online marketing

Monday, August 29, 2011

రాజకీయ పరిఙ్ఞానం లేని వ్యక్తి వివేకా

నెల్లూరు :భారతీయ జనతాపార్టీపై ఆదివారం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అధికారం తలెకెక్కి వివేకా మాట్లాడుతున్న మాటలను ఎవరూ పట్టించుకోరని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి ఆనం వివేకాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవాకులు-చెవాకులు మాట్లాడుతున్నావు. నీకు రాజకీయ పరిఙ్ఞానం లేదని, అందుకే నీవు అలా మాట్లాడుతున్నావని వివేకానందరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆనాడు మొట్టమొదటగా సంతకాలు పెట్టిన నీవు నేడు ఏమీ ఎరగనమ్మా అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ పార్టీలో చేరనని ప్రమాణం చేస్తావా వివేకా? అని ఆంజనేయరెడ్డి సవాల్‌ విసిరారు. నగరంలో అవినీతిని పెంచి పోషిస్తూ ఎక్కడ కట్టడాలు కట్టాలన్నా దండుకుంటున్నావని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే నీ దండకం ఎవరికీ తెలియంది కాదని, ఈ విషయాలు తెలిసినా తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందని, సోమిరెడ్డి, వివేకా ఇద్దరు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అన్నారు. నీ పంచన చేరితే మంచివారు. లేదంటే అవినీతిపరులా వివేకా? నీకు తగిన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.


ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని నీ సోదరుడు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, ఆనాటి క్యాబినెట్‌లో మంత్రిగా వున్న రామనారాయణరెడ్డిపై కూడా సిబిఐ విచారణ చేపట్టాలని, అదేవిధంగా ఆనం కుటుంబ ఆస్తులపై కూడా విచారణ చేయాలన్నారు. అదేవిధంగా సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి బిజెపిని గురించి మాట్లాడుతున్నారని, పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే మంచిదని, సుధాకర్‌రెడ్డికి, వివేకాకి హితవు పలికారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆనాడు జరిగిన కొన్ని కుంభకోణాలపై ఆరోపణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


జగన్‌పై సిబిఐ విచారణ జరుగుతుందని విచారణను ఆపమనిగాని, ఆయన అవినీతికి పాల్పడలేదనిగాని భారతీయ జనతాపార్టీ ఎక్కడా ప్రసంగాలు చేసిన సందర్భాలు లేవన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసింది మీరు కాదా? మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవినీతి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తూ ఆ అవినీతిలో ఆనాడు మీరు కూడా భాగస్వాములే కదా? అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు బిజెపి బరితగించిందని అంటున్నారని, బరితగించింది ఎవరో, వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిందెవరో ప్రజలకే తెలుసన్నారు. వైఎస్‌ఆర్‌కి అత్యంత ముఖ్యమైన వారమని ఆనం సోదరులు అనేవారని, ఆ వేల కోట్ల కుంభకోణంలో వీరికి భాగముండాలని, ఇవన్నీ వదిలేసి బిజెపిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు.


నీ సోదరుడు జగన్‌ పార్టీ వైపు ప్రయత్నం చేయలేదా? ఇది నిజం కాదా? నీవు అడ్డుకుంటే గొడవలు జరగలేదా? ఇదంతా ఒక నాటకమని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నీ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ప్రయత్నం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. బరితగించింది చంద్రబాబు అని, నీవు అక్రమంగా సంపాదించిన పొలాల సంగతి ఏమిటని, నీపేరు మీద కరెంటు కనెక్షన్‌ ఉందంటే అది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో, రాజ్యసభలో బిజెపివారు అవినీతిని సమర్థించారా? అది మీరు విన్నారా? బిజెపి వారి మాటలను వక్రీ రించి మాట్లాడుతున్నారని, మీ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలినవారంతా మీ దృష్టిలో అవినీతిపరులేనా? మీకు వత్తాసు పలికితే అవన్నీ మాసిపోతాయా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబు హైదరాబాద్‌ చుట్టుపక్కలంతా అవినీతికి పాల్పడలేదా? చంద్రబాబు సిబిఐ విచారణ చేయమని అడుగుతారా అని ప్రశ్నించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బాబు ఉన్నారని, గూడూరు వద్ద బాబు రెండవ ఇడుపులపాయను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఇచ్చారు కదా? ఇప్పుడు ఆస్తులు ప్రకటించడం ఏమిటి అని, ఆస్తులు ఇంకా ఎన్ని దాచిపెట్టి ఉన్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. వివేకా నీ పగటి వేషాలు మానుకో. నీకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. ఇకమీదట బిజెపిని విమర్శిస్తే పరిస్థితులు వేరేవిధంగా ఉంటాయని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. బిజెపి నేతలపై విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని
మాట్లాడితే మంచిదని, వివేకాను హెచ్చరిస్తూ బిజెపి ఇటువంటి నాయకులకు తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఆనం కుటుంబానిది తత్కాల్‌ రాజకీయమని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే నీచమైన సంస్కృతి మీది అని ఉదాహరణగా చెబుతూ వారిది తత్కాల్‌ రాజకీయమేనన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh