online marketing

Thursday, March 1, 2012

1971సంలో తాను వెంకటగిరికి వచ్చానని తిరిగి వెంకటగిరి 2012వ సంలో రావడం జరిగిందన్నారు

తెలుగుపాట కమనీయం తెలుగు బాష రమణీయమని పద్మభూషణ్‌ డాక్టర్‌ ఎస్‌.పి బాలసుబ్రమణ్యం అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక జట్పీ బాలికోన్నత పాఠశాలలో వేంకటగిరి సాంస్కృతిక ఐక్యవేదక ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలుతజ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుబాష ఎంతో తియ్యదనమన్నారు. తాను ఎన్నో బాషల్లో పాడినా తెలుగుబాషలోని కమ్మదనం ఎంతో మక్కువన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతోపాటు ప్రేక్షక అభిమానులను కూడా తాను ఈ స్థాయి చేరుకోవడానికి సహకరించారన్నారు. వేంకటగిరి చేనేత వృత్తిపై తనకు ఎంతో అభిమానముందన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చేనేతకార్మికులు జీవనం సాగిస్తున్న వెంకటగిరిలో తనకు సన్మానం జరగడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే ప్రస్తుతం పాటలను గానం చేస్తున్న వర్తమాన గాయకులను ఆయన అభినందించారు. అలాగే పాడుతాతీయగా, పాడాలని ఉండి వంటి టి.బి కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న నూతన గాయకులకు అవకాశం అందించడం తన పూర్వకాల రుణమన్నారు. అలాగే వేంకటగిరి సంస్థానాధీశులు, గేయదార సృష్టికర్త విబికె సాయికృష్ణ యాచేంద్ర రచించిన గీతాలను, పాటలను ఆయన అభినందించారు. 1971సంలో తాను వెంకటగిరికి వచ్చానని తిరిగి వెంకటగిరి 2012వ సంలో రావడం జరిగిందన్నారు. అనంతరం ఆయన్ని గజమాలతో ఎస్పీ బాలసుబ్రమణ్యం దంపతులను సన్మానించారు. పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే పలు సంసృ్కతిక కార్యక్రమాలతోపాటుగా గాయకులుపలు సినీ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు బొడిచర్ల సుబ్బయ్య, జిఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు గంగోటి నాగేశ్వరారవు, ఆత్రేయ కళాపీఠం అధ్యక్షులు బికె ప్రసాద్‌, ప్రముఖ గాయకులు డి.వి సురేష్‌, మోహన్‌గాంధీ, పద్మశ్రీ ఘంటసాల కళాక్షేత్రం సభ్యులు సుంకరరవి కుమార్‌, చిరంజీవి, వీరస్వామి, నర్రారవి, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh