online marketing

Saturday, March 19, 2011

సమీపిస్తున్న మండలి ఎన్నికలు... అభ్యర్థుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

నెల్లూరు:స్థానిక సంస్థల ఎన్ని లు దగ్గర పడడంతో అభ్యర్థుల్లో రోజు రోజుకీ ఉత్కంఠత పెరుగుతున్నప్పటికీ అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న వాకాటి నారాయణరెడ్డి శిబిరానికి రోజు రోజుకూ జడ్పీటిసిలు, ఎంపిటిసిలు చేరడంతో వాకాటి ధీమాగా ఉంటున్నట్లు సమాచారం. గత పాతికేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన వాకాటి అంచెలంచెలుగా పార్టీలోని ప్రముఖుల మన్ననలు, అండదండలు పొంది నేడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబడడంతో ఆయన గెలుపు కోసం జిల్లాలోని అగ్రనేతల నుండి సాధారణ కార్యకర్తల వరకు కృషి చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఛైర్మన్‌గా రైతుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ఆదుకున్నారు.

నష్టాల ఊబిలో ఉన్న కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకును రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధిపరచి లాభాల బాటలో పయనింపచేసి లాభాలను ఆర్జింపచేశారు. పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా పనిచేస్తూ వాకాటిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎలాగైనా గెలిపించి అధిష్ఠానం వద్ద తమ పట్టు నిలుపుకోడానికి ఆనం సోదరులతోపాటు నేదురుమల్లి వర్గం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ఓటర్లను జాగ్రత్తగా ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. సందిగ్ధంలో ఉన్న ఓటర్లను కూడా గుర్తించి వారికి నచ్చచెప్పి వారిని కూడా పిలిపించి తమ శిబిరాలకు తరలించుకుని తమ మద్దతుదార్ల సంఖ్యను తగ్గకుండా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు ఎన్ని రకాల పావులు కదిపినా వాకాటికి ఉన్న మంచిపేరే ఆయన అభివృద్ధికి సోపానమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన శిబిరానికి 300 పైబడి ఓటర్లు చేరుకున్నారని, ఆయన గెలుపు తథ్యమని పలువురు రాజకీయ ప్రముఖుల విశ్వసనీయ సమాచారం.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh