లూరు నుండి చేజర్లకు 37 మంది ప్రయాణీకులతో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో బయలుదేరిన ఆర్టీసి బస్సు నెల్లూరు రూరల్‌ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామం వద్ద గల కనుపూరు కాలువ వంతెనపైకి వచ్చేసరికి 1.20 గంటల సమయంలో ఎదురుగా టిప్పర్‌ రావడంతో దానికి తగలకుండా వెళ్లేందుకు ఆర్టీసి బస్సు డ్రైవర్‌ ప్రయత్నించాడు. అయితే రెండు వాహనాలు సగభాగం దాటిన తర్వాత ఒక్కసారిగా టిప్పర్‌ డ్రైవర్‌ ఎడమ వైపునకు మలుపు తిప్పడంతో, ఇంజన్‌ మాత్రం తప్పించుకుని టిప్పర్‌ వెనుకగల బాడి ఆర్టీసి బస్సును విసురుగా నెట్టివేయడంతో ఆర్టీసి బస్సు వంతెన పిట్టగోడను సైతం పగులగొట్టుకుని కాలువలో పడిపోయింది.

అయితే ఆర్టీసి బస్సు టైరు పంచర్‌ అవడం వలన అదుపుతప్పి కాలువలో పడిందని మరో వాదన వినిపిస్తుంది. కాలువలో దిగి బస్సును పరిశీలించిన కొంతమంది సహాయక సిబ్బంది మాత్రం బస్సు టైర్లు పంచర్‌ అయిన దాఖలాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసి బస్సు డ్రైవర్‌ ఆదిశేషయ్య తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. కండక్టర్‌ రంగనాయకులు తలకు గాయమై చికిత్స పొందుతున్నాడు. మానస అనే డిగ్రీ విద్యార్థిని తీవ్రంగా గాయపడి నగరంలోని బొల్లినేని హాస్పిటల్‌లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో నగరంలోని వివిధ ప్రైవేట్‌ ఆసుపత్రులు, నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో పి.కృష్ణమ్మ, ఎన్‌.శారదమ్మ, ఎన్‌.రామ్మూర్తి, ఎన్‌.తిరుపతమ్మ, జె.సుమలత, ఎస్‌కె.రజియా, ఎస్‌కె. ఖాదర్‌బీ, జె.అనసూయ, ఎం.అంకయ్య, ఎ.తనూజ, కె.హరిత, యు.శ్రీనివాసులు, పి.లచ్చమ్మ, డి.రమణమ్మ, మానసలు గాయపడ్డారు. ఆర్టీసి సిబ్బంది మినహా 19 మంది క్షతగాత్రులుకాగా 9 మంది తీవ్రంగాను, మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. స్వల్పంగా గాయపడ్డవారు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేయించుకుని వెళ్లిపోయారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నెల్లూరు ఆర్డీఒ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రమాద స్థలిని పరిశీలించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. రూరల్‌ సిఐ వై.జయరామసుబ్బారెడ్డి, ఎస్‌ఐ ఎం.రోశయ్యలు తమ సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.తన బ్యాగు దొరికేవరకు చికిత్సకు రానన్న క్షతగాత్రుడు

పొదలకూరులో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం.అంకయ్య తన కుమార్తె వివాహ నిమిత్తం నెల్లూరులో తయారు చేయించిన ఒకటిన్నర లక్షల రూపాయల విలువగల బంగారు ఆభరణాలను తీసుకుని గురువారం మధ్యాహ్నం ఇదే బస్సులో నెల్లూరు నుండి పొదలకూరుకు బయలుదేరాడు. అయితే ఈ బస్సు కాలువలో పడిపోవడంతో నగలతో కూడిన బ్యాగు గల్లంతయింది. దీంతో ఖిన్నుడైన ఎం.అంకయ్య తీవ్రంగా గాయపడి తన ఎడమచేయి విరిగిపోయివున్న పరిస్థితిలో సైతం వైద్యం కోసం 108 సిబ్బంది, స్థానికులు అంబులెన్స్‌లోనికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నా కూడా తాను రానని మొండి కేశాడు. తన కుమార్తె వివాహం కోసం చేయించిన నగలను వెతికి ఇస్తేనే తాను వైద్యానికి వస్తానని అంత బాధలోనూ వ్యక్తం చేయడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం మినహా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చివరకు పొదలకూరుకు చెందిన అంకయ్య సన్నిహితులు నచ్చచెప్పడంతో వైద్యం కోసం ఆయన 108 అంబులెన్స్‌ ఎక్కారు.


మిట్టమధ్యాహ్నం ఆర్తనాదాలు, హాహాకారాలు

నెల్లూరు నుండి గురువారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో చేజర్లకు బయలుదేరిన ఒకటవ డిపోకు చెందిన ఎపి11జడ్‌156 నెంబర్‌ గల ఆర్టీసి బస్సు సరిగ్గా 1.20 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. బస్సు వంతెనపై నుండి కాలువలో పడుతున్న సమయంలో ప్రయాణీకులు ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సమీప పొలాల్లో పనులు చేసుకుంటున్న ఆమంచర్ల గ్రామ రైతులు, స్థానికులు సత్వరమే స్పందించి ఉరుకులు, పరుగులమీద ప్రమాద స్థలికి చేరుకుని సగభాగం నీటిలో మునిగివున్న బస్సు అద్దాలను పగులగొట్టి చాలామంది ప్రయాణీకులను బయటకు తీసుకురాగలిగారు. ఇంతలో పొదలకూరుకు చెందిన అగ్నిమాపక వాహనం ఇక్కడకు చేరుకోవడంతో సంబంధిత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో నెల్లూరు రూరల్‌ పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేసి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


వైద్య ఖర్చులను భరిస్తున్న ఆర్టీసి

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అవసరమైన వైద్యాన్ని వారు కోరిన ఆసుపత్రిలో తమ ఖర్చుతో అందిస్తామని ఆర్టీసి ఆర్‌ఎం శేషగిరిరావు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రెడ్డిలు వెల్లడించారు. ప్రమాదస్థలికి చేరుకున్న వీరు అక్కడ పరిస్థితులను విశ్లేషించి కారణాలను అన్వేషించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి బంధువుల కోర్కె మేరకు వారు కోరిన హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు

Wednesday, November 25, 2009

ఇంగ్లీష్ నుండి తెలుగు

బంగారం ధరలు ధగధగ

నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : బంగారం ధరల పెరుగుదల రికార్డుస్థాయిని అధిగమించింది. ఈనెలలో దాదాపుగా ప్రతిరోజూ పెరుగుదలను సూచిస్తూ గ్రాముపై సుమారు 180 రూపాయలకు చేరుకుంది. డిసెంబర్‌ మొదటి వారంలో గ్రాము బంగారం 1800 రూపాయలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పసిడి వర్తకులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో సామాన్యులు జ్యువెలరీ షాపులకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. అయితే బంగారాన్ని పెట్టుబడిగా భావించే ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు మాత్రం బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.

బంగారం ధరలు గత సంవత్సరకాలంగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది ఈ సంవత్సరంలో మరింత అధికంగా ప్రభావాన్ని చూపుతోంది. జూన్‌లో గ్రాము 1350 రూపాయలు ఉండగా, జూలై మాసంలో 1390కి చేరింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో 1440 వరకూ చేరింది. ఇక నవంబర్‌ నెల ప్రారంభం నుంచి బంగారం ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ పెరుగుదల ప్రతిరోజూ కనిపించడం విశేషం. బంగారం వ్యాపారులు సైతం ధరల పెరుగుదల చూసి విస్తుపోతున్నారు.

ఈనెల 2 వతేదీన గ్రాము బంగారం ధర 1500 రూపాయలు, 9వ తేదీన 1563, 14వ తేదీన 1570, 18వ తేదీన 1600కు పెరిగి బుధవారం నాడు ఏకంగా 1657 రూపాయలు పలికింది. ఇదేవిధంగా వెండి ధర కూడా బంగారానికి అనుగుణంగా పెరుగుతూ వచ్చింది. జూన్‌, జులై నెలల్లో కిలో వెండి 23 వేల రూపాయల నుంచి 24 వేల రూపాయల వరకూ పెరుగుతూ రాగా నవంబర్‌ నెల మొదటి వారంలో 27,200కు చేరింది. క్రమంగా 9వ తేదీన 28,500, 18వ తేదీన 29,100 వరకూ పెరిగి బుధవారం నాడు 29,800కు చేరింది.

డాలర్‌ విలువ పతనం కావడం, ఆర్థిక మాంధ్య ప్రభావం తదితర కారణాల వల్ల సుమారు సంవత్సర కాలంగా బంగారం ధరలు పెరుగుదలను సూచిస్తున్నాయి. పెట్టుబడులకు వ్యాపారాలు, భూముల కొనుగోళ్లు అనుకూలంగా లేకపోవడంతో బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. దీనికి తోడు ఇటీవలే రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా భారీగా బంగారాన్ని కొనుగోలు చేసింది. త్వరలో మరోవిడత కొనుగోళ్లకు రంగం సిద్ధం చేస్తోంది. మరోపక్క రియల్‌ఏస్టేట్‌ ఆశాజనకంగా లేకపోవడం, షేర్‌మార్కెట్‌లో అనూహ్యమైన హెచ్చుతగ్గులు ఉండటంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు సరైన నిర్ణయంగా భావిస్తున్నారు.

మరోపక్క ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో బంగారాన్ని అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉండటంతో ఆ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ ఆర్థిక సంస్థలు కూడా బంగారం తాకట్టుపై నిబంధనలను పూర్తిగా సడలించారు. పైగా కొన్ని సంస్థలు గ్రాముపై 1550 రూపాయలు ఇవ్వడం, బంగారం ఇచ్చిన వెంటనే నగదు లభించడం ప్లస్‌పాయింట్‌గా మారింది. ఇళ్లస్థలాలు, ఇతర ఆస్తులు తాకట్టు పెట్టాలన్నా, అమ్మాలన్నా అంతత్వరగా వీలుపడని కారణంగా బంగారాన్నే సరైన పెట్టుబడిగా ప్రస్తుతం ధనిక, మధ్య తరగతి కుటుంబాల వారు భావిస్తున్నారు.

వానాకాలంలోనే స్వర్ణముఖిలో నీరు

కోట : జిల్లాలో ప్రవహించే నదులలో స్వర్ణముఖి ఒకటి. బంగారు కొండలలు అని పేరున్న తిరుపతి కొండల్లో పుట్టిన ఈ నదికి స్వర్ణముఖి నది అని పేరు వచ్చింది. స్వర్ణముఖి రాయని కూడా పిలుస్తారు. అంటే శ్రావ్యమగు శబ్దాలు చేస్తూ వ్రహించే నది అని అర్ధం. ఒకప్పటి ఉత్తర ఆర్కాటు జిల్లాలోని చంద్రగిరి కొండలలలో ఈ నది పుట్టింది. అది పుట్టిన చోట ఒక పెద్ద హనుమంతుని విగ్రహం చెక్కి ఉంది.


అచ్చటి నుంచి ఈ నది ఒక చెరువు మీదుగా ప్రవహించి తూర్పు దిశగా ఉన్న శ్రీకాళహస్తి, పెళ్లకూరు, నాయుడుపేట, గునపాడు, గూడలి, వాకాడు, బాలిరెడ్డిపాళెం, పుచ్చలపల్లి మీదుగా గోవిందుపల్లి పట్టపుపాళెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు 99 మైళ్లు. కళ్యాణి, భీమా నదులు ఈ నదికి ముఖ్యమైన ఉప నదులు. వర్షాకాలంలో మినహా మిగిలిన సమయాల్లో స్వర్ణముఖిలో నీరు ఉండదు. వర్షాకాలంలో మాత్రమే ఈ నది ప్రవహిస్తుంది. ఈ నదినీరు కొన్ని చెరువుల ద్వారా, కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఈ నదిలో రేణిగుంట వద్ద రాళ్ల కాలువ, కోట మండలం గూడలి వద్ద మామిడి కాలువలు కలుస్తాయి. కోట, వాకాడు మధ్యగల స్వర్ణముఖి నదిపై 2007లో బ్యారేజి కం బ్రిడ్జి నిర్మాణం జరిగింది

లారీ బోల్తా.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ధాన్యంతో వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమేనని పోలీసులు భావిస్తున్నారు

Tuesday, November 24, 2009

అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్‌

నెల్లూరు : నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారి వాహనదారులకు పలు ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. దీనికి తోడు విపరీతమైన వర్షాల వల్ల రోడ్లు గుంతలు పడడంతో ద్విచక్ర వాహనదారులు ముందు పోతున్న వాహనాలను తప్పించబోయి గుంటల్లో పడి అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. మేమేం తక్కువా అన్నట్లు నగరంలో ఉన్న ఆటోలు, టౌన్‌ సర్వీస్‌లు ప్రయాణీకులు ఎవరైనా చెయ్యెత్తితే చాలు వెనుకా ముందు చూసుకోకుండా బ్రేక్‌ కొట్టడంతో వెనుక వస్తున్నవారు ఢీకొని ఆసుపత్రి పాలవుతున్నారు. నగర కూడళ్లలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌ కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి. సిగ్నల్స్‌ వద్ద పోలీసులు డ్యూటీ చేస్తున్నప్పటికీ వారు చేసే డ్యూటీ ఎప్పుడు అయిపోతుందా, ఇంటికెళ్లిపోదామా అన్నట్టుంది గాని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యం కనిపించడంలేదు. ముఖ్యంగా కెవిఆర్‌. పెట్రోల్‌ బంకుకు ఆనుకుని పలు కళ్యాణ మండపాలు ఉండడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకిరువైపులా వాహనాలను ఉంచడంతో పొదలకూరు రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు, నగరంలో నుండి అటువైపు వెళ్లే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. ఇంత ట్రాఫిక్‌ జామ్‌ అయినా అక్కడ పట్టించుకునే నాధుడే కరువవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైరన్‌ మోగించుకుంటూ నగరంలో ‘మాకు దారి వదలండి’ అన్నట్లు సైరన్‌ మోగించుకుంటూ వెళ్తున్నారే తప్ప వారి కళ్ల ముందే ఎక్కడ పడితే అక్కడ ఆపిన వాహనాలను చూసి కూడా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు అధికారులు నగరంలోకి వచ్చే రాజకీయ నాయకుల సేవలో మునిగితేలుతున్నారేతప్ప ట్రాఫిక్‌ గురించి పట్టించుకోవడం లేదు. ఇక ట్రాఫిక్‌ ఎస్‌ఐలు పెన్ను, పుస్తకం తీసుకుని బిజి బిజీగా వచ్చే పోయే వాహనాలపై కేసులు రాసుకోవడం తప్ప ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో విఫలమవుతున్నారు. గతంలో ప్రతి స్టేషన్‌కు సంబంధించిన లా అండ్‌ ఆర్డర్‌ ఎస్‌ఐలు ప్రతి రోజూ సాయంత్రం తమ పరిధిలో ట్రాఫిక్‌ను క్లీర్‌ చేయడం, జరిమానాలు విధించడం వంటివి ఉండేవి. నేడు నగరంలోని ప్రతి ఎస్‌ఐ అధికారుల, రాజకీయ నాయకులకు సేవలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ ట్రాఫిక్‌పై చూపించడంలేదు. నగర డిఎస్‌పి కొత్తగా చార్జి తీసుకున్న తదుపరి నగరంలోని టౌన్‌సర్వీసులు, ఆటోలు, మద్యం సేవించి వాహనం నడుపుతున్నవారిపై కొరడా ఝళిపించారు. అదేదో సామెతలాగా ఎక్కడైనా అధికారి వచ్చిన కొత్తల్లో తమ ఉనికి తెలుపుకోవడం కోసం ఢూం ఢాం అని అరవడం, బెదరగొట్టడం మామూలే అన్నట్లుగా డిఎస్‌పి సైతం నేడు ట్రాఫిక్‌ గురించి పట్టించుకోవడం లేదు. నగర డిఎస్‌పి నగరానికి వచ్చి ఇప్పటికి సుమారు 8 నెలలు అయినప్పటికీ కొత్తలో ఉన్న స్పీడు నేడు తగ్గింది. మరి డిఎస్‌పి స్పీడు తగ్గడానికి కారణాలు ఏవో పరమాత్ముడికే ఎరుక. ఏది ఏమైనప్పటికీ అస్తవ్యస్తంగా మారిపోయిన ట్రాఫిక్‌ను, దద్దరిల్లిపోయే హారన్‌ మోతలు, ఎక్కడపడితే అక్కడ ఆపే ఆటోలు, బస్సులను గురించి అధికారులు పట్టించుకొని సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

చెంగాల్‌రాజుకు ఘనంగా నివాళి

నెల్లూరు :ఇటీవల మృతి చెందిన చైతన్యప్రభ సంపాదకులు కూరపాటి చెంగల్‌రాజుకు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం టౌన్‌హాల్‌ రీడింగ్‌ రూమ్‌లో జరిగిన సంస్మరణ సభలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, బిసి నాయకులు వంకి పెంచలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పముజుల దశరధరామయ్యలు అతిధులుగా పాల్గొని పత్రికా రంగానికి, పిగిలాం గ్రామానికి చెంగల్‌రాజు చేసిన సేవలను కొనియాడారు.ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వి.రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ పత్రికారంగానికి, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా చెంగల్‌రాజును అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా ఆశయాలను కొనసాగించడంలో ఆయన జీవితాన్ని అంకితం చేశారని నివాళులర్పించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిస్వార్థంగా పత్రికారంగానికి సేవలందించి, పిగిలాం గ్రామసర్పంచ్‌గా ఆ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన చెంగల్‌రాజుకు నివాళులర్పించారు.వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ చెంగల్‌రావు ప్రజల కోసం, సమాజం కోసం పనిచేయడంలో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదన్నారు. పిగిలాం గ్రామాన్నే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు అభివృద్ధిపనులను విస్తరింపచేసిన వ్యక్తిగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అరుణాగ్రాఫిక్స్‌ అధినేత, రిటైర్డ్‌ డిపిఆర్‌ఒ ఎం.వెంకటరత్నం, రచయిత అగస్త్యరెడ్డి వెంకురెడ్డిలతోపాటు చెంగల్‌రాజు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పాల్గొని చెంగల్‌రాజు ఆశయాలను కొనసాగిస్తామని ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు

సంగం:మండలంలోని చెన్నవరప్పాడు నుంచి మర్రిపాడుకు వెళ్లే కావలికాలువకట్ట రహదారిపై విద్యుత్‌తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ రహదారిలో ప్రతినిత్యం రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. పశువుల కాపరులు పశువులను తీసుకెళ్లుతుంటారు. మనిషి చేయెత్తితే అందేటట్లు తీగలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్‌ శాఖాధికారులకు ఈ మార్గంలో విద్యుత్‌స్తంభాలను దగ్గరదగ్గరగా వేయించాలని పలుసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ఏ ప్రమాదం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం


నెల్లూరు రూరల్‌:గ్రామదర్శినిలో వచ్చిన ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొత్తూరులో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను గ్రామాల వద్దే పరిష్కరించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. డిశంబర్‌ 15వ తేదీకి గ్రామదర్శిని కార్యక్రమం ముగుస్తుందని ఈ సందర్భంగా వచ్చిన అర్జీలను సమస్యల వారీగా విభజించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో కొత్తూరు ప్రాంతంలో టిడిపి హయాంలో 103 పింఛన్లు ఉంటే ప్రస్తుతం 925 పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులందరికీ 1035 ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చామన్నారు.శ్రామికనగర్‌, కుమ్మరిగుంటల మీదుగా పోతున్న కాలువను కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. సమస్యలను నిర్భయంగా తమకు తెలియజేయాలని ఆయన స్థానికులను కోరారు. కొత్తూరులో స్థానిక సమస్యలైన వీధి దీపాలు, రోడ్లు, మంచినీటి సదుపాయాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కొత్తూరు పంచాయతీని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎంపిటిసి మాధవి, శ్రీనివాసులు, ప్రభాకర్‌రెడ్డి, హరి, పిండి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అపార్ట్‌మెంట్‌వాసులూ... తస్మాత్‌ జాగ్రత్త- నగర డిఎస్‌పి రాధిక


నెల్లూరు :నగరంలోని మాగుంటలేఅవుట్‌ వద్దనున్న లెక్చరర్స్‌ కాలనీలో కొద్ది రోజుల క్రితం దొంగలు అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించి భారీఎత్తున దొంగతనాలకు పాల్పడిన సందర్భంగా నగర డిఎస్‌పి జిఆర్‌.రాధిక మంగళవారం మధ్యాహ్నం ఆ అపార్ట్‌మెంట్‌ వాసులను కలిసి దొంగతనాలు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇకపై అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు జాగరూకులై ఉండాలని, కొత్తవారు ఎవరైనా వచ్చినపుడు గమనించాల్సిన బాధ్యత అపార్ట్‌మెంట్‌లో నియమించబడిన వాచ్‌మెన్‌తోపాటు ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చేవారిని, పోయేవారిని గమనించడమే కాకుండా అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా ఐడి కార్డులు ఉంచుకోవడం మంచిదన్నారు.పగలు పురుషులు ఉద్యోగరీత్యా బయటకు వెళ్తారు కాబట్టి, ఆడవారు టివీలు చూస్తూ తలుపులు వేసుకోకుండా ఉండడం వలన దొంగతనాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. నగర డిఎస్‌పితోపాటు సిఐ వీరాంజనేయరెడ్డి, 4వ నగర ఎస్‌ఐ వేమారెడ్డి, 5వ నగర ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి తదితరులతో ఇళ్లలోకి పగలే అనుమానితులు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి వ్యూహాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ముందుగానే సివిల్‌ డ్రెస్‌లో ఉన్న తమ పోలీసులు ప్రభాకర్‌, ప్రసాద్‌లను పావని ఎన్‌క్లేవ్‌, పావని పార్క్‌ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి అపార్ట్‌మెంట్‌ వాసులు జాగ్రత్తగా ఉన్నారా? అజాగ్రత్తగా ఉన్నారా? గమనించాల్సివుందని ముందుగా పంపించారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి డిఎస్‌పి తన సిబ్బందితో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగా ముందు వెళ్లిన కానిస్టేబుళ్లు డి.బ్లాక్‌లోని 102 అపార్ట్‌మెంట్‌లో తలుపులు తీసి ఇంట్లోకి మేము వెళ్లి టేబుల్‌ మీదున్న వస్తువులు బయటకు తెస్తున్నా పట్టించుకోలేదని, మరొక కానిస్టేబుల్‌ వేరొక అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి లోపలి తలుపులు తీస్తున్నా అరగంటసేపు కూడా పట్టించుకోలేదని తెలిపారు. ఇంట్లో అందరూ ఉండి కూడా పట్టించుకోకపోవడంతో డిఎస్‌పి తన సిబ్బందితో అపార్ట్‌మెంట్‌ వాసులను కలిసి పట్టపగలే అనుమానితులు ఎవరైనా లోపలకి వస్తున్నారా లేదా అనేది గమనించకుండా మీపాటికి మీరు టివీలు చూస్తూ కూర్చోవడవం బాగలేదని సూచించారు. ఇకనైనా దొంగతనాలు జరుగుతున్నాయనడానికి తగు జాగ్రత్తలను అపార్ట్‌మెంట్‌ వాసులందరూ కలిసి వాచ్‌మెన్‌లను నియమించుకుని లోనికి వచ్చి పోయేవారిని తప్పనిసరిగా గమనించాలని చెప్పారు. డిఎస్పీ ఆకస్మిక పర్యటనతో మాగుంట లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్‌ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే డిఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం వలన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రతిఒక్కరూ పోలీస్‌వారిని ప్రశంసిస్తూ ఇకపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

లాభాల కోసం ఆర్టీసిలో ప్రత్యేక చర్యలు


సంతపేట (నెల్లూరు) :ఆర్టీసిని లాభాలబాటలో పయనింపచేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆర్టీసి డిపో మేనేజర్లను రీజనల్‌ మేనేజర్‌ పి.శేషగిరిరావు ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆర్టీసి రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయంలో డిఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ నవంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలు, ట్రాఫిక్‌ జామ్‌ల వల్ల పలు మార్గాల్లో బస్సులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో లక్ష 41 వేల కిలోమీటర్ల మైలేజీ రద్దయిందన్నారు. వర్షాల వల్ల రీజియన్‌ పరిధిలో రూ.61లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. భవిష్యత్తులో లాభాలను ఆర్జించేందుకోసం తగు చర్యలు చేపట్టాలని డిఎంలను ఆదేశించారు. అదేవిధంగా బ స్టాండ్లు, బస్సుల్లో పరిశుభ్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. బస్సులు ప్రయాణించేటప్పుడు 50 అడుగుల దూరం ఖచ్చితంగా ఉండేవిధంగా డ్రైవర్లకు సూచించాలని డిఎంలను కోరారు. ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను సిడిల ద్వారా ప్రతి మంగళవారం ఆయా డిపోల పరిధిలో డ్రైవర్లకు శిక్షణ ఇస్తామన్నారు. 54 సీట్లు ఉండే బస్సుల్లో 20 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుండడం వల్ల ఆర్టీసికి నష్టాలు వస్తున్నాయని, వీటిని అధిగమించేందుకు గ్రామాల్లో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. గత నెలలో ప్రధమ, ద్వితీయస్థానాలు సాధించిన నెల్లూరు-2 డిపో మేనేజర్‌ పి.శీనయ్య, కావలి డిపో మేనేజర్‌ మధుబాబులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎంవి.ప్రభాకర్‌రెడ్డి, 1వ డిపో మేనేజర్‌ ఈగా భాస్కర్‌రెడ్డి, 2వ డిపో మేనేజర్‌ పి.శీనయ్య, జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.

విషజ్వరాల నివారణకు ప్రణాళికలు ఏర్పాటు - కాకాణి


నెల్లూరు:జిల్లాలో వర్షాకాలం సందర్భంగా విషజ్వరాలు సోకకుండా ఆరోగ్య కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు తయారు చేసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన చాంబర్‌లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రోగులకు అందిస్తున్న సేవలు, ఇమ్యునైజేషన్‌, పిహెచ్‌సిల నిర్వహణపై ఆయన సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సకాలంలో వైద్యం, అవసరమైన మందులిచ్చి ఆదుకోవాల్సిన డాక్టర్లు, సిబ్బంది కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు సక్రమంగా నిర్వర్తించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వైద్యులు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తూ తేదీలేని సెలవు కాగితాలు పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు. అలాంటి పిహెచ్‌సిలపై ఆకస్మిక తనిఖీలు జరిపి సంబంధిత వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో ఖాళీగావున్న ఎఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సుల ఖాళీలను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగావున్న పోస్టులు భర్తీ చేయడంతోపాటు పరీక్షలకు అవసరమైన పరికరాలను సమకూర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంలో గ్రామసర్పంచ్‌లు, కార్యదర్శుల సమన్వయంతో తగిన ప్రణాళికులు తయారు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాధి నిరోధక మందులు సక్రమంగా వాడుతున్నారా అనే విషయమై తనిఖీలు నిర్వహించి తగిన నివేదికలు అందజేయాలని సూచించారు. దోమలవల్ల వ్యాధులు సోకకుండా నిర్దేశించిన క్లోరినేషన్‌ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేలా చూడాలని, ఈ ప్రక్రియలో మండల పరిషత్‌ అధికారులతో సమీక్షలు నిర్వహించి వారానికోసారి సంబంధిత నివేదికలు తీసుకోవాలన్నారు.దోమల నివారణకు అన్ని మండల కేంద్రాల్లో ఫాగింగ్‌ మిషన్లు పంపిణీ చేశామని, అవి సక్రమంగా ఉపయోగపడుతున్నాయా అనే విషయమై సమగ్ర దర్యాప్తు నిర్వహించి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ, సై్వన్‌ఫ్లూ తదితర ప్రాణాంతక వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సెమీ ఆటో అనలైజేషన్‌ పరికరాన్ని అమర్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్‌ ద్వారా వివిధ సంక్షేమ పథకాల కార్యక్రమాల పనితీరును ప్రతిరోజూ మండల పరిషత్‌ అధికారులతో సమీక్షించేందుకు వీలుగా వైర్‌లెస్‌ సెట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో వైద్యాధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ ఆంజనేయరాజు, జిల్లా ఇన్‌చార్జ్‌ వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.

ముంబాయి రహదారిపై స్తంభించిన రాకపోకలు


సంగం:మండల పరిధిలోని సంగం - బుచ్చి ముంబాయి రహదారి గాంధీజన సంఘం వద్ద ఐరన్‌వోర్‌లారీలు ఇరుక్కుని వాహన రాకపోకలు స్తంభించాయి. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాకపోకలు స్తంభించాయి. ఇటీవల మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు అధ్వానంగా ఉన్న రహదారిపై ఆర్‌అండ్‌బి అధికారులు ఎర్రమట్టి తోలారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎర్రమట్టి తోలిన ప్రాంతాల్లో వాహనాలు ఇరుకుంటున్నాయి.మంగళవారం తెల్లవారుజామున ఐరన్‌వోర్‌లారీలు ఇరుక్కోవడంతో అప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలను ఆత్మకూరు నుంచి పొదలకూరు మీదుగా మళ్ళించారు. సంగం వారధి మీదుగా తాటిపర్తి, వరదాపురం మీద జొన్నవాడ మార్గంలో కొన్ని వాహనాలు మళ్లించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరుక్కున్న లారీలను పోలీసులు తొలగించి రాకపోకలను పునరుద్దరించారు. వాహనాలు ఇరుక్కుని ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నా ఆర్‌అండ్‌బి అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రయాణీకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోస్టుమ్యాన్‌ ఆత్మహత్యాయత్నం

ఆత్మకూరు: తపాలాశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారి వేధింపులతో ఓ పోస్టుమ్యాన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని దేపూరు గ్రామంలో జరిగింది. బాధితుని, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేపూరు గ్రామంలో పూజారి శేషాద్రి గత కొన్ని సంవత్సరాలుగా పోస్టుమ్యాన్‌గా పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఇటీవల తపాలాశాఖ సిబ్బందికి కొన్ని సంవత్సరాలుగా నిల్వ ఉన్న అరియర్స్‌ను మంజూరు చేసింది. దీంతో శేషాద్రికి సుమారు 14 వేల రూపాయలు రావాల్సి ఉంది. ఆ నిధులు ఇవ్వాలంటే ఉన్నతాధికారుల ఆదేశం తప్పని సరి. ఈ నేపథ్యంలో శేషాద్రి ఆత్మకూరులో పని చేసే ఓ ఉన్నతాధికారిని తనకు వచ్చే అరియర్స్‌ను మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆ అధికారి తనకు కొంత నగదును ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు.శేషాద్రి ఉన్నతాధికారి అడిగిన మొత్తాన్ని ఇవ్వలేక అందులో కొంత మొత్తాన్ని అధికారికి సమర్పించుకున్నాడు. అయితే ఆ ఉన్నతాధికారి శేషాద్రికి రావాల్సిన అరియర్స్‌ మొత్తాన్ని ఇవ్వలేదు. తాను అడిగిన నగదు ఇస్తేనే నీకు రావాల్సిన అరియర్స్‌ ఇస్తానని ఉన్నతాధికారి శేషాద్రితో కరాకండిగా చెప్పాడు. దీంతో ఆదివారం ఉదయం నిద్రమాత్రలు తెచ్చుకుని మింగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు శేషాద్రి. ఈ విషయాన్ని తన భార్య, బిడ్డలతో సైతం చెప్పుకొచ్చాడు. నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్న శేషాద్రిని చూసిన భార్య లబోదిబోమంటూ స్థానికులకు చెప్పింది. ఈ విషయాన్ని 108 సిబ్బందికి తెలియజేయడంతో ఆత్మకూరు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు మాత్రలను కక్కించి శేషాద్రికి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ విషయమై శేషాద్రి ఆత్మకూరులో పని చేసే ఉన్నతాధికారి వేధింపులే నా ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు స్పందించి నాకు న్యాయాలంటూ కోరారు. మొత్తానికి సకాలంలో 108 వాహనం వైద్యశాలకు చేర్చడంతో శేషాద్రి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరి ఈ సంఘటన తపాలాశాఖ జిల్లా అధికారులు ఎలా స్పందింస్తారో... శేషాద్రికి ఏ మేరకు న్యాయం జరుగుతుందో.

జ్వరమేలే అనుకుంటే...

నెల్లూరు:జ్వరం...జలుబు...దగ్గు... ఇలాంటి వ్యాధులంటే గతంలో అసలు భయపడాల్సిన పనేలేదు. కేవలం క్యాన్సర్‌, గుండె, లివర్‌ తదితర వ్యాధులంటేనే అమ్మో అనుకునే పరిస్థితులు పోయాయి. భయంకరమైన ప్రాణాంతక వ్యాధులైనా ప్రస్తుతం నయమవుతున్నాయేమోగాని ఏముందిలే అనుకునే జ్వరం, జలుబు, దగ్గులు నేడు ఎంతో విలువైన ప్రాణాలను హరించి వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలుబు, దగ్గుల కారణంగా ‘సై్వన్‌ ఫ్లూ’ అనే మహమ్మారి దేశవ్యాప్తంగా ఎందరి ప్రాణాలను బలిగొన్నదో ప్రజలకు తెలియంది కాదు. ఇక జ్వరం విషయానికొస్తే కనీసం డాక్టర్ల వద్దకు వెళ్లకుండా, మాత్రలు వేసుకోకుండానే తగ్గపోయే పరిస్థితులు లేకపోలేదు. కాదు కూడదు అనుకుంటే కనీసం మందులషాపులకెళ్లి జ్వరం, తలనొప్పి, వళ్లు నొప్పులు అని చెప్పి వారిచ్చే ఒకటి రెండు మాత్రలకు తగ్గిపోయే పరిస్థితులు తెలియందికాదు. అయితే ప్రస్తుతం డెంగ్యూ, మెదడువాపు, చికున్‌గున్యాలతోపాటు పలు విషజ్వరాలు ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి వృద్దుల వరకు లింగ భేదాలు లేకుండా ప్రాణాలను తీస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. నాకు ఉగ (ఊహ) తెలిసినప్పటి నుంచి ఆసుపత్రికి అంటూ వెళ్లి ఎరుగను అని చాలామంది అంటుంటే వింటుంటాం. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది.ఈ జ్వరాలకు పేద, గొప్ప అనే తేడా ఏమాత్రం లేదనేది స్పష్టమవుతోంది. జ్వరమేకదా అనుకుంటే నిన్న మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ, మన కళ్లెదుటే ఉన్న కుటుంబ సభ్యులొకరు నేడు ఈ మాయదారి జ్వరం మూలాన లోకాన్ని విడిచి వెళ్లారంటే ఆ బాధ సంబంధిత కుటుంబానికే తెలుస్తుంది. ఈ మాయదారి జబ్బులకు కలుషితమైన నీరు, దోమలు ప్రధాన కారణమవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ వ్యాధులకు ప్రజలు బలవుతున్నారని టివిలు, పత్రికల ద్వారా వార్తలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం కాకిలెక్కలు చెబుతూ మీన మేషాలు లెక్కబెడుతుంది. అధికారులు తాము వ్యాధులను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెబుతుండడం హాస్యాస్పదంగా తయారవుతుంది. ప్రజల నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వారికి కనీస వసతి సౌకర్యాలు కల్పించడం అటుంచి వారి ప్రాణాలను హరించివేస్తున్న దోమల నివారణకు, కలుషితం కాని తాగునీటిని అందించే విషయంలో మున్సిపాలిటీ, నగర పాలక సంస్థ, పంచాయతీలు ఘోరంగా విఫలం చెందుతున్నాయి. ముఖ్యంగా ఈ జ్వరాల విషయంలో నిరక్షరాస్యుల సంగతి అటుంచితే చదువుకున్నవారు సైతం రెండు మూడు రోజులపాటు ఏదో ఒకటి అరా మందులు వాడి తీరా వ్యాధి ముదిరి ప్లేట్లెట్ల సంఖ్య భారీగా పడిపోతేగాని తేరుకోవడం లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ స్థితిలో స్థానిక వైద్యులు తాము చేయాల్సింది అంతా చేశాం... ఇక మా వ ల్ల కాదు అంటూ చేతులెత్తేస్తున్నారు. తీరా ఆగమేఘాలపై సంబంధిత రోగిని తీసుకుని చెనై్న, తిరుపతి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు వెళ్తే అదృష్టం బాగుండి సకాలంలో వైద్యసేవలు అందితేసరి లేకుంటే హరీ. ముఖ్యంగా ఇటీవల కాలంలో జిల్లాలో డెంగ్యూ వ్యాధి బారినపడి దాదాపు పది మంది వరకు చనిపోగా వందలాదిమంది పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంలా బతికి బయటపడ్డారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అప్పటికీ వారంతా వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని కాస్తా అటు ఇటుగా సకాలంలో వైద్యం పొందడంతో హమ్మయ్య అనిపించుకోగలిగారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం, హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఒంటేరు దశరధరామిరెడ్డి, అంటు వ్యాధుల నివారణ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ డి.మధుసూదన్‌ వంటి రాష్టస్థ్రాయి ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాను సందర్శించి వెళ్లినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. నగరంలో పారిశుద్ధ్య వారోత్సవాల పేరుతో నగరపాలక సంస్థ అధికారులు పలు పారిశుద్ధ్య పనులు చేపట్టినా నగరంలో దోమల మోత ఇంకా అలాగే కొనసాగుతోంది. తాజాగా నగరంలోని కొండాయపాళెం ప్రాంతానికి చెందిన క్ష్మీ ధీరజ(12) అనే బాలిక డెంగ్యూ వ్యాధికి గురై మరణించింది. వారి తల్లిదండ్రులకు ఆ బాలిక ఒక్కటే కూతురు కావడంతో ఆమె మరణంతో వారు కుప్పకూలిపోయారు. కని, పెంచి కళ్లముందే కన్నకూతురు కన్నుమూయడంతో ప్రస్తుతం వారి బాధను తీర్చి, ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. రాజకీయ నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తూ అది చేస్తాం... ఇది చేస్తాం... మా జీవితం ప్రజాసేవకే అంకితం... అంటూ చెబుతున్న మాటలు నీటి మూటల్లాగే మిగులుతున్నాయని, ఈ దోమలు, కలుషితమైన నీరు మరిన్ని ప్రాణాలను హరించేలోగా పాలకులు స్పందించి తమను కాపాడాలంటూ జిల్లా ప్రజానీకం వేడుకుంటోంది.

ఎర్రచందనం స్మగ్లింపై అధికారుల వైఫల్యం

బుచ్చిరెడ్డిపాళెం: బహిరంగ మార్కెట్లో 40 లక్షల రూపాయలకు పైగా విలువచేసే 7.126 టన్నుల బరువున్న ఎర్రచందనం దుంగలను గుర్తించే విషయంలో బుచ్చి పోలీసులు రెవెన్యూ అధికారుల వైఫల్యం వున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఎర్రచందనం దుంగలున్న విషయం జిల్లా అటవీశాఖాధికారులు దాడులు జరిపేంతవరకు స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియకపోవడం వారి నిబద్దతకు కొలమానం బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని కొట్టాలు (విలియమ్స్‌పేట) గ్రామంలో గల రైస్‌మిల్లులు 241 ఎర్రచందనం దుంగలను జిల్లా అటవీశాఖ అధికారులు ఆదివారం పట్టుకున్న విషయం తెలిసిందే. మిల్లులో దుంగలు పేర్చిన తీరునుబట్టి అవి విడతల వారీగా అక్కడికి చేర్చినట్లు తెలుస్తోంది. కొట్టాలు గ్రామం బుచ్చి, కొడవలూరు మండలాల సరిహద్దు ప్రాంతం కావడం హైవే అతిసమీపంలో (6 కి.మి.) వుండడం ఈ ప్రాంతంలో పోలీసుల నిఘా లేకపోవడం స్మగ్లర్లు అనువైన ప్రదేశంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఎస్‌ఎఫ్‌సి సీజింగ్‌లో రైస్‌మిల్లు :-స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు కొట్టాలు గ్రామంలో వున్న రైస్‌మిల్లును గతంలో సీజ్‌ చేశారు. సీజింగ్‌లో వున్న రైస్‌మిల్లులో ఎర్రచందనం దుంగలు భారీస్థాయిలో పట్టుబడడం చూస్తే ఈ స్మగ్లింగ్‌లో పెద్దస్థాయి వ్యక్తుల ప్రమేయం వున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి టాటాసుమోలు :- గత కొంతకాలంగా అర్ధరాత్రి వేళల్లో టాటాసుమోలు, మిని వ్యాన్లు సీజింగ్‌ వున్న ఈ మిల్లు వద్దకు వస్తుండేవని స్థానికులు తెలిపారు. ఇతరులను కూడా ఈ ప్రాంతానికి వెళ్ళనిచ్చేవారుకాదని వారు పేర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా స్థాని పోలీసులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆదివారం దాడులు జరిపిన అటవీశాఖ అధికారులు కూడా తమకు అందిన విశ్వసనీయం సమాచారం మేరకు దాడులు జరిపామని పేర్కొంటున్నా స్మగ్లర్ల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగానే ఎర్రచందనం దుంగల విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.స్మగ్లర్లకు అడ్డాగా :- ఇప్పటి వరకు జూదరులకు, వ్యభిచారులకు నిలయంగా వున్న బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇప్పుడు స్మగ్లర్లకు అడ్డాగా మారింది. 24 గంటలూ ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నామని చెప్పుకునే సంబందిత అధికారులు చాపక్రిందనీరులా వుస్తరిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఇకనైనా నిఘావుంచాల్సిన అవసరం వుంది.

విన్నర్‌గా నిలిచిన జెబి కళాశాల

కావలి : ఈ విద్యా సంవత్సరం ఎస్‌వి యూనివర్శిటీ నిర్వహించిన అంతర్‌ కళాశాలల క్రికెట్‌ పోటీలలో జవహర్‌ భారతి డిగ్రీ కళాశాల విన్నర్‌గా నిలవడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. గత నెల 28న ప్రారంభమయ్యి వర్షాల కారణంగా పోటీలు ఆదివారం ముగిశాయి. మొట్టమొదటిసారిగా కార్పోరేట్‌ కళాశాలలను ఓడించి ప్రభుత్వ కళాశాలలు విన్నర్‌గా నిలవడం విశేషంగా వారు భావించారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వోదయ రెక్టార్‌ వినయ్‌కుమార్‌రెడ్డి విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. ఈ విజయం కళాశాల 60సంవత్సరాల చరిత్రలో ప్రథమమని కొనియాడారు. విద్యార్థులు సమిష్టిగా ఆడి విజయం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్‌రెడ్డి, ఎం వెంకటేశ్వర్లు, డాక్టర్‌ పి సుబ్రమణ్యం నాయుడు, జె క్రిష్ణప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అందనంత ఎత్తుకు నిత్యావసరాలు

నెల్లూరు: నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేస్తున్నామని ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తుంటే, మరోపక్క సామాన్యులకు అందనంత ఎత్తులో ధరలు పెరుగుతున్నాయి. ఉల్లిపాయలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 30 నుంచి 32 రూపాయలు పలుకుతున్నాయి. రెండో రకం 28 రూపాయలుగా ఉంది. రెండో రకం ఉల్లిపాయల్లో నాసిరకం అధికంగా ఉండటంతో 30 రూపాయలు చెల్లించకతప్పడం లేదు. నిత్యం కూరల్లో తప్పనిసరిగా వాడాల్సిన ఉల్లిపాయలు ఒక్కసారిగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం రెండు రూపాయలుగా ఉన్న కోడిగుడ్డు ధర సోమవారం మార్కెట్‌లో మూడున్నర రూపాయలు పలికింది. ఉల్లిపాయలు, కోడిగుడ్లు కావలిసిన మేరకు దిగుమతి కాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే ధరల అదుపు విషయం అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు విమర్శిస్తున్నారు. వంట నూనెల ధరలు సంవత్సరం క్రితం గణనీయంగా పెరిగినప్పుడు వాటిపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా దిగివచ్చాయి.మరోపక్క చౌకధరల దుకాణాల్లో లభించే పామోలిన్‌ ఆయిల్‌ కంటే బహిరంగ మార్కెట్‌లో నాలుగు రూపాయలు తక్కువకు లభించేది. అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి మళ్లీ నూనెల ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా పొద్దుతిరుగుడు ఉత్పిత్తి గణనీయంగా తగ్గిపోవడంతో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌తో పాటు వేరుశనగ నూనెల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. వేరుశనగనూనె గత నెల మొదటి వారంలో 65 రూపాయలు ఉండగా ప్రస్తుతం 80 రూపాయలకు లభిస్తోంది. ఇది ఇంకో పది రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా పామోలిన్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ ధర ప్రస్తుతం రెండు రూపాయలు పెరిగింది. ఈ రకం నూనె ధర భవిష్యత్తులో పెద్దగా హెచ్చుదల ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆదోని రకం సన్‌ఫ్లవర్‌ఆయిల్‌ ధర 43 రూపాయల నుంచి 50కు పెరిగింది.ఇక మార్కెట్‌లో అధికంగా డిమాండ్‌ ఉండే బ్రాండెడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరలు మాత్రం అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. గత పక్షం రోజులుగా ప్రతిరోజు ఎంతో కొంత హెచ్చుదలను సూచిస్తున్నాయి. ప్రస్తుతం 60 నుంచి 70 రూపాయలకు వెళ్లింది. సంక్రాంతి నాటికి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ప్యాకెట్‌ ధర 90 రూపాయలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాకు కాకినాడ పోర్టు నుంచి వంట నూనెలు రవాణా అవుతున్నాయి. జిల్లాలో రోజుకు పది ట్యాంకర్ల వంట నూనెను వినియోగిస్తున్నారు. దీనితో ధరల పెరుగుదల ప్రభావం జిల్లాపై అధికంగా చూపిస్తోంది. ఒక కందిపప్పు ఒకటో రకం 95 నుంచి వంద రూపాయల వరకూ ఉంది. చింతపండు, మినపప్పు, మిర్చి, బియ్యంతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు ప్రతి నెలలో పెరుగుదలను సూచిస్తుండటంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తోంది.

చంద్రునిపై మువ్వన్నెల జెండా

సూళ్ళూరుపేట: ఎర్రకోటపై ఎగిరే మువ్వన్నెల జెండాను చంద్రునిపై ఎగురవేసి ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌నాయర్‌ ఎందరికో ఆదర్శమవడంతో పాటు దేశ ప్రగతిని విశ్వవీధుల్లో నిలిపారని ఇటీవల పదవీ విరమణ చేసిన ఇస్రో చైర్మన్‌ మాధవన్‌నాయర్‌ని పలువురు ప్రశంసిస్తూ ఘన సత్కారం చేశారు. సతీష్‌ ధావన్‌ స్ఫేస్‌ సెంటర్‌ శ్రీహరికోటలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం షార్‌ ఉద్యోగులు, శాస్తజ్ఞ్రులు కలిసి తమ అభిమానాన్ని చాటుకొంటూ మాధవన్‌నాయర్‌తో పాటు ఆయన సతీమణి రాధను సత్కరించారు. షార్‌ ఉద్యోగుల సత్కారానికి ఉప్పొంగిన నాయర్‌ కొద్దిసేపు మాటలు లేకుండా అలాగే ఉండిపోయి, కంట తడి పెట్టుకొన్నారు. 2003 నుంచి ఇస్రో చైర్మన్‌గా ఉన్న తాను దేశానికి కీర్తి దాయకమైన చంద్రయాన్‌లాంటి ప్రయోగంతో పాటు 27 ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో కొన్ని ప్రాజెక్టులు విఫలమైనప్పటికీ, మిగతా అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావడంలో ఇస్రో ఉద్యోగుల అందరి కృషి ఉందన్నారు. ఎన్నో లోపాలను అప్పటికప్పుడు సరిదిద్దడంలో ఇస్రో ఉద్యోగుల కృషిని అభినందిస్తూ...కొద్దిసేపు మాటలు రాక ఉండి పోయారు. ప్రాణాలకు తెగించి రాకెట్‌ ప్రయోగాల విజయవంతానికి షార్‌ ఉద్యోగస్తులు కృషి చేశారని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇస్రో ఉద్యోగస్తులతో తనకు తెలియని అనుబంధముందన్నారు. రాబోయే అయిదేళ్ళలో ఇస్రో ముందు 75 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అందరూ కలిసి లక్ష్యాన్ని ఛేదించాలని కోరారు. పెద్దల అనుభవాలను యువ శాస్తజ్ఞ్రులు పాఠాలుగా నేర్చుకోవాలని కోరారు. షార్‌ డైరక్టర్‌ చంద్ర దత్తన్‌, అసోసియేట్‌ డైరక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, వ్యాస్‌ డైరక్టర్‌ కె సుభాష్‌, స్ప్రాబ్‌ డైరక్టర్‌ వెంకట్రావు, కంట్రోలర్‌ శేషగిరిరావు, పిఆర్‌ఓ రవీంద్రనాద్‌ తదితరులు మాదవన్‌నాయర్‌ దంపతులను ఘనంగా సత్కరించారు.

తరగతి గదులకు ప్రత్యేక ప్రణాళికలు

నెల్లూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో సరైన గదులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, తరగతి గదుల్లో అవసరమైన పాఠశాలల్లో గదులు ఏర్పాటు చేసేందుకు తగిన కార్యాచ రణ ప్రణాళిక తయారు చేయాలని జడ్పీ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రె డ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జడ్పీ చైర్మన్‌ చాంబర్‌లో విద్యాశాఖ, వికలాంగుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు సరైన తరగతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో మండలాల వారీగా, పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయాలన్నారు. అలాగే మరమ్మతులకు వీలు లేకుండా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి, వాటి స్థానాల్లో నూతన భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు.కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో సరైన గదులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖాధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు సమన్వయంతో స్థలాన్ని పరిశీలించి అవసరమైన భవన నిర్మాణానికి వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి మంచి ఫలితాలను సాధించేలా చూడాలన్నారు. అలాగే జడ్పీ పాఠశాలలో చదువుతున్న వికలాంగులను గుర్తించి వారికి అవసరమైన వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్‌ తదితర పరికరాలను అందజేయాలన్నారు. దీనిపై వివిధ మండల విద్యాశాఖాధికారుల నుండి సమగ్ర నివేదికను తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ డిప్యూటీ సిఇఒ ఆంజనేయరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, వికలాంగశాఖ ఎడి లక్ష్మణ్‌, సాంఘిక సంక్షేమశాఖ ఇఇ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Monday, November 23, 2009

నెల్లూరు న్యూస్నెల్లూరు వీడియో సాంగ్

Nellore Reddys and Nellore Politics At Nellore Club

Nellore has been the hub for affluent Reddys from centuries. Even they have been the big patrons for various Telugu cultural clubs in Tamilnadu. Now they are all getting united on an occasion. The occasion is the 'sankusthapana' for the reconstruction of age-old Nellore Club building.

The Nellore Club was established in 1885 during the era of British India. Now the club is getting new hue all over. Anam Rama Narayana Reddy is going to be the Chief Guest of the event along with 9 other MLAs those are going to be special guests. Andhra Club-Chairman from Chennai is also gracing the occasion. The event can be watched through web-casting by www.nellore.tv of Manisha Network Technologies.

Suresh Reddy Bomma, CEO, Manisha Network Technologies says, "We are taking it a privilege to facilitate all the Nellore natives living across the globe to watch the happenings of their district through our www.nellore.tv . The Nellore Club event is going to be the first prestigious event to be web-casting on this TV".

It goes without saying that the occasion will also be a platform for the unification of all Reddy energies those will be useful for coming elections.

Sunday, November 22, 2009

భారీ వర్షాలు నెల్లూరు జిల్లా

Rains continued to batter PSR Nellore district without a break and the incessant rains led nearly 300 villages isolated from the other parts of the district and 200 of them are under a sheet of water.

Gudur and Kavali divisions have faced the wrath of the un-relented rains. Trains operating between Gudur and Tirupati are running behind schedule to the extent of one to three hours because of water overflow on the railway track near Yellakaru railway station located between Kalahasthi and Venkatagiri.

Traffic movement remained cut off between Gudur and Saidapuram for the second day owing to heavy floods to Kaivalya river. Farmers themselves have managed to arrest a breach to Kondapuram tank. Threat symptoms are looming large for several tanks in Kavali division especially the tanks at Bogole and Jaladanki mandals.

Several villages located in the banks of Beeraperu and Boggeru streams in Atmakur, Sangam and AS Peta mandals have been inundated.

An 80-year-old man, Polaiah of AS peta mandal was rescued by fishermen nearly three hours after he was washed away in Kommaleru stream. Fishermen spotted him holding a tree in the down stream to save himself from swirling waters.

Three women were injured when a thatched house gave in at Manubolu.

As many as 26 main roads under R&B have been damaged in various parts of the district. Irrigation and railway officials have been keeping a close watch on 120 odd tanks situated close to the railway track since they are full to their brim and close to danger level.

Senior revenue officials have been monitoring the situation and they have already sounded an alert after weather forecast indicated further rains.

Speaking to this newspaper, district collector, Mr K. Ramgopal, said that traffic is not being allowed on 14 main roads because of overflowing of water and weak causeways. He added that they are taking up repair works on war footing.

Reacting to a question on in accessible villages, he said that there is alternative road to all such villages except for Mungamur in Kavali mandal. He said that traffic movement to the village was restricted because of a weak bridge.

He informed that they have established control rooms in all the divisional offices and at the district collectorate.

Average rainfall recorded in the district was 20 mm at during the last 24 hours ending at 8.30 am on Sunday.

Meanwhile, the Kandula Obula Reddy Gundlakamma project officials lifted two gates of the reservoir to release gushing rainwater into the sea. Four gates of Rallapadu project of Lingasamudram mandal were also lifted. The highest rainfall of 4.8 cm was recorded at Valetivaripalem mandal.

10k రన్ హైదరాబాద్
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh