Friday, December 25, 2009
అద్వాన్నంగా అన్నారెడ్డిపాళెం
విడవలూరు, (మేజర్ న్యూస్) : ఆర్‌అండ్‌బి రహదారులు నరకానికి నకళ్ళుగా మారాయి. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెం గ్రామం నుండి అలగానిపాడు వెళ్ళే రోడ్లు భవనాలశాఖ రహదారి గుంటలమయమైంది. విడవలూరు - ఊటుకూరు ప్రధాన రహదారి నుండి వెళ్ళే అలగానిపాడు వరకు గల మూడు కిలో మీటర్ల రోడ్డు గతుకులమయమైంది. పలుచోట్ల గుంటలు ఏర్పడి వాహనాలు వెళ్ళలేని స్థితిలో వున్నాయి. అన్నారెడ్డిపాళెం గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల వద్ద రహదారి నీటిమడుగుగా తయారైంది.గుంటలమయంకావడంతో రోడ్డు మార్జిన్‌లో వాహనాలు వెళుతున్నాయి. ప్రజానీకం కూడా అద్వాన్నమైన రహదారిలో నడిచి వెళుతున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య మార్గ్‌గా వ్యవహరించే ఈ రహదారి అలగానిపాడు గ్రామం వరకు ఘోరంగా దెబ్బతినింది. గుంటలు పుడ్చడంకాని, ప్యాచ్‌వ ర్క్‌లు చేయడం కాని సంబందిత అధికారులు చేపట్టడంలేదు. వర్షాకాలం కావడంతో వర్షం వల్ల రహదారి దెబ్బతిని నీటి మడుగులైనాయి. ఊటుకూరు - వావిళ్ళ లింక్‌రోడ్డు వేస్తుండగా ట్రిప్పర్లు కంకర, ఎర్రమట్టి తోలుతుండగా రహదారి గోతులమయమైంది. రోడ్డు నిర్మించడ మో లేక గుంటలు అయినా పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment