online marketing

Monday, August 29, 2011

రాజకీయ పరిఙ్ఞానం లేని వ్యక్తి వివేకా

నెల్లూరు :భారతీయ జనతాపార్టీపై ఆదివారం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అధికారం తలెకెక్కి వివేకా మాట్లాడుతున్న మాటలను ఎవరూ పట్టించుకోరని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి ఆనం వివేకాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవాకులు-చెవాకులు మాట్లాడుతున్నావు. నీకు రాజకీయ పరిఙ్ఞానం లేదని, అందుకే నీవు అలా మాట్లాడుతున్నావని వివేకానందరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆనాడు మొట్టమొదటగా సంతకాలు పెట్టిన నీవు నేడు ఏమీ ఎరగనమ్మా అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ పార్టీలో చేరనని ప్రమాణం చేస్తావా వివేకా? అని ఆంజనేయరెడ్డి సవాల్‌ విసిరారు. నగరంలో అవినీతిని పెంచి పోషిస్తూ ఎక్కడ కట్టడాలు కట్టాలన్నా దండుకుంటున్నావని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే నీ దండకం ఎవరికీ తెలియంది కాదని, ఈ విషయాలు తెలిసినా తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందని, సోమిరెడ్డి, వివేకా ఇద్దరు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అన్నారు. నీ పంచన చేరితే మంచివారు. లేదంటే అవినీతిపరులా వివేకా? నీకు తగిన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.


ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని నీ సోదరుడు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, ఆనాటి క్యాబినెట్‌లో మంత్రిగా వున్న రామనారాయణరెడ్డిపై కూడా సిబిఐ విచారణ చేపట్టాలని, అదేవిధంగా ఆనం కుటుంబ ఆస్తులపై కూడా విచారణ చేయాలన్నారు. అదేవిధంగా సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి బిజెపిని గురించి మాట్లాడుతున్నారని, పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే మంచిదని, సుధాకర్‌రెడ్డికి, వివేకాకి హితవు పలికారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆనాడు జరిగిన కొన్ని కుంభకోణాలపై ఆరోపణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


జగన్‌పై సిబిఐ విచారణ జరుగుతుందని విచారణను ఆపమనిగాని, ఆయన అవినీతికి పాల్పడలేదనిగాని భారతీయ జనతాపార్టీ ఎక్కడా ప్రసంగాలు చేసిన సందర్భాలు లేవన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసింది మీరు కాదా? మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవినీతి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తూ ఆ అవినీతిలో ఆనాడు మీరు కూడా భాగస్వాములే కదా? అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు బిజెపి బరితగించిందని అంటున్నారని, బరితగించింది ఎవరో, వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిందెవరో ప్రజలకే తెలుసన్నారు. వైఎస్‌ఆర్‌కి అత్యంత ముఖ్యమైన వారమని ఆనం సోదరులు అనేవారని, ఆ వేల కోట్ల కుంభకోణంలో వీరికి భాగముండాలని, ఇవన్నీ వదిలేసి బిజెపిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు.


నీ సోదరుడు జగన్‌ పార్టీ వైపు ప్రయత్నం చేయలేదా? ఇది నిజం కాదా? నీవు అడ్డుకుంటే గొడవలు జరగలేదా? ఇదంతా ఒక నాటకమని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నీ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ప్రయత్నం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. బరితగించింది చంద్రబాబు అని, నీవు అక్రమంగా సంపాదించిన పొలాల సంగతి ఏమిటని, నీపేరు మీద కరెంటు కనెక్షన్‌ ఉందంటే అది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో, రాజ్యసభలో బిజెపివారు అవినీతిని సమర్థించారా? అది మీరు విన్నారా? బిజెపి వారి మాటలను వక్రీ రించి మాట్లాడుతున్నారని, మీ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలినవారంతా మీ దృష్టిలో అవినీతిపరులేనా? మీకు వత్తాసు పలికితే అవన్నీ మాసిపోతాయా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబు హైదరాబాద్‌ చుట్టుపక్కలంతా అవినీతికి పాల్పడలేదా? చంద్రబాబు సిబిఐ విచారణ చేయమని అడుగుతారా అని ప్రశ్నించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బాబు ఉన్నారని, గూడూరు వద్ద బాబు రెండవ ఇడుపులపాయను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఇచ్చారు కదా? ఇప్పుడు ఆస్తులు ప్రకటించడం ఏమిటి అని, ఆస్తులు ఇంకా ఎన్ని దాచిపెట్టి ఉన్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. వివేకా నీ పగటి వేషాలు మానుకో. నీకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. ఇకమీదట బిజెపిని విమర్శిస్తే పరిస్థితులు వేరేవిధంగా ఉంటాయని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. బిజెపి నేతలపై విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని
మాట్లాడితే మంచిదని, వివేకాను హెచ్చరిస్తూ బిజెపి ఇటువంటి నాయకులకు తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఆనం కుటుంబానిది తత్కాల్‌ రాజకీయమని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే నీచమైన సంస్కృతి మీది అని ఉదాహరణగా చెబుతూ వారిది తత్కాల్‌ రాజకీయమేనన్నారు.

Sunday, August 28, 2011

ఒకే ప్రాంగణంలో శివ కేశవుల

తడ : ఒకే ప్రాంగణంలో శివ కేశవుల అన గా శివుడు, కేశవుడు(విష్ణువు) ల ఆలయాలు, విగ్రహాలు కాశీలో తప్ప మరెక్కడా లేదు. ప్రపంచంలో ఈ అద్భుత ఆలయాలని సందర్శించి పాప, దోషములను పొగొట్టుకొనేం దుకు యావత్‌ భారతీయులందరూ కాశీకి పో తారు. అక్కడికి పోతే పాపాలన్నీ పోయి మళ్ళీ పునర్జ న్మ మనిషికి కలుగుతుందని ప్రతీక. కా ని కాశీలో మాదిరిగానే పులికాట్‌ తీరం లో వున్న వేనాడు దీవిలో కూడా శివ, విష్ణువు ఆల యాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆల య ప్రత్యేకత గురించి అధికారులు, పాలకులు ఎవరూ పట్టిం చుకోకపోవడంతో ఇంతటి ప్రా ముఖ్యత గల ఆలయాలు చరిత్ర బయట ప్ర పంప ప్రజలెవరికి తెలియదు.

పూర్వం వేనాడు ను వేదాంతపురి అని పిలిచే వారు.పూర్వ ము శృంగి అనే మహాముని కావడిలో ఒకపక్క శివు ని విగ్రహం మరో పక్క విష్ణువు విగ్రహాన్ని తీసు కొని కాశీ నుంచి రామేశ్వరానికి పయనమ య్యాడు. మార్గమధ్యలో పలు చోట్ల రాత్రి వేళల్లో విశ్ర మిస్తూ మరుసటి దినం యథా విధిగా పాద యాత్ర కొనసాగించే వారుఆ మహాముని. అదే క్రమంలో వేనాడు దీవిలో ఆ ముని ఓ రాత్రి విశ్రమించాడు. మరుసటి దినం ప్రభాత వేళ ప్రయాణానికి సన్నద్ధ్దుడైన ఆ మహాముని కావడిని భూజానికి ఎత్తుకునేం దుకు ప్రయత్నిస్తే కావడిపైకి లేవలేదు.ముని పరిశీలించగా శివకేశవులు భూమిలో ప్రతి ష్టిం చినట్లుగా కనిపించింది.

ఆ రాత్రి అక్కడే వి శ్రమించిన ముని కి స్వప్నంలో శివకేశువులు ప్రత్యక్షమై ఈ స్థలం ప్రభావి తానికి ఇష్టపడి తా ము స్వయంభువుగా ఇక్కడే ప్రతిష్టంబులు అయ్యామని ఆ మునినే తమకు పూజాధిపతు లుగా నియమించమని ఆదేశించినట్లు పురాణ కథనం. అలా ఒకే ప్రాంగణంలో దేవదేవుని ఆలయాలను నిర్మించారు. ఒకే ప్రాంగణంలో విష్ణాలయం, శివాలయం వెలసినందున ఈ గ్రామాన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యం కాశీలో తప్ప మరెక్కడా లేదు. అక్కడే గర్భ గుడిలో ప్రతిఏటా చైత్ర మా సం పౌర్ణమికి శ్రీరంగ పెరుమాళ్ళు పాద పద్మా లపై, శివ రాత్రికి శివుని పై సూర్య కిరణాలు ప్ర తి భింబిస్తాయి. ఈ దృశ్యాలు చిత్తూరు జిల్లా నాగాలాపురం వేదనారాయణ స్వామి ఆలయం లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. కానీ ఈ ఆలయాన్ని టూరిజం కేడర్‌ చేర్చలేదు. ఇంతే కాకుండా ఆసియా ఖండంలోనే అతి పెద్ద దర్గా ఈ గ్రామంలో ఉండడం మరో విశేషం.

కౌలన్నకు కష్టాలు తీరేనా?

నెల్లూరు :కౌలుదారులకు రుణాలు అందించి వారి క్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అని నెల్లూరు కౌలుదారుల రుణాల పంపిణీ కార్యక్రమ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామంటూ ఓ వైపు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అవి మాత్రం అసలైన కౌలుదారులకు అందడంలేదు. భూస్వాముల నుంచి పొలాలను కౌలుకు తీసుకుని పండించే రైతన్నకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కౌలుదారుల రుణాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగానే జిల్లాలో 4,127 మంది కౌలుదారులను ఆయా మండలాల రెవెన్యూ తహసిల్దార్‌లు, గ్రామ విఆర్‌ఒలు గుర్తించడం జరిగింది. వీరికోసం రూ.10.08 కోట్లును రుణాలు పంపిణీ చేసేందుకు లక్ష్యంగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. కాని ప్రస్తుతం జిల్లాలో 500లకు మించి కూడా రైతులకు రుణాలు అందలేదు. దీనికి అసలు కారణం భూయజమాని కౌలు రైతులకు ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టకపోవడం ఒక కారణమైతే బ్యాంకులు కౌలు రైతులకు హామీలు ఉండేందుకు రైతులు లేరంటూ కుంటిసాకులు చెప్పి రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం జిల్లాలో నీరుగారిపోతోంది.

ఈ పథకాన్ని పటిష్టంగా పూర్తి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం కౌలుదారులకు కార్డులు పంపిణీ చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంది. హంగులూ, ఆర్భాటాల కోసం ముఖ్యమంత్రి చేతులమీదుగా జిల్లాలో కౌలుదారుల రుణాల పంపిణీ పత్రాలను కూడా అందజేసింది. బ్యాంకులు మాత్రం నిబంధనల పేరుతో కౌలు రైతులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. అసలే కౌలు చెల్లించలేక నష్టాలపై వ్యవసాయం చేస్తున్న ఈ రైతులకు ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఏమాత్రం ఉపయోగ పడడంలేదు.

ఇందులో బ్యాంకుల పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ప్రదానంగా కినిపిస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధిగా ఆయా బ్యాంకులకు విధి విధానాలు పంపకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రైతులను కంటితుడుపు తుడిచేందుకు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి ఉపయోగం లేకుండా చేస్తున్నాయి. ‘ఫలహారం ఇచ్చాం... తన్నుకు చావండి’ అన్న చందాన తయారైంది ఈ కౌలుదారీ రుణాల పంపిణీ కార్యక్రమం. జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న రుణాలను పంపిణీ చేయలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతన్నలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీలకు తెచ్చుకుని రుణాలను తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నారు.

అసలే ఖర్చులతో తడిసిమోపెడవుతున్న వ్యవసాయానికి ప్రైవేటు వడ్డీభారం మరింత తోడవుతోంది. దీనికితోడు పోటీ తత్వంతో భూయజమానులు కౌలు రేట్లు కూడా పెంచేశారు. దీంతో కౌలు రైతులు కుటుంబం గడవక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వ్యవసాయాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమన్న కాంగ్రెస్‌ నాయకులు కౌలు రైతులను మన జిల్లాలో కష్టాల నుంచి కాపాడాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే కౌలుదారీ రుణపత్రాలు పొందిన 4,127 మంది రైతులకు వెంటనే బ్యాంకుల నుంచి రుణాలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఓ వైపు ప్రతిపక్షాలు ప్రకటనలు జారీ చేస్తున్నా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి యంత్రాంగం దృష్టి సారించి కౌలు రైతులందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు విఙ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో కాన్ఫరెన్సా...అయితే ప్రక్క జిల్లాకు పోవాల్సిందే!

నెల్లూరు  : పరిపాలనలో భాగంగా జిల్లా అధికారులు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఆయా విభాగాల కమిషనర్లు, కార్యదర్శులతో మాట్లాడడానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ సేవలు ఎపి స్వాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసారు. అత్యవసర సమావేశాలు, తుఫాను వంటి సమయాల్లో ఈ సదుపాయం ద్వారా వేగవంతంగా అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది.

అయితే కలెక్టరేట్‌లోని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రంలో ఏదో ఒక సాంకేతిక లోపంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు దాదాపు 10 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ఈ కేంద్రంలో క్లిష్ట సమయాల్లో రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నతాధికారులతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహించాల్సిన సమయాల్లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ప్రక్క జిల్లాలకు వెళ్ళ వలసి వస్తుంది. శుక్రవారం ఇటువంటి సందర్భాన్నే అధికారులు చవిచూసారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఒంగోలుకు వెళ్ళవలసి వచ్చింది.

మండలాల్లో అనుసంధానం కాని వీడియో కాన్ఫరెన్స్‌
వేగవంతమైన, సుపరిపాలన అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2009లో 23 జిల్లాలకు, 1088మండలాలకు, 5690 ప్రభుత్వ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించడానికి రూ.140 కోట్లు కేటాయించారు. హైదరాబాదు నుండి జిల్లా కేంద్రాలకు 8 ఎంబిపియస్‌, జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాలకు 2 ఎంబిపియస్‌ వేగంతో ఇటువంటి సదుపాయం కల్పించాలని సంకల్పించారు. కానీ, మండలాల్లో ఈ ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోనే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం సరిగ్గా లేనప్పుడు మండలాల్లో ఎట్లా ఉంటుందోనని కొందరు అధికారులు విమర్శిస్తున్నారు.
మండలాల్లో ఇంకా టెండర్లు పిలపలేదు - రమణయ్య, ఎపి స్వాన్‌ జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల నుండి మండలాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలనే నిర్ణయం నిజమే. కానీ మండలాల్లో టెండర్లు పిలవలేదు. సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రక్రియ అసంపూర్తిగా ఉంది.

ప్రజా నాయకుడు జగన్‌

నెల్లూరు : రాష్ట్రంలో ప్రజానాయకుడు వైఎస్‌ఆర్‌ మరణంతో ఆ లోటును తీర్చగల నాయకుడు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగల సమర్థుడు వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డేనని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌కు భయపడి కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను ఆపేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చూపడం బాధ కలిగించిందని, మనస్తాపం చెందానని అందుకే ఎంపి పదవికి రాజీనామా చేశానన్నారు. వైఎస్‌ఆర్‌ మరణంతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయి ప్రజలు ఆ మహానేతను తలచుకుంటూ అల్లాడిపోతున్నారన్నారు. భజనపరుల మాట వినే కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ను దూరం చేసుకుందని ఆయన కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శ చేశారు.


ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి సోదరులు శనివారం నగరానికి విచ్చేసిన సందర్భంగా వారికి పార్టీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఆ పార్టీ కార్యకర్తలు అయ్యప్పగుడి వద్ద నుండి గాంధీబొమ్మ వరకు భారీగా స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారికంటే జగన్‌ ఎంతో అనుభవఙ్ఞుడైన ప్రజానాయకుడని ఆయన కొనియాడారు.


జగన్‌కు వస్తున్న ఆదరణ చూచి కాంగ్రెస్‌పార్టీ ఈ చర్యకు పూనుకుందన్నారు. వైఎస్‌ఆర్‌ లేని లోటు తీర్చగల వ్యక్తి జగనే అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్‌ లక్షణాలు ఎవరికీ లేవని, అందుకే రాష్ట్ర ప్రజలు జగన్‌ను సమర్థిస్తున్నారన్నారు. అందుకు నిదర్శనమే కడప, పులివెందుల ఎన్నికలు అని అన్నారు. కడపలో వచ్చిన మెజారిటీని చూచి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. జగన్‌ ఆదరణకు తట్టుకోలేకనే హైకోర్టు చెప్పకపోయినా వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఆర్‌లో ఇరికించారని, తండ్రి కొడుకులు నేరాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్ళి ఇచ్చిన మాట కోసం ఓదార్పు చేయడమే జగన్‌ చేసిన నేరమా? అని ప్రశ్నించారు.


ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మహా నేత వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌ను దోషులుగా చూపడంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం చూపించారని, రైతులకు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, మహిళలకు పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పక్కా గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారని, ఇవన్నీ వైఎస్‌ఆర్‌ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే వైఎస్‌ఆర్‌ చేసిన తప్పా? అని రెండు పర్యాయాలు కాంగ్రెస్‌పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాసిన మహానేతకు గుర్తింపుగా కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొలిపి కేసులు పెట్టించి ప్రజల హృదయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఛీకొట్టించుకుంటుందన్నారు.


రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి జగనేనన్నారు. మీరు కోరుకున్నట్లుగా రాజీనామాలు చేశామని, దమ్ముంటే రాజీనామాలు చేసి మాతో పోటీకి సిద్ధ పడాలని పరోక్షంగా ఆనం సోదరులకు సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ బొమ్మతోనే ప్రజల వద్దకు వెళ్తాం. ఏ బొమ్మతో మీరు ప్రజల వద్దకు వెళ్తారు? మిమ్ములను ప్రజలు నమ్ముతారా... ఆ రోజులు పోయాయని ఆయన వ్యంగ్యంగా చమత్కరించారు.


రాజకీయ వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న వ్యక్తి జగనే
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరకపోవడంతో ఆ విషయాలను, రాజకీయ వాస్తవాలుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. నెల్లూరు ప్రజలు తెలివైన వారని, మహానేత వైఎస్‌ఆర్‌ నమ్మకాన్ని, ఆయన చూపిన ఆదరణను మరచిపోలేక, ఆయనపై వచ్చిన మచ్చను తట్టుకోలేక ఎంపి, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు.


అంతకుముందు కన్వీనర్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ వెంట నడవాలని, వైఎస్‌ఆర్‌పై వచ్చిన మచ్చలను తుడిచివేయాలని, ఎంపి, ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌ పార్టీ నేతలు త్యాగం చేసి రాజీనామాలు చేశారన్నారు. రెండున్నర సంవత్సరాల సమయమున్నా పదవులను త్యజించిన త్యాగమూర్తులన్నారు. ఆనాడు దేవుడు- నేడు దోషి, అదే కాంగ్రెస్‌ నీచ బుద్ధికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. దొంగతనం చేసిన దొంగ తప్పించుకునేందుకు దొంగ... దొంగ... అని అరుస్తారని, అందుకే చంద్రబాబు జగన్‌ను, వైఎస్‌ఆర్‌ను దొంగలుగా చెబుతూ ముందుగానే దొంగ దొంగ అని అరుస్తున్నారన్నారు.


ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పంచెకట్టు వైఎస్‌ఆర్‌కే అంకితమని, నీకు పంచెకట్టు అంతగా పనికిరాదని, దమ్ముండబట్టే మా నాయకులు రాజీనామాలు చేశారు. ధైర్యముంటే మీరూ రాజీనామాలు చేసి పోటీకి సిద్ధం కండి అని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి పద్మనాభరెడ్డి, యల్లసిరి గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూర్యప్రకాష్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు ప్రసంగించగా స్థానిక నేతలు నగళ్ల కిరణ్‌కుమార్‌, బిసి చెన్నారెడ్డి, కలికి శ్రీధర్‌రెడ్డి, బాల చెన్నయ్య, పాపకన్ను శేఖర్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సా...అయితే ప్రక్క జిల్లాకు పోవాల్సిందే!

నెల్లూరు:పరిపాలనలో భాగంగా జిల్లా అధికారులు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఆయా విభాగాల కమిషనర్లు, కార్యదర్శులతో మాట్లాడడానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ సేవలు ఎపి స్వాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసారు. అత్యవసర సమావేశాలు, తుఫాను వంటి సమయాల్లో ఈ సదుపాయం ద్వారా వేగవంతంగా అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది.

అయితే కలెక్టరేట్‌లోని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రంలో ఏదో ఒక సాంకేతిక లోపంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు దాదాపు 10 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ఈ కేంద్రంలో క్లిష్ట సమయాల్లో రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నతాధికారులతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహించాల్సిన సమయాల్లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ప్రక్క జిల్లాలకు వెళ్ళ వలసి వస్తుంది. శుక్రవారం ఇటువంటి సందర్భాన్నే అధికారులు చవిచూసారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఒంగోలుకు వెళ్ళవలసి వచ్చింది.

మండలాల్లో అనుసంధానం కాని వీడియో కాన్ఫరెన్స్‌
వేగవంతమైన, సుపరిపాలన అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2009లో 23 జిల్లాలకు, 1088మండలాలకు, 5690 ప్రభుత్వ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించడానికి రూ.140 కోట్లు కేటాయించారు. హైదరాబాదు నుండి జిల్లా కేంద్రాలకు 8 ఎంబిపియస్‌, జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాలకు 2 ఎంబిపియస్‌ వేగంతో ఇటువంటి సదుపాయం కల్పించాలని సంకల్పించారు. కానీ, మండలాల్లో ఈ ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోనే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం సరిగ్గా లేనప్పుడు మండలాల్లో ఎట్లా ఉంటుందోనని కొందరు అధికారులు విమర్శిస్తున్నారు.
మండలాల్లో ఇంకా టెండర్లు పిలపలేదు - రమణయ్య, ఎపి స్వాన్‌ జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల నుండి మండలాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలనే నిర్ణయం నిజమే. కానీ మండలాల్లో టెండర్లు పిలవలేదు. సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రక్రియ అసంపూర్తిగా ఉంది.

సాంకేతిక పరిజ్ఞానం విశిష్టత ప్రజలకు చేరువ కావాలి

నెల్లూరు :సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మరింత చేరువ కావాలని, దాని ఉపయోగం అన్ని రంగాల్లోను వినియోగించుకోవాలని శనివారం విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇంచార్జి ఉప కులపతి ఆచార్య ఎన్‌. ప్రభాకరరావు అన్నారు. ఈ జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆర్ధిక సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. 2 రోజుల జాతీయ కాన్ఫరెన్స్‌ను ఉప కులపతి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రం, దేశం నలుమూలల నుండి 90కి పైగా ఔత్సాహిక పరిశోధన విద్యార్ధులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను సదస్సుకు పంపించారు. ఈ 2 రోజుల జాతీయ సదస్సులో సమాచార, ప్రచార మాధ్యమాలు వ్యవస్థ భధ్రతా వ్యవ స్థలకు సంబంధించి చర్యలు, ఉపయోగకరమైన సంవాదాలు జరుగుతాయని తెలిపారు.

కంప్యూటర్‌ విభాగం 5వ జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించి ఈ ప్రాంతంలో విద్యా సంబంధమైన, పరిశోధనా రంగంలో మంచి చైతన్యం కలిగించిందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆచార్య నారాయణరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాన్ని ప్రశంసిస్తూ వారు ప్రతిసారి నూతనమైన విషయాల మీద సదస్సులు నిర్వహించి మంచి చైతన్యానికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య ఎంవి. రమణమూర్తి ముఖ్య ప్రసంగీకులుగా తన ప్రసంగ పాఠాన్ని అందిస్తూ సాంకేతిక పరిజ్ఞానం కాలానుగుణంగా వచ్చే మార్పులకు ధీటుగా రుపుదిద్దాలని, సాంకేతికత మరింత చౌకగా, ఆధారపడేదిగా ఉండాలన్నారు. అంతకుమునుపు ఆచార్య టి. సుధ సదస్సుకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ సదస్సు ముఖ్య ఉద్యేశ్యాలు ప్రకచించారు. ఆమె ఈ సదస్సులో రానున్న 2 రోజుల్లో జరగబోయే సైబర్‌ థ్రెట్‌ అనాలసిస్‌, వైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ సెక్యూరిటీ, జిఐఎస్‌ భధ్రతా వ్యవస్థలాంటి ముఖ్యమైన విషయాలపై చర్చ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కె. నరసింహారావు అతిథులను సదస్సులో పాల్గొన్న ఔత్సాహికులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కావలి స్పెషల్‌ ఆఫీసర్‌ పి. శివశంకర్‌, విద్యార్ధులు పాల్గొన్నారు.

పగటి ఘరానా దొంగ అరెస్ట్‌

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌:నగరంలో పట్టపగలు ఇంటికి తాళం వేసివున్నా, వేయకపోయినా అదును చూసి చోరీలకు పాల్పడే ఓ ఘరానా దొంగను సిసిఎస్‌ పోలీసులు గురువారం వేదాయపాళెం రైల్వేస్టేషన్‌లో అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఈ దొంగను మీడియా ముందు ప్రవేశపెట్టి డిఎస్‌పి రవికుమార్‌ వివరాలను తెలియజేశారు. నగరంలోని డైకస్‌రోడ్డు ఎన్‌బిటి కాలనీకి చెందిన ఎస్‌డి.సూద్‌ అనే యువకుడు వృత్తిరీత్యా బంగారు పనిచేస్తూ, ప్రవృత్తి రీత్యా చోరీలకు పాల్పడుతూ నగరంలోని ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించాడని నగర ఇన్‌చార్జ్‌ డిఎస్‌పి రవికుమార్‌ తెలిపారు. నగరంలోని బివి.నగర్‌, జగజ్జీవన్‌రాంనగర్‌, గాదం రోశయ్యనగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ వంటి పలు ప్రాంతాలలో గత నెలరోజులుగా చోరీలకు పాల్పడుతూ ఇంటి తాళాలు బద్దలుకొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ దొంగ వద్ద నుంచి మొత్తం రూ.3 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పగటి దొంగను పట్టుకోవడంతో సిసిఎస్‌ సిఐ సురేష్‌కుమార్‌, 3వ, 5వ నగర క్రైం ఎస్‌ఐలు బాబురావు, కృష్ణయ్యలు, క్రైం కానిస్టేబుళ్లు రవిచంద్రకుమార్‌, సిరాజ్‌, శిఖామణి, వెంకటేశ్వర్లు చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. వీరిని జిల్లా ఎస్‌పి బివి.రమణకుమార్‌ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh