Monday, January 25, 2010
తమిళుల ఒడిలో ఒదిగి, ఎదిగిన తెలుగు సినిమా
సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్ ః తమిళుల ఒడిలో పొందికగా ఒదిగి, ఎంతో ఎత్తుకు ఎదిగిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ పై పరిశోదన జరిపిన రిటైర్డ్ షార్ ఉద్యోగి కీలపర్తిజగ్గారావుకి చెనై్న యూనివర్శిటీవారు డాక్టరేట్ ప్రదానం చేశారు. ‘మద్రాసులో తెలుగు చలన చిత్ర చరిత్ర’ అన్న అంశం పై ఈయనకు డాక్టరేట్ లభించింది. రెండురోజుల క్రితం చెనై్నలో జరిగిన అక్కడ యూనివర్శిటీ 152వ వార్షికోత్సవంలో తమిళనాడు గవర్నర్ సుర్జిత్‌సింగ్‌బర్నాలా చేతులమీదుగా ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. భారత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన జగ్గారావు ఇక్కడ వారికి చిర పరిచితుడు. జగన్‌మిత్రాగా ఎన్నో రచనలు చేసిన జగ్గారావు షార్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా , షార్‌వాణి అనే సాహితీ సంస్థ వ్యవస్థాపకుడిగా, రోడ్, రైల్యే యూజర్స్, టెలిపోన్ వినియోగదారుల ప్రదాన కార్యదర్శిగా పని చేయడంతో పాటు సూళ్ళూరుపేటలో పలు సమస్యలను పరిష్కరించారు. కొన్ని కారణాల వలన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి కొద్దిరోజులు విదేశాలలో గడిపారు.కథా రచయితగా, నటుడిగా, టివి కళాకారుడిగా తన కున్న జిజ్ఞాసతో చెనై్నలో చిత్ర పరిశ్రమ ఎదుగుదలపై పరిశోదన జరిపి 2006లో డాక్టరేట్‌కోసం చెనై్న యూనివర్శిటీకి పంపారు. నాలుగేళ్ళ తరువాత చెనై్న యూనివర్శిటీవారు ఇతని పరిశోదనను గుర్తించి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 1921లో రఘుపతివెంకయ్య ‘భీష్మప్రతిజ్ఞ’ చిత్రంతో తమిళనాడులో చిగుళ్ళు వేసిన చిత్ర పరిశ్రమ, తమిళవాసుల ఆప్యాయత అనురాగాలతో తప్పటడుగులు వేస్తూ ...1931లో హెచ్‌ఎంరెడ్డి ‘భక్తప్రహ్లాద’ తో మాటలు నేర్చుకొంది. (తొలి మాటల సినిమా ఇదే) 1991లో గుత్తారామినీడు ‘యజ్ఞం’ వరకు అక్కడే ఎదిగింది. అనంతరం హైద్రాబాద్‌కు చిత్ర పరిశ్రమ తరలి పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని 1921 నుంచి 1991 వరకు తమిళనాడులో చిత్ర పరిశ్రమ ఎదుగుదలపై జగ్గారావు సమర్పించిన పరిశోదన పై తమిళనాడులోని చైనై్న యూనివర్శిటీవారు మెచ్చి డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment