ఫతేఖాన్‌పేట (నెల్లూరు) : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రిమియర్ ఆధ్వర్యంలో కార్ల తయారీలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స యుటిలిటీ వెహికిల్ (యుఎస్‌వి) స్థాయిలో కారును ఉత్పత్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రియోలో డిఎక్స్ మోడల్ కారును గురువారం సాయంత్రం నగరంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సాయి కృష్ణ ప్రిమియర్ షోరూంలో మేనేజింగ్ పార్ట్నర్లు ఎం.శివప్రసాద్, సిహెచ్.వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేందర్‌సింగ్‌లు విలే కరులకు కారు ప్రత్యేకతల గురించి వివరించారు.
షోరూంను డిసెంబర్ 11వ తేదీన ప్రారంభిస్తున్నప్పటికీ బుకింగ్ గురువారం ఉదయం నుంచే ప్రారంభించామని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి అప్పుడే బుకింగ్‌లు జరిగాయని వారు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో వాహనాలను డెలివరీ చేస్తామని వారు వివరించారు. ఇప్పటికే అరబ్, ఇండోనేసియాతో పాటు 33 దేశాల్లో ఈ మోడల్ కార్లు వినియోగంలో ఉన్నాయని, ప్రధానంగా మన దేశంలో గ్రామీణ రోడ్లను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స యుటిలిటీ కార్ల స్థాయిలో ఉండటంతో గోతులమయమైన రోడ్లపై సైతం కారు ప్రయాణించే వీలు కలుగుతుందని వారు చెప్పారు. స్పోర్ట్స యుటిలిటీ వాహనాల్లో ఉన్న సౌకర్యాలు అన్నీ రియోలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకూ పొడవు, ఎత్తు, వెడల్పులను తగ్గించి తయారుచేయడంతో మహిళలు సైతం సునాయసంగా కారును నడుపుకుంటూ వెళ్లవచ్చని అన్నారు.
పైగా యుఎస్‌వి వాహనాలకంటే ఈ కారులో మైలేజీ అధికంగా ఉంటుందని, ఏసీ వినియోగంలో ఉండగా లీటరు డీజిల్‌కు 16 కిలోమీటర్ల దూరం వెళ్లడం వల్ల ఇటు ఖర్చు తగ్గడంతోపాటు, ప్రయాణం కూడా సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 రంగుల్లో కార్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. నెల్లూరులో తమ షోరూంలోనే సర్వీసు సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నామని, సాధారణ మెకానిక్‌లు సైతం మరమ్మతు చేసేవిధంగా కారును రూపొందించినట్లు ఆయన చెప్పారు. విడిభాగాల ధరలు కూడా అత్యంత తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం మూడు మోడల్స్‌లో కార్లు లభిస్తున్నాయని అన్నారు. ఉన్నతశ్రేణి మోడల్లో అన్ని హంగులు ఉంటాయని ఆయన వివరించారు.
No comments:
Post a Comment