Monday, January 25, 2010
మేయర్ తొలగింపులో జాప్యమెందుకు?
నెల్లూరు, మేజర్‌న్యూస్: నగర మేయర్‌గా నందిమండలం భానుశ్రీ బాధ్యతలు చేపట్టి కొద్దికాలమే అయినా ఇప్పటి వరకు రూ. 5.50 కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని డిప్యూటీ మేయర్ మాదాల వెంకటే శ్వర్లు ఆరోపించారు. ఇంత పెద్ద స్థాయిలో ఇనాంటిసిపేషన్ కింద నిధులు దుర్వినియోగం చేసిన ఘనత రాష్టస్థ్రాయిలో భానుశ్రీకే దక్కుతుందన్నారు. శనివారం ఉదయం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇనాంటిసిపేషన్ ఉత్తర్వులు ఇచ్చే అధికారం చట్టప్రకారం మేయర్‌కు లేదన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించాల్సివుంటే మాత్రమే ఇనాంటిసిపేషన్ ఉత్తర్వులు ద్వారా నిధులు ఖర్చు చేయవచ్చన్నారు.అయితే వెంటనే సంబంధిత అంశాలను కౌన్సిల్‌లో పెట్టి ఆమోదం పొందాల్సి ఉందన్నారు. గత మేయర్ చేసిన పనుల వల్ల కార్పొరేషన్‌కు ఎలాంటి నష్టం లేదని, అయితే ప్రస్తుత మేయర్ నిర్వాకాల వల్ల కార్పొరేషన్ ఖజానా నిలువునా ఖాళీ అవుతుందన్నారు. కేవలం ఎమ్మెల్యే, మంత్రి అండదండలు ఉన్నాయనే కారణంగానే మేయర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆమె చేస్తున్న పనుల వల్ల మున్సిపల్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెడ్డపేరు వస్తుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రస్తుతం నగరంలో రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, భానుశ్రీలు ఏమి అనుకుంటే అదే చట్టమని, నగరాన్ని వారు భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కమిషన్‌లు ఇచ్చేవారికే కాంట్రాక్టు పనులు అప్పగిస్తూ మేయర్ టెండర్ల ప్రక్రియని ఒక ఫార్సుగా మార్చారని చెప్పారు. 50 మంది కార్పొరేటర్లు ఆమోదంతో జరగాల్సిన పనులన్నీ మేయర్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. 12వ ఆర్థిక ప్రణాళిక నిధులు దుర్వినియోగమవుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. మేయర్‌పై అనేక అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ సంబంధిత విచారణాధికారి ముందుకు రాకపోవడం చూస్తుంటే పరిస్థితి ఇట్టే అర్ధం చేసుకోవచ్చన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరపాలక సంస్థ ఖజానా ఖాళీ కావడం తథ్యమని ప్రభుత్వం ఇకనైనా మేయర్‌పై కఠిన చర్యలు తీసుకుని ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఒకటవ వార్డ్సు కమిటీ ఛైర్మన్ కత్తి శ్రీనివాసులు, రెండవ డివిజన్ కార్పొరేటర్ షేక్ మస్తాన్‌బీలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment