కలువాయి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ ంలోని నిధులు గోల్‌మాల్ అయిన విషయం మండలంలోని చింతలాత్మకూరు పంచాయితీలో చోటుచేసుకుంది. నిమ్మమొక్కలు నాటకుండానే నాటినట్లు నిధులు డ్రాచేసి రైతుల పేరిట అధికారులు కాజేసినట్లు వెలుగులోనికి వచ్చినవైనం. చింతలాత్మకూరు పంచాయితీలో ఉపాధిలో అవినీతి జరిగిందని గ్రామంలోని రైతులు ఎంపిడిఒకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఫిర్యాదు మేరకు ఎంపిడిఒ యునైశమ్మ గురువారం పంచాయితీ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగింది.
విచారణలో భాగంగా రైతులు జరిగిన 2008-09సంవత్సరానికి సంబంధించిన నిమ్మ మొక్కల పెంపకంలో భాగంగా కొందరు రైతులు మొక్కలు నాటకుండానే బిల్లులు డ్రాచేసుకొని దిగమింగడం జరిగిందని రైతులు ఆమెకు తెలియచేడంతో వెంటనే స్పందించిన ఆమె చీమలదిన్నె పోలయ్య, చీమలదిన్నె రమణయ్య, కంచర్ల సుబ్బమ్మలకు చెందిన పొలాలను పరిశీలించగా చీమలదిన్నె పోలయ్య పొలంలో మొక్కలు పూర్తిగా నాటకపోవడం, చీమలదిన్నె రమణయ్య, కంచర్ల సుబ్బమ్మ పొలాల్లో 20నుండి25సంవత్సరాల వయస్సుకలిగిన నిమ్మమొక్కలను చూసి నిర్ఘాంతపోయవడం జరిగింది.
మిగతా పొలాలను పరిశీలించమని రైతులు కోరగా అవినీతి జరిగిందని ఇక పొలాలను చూడాల్సిన అవసరం లేదని ఆమె తెలియచేసింది. ఈ విషయమై ఎపిఒ వెంకటేశ్వర్లు అడగ్గా నేడు చూడలేదని సమాధానం చెప్పడం జరిగింది. సిఐజి గ్రూపు లీడర్లు సోంపల్లి వెంకటేశ్వర్లు ఆయన భార్య విజయమ్మలు 260మొక్కలు నాటాల్సివుండగా 220మొక్కలు నాటి 260మొక్కలకు నిధులు డ్రా చేసినట్లు ఈ విచారణలో వెల్లడైంది. కనుక సంబంధిత అధికారులు, రైతులపై తక్షణమే చర్య తీసుకోవడం జరుగుదుంతని ఎంపిడిఒ యునైశమ్మ తెలిపారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్ - టిడిపి యూత్
ఉపాధిహామీ పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశంపార్టీ యూత్ నాయకుడు మూతేటి చంద్రశేఖర్, సోంపల్లి గిరినాయుడులు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment