Saturday, November 28, 2009
ఒకే కుటుంబలో ముగ్గురు ఆత్మహత్య
రాపూరు మండలం కొండక్రింద గ్రామమైన మద్దూరుపల్లి గ్రామంలో గత శుక్రవారం దేవళ్ళ అంకమ్మ ఆత్మహత్యచేసుకొని చనిపోగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె భర్త దేవళ్ళ రామయ్య(48), ఆయన కుమార్తెలు అమరావతి(18), ప్రసూన(16)లు శుక్రవారం రాపూరు-చిట్వేలి సమీపంలోని దట్టమైన అడవుల్లో గుట్టవద్ద అరటిపండులో గుళికలు తిని చనిపోయిన సంఘటన జరిగింది.దీంతో ఈ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోనికి వెళితే స్థానికుల కథనం మేరకు దేవళ్ళ రామయ్య రాపూరు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే దంపతులిద్దరు ఎంతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందరితో సరదాగా ఉండేవాడు రామయ్య. ఇంటివద్ద వ్వవసాయ పనులుచేసుకుంటూ ఉండేవారు. ఏమైందోఏమోకాని ఆ భార్యభర్తల మధ్య స్వల్ప వివాదం అతని భార్య ఆత్మహత్యకు ఉసిగొల్పింది. గత శుక్రవారం అంకమ్మ గూడూరులో మరణించింది. దీంతో ఆ కుటుంబంలో ఆమె మరణం వారందరిని ఎంతో మనస్థాపానికి గురిచేసింది.ఆమె మృతిని జీర్ణించుకోలేని భర్త, కూతుళ్లు ఏమిచేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఒకపక్క కుమారుడు రాజు తల్లి మరణించిందని దిగాలుగా రెండుమూడు రోజుల నుండి అన్నపానీయాలు మాని మౌనంగా ఉండసాగాడు. ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్ళడంతో అతన్ని రాపూరు 108 స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్సలు చేశారు. అయినప్పటికీ అతను తల్లి మరణం నుంచి తేరుకోలేకపోయాడు. ఈ విధంగా ఉండటంతో దేవళ్ళ రామయ్య అతని కూతుళ్ళను తీసుకొని ఎవరూ నిద్రలేవక ముందే అడవుల్లోనికి వెళ్ళి గుళికలు అరటిపండులోవుంచి మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు రామయ్య పెద్దకుమార్తె అయిన కస్తూరి ఆమె భర్తకు ఫోన్ ద్వారా తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని తమను ఎవరూ వెతకవద్దని ఏడుస్తూ ముగ్గురు చెప్పినట్లు తెలిసింది.అయితే వారు ఎంతసేపటికి రాకపోవడంతో వారికోసం అడవుల్లో కుక్కను వెంటపెట్టుకొని కుటుంబసభ్యులు గాలించగా అక్కడ మృతదేహాలు పడివుండటంతో వారు తల్లడిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రాపూరు ఎస్‌ఐ యు జయరావ్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం రాపూరు డిపో మేనేజర్ హనుమంతరావు, ఎస్టీఐ తుక్కా రామిరెడ్డి, మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. ఆర్టీసి లాంచనాల ప్రకారం రూ.5వేలను ఎత్తుబడి కార్యక్రమానికి ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే ఎన్‌ఎంయు యూనియన్‌కు చెందిన రామయ్యకు ఆ యూనియన్ నాయకులు కె నరయ్య ఇతర కార్మికులు నివాళులు అర్పించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment