online marketing

Monday, January 25, 2010

తమిళుల ఒడిలో ఒదిగి, ఎదిగిన తెలుగు సినిమా


సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ ః తమిళుల ఒడిలో పొందికగా ఒదిగి, ఎంతో ఎత్తుకు ఎదిగిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ పై పరిశోదన జరిపిన రిటైర్డ్‌ షార్‌ ఉద్యోగి కీలపర్తిజగ్గారావుకి చెనై్న యూనివర్శిటీవారు డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ‘మద్రాసులో తెలుగు చలన చిత్ర చరిత్ర’ అన్న అంశం పై ఈయనకు డాక్టరేట్‌ లభించింది. రెండురోజుల క్రితం చెనై్నలో జరిగిన అక్కడ యూనివర్శిటీ 152వ వార్షికోత్సవంలో తమిళనాడు గవర్నర్‌ సుర్జిత్‌సింగ్‌బర్నాలా చేతులమీదుగా ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. భారత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన జగ్గారావు ఇక్కడ వారికి చిర పరిచితుడు. జగన్‌మిత్రాగా ఎన్నో రచనలు చేసిన జగ్గారావు షార్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా , షార్‌వాణి అనే సాహితీ సంస్థ వ్యవస్థాపకుడిగా, రోడ్‌, రైల్యే యూజర్స్‌, టెలిపోన్‌ వినియోగదారుల ప్రదాన కార్యదర్శిగా పని చేయడంతో పాటు సూళ్ళూరుపేటలో పలు సమస్యలను పరిష్కరించారు. కొన్ని కారణాల వలన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి కొద్దిరోజులు విదేశాలలో గడిపారు.కథా రచయితగా, నటుడిగా, టివి కళాకారుడిగా తన కున్న జిజ్ఞాసతో చెనై్నలో చిత్ర పరిశ్రమ ఎదుగుదలపై పరిశోదన జరిపి 2006లో డాక్టరేట్‌కోసం చెనై్న యూనివర్శిటీకి పంపారు. నాలుగేళ్ళ తరువాత చెనై్న యూనివర్శిటీవారు ఇతని పరిశోదనను గుర్తించి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 1921లో రఘుపతివెంకయ్య ‘భీష్మప్రతిజ్ఞ’ చిత్రంతో తమిళనాడులో చిగుళ్ళు వేసిన చిత్ర పరిశ్రమ, తమిళవాసుల ఆప్యాయత అనురాగాలతో తప్పటడుగులు వేస్తూ ...1931లో హెచ్‌ఎంరెడ్డి ‘భక్తప్రహ్లాద’ తో మాటలు నేర్చుకొంది. (తొలి మాటల సినిమా ఇదే) 1991లో గుత్తారామినీడు ‘యజ్ఞం’ వరకు అక్కడే ఎదిగింది. అనంతరం హైద్రాబాద్‌కు చిత్ర పరిశ్రమ తరలి పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని 1921 నుంచి 1991 వరకు తమిళనాడులో చిత్ర పరిశ్రమ ఎదుగుదలపై జగ్గారావు సమర్పించిన పరిశోదన పై తమిళనాడులోని చైనై్న యూనివర్శిటీవారు మెచ్చి డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

నేర మనస్తత్వాన్ని విడనాడి సత్‌పౌరుడుగా మెలగాలి


పొదలకూరురోడ్డు (నెల్లూరు) మేజర్‌న్యూస్‌: జైలు నుండి విడుదలైన ఖైదీలు మరలా నేరాలు చేసి జైలుకు రాకుండా సత్ప్రవర్తనతో మెలుగుతూ ఏదో ఒక పని చేసుకుని బతుకు సాగించాలని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్‌సెల్‌ అథారిటీ ఛైర్మన్‌ రెడ్డెపరెడ్డి ఖైదీలనుద్దేశించి ఉద్బోధించారు. జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన న్యాయ విఙ్ఞాన వేదికలో ఆయన మాట్లాడుతూ మనదేశం బ్రిటిషువారి పరిపాలనలో ఉన్నప్పుడు శిక్షలు చాలా కఠినంగా ఉండేవని, ఆ స్థితి ఇప్పుడు లేదని, ఖైదీల్లో ప్రవర్తన తీసుకురావడానికి కారాగారంలో మంచి పరిసరాలను ఆహ్లాదకర వాతావరణాన్ని, ఖైదీలకు ఆరోగ్య వసతులను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. గతంలో ఖైదీలను అండమాన్‌ జైలుకి పంపి చిత్రహింసలకు గురి చేసేవారని, అలాంటి పరిస్థితి నేడు లేదు కనుక నేర మనస్తత్వాన్ని విడనాడి సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా గౌరవమైన జీవనం గడపాలని ఆయన తెలిపారు. జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ సెక్రెటరీ ఎస్‌వి. చలపతి మాట్లాడుతూ ఖైదీలకు లీగల్‌ సెల్‌ అథారిటీ ఎన్నో సేవలు కల్పించిందని, వాటిని వినియోగించుకుని విడుదలైన ఖైదీలు మంచి పౌరునిగా, నేర చర్యలకు దూరంగా ఉండాలని, అలాగాక మరలా నేరాలు చేసి జైలుకు వస్తే కఠినమైన శిక్షలకు గురికాక తప్పదని, క్షమాభిక్షలు ఉండవని ఆయన ఖైదీలకు హెచ్చరించారు. కారాగారంలో గ్రీవెన్సెస్‌ బాక్స్‌లను ఏర్పాటు చేశారని, వాటిని ఖైదీలు ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. అనంతరం నిర్వహించిన జైలు అదాలత్‌లో పలు నేరాలు చేసి ఎంతో కాలంగా రిమాండ్‌లో ఉన్న ఖైదీలైన ఐదవ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టులో ఏడు కేసులు, రెండవ అదనపు మెజిస్ట్రేట్‌లో నాలుగు కేసులు, కావలిలో ఒక కేసు మొత్తం 12 కేసులను పరిష్కరిస్తూ ఆ కేసులలోని ఖైదీల రిమాండ్‌ కాలాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తూ వారిని విడుదల చేయుటకు జిల్లా కేంద్ర కారాగార అధికారులకు జిల్లా లీగల్‌ సెల్‌ సర్వీస్‌ అథారిటీ ఛైర్మన్‌ రెడ్డెపరెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ జైలు అదాలత్‌ కార్యక్రమానికి ముందుగా జైలు పరిసరాలను, ఖైదీల వసతి సౌకర్యాలను రెడ్డెపరెడ్డి పరిశీలించి తెలుసుకున్నారు. జైలు అదాలత్‌ కార్యక్రమంలో ప్రిసైడింగ్‌ అధికారిగా ఐదవ అదనపు మొదటి తరగతి న్యాయమూర్తి అనూరాధ, కామేశ్వరి, టి.శ్రీనివాసరావు, టివి.రావు, పివి.ప్రసాద్‌రావు, పిసి.కృష్ణయ్య, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఫరూఖ్‌ ఆలీఖాన్‌, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మేయర్‌ తొలగింపులో జాప్యమెందుకు?


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: నగర మేయర్‌గా నందిమండలం భానుశ్రీ బాధ్యతలు చేపట్టి కొద్దికాలమే అయినా ఇప్పటి వరకు రూ. 5.50 కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటే శ్వర్లు ఆరోపించారు. ఇంత పెద్ద స్థాయిలో ఇనాంటిసిపేషన్‌ కింద నిధులు దుర్వినియోగం చేసిన ఘనత రాష్టస్థ్రాయిలో భానుశ్రీకే దక్కుతుందన్నారు. శనివారం ఉదయం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇనాంటిసిపేషన్‌ ఉత్తర్వులు ఇచ్చే అధికారం చట్టప్రకారం మేయర్‌కు లేదన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించాల్సివుంటే మాత్రమే ఇనాంటిసిపేషన్‌ ఉత్తర్వులు ద్వారా నిధులు ఖర్చు చేయవచ్చన్నారు.అయితే వెంటనే సంబంధిత అంశాలను కౌన్సిల్‌లో పెట్టి ఆమోదం పొందాల్సి ఉందన్నారు. గత మేయర్‌ చేసిన పనుల వల్ల కార్పొరేషన్‌కు ఎలాంటి నష్టం లేదని, అయితే ప్రస్తుత మేయర్‌ నిర్వాకాల వల్ల కార్పొరేషన్‌ ఖజానా నిలువునా ఖాళీ అవుతుందన్నారు. కేవలం ఎమ్మెల్యే, మంత్రి అండదండలు ఉన్నాయనే కారణంగానే మేయర్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆమె చేస్తున్న పనుల వల్ల మున్సిపల్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెడ్డపేరు వస్తుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రస్తుతం నగరంలో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, భానుశ్రీలు ఏమి అనుకుంటే అదే చట్టమని, నగరాన్ని వారు భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కమిషన్‌లు ఇచ్చేవారికే కాంట్రాక్టు పనులు అప్పగిస్తూ మేయర్‌ టెండర్ల ప్రక్రియని ఒక ఫార్సుగా మార్చారని చెప్పారు. 50 మంది కార్పొరేటర్లు ఆమోదంతో జరగాల్సిన పనులన్నీ మేయర్‌ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. 12వ ఆర్థిక ప్రణాళిక నిధులు దుర్వినియోగమవుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. మేయర్‌పై అనేక అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ సంబంధిత విచారణాధికారి ముందుకు రాకపోవడం చూస్తుంటే పరిస్థితి ఇట్టే అర్ధం చేసుకోవచ్చన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరపాలక సంస్థ ఖజానా ఖాళీ కావడం తథ్యమని ప్రభుత్వం ఇకనైనా మేయర్‌పై కఠిన చర్యలు తీసుకుని ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో ఒకటవ వార్డ్సు కమిటీ ఛైర్మన్‌ కత్తి శ్రీనివాసులు, రెండవ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ మస్తాన్‌బీలు పాల్గొన్నారు.

ఐక్యంగా సాగుదాం...సమైక్యంగా ఉందాం


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: రాజకీయాలకు, భావసారూపత్యలకు అతీతంగా అందరూ ఐక్యంగా కలిసి పోరాడడం ద్వారా సమైక్యాంధ్రను సజీవంగా నిలపాలంటూ అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రామ్మూర్తినగర్‌లోని బాలపీరయ్య కల్యాణమండపంలో జరిగిన సీమాంధ్రనేతల సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, విద్యావంతులు, మేధావులు పాల్గొని ప్రసంగించారు. జెఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ శామ్యూల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖపట్నం ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు పన్నిన కుట్రగా తెలంగాణా ఉద్యమాన్ని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలో 143 మంది ఎమ్మెల్యేలు రాజీనామలు చేశారంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బూటకపు మాటలతో తెలంగాణా ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారనీ, దీన్ని అందరూ గుర్తించాలని కోరారు. కోస్తాంధ్రతో పోల్చితే తెలంగాణా వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో ఎంతో ముందున్న సంగతిని ఇటీవలి సర్వేలు వెల్లడించాయన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణాను అడ్డం పెట్టుకొని కెసీఆర్‌ కుటుంబం బ్రతుకుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌ ఒక దుష్టశక్తని అన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రులపై కొందరు తెలంగాణా నేతలు ఇష్టారీతిగా నోరుపారేసుకుంటున్నారనీ, దీన్ని అందరూ ఖండించాలని కోరారు. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతాలకూ, వ్యాపారాలకూ ముడిపెట్టడం సరికాదని తెలంగాణావాదులకు హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్రిక్తల నడుమ విడిపోతే చివరకు ఇండియా, పాకిస్తాన్‌ల మాదిరిగా విరోధులుగా ఉండిపోతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలను సాకుగా చూపి కొందరు నేతలు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అటువంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఆలస్యం కావడమే ప్రస్తుత అనిశ్చితి కారణమనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. జెఏసీ గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్‌ నరసింహారావు మాట్లాడుతూ ఆంధ్రుల పెట్టుబడులతో పెరిగి అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌ను వదులుకునేందుకు ఏ ఆంధ్రుడూ సిద్ధంగా లేడన్నారు. ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్టమ్రంతా ఒకే జెఏసీని ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాష్టవ్య్రాప్తం చేయాలని సూచించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమంకార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన తెలుగుతల్లి కార్యక్రమం అందరినీ అలరించింది. కలిసి ఉన్న తెలుగుతమ్ముళ్లను కెసీఆర్‌ విడదీయాలని భావిస్తున్న తీరును విద్యార్థులు కళ్లకు కట్టిన ట్లు చూపించి ఆహుతుల మన్ననలను అందుకున్నారు. అనంతరం అన్ని పార్టీల నేతలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బల్లి దుర్గాప్రసాద్‌, పరసారత్నం, కాంగ్రెస్‌ నేతలు ఎల్లసరి గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, చాట్ల నరసింహారావు, టీడీపీ నేతలు కిలారి వెంకటస్వామినాయుడు, టి.రమేష్‌రెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్‌, టివి కృష్ణయాదవ్‌, ఇతర సంఘాలకు చెందిన కెవి చలమయ్య, ఆచార్య ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh