online marketing

Saturday, April 23, 2011

to click view large


to click view large


to click view large


to click view large

to c

To click view largeFriday, April 22, 2011

జనారణ్యంలో దుప్పి

కోట మండలం కర్లపూడి గ్రామంలో ఒక దుప్పి శుక్రవారం గ్రామస్తులకఁ పట్టుబడింది. ఉదయం రెండు దుప్పిలు పొలంలో గ్రామస్తులకఁ కఁపించగా వాటిఁ వెంబడించారు. సొనకాలువలో ఒక ప్రమాదవశాత్తు దిగబడి పరిగెత్తలేక స్థాఁకఁలకఁ పట్టుబడింది. మరోదుప్పి తప్పించుకఁన్నట్లు స్థాఁకఁలు తలిపారు. సర్పంచి చెంచుకృష్ణయ్య ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులకఁ దుప్పిఁ అప్పగించారు.

వెల్లంపల్లి తిరునాలకఁ ముమ్మరఏర్పాట్లు

డక్కిలి: మండలం లోఁ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్తంభాల గిరి ఈశ్వరయ్య స్వామి తిరునాల ఈ నెల 24, 25 తేదీలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు తిరునాల ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఈ ఏడాది తాత్కాలిక తిరునాల కమిటీఁ దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేఁవిధంగా తిరునాలను అత్యంత వైభవంగా జరిపేందుకఁ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఆలయాఁకి రంగులు వేసి పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. భకఁ్తలకోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించడాఁకి ముందస్తు చర్యలు చేపట్టారు. తిరునాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. డక్కిలి నుంచి వెల్లంపల్లికి పోవు మార్గమధ్యలో తాత్కాలికంగా రోడ్డుపనులు చేపట్టారు. భకఁ్తల సౌకర్యార్థం ఆర్‌టిసి బస్సును ఏర్పాటు

జిల్లా ప్రజలు చైతన్యవంతులు

నెల్లూరు : జిల్లాలోని ప్రజలు చైతన్యవంతులని, ఇటువంటి జిల్లాలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ అన్నారు. శుక్రవారం స్థానిక పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో కలెక్టర్ కె.రాంగోపాల్‌కు ఆత్మీయ వీడ్కోలు సభ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన కలెక్టర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపానన్నారు.

మత్స్యకారుల అభివృద్ధి కోసం మూడేళ్ల నుంచి చేయాలనుకున్నది అనేక కారణాల వల్ల చేయలేకపోయారన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన పథకాలు అమలులో జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అధికారులందరూ ప్రత్యేక కృషి చేయాలని కోరారు. జిల్లా అధికారులు ఈ మూడేళ్లలో సహకరించినట్లు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు కూడా సహకరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడాన్ని అధికార యంత్రాంగం ఉందన్నారు. ప్రతి పనికి అందరిని కలుపుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోతానన్నారు.


ఎవరూ పని వారు చేసుకుంటూ పథకాల అమలుకు కృషి చేయాలన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే జిల్లాధికారులు ఏ సమయంలోనైనా సరే తనతో చర్చించవచ్చనన్నారు. జాయింట్ కలెక్టర్ సౌరబ్ గౌర్ మాట్లాడుతూ కలెక్టర్ రాంగోపాల్ జిల్లా ప్రజల మనసులో స్థిర స్థాయిగా నిలిచిపోతారన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ టి.సీతారామయ్య మాట్లాడుతూ కలెక్టర్ రాంగోపాల్ ప్రతి విషయంలోనూ తమకు సంపూర్ణ సహకారాలందించారని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాంగోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీ రామ్మూర్తి, జిల్లా ఎస్పీ ఇ.దామోదర్, జిల్లా రెవెన్యూ అధికారి జయరామయ్య, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, కమిషనర్ టీఎస్‌ఆర్ ఆంజనేయులు, నెల్లూరు, గూడూరు, కావలి ఆర్డీవోలు వేణుగోపాల్‌రెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, ఐటీడీఏ పీఓ రమేష్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మధుసూదన్‌రావు, జనార్దన్‌రావు, అల్లంపాటి పెంచలరెడ్డి, సుశీలమ్మ, ఎన్జీవో నాయకులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అందరికీ అందుబాటులో ఉంటా!

నెల్లూరు: అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని కొత్త జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి కలెక్టర్ సౌరబ్‌గౌర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. శాఖల పని తీరు మెరుగుపరచి ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో సమస్యలు సహజంగా వస్తాయన్నారు.

ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గోదాములు నిర్మించి రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతామని చెప్పారు. జిల్లా ప్రజలకు ఏది అవసరమో గుర్తించి దానిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వారికి అందుబాటులో ఉంటానన్నారు. పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దృష్టి సారిస్తామన్నారు. రెవెన్యూ, ఇతర శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ

చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ టి.సీతారామయ్య, డీఆర్‌ఓ జయరామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు అభినందనలు తెలిపిన అధికారులు

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీధర్‌కు జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు ఆయన కలెక్టరుగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. శుభ సమయం వచ్చే వరకు వేచి ఉండి ఇన్‌చార్జి కలెక్టర్ సౌరబ్‌గౌర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

అభినందనలు తెలిపిన వారిలో అదనపు జాయింట్ కలెక్టర్ టి.సీతారామయ్య, డీఆర్‌ఓ జయరామయ్య, డ్వామా పీడీ రామిరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ నందకుమార్, ఐటీడీఏ పీఓ రమేష్, ఐకేపీ అర్బన్ పీడీ సోమయ్య, నగర కమిషనర్ టీఎస్‌ఆర్ ఆంజనేయులు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, సెట్నల్ సీఈఓ కోటేశ్వరరావు, సీపీఓ శివరామనాయకర్, డీఎస్‌ఓ జ్వాలా ప్రకాష్, భూసేకరణ ప్రత్యేకాధికారి కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి, ఖజానా అధికారి గీతా దేవి, నెల్లూరు, గూడూరు, కావలి ఆర్డీఓలు వేణు గోపాల్‌రెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వరరావు, ఎస్‌బీఐ కలెక్టరేట్ శాఖ మేనేజర్ రామ్మోహన్, నెల్లూరు నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.

చీకటిలో అవస్తలు పడుతున్న పేదలకు కనీస వసతులు కల్పించండి

కోవూరు:: ఇటీవల కాలంలో కోవూరు పట్టణంలోని రైల్వేఫీడర్స్‌ రోడ్డు నుంచి ఇళ్ళను ఖాళీచేసి, గుమ్మళ్ళదిబ్బలో ఇళ్ళు వేసుకుంటున్న పేదలు రాత్రిళ్ళు కఠినచీకటిలో అనేక దుర్భర అవస్థలు పడుతున్నారని, వారికి కనీస వసతులు కల్పించాలని సిపిఐ మండల, పట్టణ కార్యద ర్శులు విడవలూరు హనుమంతరావు, గుత్తా రామకృష్ణయ్యలు డిమాండ్‌ చేశారు. ఇండ్లస్థలాలు చూపి, వెంటనే ఖాళీచేయిస్తున్న రెవెన్యూ అధి కారులు, పేదల సామాన్లు చేర్చడానికి తగిన వసతులు కల్పించక పోవటం అన్యాయమన్నారు. ఇటుకలు, తాటాకు, కర్రలు, గడ్డి తదితర సామాన్లను చేర్చుకోవడానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి స్థితిని చూసి కోవూరు పట్టణ సిపిఐ కమిటి, మండల కమిటి ఆధ్వర్యంలో పంచాయతి నుంచి, దాతల నుంచి ట్రాక్టర్లను విని యోగించి కొంతమేర సామాన్లను తరలించామన్నారు. ఇంకా చాలా వరకు చేర్చవలసిన అవసరం ఉందన్నారు. అంతేకాక అర్హులైన పేదవారు 15 మంది వరకు ఇంకా ఇళ్ళస్థలాలు చూపకపోవటం కడుదారుణమని ఆయన తెలియజేశారు. సర్వే చేయించారు కాని ఇండ్లస్థలాలు ఇవ్వడం మరిచారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అక్కడ కనీస వసతులయిన కరెంటు, వీథిదీపాలు, గ్రావెల్‌రోడ్డు తదితర సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని గుత్తా డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదవారికి వెంటనే ఇండ్లస్థలాలు చూపించాలని సామాన్లు చేర్చుకోలేని పేదవారికి ప్రభుత్వమే రవాణాసౌకర్యం ఏర్పాటుచేసి ఆదుకోవాలని కోవూరు మండల సిపిఐ కమిటి ప్రధాన కార్యదర్శి విడవలూరు హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెక్కాడితే డొక్కాడని పేదలకు ప్రభుత్వం రుణసహాయం అందించి, వారిని ఆదుకోవాలని కోవూరు మండల సిపిఐ కమిటి కార్యదర్శి విడవలూరు హనుమంతరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుత్తా రామకృష్ణయ్యలు కోరారు.

ఫలించిన చెంగాళమ్మ సెంటిమెంటు

సూళ్ళూరుపేట: శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సెంటిమెంటు ప్రభావం ఏమాత్రం తగ్గలేదనడానికి నిదర్శనం బుధవారంనాటి రాకెట్‌ ప్రయోగమే. వివరాలు పరిశీలిస్తే శ్రీహరికోటలో గత కొంతకాలంగా రాకెట్‌ య్రోగానికి ముందు ఇస్రో చైర్మన్‌లు సూళ్ళూరుపేటలో ఉన్న శ్రీచెంగాళమాతా పరమేశ్వరీ దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించదం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత ఏడాది చైర్మన్‌గా భాద్యతలు తీసుకున్న ప్రస్తుత చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ మాత్రం ఆనవాయితీని మార్చి నేరుగా రాకెట్‌ ప్రయోగం జరిపారు. గత ఏడాది భారీ వైపల్యాలను ఇస్రో చవిచూసింది. విషయాన్ని గ్రహించారో లేక ఎవరైనా చెవిలో వేశారోగాని ఈ ప్రయోగానికి ముందు రోజు సతీ సమేతంగా వచ్చి అమ్మణ్ణికి పూజలు చేసి వెళ్లారు చైర్మన్‌. శాస్త్రానికి దైవ బలంతోడవడంతో బుధవారం ఉదయం 10.12 కి ప్రయోగించిన పి.ఎస్‌.యల్‌.వి. సి16 రాకెట్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని అతి ఖచ్చితంగా చేరుకుని సెంటిమెంటుకు బలాన్ని చేకూర్చింది.

ఊరించిన వర్షం


నెల్లూరు:శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గంటపాటు వర్షం కురిసింది. ఎండల తాపానికి అల్లాడుతున్న ప్రజలకు శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో అనుకోని విధంగా ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. మబ్బు దట్టంగా కమ్ముకోవడంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు భావించారు. అయితే కొద్దిపాటి వర్షంతోనే ఊరించి సరిపెట్టుకుంది. చిరుజల్లులు పడడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేసినప్పటికీ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 శాతం వరికోతలు కోయాల్సివుంది. అకాల వర్షం కురవడంతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయని అనేకమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంట చేతికొచ్చేంతవరకు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.

Accused in girl’s murder arrested

The mason, Shaik Subhan, 30, told police when they picked him for questioning, that he stumbled upon the girl when he went to buy a cellphone at a mobile shop but had nothing to do with her. Police watched the recording of CC cameras in the shop on April 4 and suspected Subhan behind the murder. Their hunch paid off when Subhan spilled the beans during interrogation. According to the circle inspector of East Zone, Mr Ch. Venkateswarlu, the girl came to purchase a mobile and Subhan befriended her by assisting her in buying the mobile.
Impressed by his nature, the girl poured out her ordeals at home after the parents of her lover living in Srikalahasthi opposed their marriage. She told him that she had left home and was looking for a job. Taking advantage of her situation, Subhan took her to a shop where his friend works to seek his help to find a job for her.
Since his friend was on leave, he asked her to come to NTR Nagar with him on the plea that there was someone else who could get her a job. On the way, he spoke to the Left party leader although the other man was not familiar to him, to gain her confidence. He attempted to rape her in the premises of the college and strangled her when she raised an alarm and resisted the move. Mr Venkateswarlu said that they arrested Subhan near Mypadu gate in Nellore on Monday evening.

గ్రామదేవత గుడిలో గజ్జల సవ్వడి

నాయుడుపేట : నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం పెరికలంపాటికండ్రిగ గ్రామదేవత గుడిలో గురువారం ఓ వింత చోటు చేసుకుంది. ఆ గ్రామ చెరువుకట్టపై ఉన్న నాగార్పమ్మ గుడిలో మువ్వలసవ్వడి వినిపిస్తోంది. అది కూడా విగ్రహం పాదాల వద్ద నుంచే వస్తుండడం విశేషం. దీంతో గ్రామదేవత గుడివద్దకు గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గత శనివారం నుంచి ప్రతి పదిహేను నిమిషాలకు వినిపించే ఈ శబ్దాలు, గురువారం నుంచి ప్రతి రెండు నిమిషాలకు ఓసారి వినిపిస్తున్నాయి.

అమ్మోరు మహిమే....
నాగార్పమ్మ గుడిలో వినిపిస్తున్న ఈ సవ్వళ్లు అమ్మవారి మహిమ ప్రభావమేనని ఆ గ్రామస్థులు తెలిపారు. గ్రామ ప్రజలు గుడివద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న ఓ మహిళకు పూనకం వచ్చి ఊగిపోతూ చిందులేస్తూ ఉండగా... భక్తులు అందరూ నాగార్పమ్మ నామస్మరణ చేశారు. ప్రతియేటా జాతరలు చేయనందునే... అమ్మవారు ఇలా వింతలు చేస్తున్నారని పూనకం వచ్చిన మహిళ చెప్పారు.

ప్రారంభించిన ఏడాదే ‘రత్నం’ అత్యుత్తమ ఫలితాలు

నెల్లూరు ప్రారంభించిన మొదటి సంవత్సరమే రత్నం జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హరనాధపురంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపిసి విభాగంలో 460, 459, 458, బైపిసి విభాగంలో 440 మార్కులకు గాను 426, 425, 424 వంటి రాష్టస్థ్రాయి అత్యుత్తమ ఫలితాలను సాధించడం అభినందనీయమన్నారు.

ఎంపిసి విభాగంలో 470కు గాను జి.ప్రవీణ్‌కుమార్‌ 460, వివి.కార్తికేయ 459, ఎం.వాసునాయుడు 459, ఎన్‌ఎస్‌.భానుప్రకాష్‌ 459, కె.సాయిప్రభాత్‌ 458, జి.తేజ 455, బి.అరవింద్‌ 454, పి.గురుతేజ 451, సి.భవాని విష్ణుప్రియ 450 మార్కులు సాధించారని తెలిపారు. బైపిసిలో 440 మార్కులకు గాను ఎంవి.శ్రావణి 426, పి.కమల నయిని 425, ఎస్‌.అరవింద్‌ 424, కె.సాయిలక్ష్మి 424, జస్మినినాధ్‌ 423, వి.సాయి స్వరూపారెడ్డి 422 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి కలిగించని విద్యాబోధన, సరైన ప్రణాళికల వల్ల ఉత్తమ ఫలితాలను సాధించామన్నారు. ఈ సమావేశంలో అకడమిక్‌ డీన్‌ జి.కృష్ణమోహన్‌, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు విద్యార్థులే టాప్

నెల్లూరు  : ఇంటర్ ప్రధమ సంవత్సర ఫలితాల్లో నెల్లూరు హవా కొనసాగింది. గురువారం విడుదలైన ఫలితాల్లో నెల్లూ రు జిల్లా కేంద్ర బిందువైంది.జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు రాష్ట్ర స్థాయి ఫలితాలలో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి కీలక పాత్ర పోషించారు.

నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నారాయణ బ్రాంచికి చెందిన జగదీష్‌కుమార్ ఎంపీసీ విభాగంలో జిల్లాతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచాడు. నారాయణ మెడికల్ ఇంటెన్సివ్ క్యాంపస్‌కు చెందిన విద్యార్థిని వి. మధులిక రాష్ట్రంలో బైపీసీ విభాగంలో ప్రధమ స్థానం సాధించింది. ఎంపీసీలో ఎన్. నాగశివాని రాష్ట్రంలో నాలుగో స్థానం కైవశం చేసుకుంది.

నెల్లూరు శ్రీ ఛైతన్య కళాశాలకి చెందిన విజయలక్ష్మి జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. బైపీసీలో వీ తేజశ్వి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. వెంకటాచలం ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యార్థి పర్వతాల గోపి జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించాడు. సీఈసీ విభాగంలో సుభాషిణి ప్రభుత్వ కళాశాల సత్తా చాటింది. ఎంఈసీ విభాగంలో కృష్ణ చైతన్య కళాశాలకు చెందిన టీ వసుధ జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఎస్‌వీఎస్ శశిధర్‌రావు ద్వితీయ స్థానంలో నిలిచాడు.

ఎంఇసిలో కృష్ణ చైతన్య జిల్లా ఫస్ట్‌

నెల్లూరు :ఇంటర్మీడియట్‌ ప్రధమ సంవత్సరం పరీక్షల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి పి.వసుధ ఎంఇసి గ్రూపులో 475 మార్కులతో జిల్లా మొదటి స్థానాన్ని సాధించిందని కళాశాల డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఫలితాలు వెలువడిన అనంతరం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. తమ విద్యార్థులు గత ఐదేళ్లుగా ఎంఇసి విభాగంలో జిల్లాలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ రీతిలో ఫలితాలను సాధిస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు.

ఈ ఏడాది ఎంఇసిలో కె.భావన 473, సుధామహేష్‌ 472 మార్కులు, 428 మార్కులతో శ్రీనాధ్‌, 466 మార్కులతో హర్షవర్థన్‌, 465 మార్కులతో లక్ష్మీ హరిశంకర్‌ అత్యుత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు.ఎంపిసి విభాగంలో డేగా పవన్‌కుమార్‌ 470 మార్కులకుగాను 460 మార్కులు సాధించారని తెలిపారు.ఎంపిసి విభాగంలో 459, 456, 453 మార్కులతో పాటు గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది ఎంపిసిలో అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది 90 శాతానికి పైగా ఫలితాలను సాధించడంతోపాటు సాధారణ విద్యార్థులను టాప్‌ ర్యాంకర్లుగా రూపొందిస్తున్న అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది అందరి సమష్టి విజయం

సూళ్ళూరుపేట టౌన్‌: పీఎస్‌ఎల్‌వీ - సీ16 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అందరి సమష్టి విజయమని ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. బుధవారం రాకెట్‌ ప్రయోగానంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది చివరిలోగా మూడు పిఎస్‌ఎల్వీ ప్రయోగాలు ఉండగా, ఒక జిఎస్‌ఎల్వీ ప్రయోగం ఉంటుందన్నారు. విజయదరహాసంతో ఇస్రో చైర్మన్‌ ఉల్లాసంగా మాట్లాడం బట్టి చూస్తే భవిష్యత్‌ రాకెట్‌ విజయాలపై అంకుటిత దీక్ష, పట్టుదల ఉన్నట్లు కనిపిస్తోంది. పిఎస్‌ఎల్వీ సీ17, సీ18, సీ19 రాకెట్‌ ప్రయోగాలు చేపడుతున్నట్లు, ఇప్పటికే రెండవ లాంచ్‌ ప్యాడ్‌లో పిఎస్‌ఎల్వీ - సీ17కు చెందిన పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. జూన్‌ చివరవారంలో గాని జూలై మాసంలో ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. కిలోల బరువుగల జిశాట్‌ 12 పేరుతో పంపుతున్నామన్నారు. ఇందులో టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్ధకు చెందిన 12 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయన్నారు. సీ18, సీ19 రాకెట ప్రయోగాలు ఈ ఏడాదిలోనే ఉంటాయని పేర్కొన్నారు.

జిఎస్‌ఎల్వీపై అధ్యయనం పూర్తి
గత ఏడాదిలో ప్రయోగించిన రెండు జిఎస్‌ఎల్వీ రాకెట్‌ ప్రయోగాలపై పూర్తి విశ్లేషణ పూర్తి అయిందని ఇస్రో చైర్మన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలోగ రష్యన్‌ క్రయోజినిక్‌ ఇంజన్‌ సహాయంతో ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా 2012లో చేపట్టే జిఎస్‌ఎల్వీ, పిఎస్‌ఎల్వీ ప్రయోగాలతో ఎంతగానో ఖ్యాతిని ఆర్జించనున్నట్లు రాధాకృష్ణన్‌ వ్యక్త పరిచారు.

చంద్రయాన్‌ -2 ప్రయోగానికి నిధులు కేటాయింపు
చల్లని జాబిలి చంద్రుని వద్ద నిఘూడమై వున్న మట్టి, నీరు ఖణిజాలతోపాటు చంద్రుని వెనుకవైపు ఏమి దాగివుంది అనే విషయాలను తెలుసుకొనేందుకు చంద్రయాన్‌ -2 ప్రయోగానికి చెందిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఇస్రో చైర్మన్‌ తెలియచేశారు. ఇందుకోసం రూ. 462 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో లాండర్‌, రోవర్‌ రెండు ఉపకరణాలు ఉంటాయని, ఇందులో రోవర్‌ను రష్యా సాంకేతికాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.

ఎల్‌వి మార్క్‌ 3 రాకెట్‌కు పరీక్షలు జరుగుతున్నాయి
భారీ బరువుగల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన జిఎస్‌ఎల్వీ మార్క్‌ 3 రాకెట్‌ ప్రయోగానికి చెందిన ఏర్పాట్లు సాగుతన్నాయని రాధాకృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే గత ఏడాది కష్టమైన దశకు చెందిన పరీక్షల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. మరో రెండు నెలలో శ్రీహరికోటలో మరో దశకు చెందిన పరీక్షను నిర్వహించనున్నట్లు తెలియచేశారు.

2016లో మూన్‌ రైజ్‌
నాసా సహకారంతో 2016లో మూన్‌ రైజ్‌ రాకెట్‌ ప్రయోగానికి చెందిన విషయాలపై అధ్యయనం చేస్తున్నామని, ఇందుకోసం జెట్‌ ప్రోపల్షన్‌ లేబొరేటరీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్ధ ఎంతగానో మెరుగైంది
దూర పరిశీలన (రిమోట్‌ సెన్సింగ్‌) ఉపగ్రహాలు ఎంతగానో ఇస్రోకు సేవలు అందిస్తున్నాయని చైర్మన్‌ కితాబులిచ్చారు. ముఖ్యంగా దేశానికి చెందిన వనరుల అధ్యయనానికి రిమోట్‌ సెన్సింగ్‌ అందిస్తున్న సేవలతో రుణపడివున్నామన్నారు. వ్యవసాయం, నానాటికి పెరిగిపోతున్న పట్టణాల సముదాయం, సముద్రాల నీటి మట్టాలుకు చెందిన ఛాయాచిత్రాలను అతి దగ్గరగా సేకరించేందుకు వీలుగా రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయన్నారు.

జిశాట్‌ 8 ఉపగ్రహానికి ముహర్తం ఖరారు
అతి బరువైన ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి పంపే సామర్ధ్యం ఉన్న ఫ్రెంచ్‌ గయానా స్పేస్‌ సెంటర్‌ నుండి మే 19న ఏరియన్‌ 5 రాకెట్‌ ద్వార జిశాట్‌ 8 ఉపగ్రహాన్ని అంతరిక్ష్యంలోకి పంపనున్నట్లు ఇస్రో చైర్మన్‌ సంతోషాలనడుమ తెలిపారు. టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్ధకు చెందిన 24 ట్రాన్స్‌పాండర్లను ఉపగ్రహంలో పొందుపరిచినట్లు తెలిపారు.

పేరు పేరునా అభినందనలు
పిఎస్‌ఎల్వీ - సీ16 రాకెట్‌ విజయం వెనుక ఇస్రోకు చెందిన అన్ని రంగాల ఉద్యోగుల కృషి ఉందని రాధాకృష్ణన్‌ తెలిపారు. పీఎస్‌ఎల్వీ ప్రయోగంలో కృషి చేసిన సీనియర్‌ శాస్తవ్రేత్తలు పిఎస్‌ రాఘవన్‌ , డాక్టర్‌ టి.కె. అలెక్స్‌, ఎస్‌. రామకృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ చంద్ర వదన్‌ దత్తన్‌, జి. రవీంద్రనాధ్‌, పి. కున్హ్ని కృష్ణన్‌, డాక్టర్‌ ఆర్‌ ఆర్‌ వావ్‌ లింగ్‌, జయవర్ధన్‌, ఎం వెంకటరావు, డివిఏ రాఘవమూర్తి, పలువురు శాస్తవ్రేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

తీరని కష్టాలు

రాపూరు : రాపూరు మండలంలోని కొండకింద గ్రామమైన మద్దూరుపల్లిలో గ్రామస్తులు మంచినీటి కోసం అవస్థలు పడ్డారు. తాగునీటి బోర్ల నుంచి జువ్వ ల నీరు వస్తుండడంతో కిలోమీటర్ దూరంలోని పంట పొలాల్లోని వ్యవసాయబావుల వద్దకు వెళ్లి నీరు తె చ్చు కుంటున్నారు. గ్రామంలోని పలువురు మౌలిక వసతులు లేకపోవడం తో పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. పంట పొలాల్లోని వ్యవసాయ బావి నుంచి డై రెక్ట్ పంపింగ్ స్కీమ్ ద్వారా తాగు నీటిని అందించాలని కోరుతున్నారు

విగ్రహావిష్కరణ ఆగడం విచారకరం

 గూడూరు టౌన్‌ : ఆదివారం వెంకటగిరి రోడ్డు సర్కిల్‌లో జరగాల్సిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ ఆగిపోయేందుకు మాలమహానాడు కారణమని విమర్శలు చేయడం తగదని మాలమహానాడు జిల్లా అడహాక్‌ క మిటీ ఛైర్మెన్‌ అరవ పార్వతయ్య ఒక ప్రకటనలో ఖండించారు. దళితుల దేవుడైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా అడ్డుకునే నీచమైన సంస్కారం మాలమహానాడుకు లేదని స్పష్టం చేసారు. రోడ్ల భవనాలశాఖ అనుమతి లేనందు వల్లే సంభందిత అధికారులు తమకు ఫిర్యాదు చేసినట్టు సిఐ రాంబాబు తనకు వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.Thursday, April 21, 2011

జూనియర్ ఇంటర్‌లో 58 శాతం ఉత్తీర్ణత

నెల్లూరు : 2010-2011 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారిలో రాష్ట్ర ఉతీర్ణత 52.21శాతం కాగా, జిల్లా ఉత్తీర్ణత 58శాతం అని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. జిల్లాలో 2009లో జనరల్ ఉత్తీర్ణత 53, ఒకేషనల్ 47శాతం, 2010లో జనరల్ 53శాతం, ఒకేషనల్ 46శాతం, 2011లో జనరల్ 58శాతం, ఒకేషనల్ 51శాతం నమోదైంది. ఈ ఏడాది బాలురు 14,673మంది పరీక్షలు రాయగా, అందలో 8,118మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 55గా నమోదైంది. బాలికలు 14,409మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో 7,010మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 60గా నమోదైంది. మొత్తం 26,082మంది పరీక్షకు హాజరుకాగా, అందులో 15,128మంది పాసయ్యారు. మొత్తం 58శాతంగా నమోదైంది. ఒకేషనల్ పరీక్షకు 690మంది బాలురు హాజరుకాగా, 320మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46గా నమోదైంది. బాలికలు 459 మంది హాజరుకాగా, అందులో 267మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 58గా నమోదైంది, మొత్తం 1149మందిలో 587మంది పరీక్షల్లో పాసై, 51శాతం ఉత్తీర్ణత సాధించారు.
27 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ ఏడాది మే 27వ తేది నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, బెటర్‌మెంట్ రాసే విద్యార్థులు మే 3వ తేదీ లోపు తమ కళాశాలల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్‌తో ఫీజు చెల్లించేందుకు అవకాశం లేనందున విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయాధికారి జి వరప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ
వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న పర్వతాల గోపి 470 మార్కులకు గాను 452 మార్కులు, సిఇసి చదువుతున్న తెలపల సుభాషిణి 500 మార్కులకు గాను 435మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారని ఇంటర్ అధికారులు తెలిపారు.

Wednesday, April 20, 2011

మంత్రి దిష్టి బొమ్మ దగ్దం

సైదాపురం,మేజర్‌న్యూస్‌ః సమస్యలను పరిష్కరించకుండా కాల యాపన చేస్తున రాష్ట్ర గ్రామీణ అభివృద్ది శాఖా మంత్రి మాణిక్య వరప్రసాద్‌రావు దిష్టి బొమ్మను ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు మంగళవారం దగ్దం చేశారు.ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా నిరవదిక సమ్మె నిర్వహిస్తున్న అధికారులు కాని, ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం భాధాకరమని యూనియన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. సైదాపురం బస్టాండ్‌ నుండి ర్యాలి నిర్వహించి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద నిరవదిక సమ్మెను కొన సాగించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యూనియన్‌ నాయకులు కుడుముల రమణయ్య, కేశవులు, ప్రభాకర్‌, శివ, రామకృష్ణ, సిఐటియు నాయకులు ముత్యాలయ్య, ఎమ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఊరు... మనదే.... ఎవడొస్తే... మనకేంటి...!!!?

ఆత్మకూరు, (మేజర్‌న్యూస్‌): ‘ఊరు మనదే. ఎవడొచ్చినా లెక్క చేయాల్సిన పని లేదు. వస్తే వాడేంచేస్తాడో చూసుకుందాం. వింటాడా సరేసరి. లేదా వారి అంతుచూద్దాం...’ ఇదేమిటా అనుకుంటున్నారా అదేనండీ ఇటీవల ఉత్సవాల పేరుతో పల్లెల్లో జరిగే నగ్నప్రదర్శనలపై ఎవరైనా కామెంట్‌ చేస్తే వారికి ఆ ఊరు పెద్దలిచ్చే వార్నింగ్‌ ఇదే మరి...! దీంతో ఎవరైనా ప్రశ్నించేందుకు భయపడుతున్నారు. అధికారులు సైతం వారి బలానికి..., ముడుపులకు దాసోహమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయాలు మంట కలుస్తున్నాయి.

అనంతసాగరం మండలంలోని మినగల్లు, గౌరవరం గ్రామాల్లో విచ్చలవిడిగా ఉత్సవాల ముంగిట నగ్నప్రదర్శన సమాజం సిగ్గుపడేలా జరిగింది. దీన్ని చూసీచూడనట్లు బందోబస్తులో ఉండే పోలీసులు ఉండడం ఓ వింత. అక్కడ లేకపోయినా పర్వాలేదు కానీ బందోబస్తు డ్యూటీలో ఉంటూ మాకేంటిలే అని తెలియనట్లుగా ఓ చోట బజ్జుంటున్నారు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే... అరే అలాగా... మేం నిద్రపోయాం.. అప్పుడు జరిగిందా అంటూ కళ్ళు నలుపుకొంటున్నారు. ఇదంతా వారికి తెలిసి జరిగిందేకదా. ముందుగా అడ్డుకోవడం, కాసేపు అడ్డగించడం తర్వాత వెళ్ళిపోవడం.

ఈ నేపథ్యంలో అశ్లీల నృత్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. యువతులు ఒక్కోక్కటిగా వలువలు విప్పుతు ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ప్రదర్శనకు యువకుల కేరింతలు, డబ్బుబాబుల సంబరాలు అంతాఇంతా కాదు.ఓ డ్రస్‌ విప్పితే ఒక రేటు, ఇలా ఏ మేరకు ఆ డ్యాన్సర్‌ అంగీకరిస్తుందో ఆమె ఒంటి నిండా డబ్బేనని చెప్పవచ్చు. మర్రిపాడు మండలంలో మూడు గ్రామాల్లో ఈ ప్రదర్శనలు ఔరా అనిపిస్తాయి.ఇక్కడ నగ్ననృత్యాలను తిలకించేందుకు బద్వేలు నుంచి సైతం యువకులు ద్విచక్రవాహనాలపై వస్తారంటే అక్కడ పరిస్థితి ఏ మేరకు ఉంటుందో చెప్పక్కరలేదు. ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో సైతం నగ్నప్రదర్శనలు జరుగుతున్నా అంతా సద్దుమణిగాకే వలువలు విప్పడం జరుగుతుంది.

అక్కడ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా వారి పని అంతే. వాళ్ళ సొంతగ్రామం కావడం, కాస్తో కూస్తో నేతల అండదండలు ఉండడం, ఆర్థిక బలం అధికంగా ఉండడంతో ఇష్టారాజ్యమేలుతున్నారు. భక్తిశ్రద్ధలతో జరిగే ఉత్సవాలకు అశ్లీలత తోడై ఆ వాతావరణం జుగుత్సాకరంగా తయారవుతుంది. పోలీసుయంత్రాంగం నిద్రావస్థలో ఉండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మహిళ లోకానికి మచ్చతెచ్చే ఇలాంటి ప్రదర్శనలపై తగు చర్యలు చేపట్టాలి. యువత పెడద్రోవ పట్టకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలి

Tuesday, April 19, 2011

మర్రిపాడు స్టేషన్‌లో ప్రేమజంట

మర్రిపాడు: మర్రిపాడు పోలీసుస్టేషన్‌లో సోమవారం ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. మండల పరిధిలోని ఏపిలగుంటకు చెందిన పొదిలి తేజ అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ముత్యాల వ్యాపారం చేస్తుండేవాడు. అక్కడ స్వాతిక అనే అమ్మాయితో గత ఎనిమిది నెలలుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇటీవల తేజ కడప జిల్లా ముద్దనూరులో ఉంటున్నాడు. వీరు ఫోన్‌లో ప్రేమాయణం సాగించారు. గత మూడు రోజుల క్రితం ఒకరినొకరు మాట్లాడుకుని తేజ నిర్మల్‌ వెళ్ళి సాత్వికను ఏపిలగుంటకు తీసుకునివచ్చాడు.

అయితే ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు నిర్మల్‌ పోలీసుస్టేషన్‌లో తమ కుమార్తె అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వారు తేజకు సంబంధం ఉందని మర్రిపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మర్రిపాడు ఎసై్స నాగేశ్వరరావు పూర్తి వివరాలు తెలుసుకుని నిర్మల్‌ సీఐ నరసింగరావుకు సమాచారం అందించారు. ఆతర్వాత తల్లిదండ్రులతో పోలీసుస్టేషన్‌కు చేరుకున్న తేజ, సాత్వికలు పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే సాత్విక మైనర్‌ తీరలేదని తేలింది.ఈవిషయం ఇరువురి తల్లిదండ్రులను ప్రశ్నించి వారి ఇష్టానుసారంగా విచారణ జరిపారు. ఇరువురు పెళ్ళికి అంగీకరించడంతో ఈ నెల 23న నిర్మల్‌లో పెళ్ళి చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు.

నగ్న ప్రదర్శన...!!!!

ఆత్మకూరు: మన సాంప్రదాయం కనుమరుగవుతుంది. మహిళల పట్ల ఉండే గౌరవం కాస్త చనిపోయిందని చెప్పవచ్చు. మద్యంమత్తులో ఊగే యువత కోసం సభ్యసమాజం తలదించుకునేలా కొన్ని ప్రదర్శనలను సాక్ష్యంగా చెప్పవచ్చు... నియోజకవర్గం పరిధిలో అన్ని పల్లెల్లో ముమ్మరంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా స్వామివార్ల ఉత్సవాల ముందు ఏదోక ప్రదర్శన జరపడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ ప్రదర్శన కాస్త రూపురేఖలు మారుతున్నాయి. రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన అర్థరాత్రికి ఓవిధంగా మార్పుచెందుతూ, తెల్లవారేలోపు అందరికి వినోదం పంచేలా ఉంటున్నాయి. ఎంత వినోదం పంచితే అక్కడ అంత డబ్బు వెదజల్లే పరిస్థితులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగే ఉత్సవాల్లో సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఓ నృత్య ప్రదర్శనపై ‘సూర్య’ ప్రత్యేక కథనం......

మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్టేజిలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఉత్సవమూర్తుల గ్రామోత్సవం సందర్భంగా కొందరు యువతులను ఏర్పాటు చేసి నృత్యప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఆరంభంలో అందరు గమనించేలా స్థానిక పోలీసులు ఆ ప్రదర్శనను అడ్డుకున్నారు. ఔరా... పోలీసులు ఇంత కచ్చితంగా పని చేస్తున్నారా..? అంటూ సెహబాస్‌ అని కొందరు వెళ్లిపోయారు.

ఇంకేముంది ఆరంభంలో అర్థనగ్న ప్రదర్శన ఇద్దరు యువతులు చేస్తుంటే మగవాళ్ల ఆనందం అంతాఇంతాకాదు. ఒక్కోక్క స్టెప్‌కు ఒక్కోక్కరకంగా డ్యాన్సర్స్‌ను ఒప్పించారు. ఇలా తెల్లవారుజాము వరకు జరిగింది. తెల్లవారుజామున శరీరంపై నూలిపోగు లేకుండా నగ్నప్రదర్శన చేయించారు. ఆ ప్రదర్శన చూస్తే మన సాంప్రదాయం ఇదా... అనిపించాల్సిందే. యువత కేరింతల నడుమ నలుగురు యువతులు నగ్న ప్రదర్శన చేయడం... ఎంత బాధకరమో వారి ప్రదర్శన వెనుక కుటుంబాల ధీన స్థితో.. లేక పేదరికమో... మనకు తెలియదుకానీ మహిళ లోకం తలదించుకునేలా ప్రదర్శన జరిగింది.

అక్కడ ఒక్కచోటే కాదు అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లో సైతం విచ్చలవిడిగా ఉత్సవాల సందర్భంగా నగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయి. పోలీసులు మామూళ్లతో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఓవైపు భక్తిపారవశ్యం, మరోవైపు నగ్న ప్రదర్శనలు వెరసి ఆదునిక ఉత్సవాల్లా కనిపిస్తున్నాయి. నాటి భక్తి పారవశ్యం కనిపించడం లేదు. నేడు ఎక్కడ చూసినా అశ్లీల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.దీంతో ఎక్కడ ఎక్కడ నుంచో ద్విచక్ర వాహనాలపై యువకులు కార్యక్రమం వద్ద కిక్కిరిస్తున్నారు. మర్రిపాడు మండలంలో రాత్రి 10 గంటల నుంచే నగ్న ప్రదర్శన జరుగుతున్నా అక్కడ మహిళలకు అవకాశం లేదు.

కేవలం మగవాళ్ళకు మాత్రమే ఉత్సవాలు అన్నట్లుగా ఉన్నాయి. అనంతసాగరం మండలంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తొలుత ఆర్కెస్ట్రాలతో పాటకచ్చేరిలు ప్రారంభించి అర్థరాత్రి అర్థ నగ్న ప్రదర్శన, తెల్లవారుజామున నగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇది తప్పని స్థానిక మహిళలు వాదిస్తున్నా మగ సామ్రాజ్యం వారిని నోరు మెదపకుండా చేస్తుంది. జిల్లా పోలీసులు యంత్రాంగం స్పందించి సమాజానికి దోహదపడే కార్యక్రమాలు జరిగేలా చర్యలు చేపట్టాలి. అశ్లీల వాతావరణాన్ని పూర్తిగా నియంత్రించాలి. మహిళ లోకానికి ఓ విలువ ఉందని చాటిచెప్పాలి. మరి అలా జరుగుతుందా... వేదిచూద్దాం...

వైయస్సే సాధించలేదు, జగన్ మెజార్టీ సాధిస్తారా!: ఆనం వివేకానంద రెడ్డి

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా 3 లక్షల ఆధిక్యం సాధించలేదని ఎప్పుడూ సాధించలేదని నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి మంగళవారం అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రెండు లక్షల మెజారిటీ వస్తుందని జగన్ వర్గం నేతలు చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఖచ్చితంగా కడప, పులివెందులలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్, విజయమ్మల పేరుతో డమ్మీ అభ్యర్థుల దరఖాస్తులో కాంగ్రెసు పార్టీ పాత్ర లేదని అన్నారు. అలాంటి అవసరం తమకు లేదన్నారు.

జగనే కాంగ్రెసు ఓట్లను కొల్లగొట్టడానికి రవీంద్రారెడ్డి పేరుతో డమ్మీ అభ్యర్థులను వేయించారని ఆరోపించారు. ఏజెంట్ల కోసమే జగన్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. ఎన్నికలలో ధన ప్రభావాన్ని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి సూచించారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెసుకున్న అభిమానాన్ని ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోని ప్రతి కార్యకర్త వైయస్‌ను అభిమానిస్తారని అన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh