నెల్లూరు, మేజర్‌న్యూస్ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య రాఘవేంద్రరెడ్డిని అనుబంధ సభ్యుడుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి అభినందించారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన రాఘవేంద్రరెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా ఎన్నికైన కొద్దికాలం తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా వైఫల్యం చెందడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం స్తబ్దుగా ఉంటూ అనంతరం కాంగ్రెస్‌పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.
నేడు సిఎల్‌పి సమావేశానికి హాజరు
ముఖ్యమంత్రిగా కె.రోశయ్య నియమించబడిన మూడు నెలల తర్వాత శుక్రవారం జరుగనున్న సిఎల్‌పి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడుగా నియమితులైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి హాజరు కానున్నారు. తాను కాంగ్రెస్‌పార్టీ అనుబంధ సభ్యుడుగా ఎన్నికైనందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్యతోపాటు ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్థనరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు బొమ్మిరెడ్డి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు
No comments:
Post a Comment