Tuesday, November 24, 2009
చంద్రునిపై మువ్వన్నెల జెండా
సూళ్ళూరుపేట: ఎర్రకోటపై ఎగిరే మువ్వన్నెల జెండాను చంద్రునిపై ఎగురవేసి ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్‌నాయర్ ఎందరికో ఆదర్శమవడంతో పాటు దేశ ప్రగతిని విశ్వవీధుల్లో నిలిపారని ఇటీవల పదవీ విరమణ చేసిన ఇస్రో చైర్మన్ మాధవన్‌నాయర్‌ని పలువురు ప్రశంసిస్తూ ఘన సత్కారం చేశారు. సతీష్ ధావన్ స్ఫేస్ సెంటర్ శ్రీహరికోటలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం షార్ ఉద్యోగులు, శాస్తజ్ఞ్రులు కలిసి తమ అభిమానాన్ని చాటుకొంటూ మాధవన్‌నాయర్‌తో పాటు ఆయన సతీమణి రాధను సత్కరించారు. షార్ ఉద్యోగుల సత్కారానికి ఉప్పొంగిన నాయర్ కొద్దిసేపు మాటలు లేకుండా అలాగే ఉండిపోయి, కంట తడి పెట్టుకొన్నారు. 2003 నుంచి ఇస్రో చైర్మన్‌గా ఉన్న తాను దేశానికి కీర్తి దాయకమైన చంద్రయాన్‌లాంటి ప్రయోగంతో పాటు 27 ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో కొన్ని ప్రాజెక్టులు విఫలమైనప్పటికీ, మిగతా అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావడంలో ఇస్రో ఉద్యోగుల అందరి కృషి ఉందన్నారు. ఎన్నో లోపాలను అప్పటికప్పుడు సరిదిద్దడంలో ఇస్రో ఉద్యోగుల కృషిని అభినందిస్తూ...కొద్దిసేపు మాటలు రాక ఉండి పోయారు. ప్రాణాలకు తెగించి రాకెట్ ప్రయోగాల విజయవంతానికి షార్ ఉద్యోగస్తులు కృషి చేశారని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇస్రో ఉద్యోగస్తులతో తనకు తెలియని అనుబంధముందన్నారు. రాబోయే అయిదేళ్ళలో ఇస్రో ముందు 75 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అందరూ కలిసి లక్ష్యాన్ని ఛేదించాలని కోరారు. పెద్దల అనుభవాలను యువ శాస్తజ్ఞ్రులు పాఠాలుగా నేర్చుకోవాలని కోరారు. షార్ డైరక్టర్ చంద్ర దత్తన్, అసోసియేట్ డైరక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, వ్యాస్ డైరక్టర్ కె సుభాష్, స్ప్రాబ్ డైరక్టర్ వెంకట్రావు, కంట్రోలర్ శేషగిరిరావు, పిఆర్‌ఓ రవీంద్రనాద్ తదితరులు మాదవన్‌నాయర్ దంపతులను ఘనంగా సత్కరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment