Tuesday, November 24, 2009
ముంబాయి రహదారిపై స్తంభించిన రాకపోకలు
సంగం:మండల పరిధిలోని సంగం - బుచ్చి ముంబాయి రహదారి గాంధీజన సంఘం వద్ద ఐరన్‌వోర్‌లారీలు ఇరుక్కుని వాహన రాకపోకలు స్తంభించాయి. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాకపోకలు స్తంభించాయి. ఇటీవల మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు అధ్వానంగా ఉన్న రహదారిపై ఆర్‌అండ్‌బి అధికారులు ఎర్రమట్టి తోలారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎర్రమట్టి తోలిన ప్రాంతాల్లో వాహనాలు ఇరుకుంటున్నాయి.మంగళవారం తెల్లవారుజామున ఐరన్‌వోర్‌లారీలు ఇరుక్కోవడంతో అప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలను ఆత్మకూరు నుంచి పొదలకూరు మీదుగా మళ్ళించారు. సంగం వారధి మీదుగా తాటిపర్తి, వరదాపురం మీద జొన్నవాడ మార్గంలో కొన్ని వాహనాలు మళ్లించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరుక్కున్న లారీలను పోలీసులు తొలగించి రాకపోకలను పునరుద్దరించారు. వాహనాలు ఇరుక్కుని ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నా ఆర్‌అండ్‌బి అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రయాణీకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment