online marketing

Friday, March 2, 2012

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి గెలుపు అంత సులభం కాదనే...ముగ్గురి మధ్య పోటీ హోరాహారీ



నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరులో వైయస్ జగన్‌ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి గెలుపు అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. మార్చి 18వ తేదీన రాష్ట్రంలోని 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆరు స్థానాలు తెలంగాణలో ఉండగా, కోవూరు స్థానం మాత్రం కోస్తాంధ్రలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం లేదు. కోవూరు మీదనే వైయస్ జగన్ దృష్టి కేంద్రీకరించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

నల్లపురెడ్డి ప్రసన్నకుమర్ రెడ్డి ఇప్పటికే తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో ప్రచార రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెసు తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు. ముగ్గురి మధ్య పోటీ హోరాహారీ జరుగుతుందని భావిస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. కాంగ్రెసు తరఫున ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు కోవూరులో మోహరించడానికి సిద్ధపడుతున్నారు. 

అయితే, నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగానే ఉంది. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు శాసనసభ్యుడు, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం కోసం రంగంలోకి దిగనున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

ప్రసన్న కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు?


నెల్లూరు:  నెల్లూరు త్వరలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు  నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు కేటాయించమని ఎన్నికల కమిషన్‌ను కోరతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆదివారం చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డికిమార్చి 3వ తేదిన పార్టీ గుర్తు వచ్చే అవకాశముందని చెప్పారు. గుర్తు అధికారికంగా వెలువడిన తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కొవ్వూరు ఉప ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోటీ అన్నారు. పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న కక్షసాధింపు చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికలో గెలవాలని జగన్ వర్గం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో సవాల్ విసిరారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవూరు  అసెంబ్లీ స్థానంలో కాంగ్రెసు పార్టీ గెలిచి చూపించాలన్నారు.  కోవూరు  తో పాటు తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఆనం వివేకానంద సిగరేట్ తాగడంపై ముఖ్యమంత్రి ఆనంపై ఒకింత ఆగ్రహం..

నెల్లూరు : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డికి శుక్రవారం క్లాస్ పీకారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆనం వివేకానంద సిగరేట్ తాగుతూ కిరణ్ కుమార్ రెడ్డికి కనిపించారు. అక్కడ సిగరేట్ తాగడంపై ముఖ్యమంత్రి ఆనంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో సిగరేట్ తాగటం ఏంటంటూ ఆనంకు క్లాస్ పీకారు. అసెంబ్లీలో దమ్ము కొట్టవద్దని సూచించారు. ఆనం అసెంబ్లీలోని సిఎం చాంబర్ వద్ద సిగరేట్ తాగడం విశేషం.

కాగా అంతకుముందు ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా తన సోదరుడు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ స్థానం నుండి పోటీ చేయడానికి జిల్లాలోని ముగ్గురం ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. కాగా ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీ ఎంపిగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ గురువారం ఆమోదించారు. దీంతో అక్కడి పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సవాల్ విసిరింది. దీనిపై ఆనం స్పందించారు.

Thursday, March 1, 2012

సోమిరెడ్డి , ప్రసన్నలు కోవూరు నియోజ వర్గానికి వలస వచ్చారు...

కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకుండా బావబావమరుదులైన సోమిరెడ్డి, ప్రసన్నలు చేసి ఉంటే బహిరంగ చర్చకు రావాలని పోలంరెడ్డి సవాల్‌ విసిరారు. విడవలూరు మండలంలోని చౌకచర్ల గ్రామానికి కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రచార నిమిత్తం వచ్చి విలేకర్లతో గురువారం మాట్లాడారు. సోమిరెడ్డి , ప్రసన్నలు కోవూరు నియోజ వర్గానికి వలస వచ్చారని, కోవూరు నియోజక వర్గం తన సొంత నియోజక వర్గం అని ఈ నియోజకవర్గంపై తన కెంతో ప్రేముందని, ఈ నియోజక వర్గం అభివృద్ధి కోసం నా ఊపిరి ఉన్నంత వరకు పని చేస్తానన్నారు. అలాగే రాష్ర్టంలో ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే కోవూరు ఒక్కస్థానంలో అభ్యర్థిని పెట్టి మిగిలిన ఆరు స్థానాల్లో అభ్యర్థులను పెట్టే ధైర్యం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు.

1971సంలో తాను వెంకటగిరికి వచ్చానని తిరిగి వెంకటగిరి 2012వ సంలో రావడం జరిగిందన్నారు

తెలుగుపాట కమనీయం తెలుగు బాష రమణీయమని పద్మభూషణ్‌ డాక్టర్‌ ఎస్‌.పి బాలసుబ్రమణ్యం అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక జట్పీ బాలికోన్నత పాఠశాలలో వేంకటగిరి సాంస్కృతిక ఐక్యవేదక ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలుతజ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుబాష ఎంతో తియ్యదనమన్నారు. తాను ఎన్నో బాషల్లో పాడినా తెలుగుబాషలోని కమ్మదనం ఎంతో మక్కువన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతోపాటు ప్రేక్షక అభిమానులను కూడా తాను ఈ స్థాయి చేరుకోవడానికి సహకరించారన్నారు. వేంకటగిరి చేనేత వృత్తిపై తనకు ఎంతో అభిమానముందన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చేనేతకార్మికులు జీవనం సాగిస్తున్న వెంకటగిరిలో తనకు సన్మానం జరగడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే ప్రస్తుతం పాటలను గానం చేస్తున్న వర్తమాన గాయకులను ఆయన అభినందించారు. అలాగే పాడుతాతీయగా, పాడాలని ఉండి వంటి టి.బి కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న నూతన గాయకులకు అవకాశం అందించడం తన పూర్వకాల రుణమన్నారు. అలాగే వేంకటగిరి సంస్థానాధీశులు, గేయదార సృష్టికర్త విబికె సాయికృష్ణ యాచేంద్ర రచించిన గీతాలను, పాటలను ఆయన అభినందించారు. 1971సంలో తాను వెంకటగిరికి వచ్చానని తిరిగి వెంకటగిరి 2012వ సంలో రావడం జరిగిందన్నారు. అనంతరం ఆయన్ని గజమాలతో ఎస్పీ బాలసుబ్రమణ్యం దంపతులను సన్మానించారు. పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే పలు సంసృ్కతిక కార్యక్రమాలతోపాటుగా గాయకులుపలు సినీ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు బొడిచర్ల సుబ్బయ్య, జిఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు గంగోటి నాగేశ్వరారవు, ఆత్రేయ కళాపీఠం అధ్యక్షులు బికె ప్రసాద్‌, ప్రముఖ గాయకులు డి.వి సురేష్‌, మోహన్‌గాంధీ, పద్మశ్రీ ఘంటసాల కళాక్షేత్రం సభ్యులు సుంకరరవి కుమార్‌, చిరంజీవి, వీరస్వామి, నర్రారవి, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు ప్రచారం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోవూరు ఉప ఎన్నికలోభాగంగా ఈ నెల 4, 9,10 తేదీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పార్టీ వర్గాల నుంచి చంద్రబాబు పర్యటన ఖరారైందని ఆయన పేర్కొన్నారు. 4న కోవూరు నియోజకవర్గంలోని బుచ్చి, కోవూరు మండలాల్లో జరిగే ఎన్నికల ప్రచారాల కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. 9,10 తేదీల్లో కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించనున్నారని ఆయన తెలిపారు

సినిమాహాళ్లలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన మీ బిడ్డలాగా పుట్టాలా? సెల్‌ఫోన్‌ దొంగతనం చేస్తే సిసి.కెమెరా చిత్రీకరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకున్న చరిత్ర నీది కాదా?--శ్రీధర్‌రెడ్డి

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆనంపై ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌.విజయమ్మ చేసిన ప్రసంగం అనంతరం పుత్రవాత్సల్యంతో కొడుకును వెనుకేసుకుని రావడం దురదృష్టకరమని విజయమ్మపై ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు.. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి దయాభిక్షతో పదవులు అనుభవించే మీరు విజయమ్మపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. మీరు, మీ బిడ్డ వైఎస్‌ను బజారుకు ఈడుస్తున్నారని మంత్రి చేసిన ప్రసంగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి రంగ ప్రవేశం చేసిన మీరు వైఎస్‌ను, విజయమ్మను విమర్శించే అర్హత మీకుందా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ లేకుంటే నీకు రాజకీయ చరిత్రే ఉండేది కాదన్నారు. నీ ప్రసంగం క్షమించరాని నేరమన్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా విజయమ్మకు, జగన్‌కాడ కాళ్లు మొక్కుతూ నేడు విమర్శించడం మీ కుటుంబానికే తగునన్నారు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచడం ఆనం వారికి అలవాటేనన్నారు. వైఎస్‌ఆర్‌ పుణ్యంతో 2004, 2009లో గెలిచి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతారో లేదోనని మీపై ప్రజలు చర్చలు మొద లు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి అవుతాన నే భ్రమల్లో వైఎస్‌ కుటుంబంపై అలా మాట్లాడుతున్నారని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇతను మనిషి కాదని, అసలు మంత్రే కాదని ప్రజలు అంటున్నారన్నారు. జగన్‌ వైఎస్‌ను మించిన నేత అవుతారని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తన వయసు వున్నవారిలో ఉండేవారికన్నా గొప్ప నేత అవుతారని, దేశంలోని యువ నాయకులంతా అదే మాట అంటున్నారన్నారు. పుత్రవాత్సల్యం గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదన్నారు. ‘నీకు కలేజా వుంటే మా అన్న రాజీనామా చేశారు. ఆయన మీద పోటీకి రా... చూసుకుందాం...’ అని సవాల్‌ విసిరారు. ఇలాంటి దగా కోరు మంత్రి ఏ జిల్లాలో లేరన్నారు. రోశయ్య కాళ్లు, కిరణ్‌ కాళ్లు ఇప్పుడు బొత్సా కాళ్లు పట్టుకుంటున్నావు. ఇంకెందరి కాళ్లు పట్టుకుంటావో నీకే తెలియాని హేళన చేశారు. విజయమ్మ కంటతడి పెడితే నాశనమవుతావు... అని శాపనార్థాలు పెట్టారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ కాకుండా వైఎస్‌ఆర్‌కు ఎలాంటి కొడుకు పుట్టాలి. మీలాంటి కొడుకు పుట్టాలా? అంటూ సినిమాహాళ్లలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన మీ బిడ్డలాగా పుట్టాలా? సెల్‌ఫోన్‌ దొంగతనం చేస్తే సిసి.కెమెరా చిత్రీకరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకున్న చరిత్ర నీది కాదా? ఇలాంటి బిడ్డ వైఎస్‌ఆర్‌కు పుట్టాలా? అంటూ మంత్రి రామనారాయణరెడ్డిపై శ్రీధర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, ఆనం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Nellore Inter Board exams begin today

Nellore Inter Board exams begin today

YSRCongress Kovur by election Election Campaigning Vehicle in Nellore

YSRCongress Kovur by election Election Campaigning Vehicle in Nellore

A thief enter into the Nellore Atmakur bu stand local police station

A thief enter into the Nellore Atmakur bu stand local police station

Development would be possible through the Congress alone --polam reddy

Development would be possible through the Congress alone --polam reddy

Kamalakar, dead, passed away, Nellore cine artitst

Kamalakar, dead, passed away, Nellore cine artitst

Nellore 7 BIKE ON FIRE ACCIDENT

NELLORE 7 BIKE ON FIRE ACCIDENT

ఇద్దరూ టిడిపి ఓట్లమీదే ఆధారపడ్డారు కనుక తమ ఓటుబ్యాంకుకు ఢోకా లేదని కాంగ్రెస్‌



రాష్ర్టమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కోవూరు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న ఈ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతుపట్టక అన్నిపార్టీల నేతలు సతమతమవుతున్నారు. వారిని ప్రసన్నంచేసుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇపుడు రాష్ర్ట నేతలు, విశ్లేషకుల దృష్టి త్వరలో జరిగే కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మీదే ఉంది. అన్ని ప్రధాన పక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
టిడిపి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,కాంగ్రెస్‌ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు, సిపిఎం నుంచి జొన్నలగడ్డ వెంకమరాజు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పక్షాలు ఈ ఎన్నికను అత్యంతప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపుకోసం పూర్తిస్థాయి కసరత్తుల ప్రాంభించారు. అయితే ఇక్కడి ఓటరు నాడిపట్టుకోవటం నాయకులకు చాలా కష్టమైన పని.

గత ఎన్నాకల ఫలితాలే ఈ విషయం వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌, టిడిపిలు ఆరేసి సార్లు ఇక్కడ విజయం సాధించగా సిపిఐ రెండుసార్లు గెలిచింది. ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఈసారి కూడా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి తరఫున పోటీచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈనియోజకవర్గం కొత్తది కావటం, ఎప్పుడూ తమకు మద్దతిచ్చే సిపిఎం ఈసారి పోటీకి దిగటం ప్రతికూల అంశాలు. అయితే తనకున్న అపార అనుభవంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని కోవూరు ఉప ఎన్నికలో తన విజయం తథ్యమని సోమిరెడ్డి అంటున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే అభ్యర్థి ఎంపికలో బాగా ఆలస్యం చేసి ప్రచారంలో కాస్త వెనకబడింది. అయితే సోమిరెడ్డి, ప్రసన్న ఇద్దరూ టిడిపి ఓట్లమీదే ఆధారపడ్డారు కనుక తమ ఓటుబ్యాంకుకు ఢోకా లేదని కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అంటున్నారు. ప్రస్తుతం నామినేషన్ల పర్వం పూర్తవటంతో అభ్యర్థులు ప్రచారపర్వంలో తలమునకలై ఉన్నారు.అయితే ముందు ముందు ఎవరు ముందుకు సాగుతారు ఎవరు చెతకిలబడతారో వేచిచూద్దాం!

రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తికి వేల విగ్రహాలు పెట్టడం విడ్డూరంగా...


మాఫియా పార్టీ అయిన కాంగ్రెస్‌ను, ఫాక్షన్‌ పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సి పార్టీలను కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈ ఉప ఎన్నికలో అంతం చేయాలని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు యర్రన్నాయుడు చెప్పాడు. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఎటు చూచినా మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూకుంభకోణాలు మితిమీరిపోయా యన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పెంచి పోషిస్తున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. లేకుంటే ఇవి రాష్ట్రంలో క్యాన్సర్‌ లాగా వ్యాపిస్తాయన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాల నాయకుడుగా గుర్తింపు పొందారన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఎంతోమంది గొప్ప నాయకుల విగ్రహాలు కరువైతే, మాఫియా ఫ్యాక్షన్‌ నాయకుడు, రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తికి వేల విగ్రహాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రెండున్నర సంవత్సరం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిగా ఉంటూ ఏరోజు పార్లమెంటులో రైతు సమస్యలపై మాట్లాడలేదని, ఈ రోజు రైతుల గురించి దీక్షలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ అభ్యర్థి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ

పేద అభివృద్ధి కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ టీడీపీయే అన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తాను చేసిన అభివృద్ధి పనులు చూపించి ఓట్లు అడగకుండా, వైఎస్‌.జగన్‌ను, విజయమ్మలను చూపించి ఓట్లు అడగడం సిగ్గు చేటన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డి ఓటమి తథ్యమన్నారు. ఈ ఉప ఎన్నికలో తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసులు ప్రసన్నకుమార్‌రెడ్డి కాదని, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అని ఆయన అన్నారు.

గెలుపునకు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బొమ్మే శ్రీరామరక్షగా... మెజారిటీపై బెట్టింగ్‌లు

కోవూరు  : కోవూరు ఉప ఎన్నిక నామినేషన్‌ల పర్వం నిన్నటితో ముగియగానే ఒక్కసారిగా  ఎన్నికల ప్రచారం ఊపందుకోగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ప్రసన్నపై నియోజకవర్గంలో కొంతమేర వ్యక్తిగతంగా విభేదాలున్నా ఆయన గెలుపునకు  వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బొమ్మే శ్రీరామరక్షగా నిలబడుతుందని అభిమానులు, ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసన్న ఎంతో ధీమాగా నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో తాను గెలుపొందుతానని ఒకింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాల్లో నాయకులు ప్రసన్న ధీమాపై ఆందోళన చెందడమే గాక ఇదే రీతిలో ఉంటే రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు. కోవూరుకు ఈ నెల 3వ తేదీ జగన్‌ వచ్చి పలు మండలాల్లో ప్రచారాన్ని చేయనున్న దృష్ట్యా వైఎస్‌ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన కుమారుడుగా జగన్‌ పర్యటన ప్రసన్న గెలుపు దిశకు అత్యంతగా తోడ్పడుతుందని వైఎస్‌ఆర్‌సి పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. గెలవడం ప్రధానం కాదు, మెజారిటీయే మాకు అత్యంత ప్రాముఖ్యత అంటూ బడా నాయకులు సైతం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉండడంతో ద్వితీయశ్రేణి నాయకుల నుండి చోటా నాయకులు సైతం తమ అభ్యర్థి మెజారిటీపై బెట్టింగ్‌లు చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని చాలా మండలాల్లో వైఎస్‌ఆర్‌ పార్టీకి చెందిన యువత హుషారు చూస్తే ప్రస్తుతం నాయకులు సైతం ఉత్సాహంగా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో చివరి వరకు ప్రజల నాడిని తెలుసుకోవాలంటే పరమేశ్వరుడికి కూడా అర్థం కానట్లు పోలింగ్‌ నాటికి ఓటరు ఎవరికి ఓటు వేస్తాడో అనేది చెప్పలేమని తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకోదగ్గ విషయం. ఈ నెల 21వ తేదీ వెలువడే ఫలితాలే వీరి భవితవ్యం తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురుచూడక తప్పదనేది నిత్య సత్యం  

Wednesday, February 29, 2012

RTC running old Bus Break Down Regularly

RTC running old Bus Break Down Regularly

Mekapati mp resignation Accepted on the telephonic conversation speaker mera kurmari

Mekapati mp resignation Accepted on the telephonic conversation -- speaker mera kurmari

Ysr Congress leader Mekapati great Decision on Resignation of MP Post..

Ysr Congress leader Mekapati great Decision on Resignation of MP Post..

Theft in shop - Nellore Atmakur bustand center..

Theft in shop - Nellore Atmakur bustand center..

Rapur ysrCongress afford 100 coconut at penchalakona temple..

Rapur ysrCongress afford 100 coconut at penchalakona temple for supporting prasana kumar reddy kovur deselection majority votes..

Rapur penchalakona development works will be end, with in the month of may.

Rapur penchalakona development works will be end, with in the month of may.

Kovur by election nominations are closed. Today on words election campaign

Kovur by election nominations are closed. Today on words election campaign

Kovur byelection all candidates list

Kovur byelection list of candidates.

Sunday, February 26, 2012

Nellore youngster, who turned to chain snatching to meet his expenses for lavish lifestyle

Nellore youngster, who turned to chain snatching to meet his expenses for lavish lifestyle

Rapur Kothapeta garbage is not removed for Months in our lane.

Rapur Kothapeta garbage is not removed for Months in our lane.

Rapur Free Health Camp.. Ratnam hospital

Rapur Free Health Camp.. Ratnam hospital

Wonder mango Tree

Wonder mango Tree

Fun, Enjoy at Kotha kodur beach

Fun, Enjoy at Kotha kodur beach

CPM in Kovur byelection..

CPM Party also in kovur by election


Vote for congress only develope the kovur.. Minister Anam

Vote for congress only develope the kovur.. Minister Anam

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh