Tuesday, November 24, 2009
ఎర్రచందనం స్మగ్లింపై అధికారుల వైఫల్యం
బుచ్చిరెడ్డిపాళెం: బహిరంగ మార్కెట్లో 40 లక్షల రూపాయలకు పైగా విలువచేసే 7.126 టన్నుల బరువున్న ఎర్రచందనం దుంగలను గుర్తించే విషయంలో బుచ్చి పోలీసులు రెవెన్యూ అధికారుల వైఫల్యం వున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఎర్రచందనం దుంగలున్న విషయం జిల్లా అటవీశాఖాధికారులు దాడులు జరిపేంతవరకు స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియకపోవడం వారి నిబద్దతకు కొలమానం బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని కొట్టాలు (విలియమ్స్‌పేట) గ్రామంలో గల రైస్‌మిల్లులు 241 ఎర్రచందనం దుంగలను జిల్లా అటవీశాఖ అధికారులు ఆదివారం పట్టుకున్న విషయం తెలిసిందే. మిల్లులో దుంగలు పేర్చిన తీరునుబట్టి అవి విడతల వారీగా అక్కడికి చేర్చినట్లు తెలుస్తోంది. కొట్టాలు గ్రామం బుచ్చి, కొడవలూరు మండలాల సరిహద్దు ప్రాంతం కావడం హైవే అతిసమీపంలో (6 కి.మి.) వుండడం ఈ ప్రాంతంలో పోలీసుల నిఘా లేకపోవడం స్మగ్లర్లు అనువైన ప్రదేశంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఎస్‌ఎఫ్‌సి సీజింగ్‌లో రైస్‌మిల్లు :-స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు కొట్టాలు గ్రామంలో వున్న రైస్‌మిల్లును గతంలో సీజ్ చేశారు. సీజింగ్‌లో వున్న రైస్‌మిల్లులో ఎర్రచందనం దుంగలు భారీస్థాయిలో పట్టుబడడం చూస్తే ఈ స్మగ్లింగ్‌లో పెద్దస్థాయి వ్యక్తుల ప్రమేయం వున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి టాటాసుమోలు :- గత కొంతకాలంగా అర్ధరాత్రి వేళల్లో టాటాసుమోలు, మిని వ్యాన్లు సీజింగ్ వున్న ఈ మిల్లు వద్దకు వస్తుండేవని స్థానికులు తెలిపారు. ఇతరులను కూడా ఈ ప్రాంతానికి వెళ్ళనిచ్చేవారుకాదని వారు పేర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా స్థాని పోలీసులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆదివారం దాడులు జరిపిన అటవీశాఖ అధికారులు కూడా తమకు అందిన విశ్వసనీయం సమాచారం మేరకు దాడులు జరిపామని పేర్కొంటున్నా స్మగ్లర్ల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగానే ఎర్రచందనం దుంగల విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.స్మగ్లర్లకు అడ్డాగా :- ఇప్పటి వరకు జూదరులకు, వ్యభిచారులకు నిలయంగా వున్న బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇప్పుడు స్మగ్లర్లకు అడ్డాగా మారింది. 24 గంటలూ ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నామని చెప్పుకునే సంబందిత అధికారులు చాపక్రిందనీరులా వుస్తరిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఇకనైనా నిఘావుంచాల్సిన అవసరం వుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment