Tuesday, November 24, 2009
తరగతి గదులకు ప్రత్యేక ప్రణాళికలు
నెల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో సరైన గదులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, తరగతి గదుల్లో అవసరమైన పాఠశాలల్లో గదులు ఏర్పాటు చేసేందుకు తగిన కార్యాచ రణ ప్రణాళిక తయారు చేయాలని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రె డ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జడ్పీ చైర్మన్ చాంబర్‌లో విద్యాశాఖ, వికలాంగుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు సరైన తరగతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో మండలాల వారీగా, పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయాలన్నారు. అలాగే మరమ్మతులకు వీలు లేకుండా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి, వాటి స్థానాల్లో నూతన భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు.కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో సరైన గదులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖాధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు సమన్వయంతో స్థలాన్ని పరిశీలించి అవసరమైన భవన నిర్మాణానికి వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి మంచి ఫలితాలను సాధించేలా చూడాలన్నారు. అలాగే జడ్పీ పాఠశాలలో చదువుతున్న వికలాంగులను గుర్తించి వారికి అవసరమైన వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్ తదితర పరికరాలను అందజేయాలన్నారు. దీనిపై వివిధ మండల విద్యాశాఖాధికారుల నుండి సమగ్ర నివేదికను తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ డిప్యూటీ సిఇఒ ఆంజనేయరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, వికలాంగశాఖ ఎడి లక్ష్మణ్, సాంఘిక సంక్షేమశాఖ ఇఇ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment