online marketing

Tuesday, March 13, 2012

కోతుల బీభత్సంవల్ల విద్యార్ధినులకు గాయాలు


రాపూరు : రాపూరు మండలంలో వానరాలు సృష్టించిన భీకరబీభత్సం వల్ల తీవ్ర భయాందోళనలకు గురై ఇద్దరు విద్యార్ధినిలు గాయాలు పాలైన సంఘటన మంగళవారం మద్దెలమడుగు తెలుగుగంగ క్వార్టర్స్‌లోని బాలికల హాస్టల్‌ వద్ద చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలావున్నాయి. మండల కేంద్రమైన రాపూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వి.సంధ్య(నర్సీపట్నం), సత్య(శ్రీకాకుళం)లు మంగళవారం ఉదయం హాస్టల్‌ భవనం పిట్టగోడపై కూర్చుకొని చదువుకుంటుండగా అటుగా వచ్చిన కోతులగుంపు గంతులేస్తూ కేకలు పెడుతూ నానాబీభత్సం సృష్టించడంతో భయపడిన విద్యార్ధులు అదుపుతప్పి కిందపడినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న తోటివిద్యార్ధులు వెంటనే 108ద్వారా రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. పట్టణ, పరసర ప్రాంతాల్లో వానరమూకలు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేయడం ఇటీవల రివాజుగా మారిందని మండల వాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కోతులను బెడదను నియంత్రించాల్సిన అవసరం ఎందైనావుంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh